appulavArE aMdarunu - అప్పులవారే అందరును

ప|| అప్పులవారే అందరును | కప్పగ దిప్పగ గర్తలు వేరీ ||

చ|| ఎక్కడ చూచిన నీ ప్రపంచమున | జిక్కులు సిలుగులు జింతలునే |

దిక్కెవ్వరు ఈతిదీపులలో| దిక్కుముక్కులకు దేవుడేగాక ||

చ|| ఏది తలంచిన నేకాలంబును | సూదుల మూటల సుఖము లివి |

కాదన నౌనన గడ గనిపించగ | పోదికాడు తలపున గల డొకడే ||

చ|| ఎన్నడు వీడీ నెప్పుడు వాసీ | బన్నిన తమ తమ బంధములు ఉన్నతి సేయగ వొప్పులు నెరపగ |

వెన్నుడు వేంకట విభుడే కలడు ||

pa|| appulavArE aMdarunu | kappaga dippaga gartalu vErI ||

ca|| ekkaDa cUcina nI prapaMcamuna | jikkulu silugulu jiMtalunE |

dikkevvaru ItidIpulalO| dikkumukkulaku dEvuDEgAka ||

ca|| Edi talaMcina nEkAlaMbunu | sUdula mUTala suKamu livi |

kAdana naunana gaDa ganipiMcaga | pOdikADu talapuna gala DokaDE ||

ca|| ennaDu vIDI neppuDu vAsI | bannina tama tama baMdhamulu unnati sEyaga voppulu nerapaga |

vennuDu vEMkaTa viBuDE kalaDu ||

appuDuvO ninu - అప్పుడువో నిను గొలువగ

ప|| అప్పుడువో నిను గొలువగ నరుహము గలుగుట ప్రాణికి | కప్పినదియు గప్పనిదియు గనుగొన గలనాడు ||

చ|| ఆపదలకు సంపదలకు నడ్డముచెప్పనినాడు | పాపములకు పుణ్యములకు బనిదొలగిననాడు |

కోపములకు శాంతములకు గూటమి మానిననాడు | లోపల వెలుపల తనమతిలో దెలిసిననాడు ||

చ|| తనవారల బెరవారల దా దెలిసిననాడు | మనసున జైతన్యంబును మరపందిననాడు |

పనివడి తిరువేంకగిరిపతి నీదాసులదాసుల | గనుగొని నీభావముగా గనువిచ్చిననాడు ||

pa|| appuDuvO ninu goluvaga naruhamu galuguTa prANiki | kappinadiyu gappanidiyu ganugona galanADu ||

ca|| Apadalaku saMpadalaku naDDamuceppaninADu | pApamulaku puNyamulaku banidolaginanADu |

kOpamulaku SAMtamulaku gUTami mAninanADu | lOpala velupala tanamatilO delisinanADu ||

ca|| tanavArala beravArala dA delisinanADu | manasuna jaitanyaMbunu marapaMdinanADu | panivaDi tiruvEMkagiripati nIdAsuladAsula | ganugoni nIBAvamugA ganuviccinanADu ||

appaNiccEnide nIku - అప్పణిచ్చేనిదె నీకు

ప|| అప్పణిచ్చేనిదె నీకు ననుమానించకు మిక | చిప్పిల మోహించిన నీ చేతిలోని దానను ||

చ|| యెంత నవ్వినా మేలే యెరిగిన విభుడవు | చెంత నుండి మరియేమి సేసినా మేలే |

యింతమాత్రమునకే యెగ్గులెంచ తప్పులెంచ | సంతోసాన నీకులోనై సమ్మతించే దానను ||

చ|| అలయించినా మేలే ఆయము లెరుగుదువు | కొలువు యిట్టే సేయించు కొన్నామేలే |

మలసిన మాత్రానకే మచ్చరించ నెచ్చరించ | చెలగుదు నీపాదాల సేవచేసేదానను ||

చ|| చేరి కూడితివి మేలే శ్రీవేంకటేశుడవు | యీరీతి నలమేల్మంగ నేమన్నా మేలే |

సారె యీమాత్రానకే జంకించ బొంకించ | మేరతో నుండుదు నిన్ను మెచ్చేటిదానను ||

pa|| appaNiccEnide nIku nanumAniMcaku mika | cippila mOhiMcina nI cEtilOni dAnanu ||

