aluka lETiki rAvE - అలుక లేటికి రావే

ప|| అలుక లేటికి రావే యాతనివద్దకి నీవు | బలిమైతే వలపులు పదనుకు వచ్చునా ||

చ|| సంగడి నున్న సతికి చనవులు గలుగుగాక | కంగి కడనుండితేను కలదా పొందు |

చెంగటనున్న రుచులు చేరి నోరూరించుగాక | అంగడినున్న సొమ్ములు ఆసలు పుట్టించునా ||

చ|| వినయపుటింతికిని వేడుక లీడేరుగాక | పెనగుచు బిగిసితే ప్రేమపుట్టునా |

తనువున బూసిన గందము చల్లనౌగాక | వనములో తరువులు వడదీర్చవోపునా ||

చ|| సేవచేసే మగువకు చేతలెల్ళా జెల్లుగాక | యీవల నొడ్డారించితే నింపు వుట్టునా |

శ్రీ వేంకటేశుడిందు విచ్చేసి తానిన్నుగూడెను | పూవులు పిందెలౌగక పొల్లు వెలవెట్టునా ||

pa|| aluka lETiki rAvE yAtanivaddaki nIvu | balimaitE valapulu padanuku vaccunA ||

ca|| saMgaDi nunna satiki canavulu galugugAka | kaMgi kaDanuMDitEnu kaladA poMdu | ceMgaTanunna ruculu cEri nOrUriMcugAka | aMgaDinunna sommulu Asalu puTTiMcunA ||

ca|| vinayapuTiMtikini vEDuka lIDErugAka | penagucu bigisitE prEmapuTTunA |

tanuvuna bUsina gaMdamu callanaugAka | vanamulO taruvulu vaDadIrcavOpunA ||

ca|| sEvacEsE maguvaku cEtalelLA jellugAka | yIvala noDDAriMcitE niMpu vuTTunA |

SrI vEMkaTESuDiMdu viccEsi tAninnugUDenu | pUvulu piMdelaugaka pollu velaveTTunA ||

alara nutiMcarO - అలర నుతించరో

ప|| అలర నుతించరో హరిని | యెలయించి మిము భ్రమయించీనీ గాలము ||

చ|| సేయరో మనుజులారా చింత హరి నికనైన | రోయరో మీ భుజియించు రుచుల మీద |

కాయమస్థిరము యీకవి యధృవము చాల- | బోయబో యెందుకు గాకపోయ గాలము ||

చ|| మెచ్చరో మనుజులార మీరే హరికథలు | పుచ్చరో మీ మదిలోని పొరలెల్లాను |

కొచ్చరో మనుజులార కోరిక లెల్లను మీకు | నిచ్చీని శుభములు యివి యెల్లకాలము ||

చ|| కనరో వేంకటపతి గన్నులు దనియగా | వినరో యీతని స్తుతు వీనులు నిండ |

మనరో శ్రీహరిచేతి మన్ననలు మీరు | తనమీది మదిబుద్ది దాచీనీ గాలము ||

pa|| alara nutiMcarO harini | yelayiMci mimu BramayiMcInI gAlamu ||

ca|| sEyarO manujulArA ciMta hari nikanaina | rOyarO mI BujiyiMcu rucula mIda | kAyamasthiramu yIkavi yadhRuvamu cAla- | bOyabO yeMduku gAkapOya gAlamu ||

ca|| meccarO manujulAra mIrE harikathalu | puccarO mI madilOni poralellAnu | koccarO manujulAra kOrika lellanu mIku | niccIni SuBamulu yivi yellakAlamu ||

ca|| kanarO vEMkaTapati gannulu daniyagA | vinarO yItani stutu vInulu niMDa | manarO SrIharicEti mannanalu mIru | tanamIdi madibuddi dAcInI gAlamu ||

Alamelumamganee - అలమేలుమంగనీ

అలమేలుమంగనీ వభినవరూపము జలజాక్షు కన్నులకు చవులిచ్చేవమ్మ

గరుడాచలాధీశు ఘనవక్షముననుండి పరమానంద సంభిరతవై నెరతనములు జూపి నిరంతరమునాథుని హరుషింపగ జేసి తిగదమ్మ

శశికిరణములకు చలువలచూపులు విశదముగా మీద వెదజల్లుచు రసికత పెంపున కరగించి ఎప్పుడు నీ వశముజేసుకొంటి వల్లభునోయమ్మ

