adi nAyaparAdha midi - అది నాయపరాధ మిది

ప|| అది నాయపరాధ మిది నాయపరాధ- | మదియు నిదియు నాయపరాధము ||

చ|| నెరయ రూపములెల్ల నీరూపమేకా- | నరయనియది నాయపరాధము | పరిపూర్ణుడగునిన్ను బరిచ్ఛిన్నునిగా- |నరయుట యది నాయపరాధము ||

చ|| జీవాత్మునిగా జింతింప దలచుట | యావంక నది నాయపరాధము | సేవించి నిను నాత్మ జింతింపకుండుట | ఆవల నిది నాయపరాధము ||

చ|| ఈడెరగక వేంకటేశుడ నిను గొని- | యాడుట యది నాయపరాధము | యేడ జూచిన నాయెదుర నుండగ నిన్ను- | నాడనీడ వెదకుటపరాధము ||

pa|| adi nAyaparAdha midi nAyaparAdha- | madiyu nidiyu nAyaparAdhamu ||

ca|| neraya rUpamulella nIrUpamEkA- | narayaniyadi nAyaparAdhamu | paripUrNuDaguninnu baricCinnunigA- |narayuTa yadi nAyaparAdhamu ||

ca|| jIvAtmunigA jiMtiMpa dalacuTa | yAvaMka nadi nAyaparAdhamu | sEviMci ninu nAtma jiMtiMpakuMDuTa | Avala nidi nAyaparAdhamu ||

ca|| IDeragaka vEMkaTESuDa ninu goni- | yADuTa yadi nAyaparAdhamu | yEDa jUcina nAyedura nuMDaga ninnu- | nADanIDa vedakuTaparAdhamu ||


Atisulabham bidi - అతిసులభం బిది

అతిసులభం బిది యందరిపాలికి గతియిది శ్రీపతికైంకర్యంబు

పాలసముద్రము బలిమి దచ్చికొని- రాలరిదేవత లమృతమును నాలుక నిదె హరినామపుటమృతము యేల కానరో యిహపరము అతి||

అడరి బాతిపడి యవని దేవతలు బడివాయరు యఙ్న భాగాలకు విడువక చేతిలో విష్ణుప్రసాదము కడిగడియైనది కానరుగాని అతి||

యెక్కుదురు దిగుదు రేడులోకములు పక్కన దపముల బడలుచును చిక్కినాడు మతి శ్రీవేంకటేశ్వరు డిక్కడితుదిపద మెఱగరుగాని అతి||

Atisulabham bidi yandaripaaliki Gatiyidi sreepatikainkaryambu

Paalasamudramu balimi dachchikoni- Raalaridevata lanrtamunu Naaluka nide harinaamaputamrutamu Yela kaanaro yihaparamu Ati||

Adari baatipadi yavani devatalu Badivaayaru yagna bhaagaalaku Viduvaka chetilo vishnuprasaadamu Kadigadiyainadi kaanarugaani Ati||

Yekkuduru digudu redulokamulu Pakkana dapamula badaluchunu Chikkinaadu mati sreevenkatesvaru Dikkaditudipada meragarugaani Ati||

Explanation:

ఆహా ఎంత చక్కని పాట

ఎంత చక్కని ఫిలాసఫీ

అతి సులభం బిది యందరిపాలికి = అతి = చాలా , very సులభం = తేలిక , easy బిది = ఇది, this యందరిపాలికి = అందరి పాలిటి , for everybody గతియిది శ్రీపతికైంకర్యంబు = గతి = మార్గము, way (or path) ఇది = ఇది , this శ్రీపతి = శ్రీ అనగా లక్ష్మీ దేవి, పతి అనగా భర్త అనగా లక్ష్మీ దేవి భర్త అయిన వేంకటేశ్వరుడు. husband of Godess laxmi, that is Lord SrI veMkaTESvara కైంకర్యంబు = పూజ, pUja, worship

(మోక్షానికి ) మార్గమైన, లక్ష్మీ పతి శ్రీ వేంకటేశ్వరుని పూజ అందరికీ, అతిసులభమైనది. worship of Lord VenkaTeswara is forverybody and very easy. It is the way to moxa.

