ana niMkE munnadi - అన నింకే మున్నది

ప|| అన నింకే మున్నది అలుగ నేమున్నది | కనుగొనలనే చూచి కరగుట గాక ||

చ|| నవ్వూ నవ్వా జెల్లును నాలి సెయ జెల్లు నీకు | రవ్వగా నే మోహించి రాపైన యందుకు |

యెవ్వరితో దగవూ లిక నాడే నేను | జవ్వనాన నొంటి నేను జడియుట గాక |

చ|| బిగియూ నమరునూ బీరాలు నమరునూ | తగవు లెంచక నిన్ను దగ్గరిన యందుకు |

జగడమూ జెల్లదూ సాదించ జెల్లదూ | మొగమోటమున నేనే ములుగుట గాక ||

చ|| సరసము దక్కెనూ చనవెలా నెక్కెనూ | మరగి నీ కౌగిట నేను మఱచిన యందుకు |

తెరయెత్త బనిలేదు దిష్టము శ్రీ వేంకటేశ | సరుగ నీ రతిజిక్కి సత మౌట గాక ||

pa|| ana niMkE munnadi aluga nEmunnadi | kanugonalanE cUci karaguTa gAka ||

ca|| navvU navvA jellunu nAli seya jellu nIku | ravvagA nE mOhiMci rApaina yaMduku | yevvaritO dagavU lika nADE nEnu | javvanAna noMTi nEnu jaDiyuTa gAka |

ca|| bigiyU namarunU bIrAlu namarunU | tagavu leMcaka ninnu daggarina yaMduku | jagaDamU jelladU sAdiMca jelladU | mogamOTamuna nEnE muluguTa gAka ||

ca|| sarasamu dakkenU canavelA nekkenU | maragi nI kaugiTa nEnu marxacina yaMduku |

terayetta banilEdu diShTamu SrI vEMkaTESa | saruga nI ratijikki sata mauTa gAka ||

Addigaa voyayya - అద్దిగా వోయయ్య

సాళంగనాట

అద్దిగా వోయయ్య నే నంతవాడనా! వొక_
కొద్ది నీదాసులసేవ కోరగలగాక

హరి నీమాయలకు నే నడ్డము చెప్పేవాడనా
అరిదైన దదియు రాచాజ్ఞ గనక
పరమ పదాన కానపడుటయు ద్రోహము
సొరిది నీభండారము సొమ్ముగనక

పంచేద్రియముల నే బారదోలేవాడనా
ముంచి నీవు వెట్టినట్టి ముద్ర కర్తలు
అంచల నావిజ్ఞాన మది దహించవచ్చునా
నించి నీవు పాతినట్టినిధాన మది

వొట్టి సంసారపు మోపు నోపననేవాడనా
వెట్టి మమ్ము జేయించేటివేడుక నీది
గట్టిగా శృఈవేంకటేశ కదిసి నీశరణంటి
ఱట్టుగ నే జెప్పేనా మీఱగ నీరహస్యము

Saalanganaata

Addigaa voyayya ne namtavaadanaa! Voka_
Koddi needaasulaseva koragalagaaka

Hari neemaayalaku ne naddamu cheppevaadanaa
Aridaina dadiyu raachaangna ganaka
Parama padaana kaanapadutayu drohamu
Soridi neebhandaaramu sommuganaka

Panchedriyamula ne baaradolevaadanaa
Munchi neevu vettinatti mudra kartalu
Anchala naavigyanaana madi dahinchavachchunaa
Ninchi neevu paatinattinidhaana madi

Votti samsaarapu mopu nopananevaadanaa
Vetti mammu jeyinchetiveduka needi
Gattigaa sreevenkatesa kadisi neesaranamti
~rattuga ne jeppenaa mee~raga neerahasyamu

