annicOTla baramAtmavu - అన్నిచోట్ల బరమాత్మవు

ప|| అన్నిచోట్ల బరమాత్మవు నీవు | యిన్నిరూపుల భ్రమయింతువుగా ||

చ|| పాలజలధి నుండి బదరీవనాన నుండి | ఆలయమై గయలో బ్రయాగ నుండి |

భూలోకనిధివై పురుషోత్తమాన నుండి | వేలసంఖ్యలరూపై విచ్చేతుగా ||

చ|| వుత్తరమధురలో నయోధ్యలోపల నుండి | సత్తైననందవ్రజాన నుండి |

చిత్తగించి పంచవటి సింహాద్రిలోన నుండి | వత్తుగా లోకములు పావనము సేయగను ||

చ|| కైవల్యమున నుండి కమలజలోకాన | మోవగ శ్రీరంగమున నుండి |

యీవల నావల నుండి యీవేంకటాద్రిపై నీవే నీవే వచ్చి నెలకొంటిగా ||

pa|| annicOTla baramAtmavu nIvu | yinnirUpula BramayiMtuvugA ||

ca|| pAlajaladhi nuMDi badarIvanAna nuMDi | Alayamai gayalO brayAga nuMDi | BUlOkanidhivai puruShOttamAna nuMDi | vElasaMKyalarUpai viccEtugA ||

ca|| vuttaramadhuralO nayOdhyalOpala nuMDi | sattainanaMdavrajAna nuMDi | cittagiMci paMcavaTi siMhAdrilOna nuMDi | vattugA lOkamulu pAvanamu sEyaganu ||

ca|| kaivalyamuna nuMDi kamalajalOkAna | mOvaga SrIraMgamuna nuMDi | yIvala nAvala nuMDi yIvEMkaTAdripai nIvE nIvE vacci nelakoMTigA ||

annalaMTA tammulaMTA - అన్నలంటా తమ్ములంటా

ప|| అన్నలంటా తమ్ములంటా ఆండ్లంటా బిడ్డలంటా | వన్నెల నప్పులు గొన్న వారువో వీరు ||

చ|| తెగనీక అప్పులెల్లా దీసి తీసి వారు | తగిలిన బెట్టలేక దాగిదాగి |

వెగటున బారిపోగా వెంట వెంట పెక్కు | వగల నప్పులు గొన్న వారువో వీరు ||

చ|| సేయరాని పనులెల్ల చేసి చేసి తమ | రాయడికి లోలోనె రాసి రాసి |

కాయములో చొచ్చి చొచ్చి కాచి కాచి మున్ను | వ్రాయని పత్రాలకాగే వారువో వీరు ||

చ|| దొరయై యప్పుల వారి దోసి తోసి యీ | పరిభవములనెల్ల బాసి పాసి |

సిరుల వేంకటపతి జేరి చేరి యిట్టి | వరుసనే గెలిచిన వారువో వీరు ||

pa|| annalaMTA tammulaMTA AMDlaMTA biDDalaMTA | vannela nappulu gonna vAruvO vIru ||

