Ade chudare mohana - అదె చూడరే మోహన

అదె చూడరే మోహన రూపం పది కోట్లు గల భావజరూపం

వెలయగ పదారువేల మగువలను అలమిన ఘన మోహనరూపం వలచిన నందవ్రజము గొల్లెతల కులుకు చూపులకు గురియగురూపం||

ఇందిరా వనితనెప్పుడు తనవుర మందు నిలిపిన మోహనరూపం కందువ భూపతి కౌగిట సొంపుల విందులు మరిగిన వేడుకరూపం||

త్రిపుర సతుల భోధించి రమించిన అపురూపపు మోహనరూపం కవురుల శ్రీ వేంకటపతియై ఇల ఉపమించగ రాని వున్నతరూపం||

Ade choodare mohana roopam Padi kotlu gala bhaavajaroopam

Velayaga padaaruvela maguvalanu Alamina ghana mohanaroopam Valachina nandavrajamu golletala Kuluku choopulaku guriyaguroopam

Indiraa vanitaneppudu tanavura Mandu nilipina mohanaroopam Kanduva bhoopati kaugita sompula Vindulu marigina vedukaroopam

Tripura satula bhodhinchi raminchina Apuroopapu mohanaroopam Kavurula Sree venkatapatiyai ila

Upaminchaga raani vunnataroopam

Adivo nityasoorulu - అదివో నిత్యసూరులు

అదివో నిత్యసూరులు అచ్యుత నీదాసులు యెదురులేనివారు యేకాంగవీరులు ॥పల్లవి॥

రచ్చల సంసారమనేరణరంగములోన తచ్చి కామక్రోధాలతలలు గొట్టి అచ్చపుతిరుమంత్రపుటారువుబొబ్బలతోడ యిచ్చలనే తిరిగేరు యేకాంగ వీరులు ॥అది॥

మొరసి పుట్టుగులనేముచ్చు బౌజుల కురికి తెరలి నడుములకు దెగవేసి పొరి గర్మము బొడిచి పోటుగంటుల దూరి యెరగొని తిరిగేరు యేకాంగవీరులు ॥అది॥

వొడ్డినదేహములనేవూళ్ళలోపల చొచ్చి చెడ్డయహంకారమును చెఱలు పట్టి అడ్డమై శ్రీవేంకటేశు నుండనుండి లోకులనే యెడ్డల జూచి నవ్వేరు యేకాంగవీరులు ॥అది॥

Adivo nityasoorulu achyuta needaasulu Yedurulenivaaru yekaangaveerulu |pallavi|

Rachchala samsaaramaneranarangamulona Tachchi kaamakrodhaalatalalu gotti Achchaputirumantraputaaruvubobbalatoda Yichchalane tirigeru yekaanga veerulu |adi|

Morasi puttugulanemuchchu baujula kuriki Terali nadumulaku degavesi Pori garmamu bodichi potugamtula doori Yeragoni tirigeru yekaangaveerulu |adi|

Voddinadehamulanevoollalopala chochchi Cheddayahankaaramunu cheralu patti Addamai sreevenkatesu nundanundi lokulane Yeddala joochi navveru yekaangaveerulu |adi|

adinE ne~raganA - అదినే నెఱగనా

అదినే నెఱగనా అంతలో భ్రమతు(గాక
మదనజనక నాకు మంచిబుధ్ధి యియ్యవే

యెంత లోకానుభవము అంతయు వ్రిథా నష్టి
కొంతైన బ్రహ్మచింత కోటిలాభము
వింతైన జనులతోడి వినోదము నిష్ఫలము
చెంత సజ్జన సంగతి చేరిన యాదాయము

నానాదేశ వార్తలు నడుమ చింతా మూలము
పూనిన పురాణ గోష్ఠి పుణ్యమూలము
ఆనినకృషివాణిజ్యాలన్నియు( దీరని వెట్టి
మానని యాచార మాత్మకు( బడ్దపాటు

