iMdirAnAyaka yidivO - ఇందిరానాయక యిదివో

ప|| ఇందిరానాయక యిదివో మాపాటు | చెంది నీవే గతి చేకొనవయ్యా ||

చ|| తీసీ గోరికతీదీపు లొకవంక | లాసీ సంసారలంపటము |

మూసీ గర్మము మునుకొని పరచింత | సేసేదేమిక జెప్పేదేమి ||

చ|| వంచీ నాసలు వలసినచోటికి | పొంచీ దుర్గుణభోగములు |

ముంచీ యౌవన మోహాంధకారము | యెంచేదేమి సోదించేదేమి ||

చ|| ఎరిగీ జిత్తము యించుకించుక నిన్ను | మరవని నీపైభక్తి మతినుండగా |

నెరి శ్రీవేంకటపతి నీవే కాతువుగాక | వెరచి నేజేసే విన్నపమేమి ||

pa|| iMdirAnAyaka yidivO mApATu | ceMdi nIvE gati cEkonavayyA ||

ca|| tIsI gOrikatIdIpu lokavaMka | lAsI saMsAralaMpaTamu |

mUsI garmamu munukoni paraciMta | sEsEdEmika jeppEdEmi ||

ca|| vaMcI nAsalu valasinacOTiki | poMcI durguNaBOgamulu |

muMcI yauvana mOhAMdhakAramu | yeMcEdEmi sOdiMcEdEmi ||

ca|| erigI jittamu yiMcukiMcuka ninnu | maravani nIpaiBakti matinuMDagA |

neri SrIvEMkaTapati nIvE kAtuvugAka | veraci nEjEsE vinnapamEmi ||

iMdirAnAma miMdariki - ఇందిరానామ మిందరికి

ప|| ఇందిరానామ మిందరికి | కుందనపుముద్ద వోగోవింద ||

చ|| అచ్చుతనామము అనంతనామము | ఇచ్చినసంపద లిందరికి |

నచ్చినసిరులు నాలుకతుదలు- | కొచ్చికొచ్చీ నోగోవింద ||

చ|| వైకుంఠనామము వరదనామము | ఈకడనాకడ నిందరికి |

నాకుదెరవులు వన్నెలు లోకాల | గూకులు వత్తులు నోగోవింద ||

చ|| పండరినామము పరమనామము | ఎండలునాపెడి దిందరికి |

నిండునిధానమై నిలిచినపేరు | కొండల కోనేటివో గోవింద ||

pa|| iMdirAnAma miMdariki | kuMdanapumudda vOgOviMda ||

ca|| accutanAmamu anaMtanAmamu | iccinasaMpada liMdariki |

naccinasirulu nAlukatudalu- | koccikoccI nOgOviMda ||

ca|| vaikuMThanAmamu varadanAmamu | IkaDanAkaDa niMdariki |

nAkuderavulu vannelu lOkAla | gUkulu vattulu nOgOviMda ||

ca|| paMDarinAmamu paramanAmamu | eMDalunApeDi diMdariki |

niMDunidhAnamai nilicinapEru | koMDala kOnETivO gOviMda ||

iMdirAnAthu DinniTi - ఇందిరానాథు డిన్నిటి

ప|| ఇందిరానాథు డిన్నిటి కీత డింతే | బందెలకర్మములాల పట్టకురో మమ్మును ||

చ|| యెఱిగిసేసినవెల్లా నీతనిమహిమలే | యెఱుగక చేసినది యీతనిమాయే |

తెఱగొప్ప రెంటికిని తెడ్డువంటివాడ నింతే | పఱచుగర్మములాల పట్టకురో మమ్మును ||

చ|| కాయములోపలివాడు ఘను డొక్కడితడే | కాయ మీతనిప్రకృతికల్పిత మింతే |

తోయరాక రెంటికిని తోడునీడైతి నింతే | బాయటికర్మములాల పట్టకురో మమ్మును ||

చ|| యేలినవాడు శ్రీవేంకటేశు డిత డొక్కడింతే | యేలికసానై పెంచేది యీతనిసతే |

పోలి నే వీరిగొలిచేసూత్రపు బొమ్మ నింతే | పాలుపుగర్మములాల పట్టకురో మమ్మును ||

pa|| iMdirAnAthu DinniTi kIta DiMtE | baMdelakarmamulAla paTTakurO mammunu ||

ca|| yerxigisEsinavellA nItanimahimalE | yerxugaka cEsinadi yItanimAyE |

terxagoppa reMTikini teDDuvaMTivADa niMtE | parxacugarmamulAla paTTakurO mammunu ||

