Alinchu palinchu - ఆలించు పాలించు

Alinchu palinchu - ఆలించు పాలించు | Annamayya Lyrics | Sankeertanalu | Songs | Telugu & English

ఆలించు పాలించు(రాగం: తోడి ) (తాళం : ఖండచాపు)

ఆలించు పాలించు ఆదిమ పురుషా
జాలిదీర నీకే శరణుజొచ్చితిమి ॥

గతినీవె మతినీవె కర్తవుభర్తవు నీవె
పతివినీవె ఏ పట్టున మాకు
ఇతరము లెవ్వరున్నారెంచిచూడ నినుబోల
చతురుడా నిన్నునే శరణు జొచ్చితిమి॥

జననీ జనకులు శరణము నీవె
వునికి మనికి నీవె వుపమ నీవె
మనిసిచ్చె నీవె నన్ను మన్నించుకొంటేనె
చనవి మనవి నీకే శరణుజొచ్చితిమి॥

లోక సాక్షివి నీవె లోకబంధుడు నీవె
ఈకడ శ్రీవేంకటేశ యిదివో నీవె
నీ కంటె మరిలేరు నిఖిలమంతయు గావ
సాకారరూప నీకె శరణు జొచ్చితిమి॥

Aalimchu paalimchu (Raagam: ) (Taalam: )

Aalimchu paalimchu aadima purushaa
Jaalideera neeke saranujochchitimi ||

Gatineeve matineeve kartavubhartavu neeve
Pativineeve e pattuna maaku
Itaramu levvarunnaaremchichooda ninubola
Chaturudaa ninnune saranu jochchitimi ||
Jananee janakulu saranamu neeve
Vuniki maniki neeve vupama neeve
Manisichche neeve nannu mannimchukontene
Chanavi manavi neeke saranujochchitimi ||

Loka saakshivi neeve lokabamdhudu neeve
Eekada sreevenkatesa yidivo neeve
Nee kamte marileru nikhilamamtayu gaava
Saakaararoopa neeke saranu jochchitimi ||


AlAgu poMdulunu - ఆలాగు పొందులును

ప|| ఆలాగు పొందులును అటువంటికూటములు | ఈలాగులౌట నేడిదె చూడనైతి ||

చ|| అడియాస చూపులకు నాసగించితిగాని | వెడమాయలని లోను వెదకలేనైతి |

కడువేడుకల దగిలి గాసి పొందితిగాని | యెడలేని పరితాప మేరుగలేనైతి ||

చ|| చిరునగవుమాటలకు చిత్తగించితిగాని | తరితీపులని లోను తలపలేనైతి |

వరుస మోహపు బసలవలల చిక్కితిగాని | గరువంపు పొలయలుక గానలేనతి ||

చ|| శ్రీ వేంకటేశ్వరుని చింతజేసితిగాని | దేవోత్తమునిలాగు తెలియలేనైతి |

ఈ వైభవముపై నిచ్చగించితి గాని | యీ వైభవానంద మిది పొందనైతి ||

pa|| AlAgu poMdulunu aTuvaMTikUTamulu | IlAgulauTa nEDide cUDanaiti ||

ca|| aDiyAsa cUpulaku nAsagiMcitigAni | veDamAyalani lOnu vedakalEnaiti |

kaDuvEDukala dagili gAsi poMditigAni | yeDalEni paritApa mErugalEnaiti ||

ca|| cirunagavumATalaku cittagiMcitigAni | taritIpulani lOnu talapalEnaiti |

varusa mOhapu basalavalala cikkitigAni | garuvaMpu polayaluka gAnalEnati ||

ca|| SrI vEMkaTESvaruni ciMtajEsitigAni | dEvOttamunilAgu teliyalEnaiti |

I vaiBavamupai niccagiMciti gAni | yI vaiBavAnaMda midi poMdanaiti ||

Aaragimchi - ఆరగించి

ఆరగించి కూచున్నా డల్లవాడె చేరువనే చూడరె లక్ష్మీనారసింహుడు॥

ఇందిరను తొడమీద నిడుకొని కొలువిచ్చీ అందపు నవ్వులు చల్లీ నల్లవాడె చెందిన మాణికముల శేషుని పడగమీద చెంది వరాలిచ్చీ లక్ష్మీనారసింహుడు॥

