Ayyo vikalpa - అయ్యో వికల్పవాదులంతటా

రాగం: ళలిత

అయ్యో వికల్పవాదులంతటా సిగ్గువడరు యియ్యెడ నెట్టుగలిగె నీయసురమతము.

నీముద్రలూ నొల్లరు నీదాసోహము నొల్లరు కామించి నీమీదిభక్తి కడు నొల్లరు నామమంత్రము నొల్లరనామయుండ వనెందురు తాము వైష్ణవుల మంటా దర్కింతురు.

పైకృతవేళ నీప్రసాదమూ నొల్లరు ఘాతలనూర్ధ్వపుండ్రము గాదందురు ఝాతరదైవాల నిన్ను సరిగా బూజింతురు ఆఅతల వైష్ణవులు దామనుకొందురు..

శ్రీవైష్ణవుల గంటే జేతులెత్తి మొక్కరు భావింతురు పగ వారిబలె గన్నట్టు ఆఅవల వైకుంఠమూ ననిత్యమందురు కావించి వైష్ణవులము కామా నే మందురు.

వరుస రావణాదులవలె నెజ్ఞాలు సేతురు శరుస నట్టే వేదమూ జదువుదురు ణిరతి శ్రీవేంకటేశ నీమహిమ లెరగక ఆరిది వైష్ణవులమే యని యాడుకొందురు.

Raagam: Lalita

Ayyo vikalpavaadulamtataa sigguvadaru Yiyyeda nettugalige neeyasuramatamu.

Neemudraloo nollaru needaasohamu nollaru Kaamimchi neemeedibhakti kadu nollaru Naamamamtramu nollaranaamayumda vanemduru Taamu vaishnavula mamtaa darkimturu.

Paikrtavela neeprasaadamoo nollaru Ghaatalanoordhvapumdramu gaadamduru Jhaataradaivaala ninnu sarigaa boojimturu Aaatala vaishnavulu daamanukomduru..

Sreevaishnavula gamte jetuletti mokkaru Bhaavimturu paga vaaribale gannattu Aaavala vaikumthamoo nanityamamduru Kaavimchi vaishnavulamu kaamaa ne mamduru.

Varusa raavanaadulavale negyanaalu seturu Sarusa natte vedamoo jaduvuduru Nirati sreevenkatesa neemahima leragaka Aaridi vaishnavulame yani yaadukomduru.


Ayyo vaaribhaagya - అయ్యో వారిభాగ్య మంతేకాక

అయ్యో వారిభాగ్య మంతేకాక నెయ్యపువెన్న వట్టుక నెయ్యి వెదకేరు

దేవుడు వెల్లవిరై దిక్కులెల్లా నిండుండగా సోవల నాస్తికునకు శూన్యమై తోచు యీవల వాన గురిసి యేరెంతబంటి వారినా కావరపుజీవునకు గతుగతుకే

హరి శరణంటే గాచేఅట్టియుపాయమే వుండగ విరసానకు గర్మమే వెగాళమాయ పరగ నరులకెల్లా బట్టపగలై యుండగా అరయ గొన్నిజంతుల కంధకారమాయను

యిక్కడ శ్రీవేంకటేశు డెదుటనే వుండగాను అక్కటా మూడున కెందు ననుమానమే మక్కువ నింతా నమృతమయమైన గోడికి తెక్కుల దవ్వ బోయ్యేది తిప్పపెంటలే

Ayyo vaaribhaagya mamtekaaka Neyyapuvenna vattuka neyyi vedakeru

Devudu vellavirai dikkulellaa nimdumdagaa Sovala naastikunaku Soonyamai tochu Yeevala vaana gurisi yeremtabamti vaarinaa Kaavarapujeevunaku gatugatuke

Hari saranamte gaacheattiyupaayame vumdaga Virasaanaku garmame vegaalamaaya Paraga narulakellaa battapagalai yumdagaa Araya gonnijamtula kamdhakaaramaayanu

Yikkada sreevenkatesu dedutane vumdagaanu Akkataa mooduna kemdu nanumaaname Makkuva nimtaa namrutamayamaina godiki Tekkula davva boyyedi tippapemtale

Ayyo maayala bomdi - అయ్యో మాయల బొంది

రాగం: భైరవి

అయ్యో మాయల బొంది అందు నిండు నున్నవారు యియ్యగొన గర్తలుగా రెఱగరు జడులు

చుక్కలై యుండినవారు సురలై యుండినవారు యిక్కడనుండిపోయినయీజీవులే దిక్కుల వారి నిందరు దేవతలంటా మొక్కేరు యెక్కుడైనహరి నాత్మ నెఱగరు జడులు