ca|| yeMta navvinA mElE yerigina viBuDavu | ceMta nuMDi mariyEmi sEsinA mElE | yiMtamAtramunakE yegguleMca tappuleMca | saMtOsAna nIkulOnai sammatiMcE dAnanu ||

ca|| alayiMcinA mElE Ayamu leruguduvu | koluvu yiTTE sEyiMcu konnAmElE | malasina mAtrAnakE maccariMca neccariMca | celagudu nIpAdAla sEvacEsEdAnanu ||

ca|| cEri kUDitivi mElE SrIvEMkaTESuDavu | yIrIti nalamElmaMga nEmannA mElE | sAre yImAtrAnakE jaMkiMca boMkiMca | mEratO nuMDudu ninnu meccETidAnanu ||

Appadu daivaalaraaya - అప్పడు దైవాలరాయ

రాగమ్: శంకరాభరణం

అప్పడు దైవాలరాయ డాదిమూలమీతడు యిప్పు డిట్టిమహినుల నెక్కుడాయ నీతడు

చేకొని తొలికొలితే చేసినపన్నీరు కాపు జోక గాలువలై సొరిది జార సైకపునీలాద్రినుండి జలజలబారేటి కేకలసెలయేరులరీతి నున్న దిదివో

తెప్పలుగా గుప్పినట్టితెల్లనికప్పురకాపు చిప్పిలుచు వెన్నెలలై చిందగాను పుప్పొడిదోగినకల్ప భూజము నిలుచున్న చొప్పున నున్నాడిదివో సొంపులు మీరుచును

పొందుగ నంతటిమీద జూసినపునుగుకాపు కందువ మాణిక్యముల గనియైనట్టు అంది శ్రీవేంకటేశ్వరు కదె యలమేలుమంగ చెంది యరత గట్టగా శ్రీవిభుడై నిలిచె

Raagam: Samkaraabharanam

Appadu daivaalaraaya daadimoolameetadu Yippu dittiahinula nekkudaaya neetadu

Chekoni tolikolite chesinapanneeru kaapu Joka gaaluvalai soridi jaara Saikapuneelaadrinumdi jalajalabaareti Kekalaselayerulareeti nunna didivo

Teppalugaa guppinattitellanikappurakaapu Chippiluchu vennelalai chimdagaanu Puppodidoginakalpa bhoojamu niluchunna Choppuna nunnaadidivo sompulu meeruchunu

Pomduga namtatimeeda joosinapunugukaapu Kanduva maanikyamula ganiyainattu Amdi sreevenkatesvaru kade yalamelumanga Chendi yarata gattagaa sreevibhudai niliche


appaTikappuDE kAka - అప్పటికప్పుడే కాక

ప|| అప్పటికప్పుడే కాక అంత యేటికి | యెప్పుడూ మనకు బోదు ఇందవయ్య విడెము ||

చ|| తక్కి మాటున నున్నంత తడవు నిను దూరితి | నిక్కిచూడ బోతేను నీవే నేను |

కక్కసించనిక నిన్ను కడు నాసవెట్టకిక | యిక్కువలు గరగేను ఇందవయ్య విడెము ||

చ|| గుట్టుతో నూరకుండగా గుణము వెరపులాయ | నెట్టుకొని మాటాడితే నీవే నేను |

పెట్టను రట్ల నిన్ను పెనగకుమిక నీవు | ఇట్టే నీమాటలు వింటి నిందవయ్య విడెము ||

చ|| అరయ దూరకున్నందు కటునిటు బిగిసితి | నేరిచి పొందు సేసితే నీవే నేను |

కోరి శ్రీ వేంకటేశుడ కూడితి మిద్దరమును | యీరీతి బాయకుందము ఇందవయ్య విడెము ||

pa|| appaTikappuDE kAka aMta yETiki | yeppuDU manaku bOdu iMdavayya viDemu ||

ca|| takki mATuna nunnaMta taDavu ninu dUriti | nikkicUDa bOtEnu nIvE nEnu | kakkasiMcanika ninnu kaDu nAsaveTTakika | yikkuvalu garagEnu iMdavayya viDemu ||