బంగారు మేడలోన పచ్చల గద్దియల మీద అంగనల ఆట చూచీ నల్లవాడె రంగగు సొమ్ముల తోడ రాజసపు విభవాల చెంగట నున్నాడు లక్ష్మీనారసింగుడు॥

పెండెపు పాదము చాచిపెనచి ఒక పాదము అండనే పూజలుగొనీ నల్లవాడె కొండల శ్రీ వేంకటాద్రి కోరి అహోబలమున మెండుగాను మెరసీ లక్ష్మీ నారసింగుడు॥

Aaragimchi koochunnaa dallavaade Cheruvane choodare lakshmeenaarasimhudu

Imdiranu todameeda nidukoni koluvichchee Amdapu navvulu challee nallavaade Chemdina maanikamula Seshuni padagameeda Chemdi varaalichchee lakshmeenaarasimhudu

Bamgaaru medalona pachchala gaddiyala meeda Amganala aata choochee nallavaade Ramgagu sommula toda raajasapu vibhavaala Chemgata nunnaadu lakshmeenaarasimgudu

Pemdepu paadamu chaachipenachi oka paadamu Amdane poojalugonee nallavaade Komdala Sree venkataadri kori ahobalamuna Memdugaanu merasee lakshmee naarasimgudu

Aamusvatamtrulu gaaru - ఆముస్వతంత్రులు గారు

రాగం: సాళంగనాట

ఆముస్వతంత్రులు గారు 'దాసోహము' నన లేరు పామరపుదేహులకు పట్టరాదు గర్వము

పరగుబ్రహ్మాదులు బ్రహ్మమే తా మనలేరు హరికే మొరవెట్టేరు ఆపదైతేను ధరలో మనుజులింతే తామే దయివమనేరు పొరి దాము చచ్చిపుట్టే పొద్దెరగరు

పండినవ్యాసాదులు ప్రపంచము కల్లనరు కొండలుగా బురాణాల గొనియాడేరు అండనే తిరిపెములై అందరినడిగి తా_ ముందుండి లేదనుకొనే రొప్పదన్నా మానరు

సనకాదియోగులు శౌరిభక్తి సేసేరు దు_ ర్జనులు భక్తి వొల్లరు జ్ఞానులమంటా నినుపయి శ్రీవేంకటేశ నిను జేరి మొక్కుతానె అనిశము నిరాకారమనేరు యీద్రోహులు

Raagam:Saalamganaata

Aamusvatamtrulu gaaru 'daasohamu' nana leru Paamarapudehulaku pattaraadu garvamu

Paragubrahmaadulu brahmame taa manaleru Harike moravetteru aapadaitenu Dharalo manujulimte taame dayivamaneru Pori daamu chachchiputte podderagaru

Pamdinavyaasaadulu prapamchamu kallanaru Komdalugaa buraanaala goniyaaderu Amdane tiripemulai amdarinadigi taa_ Mumdumdi ledanukone roppadannaa maanaru

Sanakaadiyogulu Sauribhakti seseru du_ rjanulu bhakti vollaru gyanulamamtaa Ninupayi sreevenkatesa ninu jeri mokkutaane Anisamu niraakaaramaneru yeedrohulu