పలు చుట్టరికములు బట్టబయలు తగుళ్ళు
చెలగు నాచార్య సేవ జీవన్ముక్తి
బలిమి శ్రీవేంకటేశ పరగ రెండు విధాలు
నిలుకడయినవాడవు నీవే యిన్నిటికి

adinE ne~raganA aMtalO bhramatu(gAka
madanajanaka nAku maMchibudhdhi yiyyavE

yeMta lOkAnubhavamu aMtayu vrithA nashTi
koMtaina brahmachiMta kOTilAbhamu
viMtaina janulatODi vinOdamu nishphalamu
cheMta sajjana saMgati chErina yAdAyamu

nAnAdESa vArtalu naDuma chiMtA mUlamu
pUnina purANa gOshThi puNyamUlamu
AninakRshivANijyAlanniyu( dIrani veTTi
mAnani yAchAra mAtmaku( baDdapATu

palu chuTTarikamulu baTTabayalu taguLLu
chelagu nAchArya sEva jIvanmukti
balimi SrIvEMkaTESa paraga reMDu vidhAlu
nilukaDayinavADavu nIvE yinniTiki

adinIku dArukANamu - అదినీకు దారుకాణము

ప|| అదినీకు దారుకాణము అవునో కాదోకాని | 

కదిసి చెప్పగబోతే కతలయ్యీగాని ||

చ|| కలలోన నీరూపు కన్నుల గన్నట్లయ్యీ | 

చెలగి ఆసుద్ది చెప్ప జింతయ్యీగాని | 

వెలయ నీపలుకులు వీనుల విన్నట్లయ్యీ | 

సెలవి గమ్మర జెప్ప సిగ్గయ్యీగాని ||

చ|| మంతనాన నీతో మాటలాడి నట్లయ్యా | 

అంతట జూచితే వెరగయ్యీగాని | 

కంతు సమరతి నిన్ను గాగలించినట్లయ్యీ | 

పంతాన నేమనినాను పచ్చిదేరీగాని ||

చ|| వరుస నీమోవితేనె చవిగొన్న అట్లనయీ | 

వొరసి చూపబోతే గోరొత్తీగాని | 

ఇరవయిన శ్రీ వేంకటేశ నీవు ద్రిష్టముగా | 

సరుగ గూడిన నదె చాలాయగాని ||


pa|| adinIku dArukANamu avunO kAdOkAni | 

kadisi ceppagabOtE katalayyIgAni ||

ca|| kalalOna nIrUpu kannula gannaTlayyI | 

celagi Asuddi ceppa jiMtayyIgAni | 

velaya nIpalukulu vInula vinnaTlayyI | 

selavi gammara jeppa siggayyIgAni ||

ca|| maMtanAna nItO mATalADi naTlayyA | 

aMtaTa jUcitE veragayyIgAni | 

kaMtu samarati ninnu gAgaliMcinaTlayyI | 

paMtAna nEmaninAnu paccidErIgAni ||

ca|| varusa nImOvitEne cavigonna aTlanayI | 

vorasi cUpabOtE gOrottIgAni | 

iravayina SrI vEMkaTESa nIvu driShTamugA | 

saruga gUDina nade cAlAyagAni ||

adigAka soubhAgyamadigAka - అదిగాక సౌభాగ్యమదిగాక

అదిగాక సౌభాగ్యమదిగాక వలపు
అదిగాక సుఖ్హమింక నందరికి గలదా ||

ప్రాణవల్లభుని బెడబాసి మరుబాణముల
ప్రాణబాధల నెగులుపడుటేటి వలపే
ప్రాణేశ్వరుదు దన్ను బాయజూచిన యపుడు
ప్రాణంబు మేనిలో బాయంగవలదా ||

ఒద్దికై ప్రియునితో నొడగూడి యుండినపు
డిద్దరై విహరించు టిదియేటి వలపే
పొద్దుపోకలకు దమ పొలయలుకకూటముల
బుద్దిలో బరవశము పొందంగ వలదా ||