రట్టడి శ్రీవేంకటరాయనికి నీవు పట్టపురాణివై పరగుచు వట్టిమాకులిగిరించు వలపుమాటలవిభు జట్టిగొని వురమునసతమైతివమ్మ

Alamelumamganee vabhinavaroopamu Jalajaakshu kannulaku chavulichchevamma

Garudaachalaadheesu ghanavakshamunanumdi Paramaanamda sambhiratavai Neratanamulu joopi niramtaramunaathuni Harushimpaga jesi tigadamma

Sasikiranamulaku chaluvalachoopulu Visadamugaa meeda vedajalluchu Rasikata pempuna karagimchi eppudu nee Vasamujesukomti vallabhunoyamma

Rattadi sreevenkataraayaniki neevu Pattapuraanivai paraguchu Vattimaakuligirimchu valapumaatalavibhu Jattigoni vuramunasatamaitivamma

alamElu maMgavu nI - అలమేలు మంగవు నీ

ప|| అలమేలు మంగవు నీ వన్నిటా నేరుపరివి | చలము లేటికి నిక సమ్మతించవే ||

చ|| విడియము చేతికిచ్చి విభుడు వేడుకపడి | వొడివట్టి పెనగగా నొద్దనకువే ||
వుడివోని వేడుకతో నుంగరము చేతికిచ్చి | యెడయక వేడుకొనగా నియ్యకొనవే ||

చ|| చిప్పిలు వలపుతోడ చెక్కులు నొక్కుచు మోవి- | గప్పుర మందియ్యగాను కాదనకువే |
కొప్పుదువ్వి బుజ్జగించి కొసరి మాటలాడి | అప్పసము నవ్వగాను అట్టె కానిమ్మనవే ||

చ|| యిచ్చగించి శ్రీవేంకటేశ్వరుడు నిన్నుగూడి | మచ్చిక గాగిలించగాను మారాడకువే |
పచ్చడము మీద గప్పి పట్టపు దేవులజేసి | నిచ్చలాన నేలుకొనె నీవూ గైకొనవే ||

pa|| alamElu maMgavu nI vanniTA nEruparivi | calamu lETiki nika sammatiMcavE ||

ca|| viDiyamu cEtikicci viBuDu vEDukapaDi | voDivaTTi penagagA noddanakuvE || vuDivOni vEDukatO nuMgaramu cEtikicci | yeDayaka vEDukonagA niyyakonavE ||

ca|| cippilu valaputODa cekkulu nokkucu mOvi- | gappura maMdiyyagAnu kAdanakuvE | koppuduvvi bujjagiMci kosari mATalADi | appasamu navvagAnu aTTe kAnimmanavE ||

ca|| yiccagiMci SrIvEMkaTESvaruDu ninnugUDi | maccika gAgiliMcagAnu mArADakuvE | paccaDamu mIda gappi paTTapu dEvulajEsi | niccalAna nElukone nIvU gaikonavE ||

alapu dIrcukOrAda - అలపు దీర్చుకోరాద

ప|| అలపు దీర్చుకోరాద అన్నీనయ్యీ గని | నిలువెల్లా జెమరించి నీళ్ళు గారీని ||

చ|| వీడెమందుకొనరాదా వెనక విచ్చేతుగాని | బీడై నీకెమ్మోవి పిప్పిగట్టెను |

చూడరాదా మమ్ముగొంత చొక్కి కన్నుమూతుగాని | ఆడ నీడా నుమ్మదాకి యలపుదేరీని ||

చ|| పాదమొత్తించుకోరాదా ప్రక్కన నవ్వుదుగాని | వీధులెల్లా దిరుగాడి విసిగినది |

జూదమైనా నాడరాదా సొంట్లు సోదింతుగాని | ఆదిగొని కోరికలు అంకెకు దీసీని ||

చ|| పవళించివుండరాదా పానుపుపై నికనైనా | జవళి బులకలు మైజడిపీని |

యివల శ్రీవేంకటేశ యిట్టె నన్నుగూడితివి | సవతులదేకుమీ చలమెక్కీని ||

pa|| alapu dIrcukOrAda annInayyI gani | niluvellA jemariMci nILLu gArIni ||

ca|| vIDemaMdukonarAdA venaka viccEtugAni | bIDai nIkemmOvi pippigaTTenu |

cUDarAdA mammugoMta cokki kannumUtugAni | ADa nIDA nummadAki yalapudErIni ||

ca|| pAdamottiMcukOrAdA prakkana navvudugAni | vIdhulellA dirugADi visiginadi | jUdamainA nADarAdA soMTlu sOdiMtugAni | Adigoni kOrikalu aMkeku dIsIni ||