ca|| kAyamulOpalivADu Ganu DokkaDitaDE | kAya mItaniprakRutikalpita miMtE |

tOyarAka reMTikini tODunIDaiti niMtE | bAyaTikarmamulAla paTTakurO mammunu ||

ca|| yElinavADu SrIvEMkaTESu Dita DokkaDiMtE | yElikasAnai peMcEdi yItanisatE |

pOli nE vIrigolicEsUtrapu bomma niMtE | pAlupugarmamulAla paTTakurO mammunu ||

iMdirAdhipunisEva - ఇందిరాధిపునిసేవ

ప|| ఇందిరాధిపునిసేవ యేమరకుండుటగాక | బొందితోడిజీవులకు బుద్ధు లేటిబుద్ధులు ||

చ|| రేయెల్లా మింగిమింగి రేపే వెళ్ళనిమియు | బాయట నిద్రాదేవి పలుమారును |

చాయలకు నిచ్చానిచ్చా జచ్చిచచ్చి పొడమేటి- | మాయజీవులకునెల్లా మని కేటిమనికి ||

చ|| కనురెప్ప మూసితేనే కడు సిష్టే చీకటౌను | కనురెప్ప దెరచితే క్రమ్మర బుట్టు |

ఘనమై నిమిషమందే కలిమి లేమియు దోచె | యెనయుజీవుల కింక యెఱు కేటియెఱుక ||

చ|| వొప్పగుబ్రాణము లవి వూరుగాలివెంట | యెప్పుడు లోనివెలికి నెడతాకును |

అప్పుడు శ్రీవేంకటేశు డంతరాత్ము డందరికి | తప్పక యాతడే కాచు తల పేటితలపు ||

pa|| iMdirAdhipunisEva yEmarakuMDuTagAka | boMditODijIvulaku buddhu lETibuddhulu ||

ca|| rEyellA miMgimiMgi rEpE veLLanimiyu | bAyaTa nidrAdEvi palumArunu |

cAyalaku niccAniccA jaccicacci poDamETi- | mAyajIvulakunellA mani kETimaniki ||

ca|| kanureppa mUsitEnE kaDu siShTE cIkaTaunu | kanureppa deracitE krammara buTTu |

Ganamai nimiShamaMdE kalimi lEmiyu dOce | yenayujIvula kiMka yerxu kETiyerxuka ||

ca|| voppagubrANamu lavi vUrugAliveMTa | yeppuDu lOniveliki neDatAkunu |

appuDu SrIvEMkaTESu DaMtarAtmu DaMdariki | tappaka yAtaDE kAcu tala pETitalapu ||

indirAramaNu - ఇందిరారమణు

రాగం:శివరంజని
ఇందిరారమణు దెచ్చి యియ్యరో మా కిటువలె
పొంది యీతని పూజింప పొద్దాయనిపుడు !!

ధారుణి మైరావణు దండించి రాముదెచ్చి
నేరుపున మించిన అంజనీతనయా
ఘోర(తూల)నాగపాశముల కొట్టివేసి యీతని
కారుణ్యమందినట్టి ఖగరాజ గరుడా !!

నానాదేవతలకు నరసింహు కంభములో
పానిపట్టి చూపినట్టి ప్రహ్లాదుడా
మానవుడౌ కృష్ణ మహిమల విశ్వరూపు
పూని బండి నుంచుకొన్న పోటుబంట అర్జునా !!

శ్రీ వల్లభునకు అశేష కైంకర్యముల
శ్రీ వేంకటాద్రివైన శేషమూరితీ
కైవసమైనయట్టి కార్తవీర్యార్జునుడా
దేవుని నీవేళనిట్టె తెచ్చి మాకు నియ్యరే !!

Raagam:Sivaramjani

indirAramaNu decchi yiyyarO mA kiTuvale
pondi yItani poojimpa poddAyanipuDu !!

dHAruNi mairAvaNu danDinchi rAmudecchi
nErupuna minchina anjanItanayA
ghOra(toola)nAgapASamula koTTivEsi yItani
kAruNyamandinaTTi khagarAja garuDA !!

nAnAdEvatalaku narasiMhu kambhamulO
pAnipaTTi choopinaTTi prahlAduDA
mAnavuDou kRshNa mahimala viSwaroopu
pooni banDi nunchukonna pOTubanTa arjunA !!