ca|| teganIka appulellA dIsi tIsi vAru | tagilina beTTalEka dAgidAgi |

vegaTuna bAripOgA veMTa veMTa pekku | vagala nappulu gonna vAruvO vIru ||

ca|| sEyarAni panulella cEsi cEsi tama | rAyaDiki lOlOne rAsi rAsi |

kAyamulO cocci cocci kAci kAci munnu | vrAyani patrAlakAgE vAruvO vIru ||

ca|| dorayai yappula vAri dOsi tOsi yI | pariBavamulanella bAsi pAsi |

sirula vEMkaTapati jEri cEri yiTTi | varusanE gelicina vAruvO vIru ||

anumAnapubraduku - అనుమానపుబ్రదుకు

ప|| అనుమానపుబ్రదుకు కది రోతా తన- | మనసెనయనికూటమి మరి రోతా ||

చ|| అపకీర్తులబడి ఆడికెలోనై | అపవాదియౌట అది రోత |

వుపమ గెలిచెనని వొరు జెరుచుటలు | విపరీతపుగుణ విధమొక రోతా ||

చ|| తనగుట్టెల్లా నెరిగిన వారలముందట | తనయెమ్మెలు చెప్పుకొనుట రోత |

వనితలముందట వదరుచు వదరుచు | కనుగవ గావనిగర్వము రోత ||

చ|| భువి హరిగతియని బుద్ధిదలంచని | యవమానపుమన నది రోత |

భవసంహరుడై పరగు వేంకటపతి- | నవిరళముగ గొలువని దది రోత ||

pa|| anumAnapubraduku kadi rOtA tana- | manasenayanikUTami mari rOtA ||

ca|| apakIrtulabaDi ADikelOnai | apavAdiyauTa adi rOta | vupama gelicenani voru jerucuTalu | viparItapuguNa vidhamoka rOtA ||

ca|| tanaguTTellA nerigina vAralamuMdaTa | tanayemmelu ceppukonuTa rOta | vanitalamuMdaTa vadarucu vadarucu | kanugava gAvanigarvamu rOta ||

ca|| Buvi harigatiyani buddhidalaMcani | yavamAnapumana nadi rOta | BavasaMharuDai paragu vEMkaTapati- | naviraLamuga goluvani dadi rOta ||

Anuchu niddarunaade - అనుచు నిద్దరునాడే

రాగమ్: రామక్రియ

అనుచు నిద్దరునాడే రమడవలెనే మొనసి యివెల్లా జూచి మ్రొక్కిరి బ్రహ్మాదులు

రాముడ పండ్లు నాకు రండు వెట్టరా యేమిరా యిట్లానె నాకు యిత్తువా నీవు ప్రేమపుతమ్ముడగాన పిన్ననే నీకు యీమాట మఱవకు యిందరా కృష్ణుడా

యెక్కిన పుట్టిపై నన్ను నెక్కించరా వోరి వుక్కున బడేవు రాకు వద్దురా నీవు పక్కున మొక్కేరా నీపయిడికాళ్ళకు వోరి అక్కతో జెప్పేగాని అందుకొనే రారా

యెవ్వరు వొడవో సరి నిటు నిలుతమురా వోరి నివ్వటిల్ల నీ వింత నిక్కవొద్దురా రవ్వల శ్రీవేంకటాద్రిరాయడనేరా, అయితే యివ్వల నీకంటే బెద్ద యిది నీ వెఱగవా

Raagam: Raamakriya

Anuchu niddarunaade ramadavalene Monasi yivellaa joochi mrokkiri brahmaadulu

Raamuda pamdlu naaku ramdu vettaraa Yemiraa yitlaane naaku yittuvaa neevu Premaputammudagaana pinnane neeku Yeemaata maravaku yimdaraa krshnudaa

Yekkina puttipai nannu nekkimcharaa vori Vukkuna badevu raaku vadduraa neevu Pakkuna mokkeraa neepayidikaallaku vori Akkato jeppegaani amdukone raaraa

Yevvaru vodavo sari nitu nilutamuraa vori Nivvatilla nee vimta nikkavodduraa Ravvala sreevenkataadriraayadaneraa, ayite Yivvala neekamte bedda yidi nee veragavaa


Ani raavanutala - అని రావణుతల

రాగమ్: సాళంగనాట

అని రావణుతల లట్టలు బొందించి చెనకి భూతములు చెప్పె బుద్ది

కట్టిరి జలనిధి కపిసేన లవిగో చుట్టు లంక కంచుల విడిసె కొట్టిరి దానవకోట్లతల లదే కట్టిడిరావణ గతియో నీకు

యెక్కిరి కోటలు యిందరు నొకపరి చిక్కిరి కలిగినచెరయెల్ల పక్కన సీతకు బరిణామమాయ నిక్కము రావణ నీకో బ్రదుకు