పాలసముద్రము బలిమి దచ్చికొనిరి అలరి దేవతలు అమృతము = పాలసముద్రము = పాలసముద్రము , milky ocean బలిమి = ??? బలముతో, with great effort దచ్చికొనిరి = ??? అలరి = /??? దేవతలు = దేవతలు , demigods అమృతము = అమృతము, nector

పాలసముద్రము నుండి దేవతలు అతి ప్రయాసతో అమృతమును సంపాదించుకున్నారు.

Demigods got nector from milky ocean with great ocean.

నాలుక నిదె హరినామపుటమృతము యేల కానరో యిహపరసుఖము = నాలుక = నాలుక , tounge ఇదె = ఇదియే, this one only హరినామపు అమృతము = హరి పేరు లోని అమృతము, nector of hari nama (nector of Lord hari's name) యేల = ఏ విధముగా, how కానరో = చూడరో, గమనించరో miss to see ఇహ = ఈ లోకమున, అనగా భూ లోకమున , in this world of earth పర = పర లోకమున, అనగా వైకుంఠమున , in the other world of viakuMTa సుఖము = సుఖము, ఆనందము, happyness (అంత కష్టపడి అమృతము సంపాదిమ్చిన దేవతలు) నాలుక పై ఉన్న హరి నామ అమృతము ను ఎలా చూడరో? ఏమిటో? ఈ హరి నామామృతము భూ లోకములోనూ, వైకుంఠ లోకములోనూ సుఖము ఇవ్వగలదు. (but those demigods) forgot to see the nector of hari nama on the tounge, which gives happy ness in this earthly planets and in vaikunTa planets.

అడరి బాతిపడి యవని దేవతలు బడివాయరు (బడివాయురు?) యఙ్న భాగాలకు, విడువక చేతిలో విష్ణుప్రసాదము కడిగడియైనది కానరుగాని =

అడరి = ???? బాతిపడి = బ్రాంతి పడి, with illusion యవని = భూమి దేవతలు = దేవతలు, demigods బడివాయురు = ఆశపడతారు యఙ్న భాగాలకు = యఙ్నం లోని భాగాలకు విడువక చేతిలో = విడువక చేతిలోని, un attached from hand విష్ణుప్రసాదము = విష్ణు దేవుని ప్రసాదము, Lord vishnu's prasada కడిగడియనది = ??? కానరు గాని = చూడరు గానీ, భూమి కి చెందిన దేవతలు భ్రాంతి తో యఙ్న భాగాలకు ఆశ పడతారు కాని, చేతి లో విడువక వుండే విష్ణు ప్రసాదముని చూడరు.

యెక్కుదురు దిగుదు రేడులోకములు పక్కన తపముల బడలుచును = ఎక్కుదురు = పైకి వెళ్తారు , will go up దిగుదురు = కిందకి వెళ్తారు, will go down ఏడు లోకములు = ఏడు లోకములు , seven lOkaas పక్కన = పక్కన ?? , side తపముల = తపస్సులతో, with austirities బడలుచును = చేయుచూ, doing తపస్సులు చేస్తూ ఏడు లోకములలో పైకీ, క్రిందకీ తిరుగుతూ ఉంటారు ding severe austirities will go up and down of seven lokas.

[ ఈ రెండు లైనులు చాలా అర్ధవంత మైనవి, ఇవి తపస్సులు చేసి భూమి, స్వర్గ ములు మారే వారి గురించి, పాపాలు చేసి పాతాల లోకాలు పొయ్యె వారి గురించి చెప్పుతున్నాయి]

చిక్కినాడు మతి శ్రీవేంకటేశ్వరుడిక్కడితుదిపద మెఱగరు గాని చిక్కినాడు = దొరికినాడు, caught మతి = మనసున , in mind శ్రీ వేంకటేశ్వరుడు = శ్రీ వేంకటేశ్వరుడు, Lord Venkatesvara ఇక్కడి = ఇక్కడ వున్నటువంటి, here తుది పదము = చిట్ట చివరి గమ్యము, the final goal ఎఱుగరు గాని = తెలుసు కొనరు కానీ, won't know

