Ati sulabham bide - అతి సులభంబిదె

అతి సులభం బిదె శ్రీపతి శరణము అందుకు నారదాదులు సాక్షి

ప్రతిలే దిదియే నిత్యానందము బహువేదంబులె యివే సాక్షి

వేసరకుమీ జీవుడా వెదకివెదకి దైవమును ఆసపాటుగా హరి యున్నా డిదె అందుకు ప్రహ్లాదుడు సాక్షి

మోసపోకుమీ జన్మమా ముమ్చినయనుమానములను సేసినభక్తికి జేటు లేదు యీనేత కెల్ల ధ్రువుడే సాక్షి

తమకించకుమీ దేహమా తగుసుఖదు:ఖంబుల నలసి అమితము నరహరికరుణ నమ్మితే నందుకు నర్జునుడే సాక్షి భ్రమయకుమీ వివేకమా బహుకాలంబులు యీదీది తమితో దాస్యము తను రక్షించును దానికి బలీంద్రుడే సాక్షి

మరిగివుండుమీ వోజిహ్వా మరి శ్రీవేంకటపతిసుతులు అరయగ నిదియే యీడేరించును అందుకు వ్యాసాదులె సాక్షి తిరుగకుమీ విజ్ఞానమా ద్రిష్టపుమాయలకును లోగి సరిలే దితనిపాదసేవకును సనకాదులబ్రదుకే సాక్షి


Ati sulabham bide Sreepati saranamu anduku naaradaadulu saakshi

Pratile didiye nityaanandamu bahuvedambule yive saakshi

Vesarakumee jeevudaa vedakivedaki daivamunu Aasapaatugaa hari yunnaa Dide anduku prahlaadudu saakshi Mosapokumee janmamaa munchinayanumaanamulanu Sesinabhaktiki jetu ledu yeeneta kella dhruvude saakshi

Tamakinchakumee dehamaa tagusukhadu:khambula nalasi Amitamu naraharikaruna nammite nanduku narjunude saakshi

Bhramayakumee vivekamaa bahukaalambulu yeedeedi Tamito daasyamu tanu rakshinchunu daaniki baleendrude saakshi

Marigivundumee vojihvaa mari sreevenkatapatisutulu Arayaga nidiye yeederinchunu anduku vyaasaadule saakshi

Tirugakumee vijnaanamaa drishtapumaayalakunu logi Sarile ditanipaadasevakunu sanakaadulabraduke saakshi