పరగ విభీషణు బట్టము గట్టెను తొరలి లంకకును తొలుదొలుతే గరిమెల శ్రీవేంకటగిరి రాముడు మెరసెను రావణ మేలాయ బనులు

Raagam:Saalanganaata

Ani raavanutala lattalu bondinchi Chenaki bhootamulu cheppe buddi

Kattiri jalanidhi kapisena lavigo Chuttu lanka kanchula vidise Kottiri daanavakotlatala lade Kattidiraavana gatiyo neeku

Yekkiri kotalu yindaru nokapari Chikkiri kaliginacherayella Pakkana seetaku barinaamamaaya Nikkamu raavana neeko braduku

Paraga vibheeshanu battamu gattenu Torali lankakunu toludolute Garimela sreevenkatagiri raamudu

Merasenu raavana melaaya banulu

anAdi jagamuna - అనాది జగమున

ప|| అనాది జగమున కౌభళము | అనేకాద్భుతంబౌ భళము ||

చ|| హరి నివాస మీయౌ భళము | అరిది పరమ పదమౌ భళము|

అరిదైత్యాంతకమౌ భళము | హరముఖ సేవితమౌ భళము ||

చ|| అమలరమాకరమౌ భళము | అమితమునీంద్రంబౌ భళము |

అమరవందితంబౌ భళము | అమరె బుణ్యములనౌ భళము ||

చ|| అగరాజంబీ యౌ భళము | అగణిత తీర్థంబౌ భళము |

తగు శ్రీవేంక ధామ విహారం- | బగు శుభాంచితంబౌ భళము||

pa|| anAdi jagamunakau BaLamu | anEkAdButaMbau BaLamu ||

ca|| hari nivAsa mIyau BaLamu | aridi parama padamau BaLamu| aridaityAMtakamau BaLamu | haramuKa sEvitamau BaLamu ||

ca|| amalaramAkaramau BaLamu | amitamunIMdraMbau BaLamu | amaravaMditaMbau BaLamu | amare buNyamulanau BaLamu ||

ca|| agarAjaMbI yau BaLamu | agaNita tIrthaMbau BaLamu | tagu SrIvEMka dhAma vihAraM- | bagu SuBAMcitaMbau BaLamu||

Get this widget | Track details | eSnips Social DNA

Anantamahimudavu - అనంతమహిముడవు

అనంతమహిముడవు అనంతశక్తివి నీవు యెనలేనిదైవమా నిన్నేమని నుతింతును.

అన్నిలోకములు నీయందు నున్న వందురు నీ_ వున్న లోక మిట్టిదని వూహించరాదు యెన్న నీవు రxఅకుడ విందరిపాలిటికి నిన్ను రxఇంచేటివారి నేనెవ్వరి నందును.

తల్లివి దండ్రివి నీవు తగుబ్రహ్మాదులకు యెల్లగా నీతల్లిదండ్రులెవ్వరందును యిల్లిదె వరములు నీ విత్తువిందరికిని చెల్లబో నీకొకదాత చెప్పగ జోటేది.

జూవుల కేలికవు శ్రీవేంకటేశుడవు నీ_ వేవల జూచిన నీ కేయేలికే లేడు వేవేలు మునులును వెదకేరు నిన్నును

నీ వెవ్వరి వెదకేవు నిర్మలమూరితివి.

Anantamahimudavu anantasaktivi neevu Yenalenidaivamaa ninnemani nutintunu.

Annilokamulu neeyandu nunna vanduru nee_ Vunna loka mittidani voohincharaadu Yenna neevu rakshaakuda vindaripaalitiki Ninnu rakshinchetivaari nenevvari nandunu.

Tallivi dandrivi neevu tagubrahmaadulaku Yellagaa neetallidandrulevvaramdunu Yillide varamulu nee vittuvindarikini Chellabo neekokadaata cheppaga jotedi.

Joovula kelikavu sreevenkatesudavu nee_ Vevala joochina nee keyelike ledu Vevelu munulunu vedakeru ninnunu Nee vevvari vedakevu nirmalamooritivi.