ca|| pavaLiMcivuMDarAdA pAnupupai nikanainA | javaLi bulakalu maijaDipIni |

yivala SrIvEMkaTESa yiTTe nannugUDitivi | savatuladEkumI calamekkIni ||

arudarudu nImAya - అరుదరుదు నీమాయ

ప|| అరుదరుదు నీమాయ హరిహరీ | అరసి తెలియరాదు హరిహరీ ||

చ|| అనంత బ్రహ్మాడములవె రోమకూపముల | అనంతములై వున్నవి హరిహరీ |

పొనిగి కుంగినవొక్కభూమి నీవెత్తినది యే- | మని నుతింతు నిన్ను హరిహరీ ||

చ|| పొదిగి బ్రహ్మాదులు నీబొడ్డున నేకాలము | అదివో పుట్టుచున్నారు హరిహరీ |

పొదలి యీజీవుడు పుట్టించే యీసామర్ధ్యము | అదన నేమనిచెప్పే హరిహరీ ||

చ|| పావన వైకుంఠము నీపాద మూలమందున్నది | ఆవహించే భక్తిచేత హరిహరీ |

శ్రీవేంకాటాద్రి మీదచేరి నీవిట్టె వుండగా- | నావల వెదకనేల హరిహరీ ||

pa|| arudarudu nImAya hariharI | arasi teliyarAdu hariharI ||

ca|| anaMta brahmADamulave rOmakUpamula | anaMtamulai vunnavi hariharI | ponigi kuMginavokkaBUmi nIvettinadi yE- | mani nutiMtu ninnu hariharI ||

ca|| podigi brahmAdulu nIboDDuna nEkAlamu | adivO puTTucunnAru hariharI | podali yIjIvuDu puTTiMcE yIsAmardhyamu | adana nEmaniceppE hariharI ||

ca|| pAvana vaikuMThamu nIpAda mUlamaMdunnadi | AvahiMcE BakticEta hariharI |

SrIvEMkATAdri mIdacEri nIviTTe vuMDagA- | nAvala vedakanEla hariharI ||

aridisEtalE cEsi - అరిదిసేతలే చేసి

ప|| అరిదిసేతలే చేసి తల్లాడ నిల్లాడ | సరిలేక వుండితివి జలరాశికాడ ||

చ|| పొలియంబీర్చితి వొకతి బురిటిమంచముకాడ | నలచితి వొకని గగనంబుకాడ |

బలిమి దన్నితి వొకని బండిపోతులకాడ | దులిమితివి యేడుగుర దోలి మందకాడ ||

చ|| తడవి మోదితి వొకని తాటిమాకులకాడ- | నడిచితి వొకని బేయలకాడను |

పిడిచివేసితి వొకని బృందావనముకాడ | వొడిసితివి వొకని నావులమందకాడ ||

చ|| పటపటన దిక్కులు పగుల బగతుల దునిమి | నటియించితివి మామనగరికాడ |

కుటిలబాహు దైత్యాంతకుడవు వేంకటరాయ | పుటమెగసితి జగంబుల యింటికాడ ||

pa|| aridisEtalE cEsi tallADa nillADa | sarilEka vuMDitivi jalarASikADa ||

ca|| poliyaMbIrciti vokati buriTimaMcamukADa | nalaciti vokani gaganaMbukADa |

balimi danniti vokani baMDipOtulakADa | dulimitivi yEDugura dOli maMdakADa ||

ca|| taDavi mOditi vokani tATimAkulakADa- | naDiciti vokani bEyalakADanu |

piDicivEsiti vokani bRuMdAvanamukADa | voDisitivi vokani nAvulamaMdakADa ||

ca|| paTapaTana dikkulu pagula bagatula dunimi | naTiyiMcitivi mAmanagarikADa | kuTilabAhu daityAMtakuDavu vEMkaTarAya | puTamegasiti jagaMbula yiMTikADa ||