aBayadAyakuDa vade - అభయదాయకుడ వదె

అభయదాయకుడ వదె నీవేగతి | ఇభరక్షక నన్నిపుడు కావవే ||

చ|| భయహారదైత్యేయ భంజనకేశవ | జయజయ నృసింహ సర్వేశ్వరా |

నియతము మాకిదె నీపాదములే గతి | క్రియగా మమ్మేలి కింకలుడుపవే ||

చ|| బంధవిమోచన పాపవినాశన | సింధురవరదా శ్రితరక్షక |

కంధర వర్ణుడ గతి నీనామమె | అంధకారముల నణచి మనుపవే ||

చ|| దైవశిఖామణి తతచక్రాయుధ | శ్రీవేంకటగిరి శ్రీరమణా |

సావధాన నీశరణ్యమే గతి | వేవేలకు నా విన్నపమిదియే ||

pa||aBayadAyakuDa vade nIvEgati | iBarakShaka nannipuDu kAvavE ||

ca|| BayahAradaityEya BaMjanakESava | jayajaya nRusiMha sarvESvarA | niyatamu mAkide nIpAdamulE gati | kriyagA mammEli kiMkaluDupavE ||

ca|| baMdhavimOcana pApavinASana | siMdhuravaradA SritarakShaka | kaMdhara varNuDa gati nInAmame | aMdhakAramula naNaci manupavE ||

ca|| daivaSiKAmaNi tatacakrAyudha | SrIvEMkaTagiri SrIramaNA | sAvadhAna nISaraNyamE gati | vEvElaku nA vinnapamidiyE ||

appulEni saMsAra - అప్పులేని సంసార

ప|| అప్పులేని సంసార మైనపాటే చాలు | తప్పులేని జీతమొక్క తారమైన జాలు ||

చ|| కంతలేని గుడిసొక్క గంపంతైన జాలు | చింతలేని యంబలొక్క చేరెడే చాలు |

జంతగాని తరుణి యేజాతైన నాదె చాలు | వింతలేని సంపదొక్క వీసమే చాలు ||

చ|| తిట్టులేని బ్రదుకొక్క దినమైన నదే చాలు | ముట్టులేని కూడొక్క ముద్దడే చాలు |

గుట్టుచెడి మనుకంటే కొంచెపు మేలైన చాలు | వట్టిజాలి బడుకంటే వచ్చినంతే చాలు ||

చ|| లంపటపడని మేలు లవలేసమే చాలు | రొంపికంబమౌకంటె రోయుటే చాలు |

రంపపు గోరికకంటే రతి వేంకటపతి | పంపున నాతని జేరే భవమే చాలు ||

pa|| appulEni saMsAra mainapATE cAlu | tappulEni jItamokka tAramaina jAlu ||

ca|| kaMtalEni guDisokka gaMpaMtaina jAlu | ciMtalEni yaMbalokka cEreDE cAlu |

jaMtagAni taruNi yEjAtaina nAde cAlu | viMtalEni saMpadokka vIsamE cAlu ||

ca|| tiTTulEni bradukokka dinamaina nadE cAlu | muTTulEni kUDokka muddaDE cAlu | guTTuceDi manukaMTE koMcepu mElaina cAlu | vaTTijaali baDukaMTE vaccinaMtE cAlu ||

ca|| laMpaTapaDani mElu lavalEsamE cAlu | roMpikaMbamaukaMTe rOyuTE cAlu |

raMpapu gOrikakaMTE rati vEMkaTapati | paMpuna nAtani jErE BavamE cAlu ||

appulavArE aMdarunu - అప్పులవారే అందరును

ప|| అప్పులవారే అందరును | కప్పగ దిప్పగ గర్తలు వేరీ ||

చ|| ఎక్కడ చూచిన నీ ప్రపంచమున | జిక్కులు సిలుగులు జింతలునే |

దిక్కెవ్వరు ఈతిదీపులలో| దిక్కుముక్కులకు దేవుడేగాక ||

చ|| ఏది తలంచిన నేకాలంబును | సూదుల మూటల సుఖము లివి |

కాదన నౌనన గడ గనిపించగ | పోదికాడు తలపున గల డొకడే ||

చ|| ఎన్నడు వీడీ నెప్పుడు వాసీ | బన్నిన తమ తమ బంధములు ఉన్నతి సేయగ వొప్పులు నెరపగ |