ca|| guTTutO nUrakuMDagA guNamu verapulAya | neTTukoni mATADitE nIvE nEnu | peTTanu raTla ninnu penagakumika nIvu | iTTE nImATalu viMTi niMdavayya viDemu ||

ca|| araya dUrakunnaMdu kaTuniTu bigisiti | nErici poMdu sEsitE nIvE nEnu | kOri SrI vEMkaTESuDa kUDiti middaramunu | yIrIti bAyakuMdamu iMdavayya viDemu ||

appa dumde komdalona - అప్ప డుండే కొండలోన

రాగం:యదుకులకాంబోది తాళం :చాపు
౧। అప్ప డుండే కొండలోన ఇప్పపూల ఏరబోతే ఇప్పపూలు కప్పలాయెరా ఓ వేంకటేశ అప్పలుగల వాని వలనే ఓ వేంకటేశ।

౨। ఆకాశాన పొయ్యేకాకి మూకజూచి కేకవేశే మూక మూడు విధము లాయరా - ఓ వేంకటేశ దీని భావము నీకే తెలుసురా ఓ వేంకటేశ।

౩। అహోబిలయ్య గుంటలోన వొల్వలు ఉదుక పోతే వొల్వలెల్ల మల్ల్యెలాయే - ఓ వేంకటేశా దీనిభావము నీకే తెలుసురా ఓ వేంకటేశా।

౪। అహోబిలాన చెట్టు బుట్టే భూమి యెల్ల తీగపారే కంచిలోన కాయ కాచేరా ఓ వేంకటేశా శ్రీరంగాన పండు పండేరా ఓ వేంకటేశా।

౫। పుట్టామీద చెట్టు బుట్టే భూమియెల్ల తీగపారే పర్వతాన పండు పండేరా ఓ వేంకటేశా అందవచ్చు కోయరాదురా - ఓ వేంకటేశా।

౬। చేయిలేనివాడుకోశే నెత్తిలేని వాడుమేశే కాళ్ళులేని వాడు నడచే ఓ వేంకటేశా పెదవిలేనివాడు చిలుక తినేరా ఓ వేంకటేశా।

౭। గుంట యెండి పండు పండే - పండుకోశి కుప్పవేశే కుప్పకాలి యప్పు తీరేరా - ఓ వేంకటేశా దీని భావము నీకే తెలుసురా ఓ వేంకటేశా।

౮। సందెకాడ తలవ్రాలు సంధిదీరి వేంకటరాయా! తెల్లవారనాయనీడరా ఓ వేంకటేశ! దీని భావము నీకే తెలుసురా ఓ వేంకటేశ!

౯। ముత్యాల పందిటిలోన ముగ్గురు వేంచేసి రాగ ముక్కంటి దేవుని జూచేరు ఓ వేంకటేశా! దీని భావము నీకే తెలుసురా! ఓ వేంకటేశా!

౧౦। ఏటిలోన వలవేశే తాటిమాను నీడలాయె దూరపోతే చోటులేదురా ఓ వేంకటేశా దీని భావము నీకే తెలుసురా ఓ వేంకటేశా।

౧౧। ముందు కూతు రాలు ఆమె ముందు ఆలు కూతురాయె పొందుగా పెండ్లాము తానాయె ఓ వేంకటేశ దీని భావము నీకే తెలుసురా ఓ వేంకటేశా।

౧౨। ఆకులేని అడవిలోన మూడుతోకల పెద్దపులిని మేక యొకటి యెత్తి మింగేరా ఓ వేంకటేశా దీని భావము నీకే తెలుసురా ఒ వేంకటేశా।