చిత్తంబులోపలను శ్రీ వేంకటేశ్వరుని
హత్తించి నాడుదాన ఈ యుండవలదా
కొత్తైన ఈటువంటి కొదలేని సంగతుల
తత్తరము మున్నడి తగులంగవలదా ||
adigAka soubhAgyamadigAka valapu
adigAka suKhamiMka naMdariki galadA ||

prANavallabhuni beDabAsi marubANamula
prANabAdhala negulupaDuTETi valapE
prANESvarudu dannu bAyajUchina yapuDu
prANaMbu mEnilO bAyaMgavaladA ||

oddikai priyunitO noDagUDi yuMDinapu
Diddarai vihariMchu TidiyETi valapE
poddupOkalaku dama polayalukakUTamula
buddilO baravaSamu poMdaMga valadA ||

chittaMbulOpalanu SrI vEMkaTESvaruni
hattiMchi nADudAna I yuMDavaladA
kottaina ITuvaMTi kodalEni saMgatula
tattaramu munnaDi tagulaMgavaladA ||

adigAka nijamataMbadi - అదిగాక నిజమతంబది

ప|| అదిగాక నిజమతంబది గాక యాజకం- | బదిగాక హృదయసుఖ మదిగాక పరము ||

చ|| అమలమగు విజ్ఞానమను మహాధ్వరమునకు- | నమరినది సంకల్పమను మహాపశువు | ప్రమదమను యూపగంబమున వికసింపించి | విమలేంద్రియాహుతులు వేల్పంగవలదా ||

చ|| అరయ నిర్మమకార మాచార్యుడై చెలగ | వరుసతో ధర్మదేవత బ్రహ్మ గాగ | దొరకొన్న శమదమాదులు దానధర్మ | భాస్వరగుణాదులు విప్రసమితి గావలదా ||

చ|| తిరువేంకటాచలాధిపు నిజధ్యానంబు | నరులకును సోమపానంబు గావలదా | పరగ నాతనికృపా పరిపూర్ణజలధిలో | నర్హులై యపబృథం బాడంగవలదా ||

pa|| adigAka nijamataMbadi gAka yAjakaM- | badigAka hRudayasuKa madigAka paramu ||

ca|| amalamagu vij~jAnamanu mahAdhvaramunaku- | namarinadi saMkalpamanu mahApaSuvu | pramadamanu yUpagaMbamuna vikasiMpiMci | vimalEMdriyAhutulu vElpaMgavaladA ||

ca|| araya nirmamakAra mAcAryuDai celaga | varusatO dharmadEvata brahma gAga | dorakonna SamadamAdulu dAnadharma | BAsvaraguNAdulu viprasamiti gAvaladA ||

ca|| tiruvEMkaTAcalAdhipu nijadhyAnaMbu | narulakunu sOmapAnaMbu gAvaladA | paraga nAtanikRupA paripUrNajaladhilO | narhulai yapabRuthaM bADaMgavaladA ||

adi brahmANDaMbidi - అది బ్రహ్మాణ్డంబిది

ప|| అది బ్రహ్మాణ్డంబిది పిణ్డాణ్డంబు- | 

దుటు జీవులము వున్నారమిదివో ||

చ|| ఉదయాస్త మయము లొనరిన వలెనే | 

నిదురలు మేల్కను నిమయములు | 

కదిసి తిరిసంధ్యా కాలంబులవలె | 

గుదిగొను దేహికి గుణత్రయములు ||

చ|| పుడమి సస్యములు పొదలిన వలెనే | 

వొడలి రోగములన్నవివే | 

ఉడుగని వెలుపటి వుద్యోగమువలె | 

కొడిసాగెడి మితి కోరికలు ||

చ|| వెలుపలగల శ్రీ వేంకట విభుడే | 

కలడాతుమలో ఘనుడితడే | 

చలమున నీతని శరణాగతియే | 

ఫలమును భాగ్యము బహు సంపదలు ||


pa|| adi brahmANDaMbidi piNDANDaMbu- | 

duTu jIvulamu vunnAramidivO ||

ca|| udayAsta mayamu lonarina valenE | 

niduralu mElkanu nimayamulu | 

kadisi tirisaMdhyA kAlaMbulavale | 

gudigonu dEhiki guNatrayamulu ||

ca|| puDami sasyamulu podalina valenE | 

voDali rOgamulannavivE | 

uDugani velupaTi vudyOgamuvale | 

koDisAgeDi miti kOrikalu ||

ca|| velupalagala SrI vEMkaTa viBuDE | 

kalaDAtumalO GanuDitaDE | 

calamuna nItani SaraNAgatiyE | 

phalamunu bhAgyamu bahu saMpadalu ||