పాతాళవాసులును పలులోకవాసులును యీతరవాతనుండినయీజీవులే కాతరాన వారిపుణ్యకతలె వినేరుగాని యీతల శ్రీహరికత లెఱగరు జడులు

యిరవెఱిగినముక్తులెఱగని బద్దులు యిరవై మనలోనున్న యీజీవులే సిరుల మించినవాడు శ్రీవేంకటేశ్వరుడే శరణాగతులు దక్క చక్కగారు జడులు

Raagam:Bhairavi

Ayyo maayala bomdi amdu nimdu nunnavaaru Yiyyagona gartalugaa reragaru jadulu

Chukkalai yumdinavaaru suralai yumdinavaaru Yikkadanumdipoyinayeejeevule Dikkula vaari nimdaru devatalamtaa mokkeru Yekkudainahari naatma neragaru jadulu

Paataalavaasulunu palulokavaasulunu Yeetaravaatanumdinayeejeevule Kaataraana vaaripunyakatale vinerugaani Yeetala sreeharikata leragaru jadulu

Yiraveriginamuktuleragani baddulu Yiravai manalonunna yeejeevule Sirula mimchinavaadu sreevenkatesvarude Saranaagatulu dakka chakkagaaru jadulu


ayyO nEnEkA - అయ్యో నేనేకా

ప|| అయ్యో నేనేకా అన్నిటికంటె దీలు | గయ్యాళినై వ్రిధా గర్వింతుగాని ||

చ|| తడిపివుదికినట్టిధౌతవస్త్రములు నా- | యొడలు మోచినమీద యోగ్యము గావు | వుడివోక వనములో వొప్పైనవిరులు నే- | ముడిచివేసినంతనే ముట్టరాదాయను ||

చ|| వెక్కసపురచనలవేవేలురుచులు నా- | వొకనాలు కంటితేనే యోగ్యముగావు | పక్కనదేవార్హపుబరిమళ గంధములు నా- | ముక్కుసోకినంతలోనే ముట్టరాదాయను ||

చ|| గగనానుండి వచ్చేగంగాజలములైన | వొగి నాగోరంటితేనె యోగ్యము గావు | నగుశ్రీవేంకటపతి నన్నే రక్షించినదాక | మొగడై యెరుకతుది ముట్టరాదాయను ||

pa|| ayyO nEnEkA anniTikaMTe dIlu | gayyALinai vridhA garviMtugAni ||

ca|| taDipivudikinaTTidhautavastramulu nA- | yoDalu mOcinamIda yOgyamu gAvu | vuDivOka vanamulO voppainavirulu nE- | muDicivEsinaMtanE muTTarAdAyanu ||

ca|| vekkasapuracanalavEvEluruculu nA- | vokanAlu kaMTitEnE yOgyamugAvu | pakkanadEvArhapubarimaLa gaMdhamulu nA- | mukkusOkinaMtalOnE muTTarAdAyanu ||

ca|| gaganAnuMDi vaccEgaMgAjalamulaina | vogi nAgOraMTitEne yOgyamu gAvu | naguSrIvEMkaTapati nannE rakShiMcinadAka | mogaDai yerukatudi muTTarAdAyanu ||

Ayyo naaneramike - అయ్యో నానేరమికే

రాగం:ఆహిరి

అయ్యో నానేరమికే అట్టే యేమని వగతు ముయ్యంచుచంచలాన మోసపోతిగాక

కాననా నావంటివారే కారా యీజంతువులు నానా యోనుల బుట్టి నడచేవారు మానక నాగర్వమున మదాంధమున ముందు గానక భయపడినకర్మి నింతేకాక

చదువనా నేదొల్లి జన్మజన్మాంతరముల ఇది పుణ్య మిది పాప మింతంతని వదలక నాభోగవాంఛలే పెంచి పెంచి తుదకెక్క వెదకనిదుషుడనేను

వినవా నే బురాణాల వెనకటివారినెల్ల మనెడిభాగవతులమహిమలెల్లా యెనయుచు శ్రీవేంకటేశుకృపచేత నేడు ఘనుడ నయితిగాక కష్టుడగానా