adecUDu tiruvEMkaTAdri - అదెచూడు తిరువేంకటాద్రి

ప|| అదెచూడు తిరువేంకటాద్రి నాలుగుయుగము- | లందు వెలుగొందీ ప్రభమీరగాను ||

చ|| తగ నూటయిరువై యెనిమిదితిరుపతుల గల- | స్థానికులును చక్రవర్తిపీఠకమలములును |

అగణితంబైన దేశాంత్రులమఠంబులును | నధికమై చెలువొందగాను ||

చ|| మిగులనున్నతములగుమేడలును మాడుగులు | మితిలేనిదివ్యతపస్సులున్న గృహములును |

వొగి నొరగు బెరుమాళ్ళ వునికిపట్టయి వెలయు- | దిగువ తిరుపతి గడవగాను ||

చ|| పొదలి యరయోజనముపొడవునను బొలుపొంది | పదినొండుయోజనంబులపరపునను బరగి |

చెదర కేవంకచూచిన మహాభూజములు | సింహశార్దూలములును ||

చ|| కదిసి సురవరులు కిన్నరులు కింపురుషులును | గరుడగంధర్వయక్షులును విద్యాధరులు |

విదితమై విహరించువిశ్రాంతదేశముల | వేడుకలు దైవారగాను||

చ|| యెక్కువలకెక్కువై యెసగి వెలసినపెద్ద- | యెక్కు డతిశయముగా నెక్కినంతటిమీద |

అకజంబైన పల్లవరాయనిమటము | అల్లయేట్ల పేడ గడవన్ ||

చ|| చక్కనేగుచు నవ్వచరి గడచి హరి దలచి | మ్రొక్కుచును మోకాళ్ళముడుగు గడచినమీద- |

నక్కడక్కడ వేంకటాద్రీశుసంపదలు | అంతంత గానరాగాను ||

చ|| బుగులుకొనుపరిమళంబుల పూవుదోటలును | పొందైన నానావిధంబుల వనంబులును |

నిగడి కిక్కిరిసి పండినమహావృక్షముల- | నీడలను నిలిచి నిలిచి ||

చ|| గగనంబుదాకి శృంగార రసభరితమై | కనకమయమైన గోపురములను జెలువొంది |

జగతీధరుని దివ్యసంపదలు గలనగరు | సరుగనను గానరాగాను ||

చ|| ప్రాకటంబైన పాపవినాశనములోని | భరితమగుదురితములు పగిలి పారుచునుండ |

ఆకాశగంగతోయములు సోకిన భవము- | లంతంత వీడి పారగను ||


చ|| యీకడను గోనేట యతులు బాశుపతుల్ మును- | లెన్న నగ్గలమైవున్న వైష్ణవులలో |

యేకమై తిరువేంకటాద్రీశు డాదరిని | యేప్రొద్దు విహరించగాను ||

pa|| adecUDu tiruvEMkaTAdri nAluguyugamu- | laMdu velugoMdI praBamIragAnu ||

ca|| taga nUTayiruvai yenimiditirupatula gala- | sthAnikulunu cakravartipIThakamalamulunu | agaNitaMbaina dESAMtrulamaThaMbulunu | nadhikamai celuvoMdagAnu ||

ca|| migulanunnatamulagumEDalunu mADugulu | mitilEnidivyatapassulunna gRuhamulunu | vogi noragu berumALLa vunikipaTTayi velayu- | diguva tirupati gaDavagAnu ||

ca|| podali yarayOjanamupoDavunanu bolupoMdi | padinoMDuyOjanaMbulaparapunanu baragi | cedara kEvaMkacUcina mahABUjamulu | siMhaSArdUlamulunu ||

ca|| kadisi suravarulu kinnarulu kiMpuruShulunu | garuDagaMdharvayakShulunu vidyAdharulu | viditamai vihariMcuviSrAMtadESamula | vEDukalu daivAragAnu||

ca|| yekkuvalakekkuvai yesagi velasinapedda- | yekku DatiSayamugA nekkinaMtaTimIda | akajaMbaina pallavarAyanimaTamu | allayETla pEDa gaDavan ||

ca|| cakkanEgucu navvacari gaDaci hari dalaci | mrokkucunu mOkALLamuDugu gaDacinamIda- | nakkaDakkaDa vEMkaTAdrISusaMpadalu | aMtaMta gAnarAgAnu ||

ca|| bugulukonuparimaLaMbula pUvudOTalunu | poMdaina nAnAvidhaMbula vanaMbulunu | nigaDi kikkirisi paMDinamahAvRukShamula- | nIDalanu nilici nilici ||