SrI vallabhunaku aSEsha kaimkaryamula
SrI vEnkaTAdrivaina SEshamooritI
kaivasamainayaTTi kArtavIryArjunuDA
dEvuni nIvELaniTTe tecchi mAku niyyarE !!

Indira vaddincha - ఇందిర వడ్డించ

Indira vaddincha - ఇందిర వడ్డించ | Annamayya Lyrics | Sankeertanalu | Songs | Telugu & English

Listen Audio by P S RANGANATH:

 ఇందిర వడ్డించ (రాగం: ) (తాళం : )

ఇందిర వడ్డించ నింపుగను
చిందక యిట్లే భుజించవో స్వామి

అక్కాళపాళాలు నప్పాలు వడలు
పెక్కైనసయిదంపు పేణులును
సక్కెరరాసులు సద్యోఘృతములు
కిక్కిరియ నారగించవో స్వామి

మీరినకెళంగు మిరియపు దాళింపు
గూరలు కమ్మనికూరలును
సారంపుబచ్చళ్ళు చవులుగ నిట్టే
కూరిమితో జేకొనవో స్వామీ

పిండివంటలును బెరుగులు బాలు
మెండైన పాశాలు మెచ్చి మెచ్చి
కొండలపొడవు కోరి దివ్యాన్నాలు
వెండియు మెచ్చవే వేంకటస్వామీ

iMdira vaDDiMca (Raagam: ) (Taalam: )

iMdira vaDDiMca niMpuganu
ciMdaka yiTlE BujiMcavO svAmi

akkALapALAlu nappAlu vaDalu
pekkainasayidaMpu pENulunu
sakkerarAsulu sadyOGRutamulu
kikkiriya nAragiMcavO svAmi

mIrinakeLaMgu miriyapu dALiMpu
gUralu kammanikUralunu
sAraMpubaccaLLu cavuluga niTTE
kUrimitO jEkonavO svAmI

piMDivaMTalunu berugulu bAlu
meMDaina pASAlu mecci mecci
koMDalapoDavu kOri divyAnnAlu
veMDiyu meccavE vEMkaTasvAmI


iMdAkA nerxaganaiti - ఇందాకా నెఱగనైతి

ప|| ఇందాకా నెఱగనైతి నిక గపటములేల | చెంది యిట్టె నాతోడ జెప్పవయ్య మాటలు ||

చ|| మంతనానకు రాగాను మనసెల్లా నొక్కటాయ | పంతము నీ వియ్యగాను పాసెగోపము |

అంతరంగము చెప్పగా ననుమానమింక నెంచ | రంతులు సేయక యిట్టె రావయ్య యింటికి ||

చ|| సరసము నీవాడగా చల్లనాయనా మేను | సరుస గూచుండగాను సమ్మతించితివి |

యెరవులేక నవ్వగా నిరవాయ గూరిములు | బిరిదులెల్లా గంటి బెట్టవయ్య విడెము ||

చ|| గక్కన నీవు గూడగా కాతాళము లణగె | మిక్కిలి మన్నించగాను మెచ్చితి నేను |

అక్కున శ్రీ వేంకటేశ అలమేలు మంగను నేను | వొక్కటై కూడితి విట్టె వుండవయ్య వొద్దను ||

pa|| iMdAkA nerxaganaiti nika gapaTamulEla | ceMdi yiTTe nAtODa jeppavayya mATalu ||

ca|| maMtanAnaku rAgAnu manasellA nokkaTAya | paMtamu nI viyyagAnu pAsegOpamu |

aMtaraMgamu ceppagA nanumAnamiMka neMca | raMtulu sEyaka yiTTe rAvayya yiMTiki ||

ca|| sarasamu nIvADagA callanAyanA mEnu | sarusa gUcuMDagAnu sammatiMcitivi |

yeravulEka navvagA niravAya gUrimulu | biridulellA gaMTi beTTavayya viDemu ||

ca|| gakkana nIvu gUDagA kAtALamu laNage | mikkili manniMcagAnu mecciti nEnu |

akkuna SrI vEMkaTESa alamElu maMganu nEnu | vokkaTai kUDiti viTTe vuMDavayya voddanu ||