Aparaadhini nenainaanu - అపరాధిని నేనైనాను

అపరాధిని నేనైనాను ౩ కృపగల వారికి కపటము లేదు ౨ (౨)

సనాతనా అచ్యుత సర్వేశ్వరా అనాది కారణ అనంతా ౨ జనార్ధనా అచల సకల లోకేశ్వరా ౨ నిను మరచియున్నాడ నను తెలుపవయా ౨

పల్లవి ౨

పురాణ పురుష పురుషోత్తమ చరాచరాత్మక జగదీశా ౨ పరాత్పరా హరి బ్రహ్మండనాయకా ౨ ఇరగ నీవే అట ఎరిగించగదే ౨

పల్లవి ౨ దేవోత్తమా శశి దినకర నయనా పావన చరితా పరమాత్మా శ్రీ వెంకటేశా ౨ జీవాంతరంగా (౨) సేవకుడను బుద్దిచెప్పతగవలయు ౨

పల్లవి ౨

Aparaadhini nenainaanu ~3 krupagala vaariki kapatamu ledu ~2 (~2)

Sanaatanaa achyuta sarvesvaraa anaadi kaarana anamtaa ~2 Janaardhanaa achala sakala lokesvaraa ~2 ninu marachiyunnaada nanu telupavayaa ~2

Pallavi ~2

Puraana purusha purushottama charaacharaatmaka jagadeesaa ~2 Paraatparaa hari brahmamdanaayakaa ~2 Iraga neeve ata erigimchagade ~2

Pallavi ~2 Devottamaa sasi dinakara nayanaa paavana charitaa paramaatmaa Sree venkatesaa ~2 jeevaamtaramgaa (~2) Sevakudanu buddicheppatagavalayu ~2

Pallavi ~2

anniyunu harinE - అన్నియును హరినేనే

ప|| అన్నియును హరినేనేయటమటాలే యివి | పన్నిన సుజ్ఞానికి బయలై తోచును ||

చ|| తిరుపై యవ్వలవ్వల దిరుగుచుండేటివేళ | దిరిగినట్ల నుండు దిక్కులెల్లాను |
సిరులసంసారభ్రమ జిక్కినజీవునికిని | సరిగ నైహికము పరమై తోచు ||

చ|| సొగిసి యద్దమునీడ చూచినవేళ దనకు | మగుడ వేఱొకరూపు మతి దోచును |
తగిలి యిట్లానేపో తనుదా నెఱగకున్న | నిగిడినపుట్టువులు నిజమై తోచు ||

చ|| కదిసినసకలాంధకార మంతటా గప్పి | వుదయమైతే నన్నీ నొదిగినట్టు |
హృదయపుశ్రీవేంకటేశుడు వెల్లవిరైతే | మదిలో నజ్ఞానము మాయమై తోచు ||

pa|| anniyunu harinEnEyaTamaTAlE yivi | pannina suj~jAniki bayalai tOcunu ||

ca|| tirupai yavvalavvala dirugucuMDETivELa | diriginaTla nuMDu dikkulellAnu |
sirulasaMsAraBrama jikkinajIvunikini | sariga naihikamu paramai tOcu ||

ca|| sogisi yaddamunIDa cUcinavELa danaku | maguDa vErxokarUpu mati dOcunu |
tagili yiTlAnEpO tanudA nerxagakunna | nigiDinapuTTuvulu nijamai tOcu ||

ca|| kadisinasakalAMdhakAra maMtaTA gappi | vudayamaitE nannI nodiginaTTu |
hRudayapuSrIvEMkaTESuDu vellaviraitE | madilO naj~jAnamu mAyamai tOcu ||