ca|| gaganaMbudAki SRuMgAra rasaBaritamai | kanakamayamaina gOpuramulanu jeluvoMdi | jagatIdharuni divyasaMpadalu galanagaru | sarugananu gAnarAgAnu ||

ca|| prAkaTaMbaina pApavinASanamulOni | Baritamaguduritamulu pagili pArucunuMDa | AkASagaMgatOyamulu sOkina Bavamu- | laMtaMta vIDi pAraganu ||

ca|| yIkaDanu gOnETa yatulu bASupatul munu- | lenna naggalamaivunna vaiShNavulalO | yEkamai tiruvEMkaTAdrISu DAdarini | yEproddu vihariMcagAnu ||

ade SrIvEMkaTapati - అదె శ్రీవేంకటపతి

అదె శ్రీవేంకటపతి అలమేలుమంగయును
కదిసి యున్నారు తమకమున పెండ్లికిని

బాసికములు కట్టరో పైపై దంపతులకు
శేసపాలందియ్యరో చేతులకును
సూసకాల పేరంటాండ్లు సోబనాలు పాడరో
మోసపోక యిట్టే ముహూర్తమడుగరో

గక్కునను మంగలాష్టకములు చదువురో
తక్కట జేగట (జేగంట?) వేసి తప్పకుండాను
నిక్కినిక్కి చూచేరదె నెరి(దెర తీయరో
వొక్కటైరి కొంగుముళ్ళు వొనరగ వేయరో

కంకణ దారములను కట్టరో యిద్దరికిని
సుంకుల పెండ్లిపీట కూర్చుండబెట్టరో
లంకె శ్రీవేంకటేశు నలమేల్ మంగను దీవించి
అంకెల పానుపుమీద అమరించరో
ade SrIvEMkaTapati alamElumaMgayunu
kadisi yunnAru tamakamuna peMDlikini

bAsikamulu kaTTarO paipai daMpatulaku
SEsapAlaMdiyyarO chEtulakunu
sUsakAla pEraMTAMDlu sObanAlu pADarO
mOsapOka yiTTE muhUrtamaDugarO

gakkunanu maMgalAShTakamulu chaduvurO
takkaTa jEgaTa (jEgaMTa?) vEsi tappakuMDAnu
nikkinikki chUchErade neri(dera tIyarO
vokkaTairi koMgumuLLu vonaraga vEyarO

kaMkaNa dAramulanu kaTTarO yiddarikini
suMkula peMDlipITa kUrchuMDabeTTarO
laMke SrIvEMkaTESu nalamEl maMganu dIviMchi
aMkela pAnupumIda amariMcharO

ade SiraScakramulEnaTTi - అదె శిరశ్చక్రములే

ప|| అదె శిరశ్చక్రములేనట్టిదేవర లేదు | యిదె హరిముద్రాంకిత మిందే తెలియరో ||

చ|| "అనాయుధాసో అసురా అదేవా" యని | వినోదముగ ఋగ్వేదముదెలిపెడి |

సనాతనము విష్ణుచక్రధారునకును | అనాది ప్రమాణమందే తెలియరో ||

చ|| "యచ్చ యింద్రే" యని "యచ్చ సూర్యే" యని | అచ్చుగ తుదకెక్క నదె పొగడీ శ్రుతి |

ముచ్చట గోవిందుని ముద్రధారణకు | అచ్చమయిన ప్రమాణమందే తెలియరో ||

చ|| మును "నేమినా తప్త ముద్రాం ధారయే" త్తని | వెనువేంకటశ్రుతి యదె వెల్లవిరిసేసీని |