atanu saMpada - అతను సంపద కంటెన

ప|| అతను సంపద కంటెన సదా చెలిరూపు | మతి చింత చేత వేమరు నలగె గాక ||

చ|| తగు జందురుని నణచ దగదా చెలిమోము | వగలచే నొకయింత వాడెగాక |

పగటు గోవెల మించి పాఱదా సతి పలుకు | జగడమున బతి బాసి సన్నగిలె గాక ||

చ|| కదలు గందపు గాలి గావదా చెలియూర్పు | కదిమేటి మదనాగ్ని గ్రాగె గాక |

కొదకు తుమ్మెద గమికి గొఱతా చెలి తురుము | చెదరి మరు బాణముల చేజాఱె గాక ||

చ|| లీల బన్నీటికిని లేతా చెలి చెమట | లోలి బూబానుపున నుడికె గాక |

యేల చిగురున కంటె నెరవా చెలి మోవి | గేళి వేంకట విభుడు గీలించెగాక ||


pa|| atanu saMpada kaMTena sadA celirUpu | mati ciMta cEta vEmaru nalage gAka ||

ca|| tagu jaMduruni naNaca dagadA celimOmu | vagalacE nokayiMta vADegAka |

pagaTu gOvela miMci pArxadA sati paluku | jagaDamuna bati bAsi sannagile gAka ||

ca|| kadalu gaMdapu gAli gAvadA celiyUrpu | kadimETi madanAgni grAge gAka |

kodaku tummeda gamiki gorxatA celi turumu | cedari maru bANamula cEjArxe gAka ||

ca|| lIla bannITikini lEtA celi cemaTa | lOli bUbAnupuna nuDike gAka |

yEla ciguruna kaMTe neravA celi mOvi | gELi vEMkaTa viBuDu gIliMcegAka ||

atanikeTla satamaitinO - అతనికెట్ల సతమైతినో

ప|| అతనికెట్ల సతమైతినో కడు- | హితవో పొందులహితవో యెఱగ ||

చ|| హృదయము తలపున నిరవయినగదా | పదిలమౌను లోపలిమాట |

వెదకినచిత్తము వెర వెఱుగదు నే- | నెదిరి నెఱగ నే నేమియు నెఱగ ||

చ|| కాలూద మనసుగలిగినకదా నా- | తాలిమి మతిలో దగులౌట |

మేలిమిపతితో మెలగుటేదో నే- | నేలో నే నిపుడెక్కడో యెఱగ ||

చ|| నేడని రేపని నే నెఱిగికదా | పోడిమి మతిలో పొలుపౌట |

వాడే వేంకటేశ్వరుడు రాగలిగె | ఆడుజన్మ మేనౌటిది యెఱగ ||


pa|| atanikeTla satamaitinO kaDu- | hitavO poMdulahitavO yerxaga ||

ca|| hRudayamu talapuna niravayinagadA | padilamaunu lOpalimATa |

vedakinacittamu vera verxugadu nE- | nediri nerxaga nE nEmiyu nerxaga ||

ca|| kAlUda manasugaliginakadA nA- | tAlimi matilO dagulauTa |

mElimipatitO melaguTEdO nE- | nElO nE nipuDekkaDO yerxaga ||

ca|| nEDani rEpani nE nerxigikadA | pODimi matilO polupauTa |

vADE vEMkaTESvaruDu rAgalige | ADujanma mEnauTidi yerxaga ||

atani dODitechchinaMdAkA - అతని దోడితెచ్చినందాకా

అతని దోడితెచ్చినందాకా
హిత బుద్దుల చెలియేమరకు మీ ||

వెలది విరహముల వేసవికాలమిది
యెలమి మోవి చిగురెండనీకు మీ
కలికి నిట్టూర్పుల గాలికాద మదె
తేలివలపుపదని తియ్యనీకుమీ ||

వనిత పెంజెమట వానకాల మదె
మొనపులకననలు ముంచనీకిమీ
మనవుల సిగ్గుల ముంచుగాలమదె
ఘనకుచగిరులను గప్పనీకు మీ ||

వెసగాంత నవ్వు వెన్నెల కాలము
ససి గొప్పు చీకటి జారనీకు మీ
పసగా శ్రీవేంకటపతి విచ్చెసి కూడె
వసంతకాల మిదె వదలనీకు మీ ||
atani dODitechchinaMdAkA
hita buddula cheliyEmaraku mI ||

veladi virahamula vEsavikAlamidi
yelami mOvi chigureMDanIku mI
kaliki niTTUrpula gAlikAda made
tElivalapupadani tiyyanIkumI ||

vanita peMjemaTa vAnakAla made
monapulakananalu muMchanIkimI
manavula siggula muMchugAlamade
ghanakuchagirulanu gappanIku mI ||

vesagAMta navvu vennela kAlamu
sasi goppu chIkaTi jAranIku mI
pasagA SrIvEMkaTapati vichchesi kUDe
vasaMtakAla mide vadalanIku mI ||

atani kokkatevE - అతని కొక్కతెవే

అతని కొక్కతెవే వాలు నైతివా
సతులందరును నీసాటివారే కారా ||

గాదె బోసుకొనే వేమే గంపముంచి వలపులు
పోదిసేసి రమణుని పొంతనీవుండి
పాదుసేసి విత్తేవేమే పద నుతోనీసిగ్గులు
అదిగొని చన్నులు పయ్యద గప్పికప్పి ||

నెదజల్లేవేమే వెన్నెలవంటి నవ్వులు
కొదదీర నీతని కొలువునను
తుద బచరించేవేమే తొంగి తొంగినీ చూపులు
చెదరిన నీ కొప్పు చేత దెట్టుకొంటాను ||

వొడిగట్టు కొనేవేమే వుబ్బరి సంతోసాలు
కడగి శ్రీవేంకటేశు కౌగిటగూడి
నడుమ నీవది యేమే నన్ను నీతండిపుడేలె
అడరియలమేల్మంగనౌతనీ వెఅగవానీ ||
atani kokkatevE vAlu naitivA
satulaMdarunu nIsATivArE kArA ||

gAde bOsukonE vEmE gaMpamuMchi valapulu
pOdisEsi ramaNuni poMtanIvuMDi
pAdusEsi vittEvEmE pada nutOnIsiggulu
adigoni channulu payyada gappikappi ||

nedajallEvEmE vennelavaMTi navvulu
kodadIra nItani koluvunanu
tuda bachariMchEvEmE toMgi toMginI chUpulu
chedarina nI koppu chEta deTTukoMTAnu ||

voDigaTTu konEvEmE vubbari saMtOsAlu
kaDagi SrIvEMkaTESu kougiTagUDi
naDuma nIvadi yEmE nannu nItaMDipuDEle
aDariyalamElmaMganoutanI veRagavAnI ||

Atade sakalamu ani - అతడే సకలము

అతడే సకలము అని భావింపుచు

నీతితో నడవక నిలుకడ యేది.