౧౩। పున్నమ వెన్నెలలోన వన్న్యలాడితోను గూడి కిన్నెర మీటుచు పొయ్యేవు ఓ వేంకటేశా దీని భావము నీకే తెలుసురా ఓ వేంకటేశా।

౧౪। అర్థరాత్రివేళలోని రుద్రవీణ నెత్తుకొని నిద్రించిన నిన్ను పాడగ - ఓ వేంకటేశా దీని భావము నీకే తెలుసురా - ఓ వేంకటేశా।

(తాళ్ళపాక పదసాహిత్యము సంపుటము ౨౭ శృంగార సంకీర్తనలు నుండి)

Raagam: yadukulakaambodi Taalam: chaapu


~1 appa dumde komdalona ippapoola erabote Ippapoolu kappalaayeraa O venkatesa Appalugala vaani valanae O venkatesa

~2 aakaasaana poyyekaaki mookajoochi kekavese Mooka moodu vidhamu laayaraa - O venkatesa Deeni bhaavamu neeke telusuraa O venkatesa

~3 ahobilayya gumtalona volvalu uduka pote Volvalella mallyelaaye - O venkatesaa Deenibhaavamu neeke telusuraa O venkatesaa

~4 ahobilaana chettu butte bhoomi yella teegapaare Kamchilona kaaya kaacheraa O venkatesaa Sreeramgaana pamdu pamderaa O venkatesaa

~5 puttaameeda chettu butte bhoomiyella teegapaare Parvataana pamdu pamderaa O venkatesaa Amdavachchu koyaraaduraa - O venkatesaa

~6 cheyilenivaadukose nettileni vaadumese Kaalluleni vaadu nadache O venkatesaa Pedavilenivaadu chiluka tineraa O venkatesaa

~7 gumta yemdi pamdu pamde - pamdukosi kuppavese Kuppakaali yappu teereraa - O venkatesaa Deeni bhaavamu neeke telusuraa O venkatesaa

~8 samdekaada talavraalu samdhideeri venkataraayaa! Tellavaaranaayaneedaraa O venkatesa! Deeni bhaavamu neeke telusuraa O venkatesa!

~9 mutyaala pamditilona mugguru vemchesi raaga Mukkamti devuni joocheru O venkatesaa! Deeni bhaavamu neeke telusuraa! O venkatesaa!

~1~0 etilona valavese taatimaanu needalaaye Doorapotae chotuleduraa O venkatesaa Deeni bhaavamu neeke telusuraa O venkatesaa

~1~1 mumdu kootu raalu aame mumdu aalu kooturaaye Pomdugaa pemdlaamu taanaaye O venkatesa Deeni bhaavamu neeke telusuraa O venkatesaa

~1~2 aakuleni adavilona moodutokala peddapulini Meka yokati yetti mimgeraa O venkatesaa Deeni bhaavamu neeke telusuraa o venkatesaa

~1~3 punnama vennelalona vannyalaaditonu goodi Kinnera meetuchu poyyevu O venkatesaa Deeni bhaavamu neeke telusuraa O venkatesaa

~1~4 artharaatrivelaloni rudraveena nettukoni Nidrimchina ninnu paadaga - O venkatesaa Deeni bhaavamu neeke telusuraa - O venkatesaa

(Taallapaaka padasaahityamu samputamu ~2~7 Srumgaara samkeertanalu numdi)

apurUpamaina - అపురూపమైన మొహము

అపురూపమైన మొహముదాచి యిటువంటి
కపటపు నటనలు గడించనేలే ||

కిన్నెర కాయలబోలు కిక్కిరిసినట్టి
చన్నులపై నునుగొంగు జారగా
కిన్నెరమీటుచు మంచి నన్నపునడపుతో
కన్నులు దేలగ మేను కదిలించేవేలే ||
apurUpamaina mohamudAchi yiTuvaMTi
kapaTapu naTanalu gaDiMchanElE ||

kinnera kAyalabOlu kikkirisinaTTi
channulapai nunugoMgu jAragA
kinneramITuchu maMchi nannapunaDaputO
kannulu dElaga mEnu kadiliMchEvElE ||