anniyunu dana - అన్నియును దన

ప|| అన్నియును దన ఆచార్యాధీనము | చెన్నుమీఱ హరిపాదసేవసేయు మనసా ||

చ|| దైవమా గొంచము గాడు తానూ గొంచము గాడు | భావించికొలచేవారిపరిపాటి |

చేవల బత్తిముదుగు చేనిముదుగూ లేదు | వావిరి బోగెత్తెటివారివారినేరుపు ||

చ|| కాలము కడమలేదు కర్మము కడమలేదు | కేలి విశ్వాసముగలిగినపాటి |

వ్రాలకి ముదిమీ లేదు వక్కణ ముదిమీ లేదు | పోలించేటివిద్వాంసులబుద్ధిలోనినేరుపు ||

చ|| జ్ఞానానకు దప్పు లెదు జన్మానకు దప్పు లేదు | నానాటికి వివేకించి నడచేపాటి |

శ్రీవేంకటపతి యింతకు మూలము | ఆనుక యీతని శరణనేవారినేరుపు ||

pa|| anniyunu dana AcAryAdhInamu | cennumIrxa haripAdasEvasEyu manasA ||

ca|| daivamA goMcamu gADu tAnU goMcamu gADu | BAviMcikolacEvAriparipATi |

cEvala battimudugu cEnimudugU lEdu | vAviri bOgetteTivArivArinErupu ||

ca|| kAlamu kaDamalEdu karmamu kaDamalEdu | kEli viSvAsamugaliginapATi |

vrAlaki mudimI lEdu vakkaNa mudimI lEdu | pOliMcETividvAMsulabuddhilOninErupu ||

ca|| j~jAnAnaku dappu ledu janmAnaku dappu lEdu | nAnATiki vivEkiMci naDacEpATi | pAnipaTTi SrIvEMkaTapati yiMtaku mUlamu | Anuka yItani SaraNanEvArinErupu ||

Anniyu neetanimoola - అన్నియు నీతనిమూల

రాగమ్: మాళవిగౌళ

అన్నియు నీతనిమూల మాతడే మాపలజిక్కె కన్నుల మావేడుకకు కడయేది యికను

కామధేనువు గలిగితే గర్వించు నొక్కరుడు భూమి యేలితే నొకడు పొదలుచుండు కామించి నిధి గంటె కళలమించు నొకడు శ్రీమంతుడగుహరి చిక్కె మాకు నిదివో

పరుసవేదిగలిగితే పంతములాడు నొకడు ధర జింతామణబ్బితే దాటు నొకడు సురలోక మబ్బితేను చొక్కుచునుండు నొకడు పరమాత్ముడే మాపాలజిక్కెనిదివో

అమృతపానముసేసి యానందించు నొకడు భ్రమసు దేహసిద్ది బరగొకడు తమి శ్రీవేంకటేశుడే దాచినధనమై మాకు అమరి నామతి జిక్కె నడ్డాములే దిదివో

Raagam: Maalavigaula

Anniyu neetanimoola maatade maapalajikke Kannula maavedukaku kadayedi yikanu

Kaamadhenuvu galigite garvimchu nokkarudu Bhoomi yelite nokadu podaluchundu Kaaminchi nidhi gante kalalaminchu nokadu Sreemamtudaguhari chikke maaku nidivo

Parusavedigaligite pantamulaadu nokadu Dhara jintaamanabbite daatu nokadu Suraloka mabbitenu chokkuchunumdu nokadu Paramaatmude maapaalajikkenidivo

Amrtapaanamusesi yaanamdimchu nokadu Bhramasu dehasiddi baragokadu Tami sreevenkatesude daachinadhanamai maaku Amari naamati jikke naddaamule didivo


Annitiki nodayudavaina - అన్నిటికి నొడయుడవైన

రాగమ్: శ్రీరాగం

అన్నిటికి నొడయుడవైనశ్రీపతివి నీవు యెన్నరాదు మాబలగ మెంఉకో మాపౌజు

జ్ఞానేంద్రియము లైదు శరీరిలొపల ఆనక కర్మేంద్రియము లైదు తానకపుకామక్రోధాలవర్గములారు యీనెలవు పంచభూతా లెంచు మాపౌజు

తప్పని గుణాలు మూడు తనువికారములారు అప్పటి మనోబుద్ద్యహంకారాలు వుప్పతిల్లువిషయము లుడివోని వొకాయిదు యిప్పటి మించేకోపము యెంచుకో మాపౌజు

ఆకలి దప్పియును మానావమానములును సోకినశీతోష్ణాలు సుఖదు:ఖాలు మూకగమికాడ నేను మొక్కెద శ్రీవేంకటేశ యేకటారగడసేవా నెంచుకో మాపౌజు

Raagam: Sreeraagam)