వెన్నుడు వేంకట విభుడే కలడు ||

pa|| appulavArE aMdarunu | kappaga dippaga gartalu vErI ||

ca|| ekkaDa cUcina nI prapaMcamuna | jikkulu silugulu jiMtalunE |

dikkevvaru ItidIpulalO| dikkumukkulaku dEvuDEgAka ||

ca|| Edi talaMcina nEkAlaMbunu | sUdula mUTala suKamu livi |

kAdana naunana gaDa ganipiMcaga | pOdikADu talapuna gala DokaDE ||

ca|| ennaDu vIDI neppuDu vAsI | bannina tama tama baMdhamulu unnati sEyaga voppulu nerapaga |

vennuDu vEMkaTa viBuDE kalaDu ||

appuDuvO ninu - అప్పుడువో నిను గొలువగ

ప|| అప్పుడువో నిను గొలువగ నరుహము గలుగుట ప్రాణికి | కప్పినదియు గప్పనిదియు గనుగొన గలనాడు ||

చ|| ఆపదలకు సంపదలకు నడ్డముచెప్పనినాడు | పాపములకు పుణ్యములకు బనిదొలగిననాడు |

కోపములకు శాంతములకు గూటమి మానిననాడు | లోపల వెలుపల తనమతిలో దెలిసిననాడు ||

చ|| తనవారల బెరవారల దా దెలిసిననాడు | మనసున జైతన్యంబును మరపందిననాడు |

పనివడి తిరువేంకగిరిపతి నీదాసులదాసుల | గనుగొని నీభావముగా గనువిచ్చిననాడు ||

pa|| appuDuvO ninu goluvaga naruhamu galuguTa prANiki | kappinadiyu gappanidiyu ganugona galanADu ||

ca|| Apadalaku saMpadalaku naDDamuceppaninADu | pApamulaku puNyamulaku banidolaginanADu |

kOpamulaku SAMtamulaku gUTami mAninanADu | lOpala velupala tanamatilO delisinanADu ||

ca|| tanavArala beravArala dA delisinanADu | manasuna jaitanyaMbunu marapaMdinanADu | panivaDi tiruvEMkagiripati nIdAsuladAsula | ganugoni nIBAvamugA ganuviccinanADu ||

appaNiccEnide nIku - అప్పణిచ్చేనిదె నీకు

ప|| అప్పణిచ్చేనిదె నీకు ననుమానించకు మిక | చిప్పిల మోహించిన నీ చేతిలోని దానను ||

చ|| యెంత నవ్వినా మేలే యెరిగిన విభుడవు | చెంత నుండి మరియేమి సేసినా మేలే |

యింతమాత్రమునకే యెగ్గులెంచ తప్పులెంచ | సంతోసాన నీకులోనై సమ్మతించే దానను ||

చ|| అలయించినా మేలే ఆయము లెరుగుదువు | కొలువు యిట్టే సేయించు కొన్నామేలే |

మలసిన మాత్రానకే మచ్చరించ నెచ్చరించ | చెలగుదు నీపాదాల సేవచేసేదానను ||

చ|| చేరి కూడితివి మేలే శ్రీవేంకటేశుడవు | యీరీతి నలమేల్మంగ నేమన్నా మేలే |

సారె యీమాత్రానకే జంకించ బొంకించ | మేరతో నుండుదు నిన్ను మెచ్చేటిదానను ||

pa|| appaNiccEnide nIku nanumAniMcaku mika | cippila mOhiMcina nI cEtilOni dAnanu ||

ca|| yeMta navvinA mElE yerigina viBuDavu | ceMta nuMDi mariyEmi sEsinA mElE | yiMtamAtramunakE yegguleMca tappuleMca | saMtOsAna nIkulOnai sammatiMcE dAnanu ||

ca|| alayiMcinA mElE Ayamu leruguduvu | koluvu yiTTE sEyiMcu konnAmElE | malasina mAtrAnakE maccariMca neccariMca | celagudu nIpAdAla sEvacEsEdAnanu ||

ca|| cEri kUDitivi mElE SrIvEMkaTESuDavu | yIrIti nalamElmaMga nEmannA mElE | sAre yImAtrAnakE jaMkiMca boMkiMca | mEratO nuMDudu ninnu meccETidAnanu ||