మనసున శ్రీ వేంకటేశ్వరుని ఉంచుకొనడము అనే చిట్ట చివరి గమ్యము ని తెలుసుకొనరు గానీ, (these people who with severe austirities wonder between seven lokas won't recognize the final goal of keeping Lord VeMkaTEsvara in the mind. )

atiSayamagu sauKya - అతిశయమగు

ప|| అతిశయమగు సౌఖ్య మనుభవింపుమన్న | హితవు చేకొన నొల్లరిందరు ||

చ|| కడలేని విజ్ఞానగతికి దోడుగారు | యెడపులవారలె యిందరు |

అడరిన మోక్ష సహాయు లెవ్వరు లేరు | ఇడుమపాట్ల వారె యిందరు ||

చ|| తిరమైన పుణ్యము బోధించేవారు లేరు | యెరవులవారే యిందరు |

తిరువేంకటాచలాధిపుని మీదిచిత్త- | మిరవు సేయక పోయిరిందరు ||


pa|| atiSayamagu sauKya manuBaviMpumanna | hitavu cEkona nollariMdaru ||

ca|| kaDalEni vij~jAnagatiki dODugAru | yeDapulavArale yiMdaru |

aDarina mOkSha sahAyu levvaru lEru | iDumapATla vAre yiMdaru ||

ca|| tiramaina puNyamu bOdhiMcEvAru lEru | yeravulavArE yiMdaru | tiruvEMkaTAcalAdhipuni mIdicitta- | miravu sEyaka pOyiriMdaru ||

ativa javvanamu - అతివ జవ్వనము

అతివ జవ్వనము రాయలకు బెట్టిన కోట
పతిమదన సుఖ్హరాజ్య భారంబు నిలువ ||

కంతకనుచూపు మేఘ్హంబులోపలి మెఋగు
కాంతుని మనంబు చీకటి వాపను
ఇంతిచక్కని వదన మిందుబింబము విభుని
వంత కనుదోయి కలువల జొక్కజేయు ||

అలివేణి ధమ్మిల్ల మంధకారపు భూమి
కలికి రమణునకు నేకతమొసగును
పొలతికి బాహువులు పూవు దీగల కొనలు
పొలసి ప్రాణేశు వలపుల లతల బెనచ ||

పంకజానన రూపు బంగారులో నిగ్గు
వేంకటేశ్వరు సిరులు వెదచల్లగా
చింకచూపుల చెలియచేత మదనునిచేత
యింకా నతనినె మోహించజేయగను ||

ativa javvanamu rAyalaku beTTina kOTa
patimadana suKharAjya bhAraMbu niluva ||

kaMtakanuchUpu mEGhaMbulOpali meRugu
kAMtuni manaMbu chIkaTi vApanu
iMtichakkani vadana miMdubiMbamu vibhuni
vaMta kanudOyi kaluvala jokkajEyu ||

alivENi dhammilla maMdhakArapu bhUmi
kaliki ramaNunaku nEkatamosagunu
polatiki bAhuvulu pUvu dIgala konalu
polasi prANESu valapula latala benacha ||

paMkajAnana rUpu baMgArulO niggu
vEMkaTESvaru sirulu vedachallagA
chiMkachUpula cheliyachEta madanunichEta
yiMkA natanine mOhiMchajEyaganu ||

atiduShTuDa nE - అతిదుష్టుడ నే

ప|| అతిదుష్టుడ నే నలసుడను | యితరవివేకం బికనేల ||

చ|| ఎక్కడ నెన్నిట యేమి సేసితినొ | నిక్కపుదప్పులు నేరములు |

గక్కన నిన్నిట కలిగిననీవే | దిక్కుగాక మరి దిక్కేది ||

చ|| ఘోరపుబాపము కోట్లసంఖ్యలు | చేరువ నివె నాచేసినివి |

నీరసునకు నిటు నీకృప నాకిక | కూరిమి నా యెడ గుణమేది ||

చ|| యెఱిగి చేసినది యెఱుగక చేసిన- | కొఱతలు నాయెడ గోటులివే |

వెఱపు దీర్చి శ్రీవేంకటేశ కావు | మఱవక నాగతి మఱి యేది ||


pa|| atiduShTuDa nE nalasuDanu | yitaravivEkaM bikanEla ||

ca|| ekkaDa nenniTa yEmi sEsitino | nikkapudappulu nEramulu |

gakkana ninniTa kaliginanIvE | dikkugAka mari dikkEdi ||

ca|| GOrapubApamu kOTlasaMKyalu | cEruva nive nAcEsinivi |

nIrasunaku niTu nIkRupa nAkika | kUrimi nA yeDa guNamEdi ||

ca|| yerxigi cEsinadi yerxugaka cEsina- | korxatalu nAyeDa gOTulivE |

verxapu dIrci SrIvEMkaTESa kAvu | marxavaka nAgati marxi yEdi ||

Ati sulabham bide - అతి సులభంబిదె

అతి సులభం బిదె శ్రీపతి శరణము అందుకు నారదాదులు సాక్షి

ప్రతిలే దిదియే నిత్యానందము బహువేదంబులె యివే సాక్షి

వేసరకుమీ జీవుడా వెదకివెదకి దైవమును ఆసపాటుగా హరి యున్నా డిదె అందుకు ప్రహ్లాదుడు సాక్షి