Annitiki nodayudavainasreepativi neevu Yennaraadu maabalaga memuko maapauju

Gyaanendriyamu laidu sareerilopala Aanaka karmemdriyamu laidu Taanakapukaamakrodhaalavargamulaaru Yeenelavu pamchabhootaa lenchu maapauju

Tappani gunaalu moodu tanuvikaaramulaaru Appati manobuddyahamkaaraalu Vuppatilluvishayamu ludivoni vokaayidu Yippati mimchekopamu yemchuko maapauju

Aakali dappiyunu maanaavamaanamulunu Sokinaseetoshnaalu sukhadu:khaalu Mookagamikaada nenu mokkeda sreevenkatesa Yekataaragadasevaa nenchuko maapauju


Anniti kekkuduyeevi - అన్నిటి కెక్కుడుయీవి

అన్నిటి కెక్కుడుయీవి హరియిచ్చేది మన్నించునాతనికంటే మఱి లేరు దొరలు

తగుబ్రహ్మలోకముదాకా నెక్కిచూచిన మగుడ బుట్టేలోకాలే మనుజులకు తెగియిచ్చే యింద్రాదిదేవతలవరములు యెగుఅదిగువలను యీసందివే

మాయలోన బుట్టేది మాయలోన బెరిగేది కాయదారులుకు నెల్లా గలిగినదే నేయరానిపుణ్యమెల్లా జేసి గండించుకొనేది చాయల బహురూప సంసారమే

చెడనివై కుంఠ మిచ్చు జేటులేనిపరమిచ్చు వెడమాయ బెడబాపు విష్ణు డీతడే యెడయక శ్రీ వేంకటేశుడై వున్నాడు వీడె జడియ కితడే కాచు శరణంటే జాలును

Anniti kekkuduyeevi hariyichchedi Mannimchunaatanikamte mari leru doralu

Tagubrahmalokamudaakaa nekkichoochina Maguda buttelokaale manujulaku Tegiyichche yindraadidevatalavaramulu Yeguadiguvalanu yeesamdive

Maayalona buttedi maayalona berigedi Kaayadaaruluku nellaa galiginade Neyaraanipunyamellaa jesi gandinchukonedi Chaayala bahuroopa samsaarame

Chedanivai kuntha michchu jetuleniparamichchu Vedamaaya bedabaapu vishnu deetade Yedayaka Sree venkatesudai vunnaadu veede Jadiya kitade kaachu saranamte jaalunu

anniTAnu haridAsu - అన్నిటాను హరిదాసు

ప|| అన్నిటాను హరిదాసు లధికులు | కన్నులవంటివారు కమలజాదులకు ||

చ|| అందరును సమమైతే నరుహానరుహము లేదా | అందరిలో హరియైతే నౌగాక |

బొందితో విప్రునిదెచ్చి పూజించినట్టు వేరే- | పొందుగానిశునకము బూజింపదగునా ||

చ|| అన్నిమతములు సరియైతేను వాసిలేదా | చెన్నగుబురాణాలు చెప్పుగాక |

యెన్నగ సొర్ణాటంక మింతటాను జెల్లినట్లు | సన్నపుదోలుబిళ్ళలు సరిగా జెల్లునా ||

చ|| గక్కున బైరు విత్తగా గాదము మొరచినట్లు | చిక్కినకర్మములెల్లా జెలగెగాక |

తక్కక శ్రీవేంకటేశు దాస్యమెక్కుడైనట్టు | యెక్కడా మోక్షోపాయమిక జెప్పనున్నదా ||

pa|| anniTAnu haridAsu ladhikulu | kannulavaMTivAru kamalajAdulaku ||

ca|| aMdarunu samamaitE naruhAnaruhamu lEdA | aMdarilO hariyaitE naugAka |

boMditO viprunidecci pUjiMcinaTTu vErE- | poMdugAniSunakamu bUjiMpadagunA ||

ca|| annimatamulu sariyaitEnu vAsilEdA | cennaguburANAlu ceppugAka |

yennaga sorNATaMka miMtaTAnu jellinaTlu | sannapudOlubiLLalu sarigA jellunA ||

ca|| gakkuna bairu vittagA gAdamu moracinaTlu | cikkinakarmamulellA jelagegAka |

takkaka SrIvEMkaTESu dAsyamekkuDainaTTu | yekkaDA mOkShOpAyamika jeppanunnadA ||