AmIdinijasuKa - ఆమీదినిజసుఖ

ప|| ఆమీదినిజసుఖ మరయలేము | పామరపుచాయలకే భ్రమసితిమయ్యా ||

చ|| మనసున బాలు దాగి మదియించివున్నయట్టు | ననిచి గిలిగింతకు నవ్వినయట్టు |

యెనసి సంసారసుఖ మిది నిజముసేసుక | తవివొంది యిందులోనే తడబడేమయ్యా ||

చ|| బొమ్మలాట నిజమంటా బూచి చూచి మెచ్చినట్టు | తెమ్మగా శివమాడి తా దేవరైనట్టు |

కిమ్ముల యీజన్మమందు కిందుమీదు నేఱక | పమ్మి భోగములనేతెప్పల దేలేమయ్యా ||

చ|| బాలులు యిసుకగుళ్ళు పస గట్టు కాడినట్టు | వీలి వెఱ్ఱివాడు గంతువేసినయట్టు |

మేలిమి శ్రీవేంకటేశ మిమ్ము గొలువక నేము | కాల మూరకే యిన్నాళ్ళు గడిపితిమయ్యా ||

pa|| AmIdinijasuKa marayalEmu | pAmarapucAyalakE BramasitimayyA ||

ca|| manasuna bAlu dAgi madiyiMcivunnayaTTu | nanici giligiMtaku navvinayaTTu |

yenasi saMsArasuKa midi nijamusEsuka | tavivoMdi yiMdulOnE taDabaDEmayyA ||

ca|| bommalATa nijamaMTA bUci cUci meccinaTTu | temmagA SivamADi tA dEvarainaTTu |

kimmula yIjanmamaMdu kiMdumIdu nErxaka | pammi BOgamulanEteppala dElEmayyA ||

ca|| bAlulu yisukaguLLu pasa gaTTu kADinaTTu | vIli verxrxivADu gaMtuvEsinayaTTu |

mElimi SrIvEMkaTESa mimmu goluvaka nEmu | kAla mUrakE yinnALLu gaDipitimayyA ||

Apannula pAli - ఆపన్నుల పాలి

ప|| ఆపన్నుల పాలి దైవమాతడే గతి తక్క | ఏ ప్రొద్దును భజియించక నితరుడు మరి కలడా ||

చ|| నిరుపాధిక నిజ బంధుడు నిరతిశయానందుడు | కరి వరదుడితడే కాక ఘనుడధికుడు కలడా ||

చ|| సంతత గుణ సంపన్నుడు సాధులకు బ్రసన్నుడు | అంతర్యామితడే కాక అధికుడు మరి కలడా||

చ|| పరమాత్ముడు పరమ పురుషుడు పరికింపగ గృపాలుడు | తిరువేంకట విభుడే కాక దేవుడు మరి కలడా ||

pa|| Apannula pAli daivamAtaDE gati takka | E proddunu bhajiyiMcaka nitaruDu mari kalaDA ||

ca|| nirupAdhika nija baMdhuDu niratiSayAnaMduDu | kari varaduDitaDE kAka GanuDadhikuDu kalaDA ||

ca|| saMtata guNa saMpannuDu sAdhulaku brasannuDu | aMtaryAmitaDE kAka adhikuDu mari kalaDA||

ca|| paramAtmuDu parama puruShuDu parikiMpaga gRupAluDu | tiruvEMkaTa vibhuDE kAka dEvuDu mari kalaDA ||

ApadbaMdhuDu hari - ఆపద్బంధుడు హరి

ప|| ఆపద్బంధుడు హరి మాకు గలడు | దూపిలి తలచినా దోషహరము ||

చ|| గరుడనినెక్కినఘనరేవంతుడు | గరుడకేతనముగలరథుడు |

గరుడడే తనకును గరియగుబాణము | గరిమె నీతడేపో ఘనగారుడము ||

చ|| పాముపరపై బండినసిద్ధుడు | పాముపాశములపరిహరము |

పామున నమృతముపడదచ్చినతడు | వేమరు నీతడే విషహరము ||

చ|| కమలాక్షు డీతడు కమలనాథుడును | కమలాదేవికి గైవశము |

అమరిన శ్రీవేంకటాధిపు డితడే | మమతల మా కిదే మంత్రౌషధము ||

pa|| ApadbaMdhuDu hari mAku galaDu | dUpili talacinA dOShaharamu ||

ca|| garuDaninekkinaGanarEvaMtuDu | garuDakEtanamugalarathuDu |

garuDaDE tanakunu gariyagubANamu | garime nItaDEpO GanagAruDamu ||

ca|| pAmuparapai baMDinasiddhuDu | pAmupASamulapariharamu |

pAmuna namRutamupaDadaccinataDu | vEmaru nItaDE viShaharamu ||

ca|| kamalAkShu DItaDu kamalanAthuDunu | kamalAdEviki gaivaSamu |

amarina SrIvEMkaTAdhipu DitaDE | mamatala mA kidE maMtrauShadhamu ||