Appadu daivaalaraaya - అప్పడు దైవాలరాయ

రాగమ్: శంకరాభరణం

అప్పడు దైవాలరాయ డాదిమూలమీతడు యిప్పు డిట్టిమహినుల నెక్కుడాయ నీతడు

చేకొని తొలికొలితే చేసినపన్నీరు కాపు జోక గాలువలై సొరిది జార సైకపునీలాద్రినుండి జలజలబారేటి కేకలసెలయేరులరీతి నున్న దిదివో

తెప్పలుగా గుప్పినట్టితెల్లనికప్పురకాపు చిప్పిలుచు వెన్నెలలై చిందగాను పుప్పొడిదోగినకల్ప భూజము నిలుచున్న చొప్పున నున్నాడిదివో సొంపులు మీరుచును

పొందుగ నంతటిమీద జూసినపునుగుకాపు కందువ మాణిక్యముల గనియైనట్టు అంది శ్రీవేంకటేశ్వరు కదె యలమేలుమంగ చెంది యరత గట్టగా శ్రీవిభుడై నిలిచె

Raagam: Samkaraabharanam

Appadu daivaalaraaya daadimoolameetadu Yippu dittiahinula nekkudaaya neetadu

Chekoni tolikolite chesinapanneeru kaapu Joka gaaluvalai soridi jaara Saikapuneelaadrinumdi jalajalabaareti Kekalaselayerulareeti nunna didivo

Teppalugaa guppinattitellanikappurakaapu Chippiluchu vennelalai chimdagaanu Puppodidoginakalpa bhoojamu niluchunna Choppuna nunnaadidivo sompulu meeruchunu

Pomduga namtatimeeda joosinapunugukaapu Kanduva maanikyamula ganiyainattu Amdi sreevenkatesvaru kade yalamelumanga Chendi yarata gattagaa sreevibhudai niliche


appaTikappuDE kAka - అప్పటికప్పుడే కాక

ప|| అప్పటికప్పుడే కాక అంత యేటికి | యెప్పుడూ మనకు బోదు ఇందవయ్య విడెము ||

చ|| తక్కి మాటున నున్నంత తడవు నిను దూరితి | నిక్కిచూడ బోతేను నీవే నేను |

కక్కసించనిక నిన్ను కడు నాసవెట్టకిక | యిక్కువలు గరగేను ఇందవయ్య విడెము ||

చ|| గుట్టుతో నూరకుండగా గుణము వెరపులాయ | నెట్టుకొని మాటాడితే నీవే నేను |

పెట్టను రట్ల నిన్ను పెనగకుమిక నీవు | ఇట్టే నీమాటలు వింటి నిందవయ్య విడెము ||

చ|| అరయ దూరకున్నందు కటునిటు బిగిసితి | నేరిచి పొందు సేసితే నీవే నేను |

కోరి శ్రీ వేంకటేశుడ కూడితి మిద్దరమును | యీరీతి బాయకుందము ఇందవయ్య విడెము ||

pa|| appaTikappuDE kAka aMta yETiki | yeppuDU manaku bOdu iMdavayya viDemu ||

ca|| takki mATuna nunnaMta taDavu ninu dUriti | nikkicUDa bOtEnu nIvE nEnu | kakkasiMcanika ninnu kaDu nAsaveTTakika | yikkuvalu garagEnu iMdavayya viDemu ||

ca|| guTTutO nUrakuMDagA guNamu verapulAya | neTTukoni mATADitE nIvE nEnu | peTTanu raTla ninnu penagakumika nIvu | iTTE nImATalu viMTi niMdavayya viDemu ||

ca|| araya dUrakunnaMdu kaTuniTu bigisiti | nErici poMdu sEsitE nIvE nEnu | kOri SrI vEMkaTESuDa kUDiti middaramunu | yIrIti bAyakuMdamu iMdavayya viDemu ||