Raagam:Aahiri

Ayyo naaneramike atte yemani vagatu Muyyamchuchamchalaana mosapotigaaka

Kaananaa naavamtivaare kaaraa yeejamtuvulu Naanaa yonula butti nadachevaaru Maanaka naagarvamuna madaamdhamuna mumdu Gaanaka bhayapadinakarmi nimtekaaka

Chaduvanaa nedolli janmajanmaamtaramula Idi punya midi paapa mimtamtani Vadalaka naabhogavaamchale pemchi pemchi Tudakekka vedakanidushudanenu

Vinavaa ne buraanaala venakativaarinella Manedibhaagavatulamahimalellaa Yenayuchu sreevenkatesukrpacheta nedu Ghanuda nayitigaaka kashtudagaanaa



ammeDi dokaTi - అమ్మెడి దొకటి

ప|| అమ్మెడి దొకటి అసిమలోదొకటి | బిమ్మిటి నిందేటిపెద్దలమయ్యా ||

చ|| సంగము మానక శాంతియు గలుగదు | సంగలంపటము సంసారము |

యెంగిలిదేహం బింతకు మూలము | బెంగల మిందేటిపెద్దలమయ్యా ||

చ|| కోరికె లుడుగక కోపం బుడుగదు | కోరకుండ దిక్కువమనసు |

క్రూరత్వమునకు కుదువ యీబ్రదుకు | పేరడి నేమిటిపెద్దలమయ్యా ||

చ|| ఫలము లందితే బంధము వీడదు | ఫలములో తగులు ప్రపంచము |

యిలలో శ్రీవేంకటేశుదాసులము | పిలువగ నేమిటిపెద్దలమయ్యా ||

pa|| ammeDi dokaTi asimalOdokaTi | bimmiTi niMdETipeddalamayyA ||

ca|| saMgamu mAnaka SAMtiyu galugadu | saMgalaMpaTamu saMsAramu |

yeMgilidEhaM biMtaku mUlamu | beMgala miMdETipeddalamayyA ||

ca|| kOrike luDugaka kOpaM buDugadu | kOrakuMDa dikkuvamanasu |

krUratvamunaku kuduva yIbraduku | pEraDi nEmiTipeddalamayyA ||

ca|| Palamu laMditE baMdhamu vIDadu | PalamulO tagulu prapaMcamu |

yilalO SrIvEMkaTESudAsulamu | piluvaga nEmiTipeddalamayyA ||

ammamma Emamma - అమ్మమ్మ ఏమమ్మ

Govinda7.jpg
ప|| అమ్మమ్మ ఏమమ్మ అలమేల్మంగ నాంచారమ్మ | తమ్మియింట నలరుకొమ్మ ఓయమ్మ ||

చ|| నీరిలోన తల్లడించే నీకే తలవంచీ | నీరికింద పులకించీ నీరమణుండు |
గోరికొన చెమరించీ కోపమే పచరించీ | సారెకు నీయలుక ఇట్టె చాలించవమ్మ ||

చ|| నీకుగానే చెయ్యిచాచీ నిండాకోపమురేచీ | మేకొని నీవిరహాన మేను వెంచీని |
ఈకడాకడి సతుల హృదయమే పెరరేచీ | ఆకు మడిచియ్యనైన ఆనతియ్యవమ్మా ||

చ|| చక్కదనములె పెంచీ సకలము గాలదంచి | నిక్కపు వేంకటేశుడు నీకే పొంచీని |
మక్కువతో అలమేల్మంగ నాంచారమ్మ | అక్కున నాతని నిట్టే అలరించవమ్మ ||

pa|| ammamma Emamma alamElmaMga nAMcAramma | tammiyiMTa nalarukomma Oyamma ||

ca|| nIrilOna tallaDiMcE nIkE talavaMcI | nIrikiMda pulakiMcI nIramaNuMDu |
gOrikona cemariMcI kOpamE pacariMcI | sAreku nIyaluka iTTe cAliMcavamma ||

ca|| nIkugAnE ceyyicAcI niMDAkOpamurEcI | mEkoni nIvirahAna mEnu veMcIni |
IkaDAkaDi satula hRudayamE perarEcI | Aku maDiciyyanaina AnatiyyavammA ||

ca|| cakkadanamule peMcI sakalamu gAladaMci | nikkapu vEMkaTESuDu nIkE poMcIni |
makkuvatO alamElmaMga nAMcAramma | akkuna nAtani niTTE alariMcavamma ||


Sung by:Balakrishna Prasad

Get this widget | Track details | eSnips Social DNA