మొనసి శ్రీవేంకటేశు ముద్రధారణకు | అనువుగ బ్రమాణమందే తెలియరో ||

pa|| ade SiraScakramulEnaTTidEvara lEdu | yide harimudrAMkita miMdE teliyarO ||

ca|| "anAyudhAsO asurA adEvA" yani | vinOdamuga RugvEdamudelipeDi |

sanAtanamu viShNucakradhArunakunu | anAdi pramANamaMdE teliyarO ||

ca|| "yacca yiMdrE" yani "yacca sUryE" yani | accuga tudakekka nade pogaDI Sruti |

muccaTa gOviMduni mudradhAraNaku | accamayina pramANamaMdE teliyarO ||

ca|| munu "nEminA tapta mudrAM dhArayE" ttani | venuvEMkaTaSruti yade vellavirisEsIni | monasi SrIvEMkaTESu mudradhAraNaku | anuvuga bramANamaMdE teliyarO ||

ade vADe yide vIDe - అదె వాడె యిదె వీడె

ప|| అదె వాడె యిదె వీడె అందు నిందు నేగీని | వెదకి వెదకి తిరువీధులందు దేవుడు ||

చ|| అలసూర్యవీధి నేగీ నాదిత్యునితేరిమిద | కలికికమలానందకరుడుగాన |

తలపోసి అదియును దవ్వు చుట్టరికమని | యిల దేరిమీద నేగీ నిందిరావిభుడు ||

చ|| చక్క సోమవీధి నేగీ జందురునితేరిమీద | యెక్కువైనకువలయహితుడుగాన |

చుక్కలుమోచినదవ్వుచుట్టరిక మిదియని | యిక్కువతో వీధి నేగీ నెన్నికైనదేవుడు ||

చ|| యింతులమనోవీధి నేగీ మరుతేరిమీద- | నంతటా రతిప్రియు డటుగాన |

రంతుల నదియు గానరానిచుట్టరికమని | వింతరీతి నేగీ శ్రీవేంకటాద్రిదేవుడు ||

pa|| ade vADe yide vIDe aMdu niMdu nEgIni | vedaki vedaki tiruvIdhulaMdu dEvuDu ||

ca|| alasUryavIdhi nEgI nAdityunitErimida | kalikikamalAnaMdakaruDugAna |

talapOsi adiyunu davvu cuTTarikamani | yila dErimIda nEgI niMdirAviBuDu ||

ca|| cakka sOmavIdhi nEgI jaMdurunitErimIda | yekkuvainakuvalayahituDugAna | cukkalumOcinadavvucuTTarika midiyani | yikkuvatO vIdhi nEgI nennikainadEvuDu ||

ca|| yiMtulamanOvIdhi nEgI marutErimIda- | naMtaTA ratipriyu DaTugAna |

raMtula nadiyu gAnarAnicuTTarikamani | viMtarIti nEgI SrIvEMkaTAdridEvuDu ||

ade vacce nide vacce - అదె వచ్చె నిదె వచ్చె

ప|| అదె వచ్చె నిదె వచ్చె నచ్యుతుసేనాపతి | పదిదిక్కులకు నిట్టె పారరో యసురలు ||

చ|| గరుడధ్వజం బిదె ఘనశంఖరవ మదె | సరుసనే విష్ణుదేవుచక్ర మదె |

మురవైరిపంపు లవె ముందరిసేన లవె | పరచి గగ్గుల కాడై పారరో దానవుల ||

చ|| తెల్లవి గొడుగు లవె దేవదుందుభులు నవె | యెల్లదేవతలరథా లింతటా నవె |

కెల్లురేగీ నిక్కి హరికీర్తి భుజములవె | పల్లపుపాతాళాన బడరో దనుజులు ||

చ|| వెండిపైడిగుదె లవె వెంజామరము లవె | మెండగుకై వారాలు మించిన వవె |

దండి శ్రీవేంకటపై దాడిముటై నదె యిదె | బడుబండై జజ్జరించి పారరోదై తేయులు ||

pa|| ade vacce nide vacce nacyutusEnApati | padidikkulaku niTTe pArarO yasuralu ||

ca|| garuDadhvajaM bide GanaSaMKarava made | sarusanE viShNudEvucakra made | muravairipaMpu lave muMdarisEna lave | paraci gaggula kADai pArarO dAnavula ||

ca|| tellavi goDugu lave dEvaduMduBulu nave | yelladEvatalarathA liMtaTA nave | kellurEgI nikki harikIrti Bujamulave | pallapupAtALAna baDarO danujulu ||

ca|| veMDipaiDigude lave veMjAmaramu lave | meMDagukai vArAlu miMcina vave | daMDi SrIvEMkaTapai dADimuTai nade yide | baDubaMDai jajjariMci pArarOdai tEyulu ||