మోసపోకుమీ జన్మమా ముమ్చినయనుమానములను సేసినభక్తికి జేటు లేదు యీనేత కెల్ల ధ్రువుడే సాక్షి

తమకించకుమీ దేహమా తగుసుఖదు:ఖంబుల నలసి అమితము నరహరికరుణ నమ్మితే నందుకు నర్జునుడే సాక్షి భ్రమయకుమీ వివేకమా బహుకాలంబులు యీదీది తమితో దాస్యము తను రక్షించును దానికి బలీంద్రుడే సాక్షి

మరిగివుండుమీ వోజిహ్వా మరి శ్రీవేంకటపతిసుతులు అరయగ నిదియే యీడేరించును అందుకు వ్యాసాదులె సాక్షి తిరుగకుమీ విజ్ఞానమా ద్రిష్టపుమాయలకును లోగి సరిలే దితనిపాదసేవకును సనకాదులబ్రదుకే సాక్షి


Ati sulabham bide Sreepati saranamu anduku naaradaadulu saakshi

Pratile didiye nityaanandamu bahuvedambule yive saakshi

Vesarakumee jeevudaa vedakivedaki daivamunu Aasapaatugaa hari yunnaa Dide anduku prahlaadudu saakshi Mosapokumee janmamaa munchinayanumaanamulanu Sesinabhaktiki jetu ledu yeeneta kella dhruvude saakshi

Tamakinchakumee dehamaa tagusukhadu:khambula nalasi Amitamu naraharikaruna nammite nanduku narjunude saakshi

Bhramayakumee vivekamaa bahukaalambulu yeedeedi Tamito daasyamu tanu rakshinchunu daaniki baleendrude saakshi

Marigivundumee vojihvaa mari sreevenkatapatisutulu Arayaga nidiye yeederinchunu anduku vyaasaadule saakshi

Tirugakumee vijnaanamaa drishtapumaayalakunu logi Sarile ditanipaadasevakunu sanakaadulabraduke saakshi

atanu saMpada - అతను సంపద కంటెన

ప|| అతను సంపద కంటెన సదా చెలిరూపు | మతి చింత చేత వేమరు నలగె గాక ||

చ|| తగు జందురుని నణచ దగదా చెలిమోము | వగలచే నొకయింత వాడెగాక |

పగటు గోవెల మించి పాఱదా సతి పలుకు | జగడమున బతి బాసి సన్నగిలె గాక ||

చ|| కదలు గందపు గాలి గావదా చెలియూర్పు | కదిమేటి మదనాగ్ని గ్రాగె గాక |

కొదకు తుమ్మెద గమికి గొఱతా చెలి తురుము | చెదరి మరు బాణముల చేజాఱె గాక ||

చ|| లీల బన్నీటికిని లేతా చెలి చెమట | లోలి బూబానుపున నుడికె గాక |

యేల చిగురున కంటె నెరవా చెలి మోవి | గేళి వేంకట విభుడు గీలించెగాక ||


pa|| atanu saMpada kaMTena sadA celirUpu | mati ciMta cEta vEmaru nalage gAka ||

ca|| tagu jaMduruni naNaca dagadA celimOmu | vagalacE nokayiMta vADegAka |

pagaTu gOvela miMci pArxadA sati paluku | jagaDamuna bati bAsi sannagile gAka ||

ca|| kadalu gaMdapu gAli gAvadA celiyUrpu | kadimETi madanAgni grAge gAka |

kodaku tummeda gamiki gorxatA celi turumu | cedari maru bANamula cEjArxe gAka ||

ca|| lIla bannITikini lEtA celi cemaTa | lOli bUbAnupuna nuDike gAka |

yEla ciguruna kaMTe neravA celi mOvi | gELi vEMkaTa viBuDu gIliMcegAka ||