యెందును జూచిన యీశ్వరుడుండగ

విందుల మనసుకు వెలితేది

సందడించేహరిచైతన్య మిదివో

కందువలిక వెదకగ నేది.


అంతరాత్ముడై హరి పొడచూపగ

పంతపుకర్శపుభయ మేది

సంతత మాతడే స్వతంత్రుడిదివో

కొంత గొంత మరి కోరేది లేదు,


శ్రీ వేంకటపతి జీవుని నేలగ

యీవల సందేహ మిక నేది

భావం బీతడు ప్రపంచ మీతడు

వేవేలుగ మరి వెదకెడిదేది.

Atade sakalamu ani bhaavinpuchu

Neetito nadavaka nilukada yedi.


Yendunu joochina yeesvarudundaga

Vindula manasuku velitedi

Sandadincheharichaitanya midivo

Kanduvalika vedakaga nedi.


Antaraatmudai hari podachoopaga

Pantapukarsapubhaya medi

Santata maatade svatantrudidivo

Konta gonta mari koredi ledu,


Sree venkatapati jeevuni nelaga

Yeevala samdeha mika nedi

Bhaavam beetadu prapancha meetadu

Veveluga mari vedakedidedi.

ataDE yerugunu - అతడే యెరుగును

ప|| అతడే యెరుగును మముబుట్టించిన యంతరాత్మయగు నీశ్వరుడు |

అతికీనతుకదు చిత్తశాంతి యిదె ఆత్మవిహారంబిక నేదో ||

చ|| కనుచున్నారము సూర్యచంద్రులకు ఘన వుదయాస్తమయములు |

వినుచున్నారము తొల్లిటివారల విశ్వములోపలి కథలెల్లా |

మనుచున్నారము నానాటికి మాయల సంసారములోన |

తనిసీ దనియము తెలిసీ దెలియము తరువాతి పనులిక నేవో ||

చ|| తిరిగెదమిదివో ఆసలనాసల దిక్కుల నర్ధార్జన కొరకు |

పొరలెదమిదివో పుణ్యపాపముల భోగములందే మత్తులమై |

పెరిగెదమిదివో చచ్చెడి పుట్టెడి భీతుగలుగు దేహములలోనే |

విరసము లెరగము మరచీ మరవము వెనకటి కాలము విధియేదో ||

చ|| అట్లైనారము హరినుతిచే నాఱడి (బోవక) గురువనుమతిని |

పట్టినారమిదె భక్తిమార్గమిదె (మును) బలువగు విజ్ఞానముచేత |

గట్టిగ శ్రీవేంకటపతి శరణని కంటిమిదివొ మోక్షము తెరువు |

ముట్టీముట్టము పట్టీపట్టము ముందటి కైంకర్యంబేదో ||

pa|| ataDE yerugunu mamubuTTiMcina yaMtarAtmayagu nISvaruDu |

atikInatukadu cittaSAMti yide AtmavihAraMbika nEdO ||

ca|| kanucunnAramu sUryacaMdrulaku Gana vudayAstamayamulu |

vinucunnAramu tolliTivArala viSvamulOpali kathalellA |

manucunnAramu nAnATiki mAyala saMsAramulOna |

tanisI daniyamu telisI deliyamu taruvAti panulika nEvO ||

ca|| tirigedamidivO AsalanAsala dikkula nardhArjana koraku |

poraledamidivO puNyapApamula BOgamulaMdE mattulamai |

perigedamidivO cacceDi puTTeDi BItugalugu dEhamulalOnE |

virasamu leragamu maracI maravamu venakaTi kAlamu vidhiyEdO ||

ca|| aTlainAramu harinuticE nArxaDi (bOvaka) guruvanumatini |

paTTinAramide BaktimArgamide (munu) baluvagu vij~jAnamucEta |

gaTTiga SrIvEMkaTapati SaraNani kaMTimidivo mOkShamu teruvu |

muTTImuTTamu paTTIpaTTamu muMdaTi kaiMkaryaMbEdO ||