Indira vaddincha - ఇందిర వడ్డించ

Indira vaddincha - ఇందిర వడ్డించ | Annamayya Lyrics | Sankeertanalu | Songs | Telugu & English

Listen Audio by P S RANGANATH:

 ఇందిర వడ్డించ (రాగం: ) (తాళం : )

ఇందిర వడ్డించ నింపుగను
చిందక యిట్లే భుజించవో స్వామి

అక్కాళపాళాలు నప్పాలు వడలు
పెక్కైనసయిదంపు పేణులును
సక్కెరరాసులు సద్యోఘృతములు
కిక్కిరియ నారగించవో స్వామి

మీరినకెళంగు మిరియపు దాళింపు
గూరలు కమ్మనికూరలును
సారంపుబచ్చళ్ళు చవులుగ నిట్టే
కూరిమితో జేకొనవో స్వామీ

పిండివంటలును బెరుగులు బాలు
మెండైన పాశాలు మెచ్చి మెచ్చి
కొండలపొడవు కోరి దివ్యాన్నాలు
వెండియు మెచ్చవే వేంకటస్వామీ

iMdira vaDDiMca (Raagam: ) (Taalam: )

iMdira vaDDiMca niMpuganu
ciMdaka yiTlE BujiMcavO svAmi

akkALapALAlu nappAlu vaDalu
pekkainasayidaMpu pENulunu
sakkerarAsulu sadyOGRutamulu
kikkiriya nAragiMcavO svAmi

mIrinakeLaMgu miriyapu dALiMpu
gUralu kammanikUralunu
sAraMpubaccaLLu cavuluga niTTE
kUrimitO jEkonavO svAmI

piMDivaMTalunu berugulu bAlu
meMDaina pASAlu mecci mecci
koMDalapoDavu kOri divyAnnAlu
veMDiyu meccavE vEMkaTasvAmI


iMdAkA nerxaganaiti - ఇందాకా నెఱగనైతి

ప|| ఇందాకా నెఱగనైతి నిక గపటములేల | చెంది యిట్టె నాతోడ జెప్పవయ్య మాటలు ||

చ|| మంతనానకు రాగాను మనసెల్లా నొక్కటాయ | పంతము నీ వియ్యగాను పాసెగోపము |

అంతరంగము చెప్పగా ననుమానమింక నెంచ | రంతులు సేయక యిట్టె రావయ్య యింటికి ||

చ|| సరసము నీవాడగా చల్లనాయనా మేను | సరుస గూచుండగాను సమ్మతించితివి |

యెరవులేక నవ్వగా నిరవాయ గూరిములు | బిరిదులెల్లా గంటి బెట్టవయ్య విడెము ||

చ|| గక్కన నీవు గూడగా కాతాళము లణగె | మిక్కిలి మన్నించగాను మెచ్చితి నేను |

అక్కున శ్రీ వేంకటేశ అలమేలు మంగను నేను | వొక్కటై కూడితి విట్టె వుండవయ్య వొద్దను ||

pa|| iMdAkA nerxaganaiti nika gapaTamulEla | ceMdi yiTTe nAtODa jeppavayya mATalu ||

ca|| maMtanAnaku rAgAnu manasellA nokkaTAya | paMtamu nI viyyagAnu pAsegOpamu |

aMtaraMgamu ceppagA nanumAnamiMka neMca | raMtulu sEyaka yiTTe rAvayya yiMTiki ||

ca|| sarasamu nIvADagA callanAyanA mEnu | sarusa gUcuMDagAnu sammatiMcitivi |

yeravulEka navvagA niravAya gUrimulu | biridulellA gaMTi beTTavayya viDemu ||

ca|| gakkana nIvu gUDagA kAtALamu laNage | mikkili manniMcagAnu mecciti nEnu |

akkuna SrI vEMkaTESa alamElu maMganu nEnu | vokkaTai kUDiti viTTe vuMDavayya voddanu ||

iMdarivale jUDaku - ఇందరివలె జూడకు

ప|| ఇందరివలె జూడకు యింకా నన్ను | మందలించి యెటువలె మన్నించినా మంచిదే ||

చ|| తత్తరించి నీ మీద తప్పులు మోపగ నోప | కొత్త కొత్త మాటలను కొసర నోప |

బత్తి గల దాన నీతో బంతము లాడగ నోప | చిత్తగించి యేమి దయసేసి నాను మంచిదే ||

చ|| చేయి చాచి కొనగోర బెనకగ నే నోప | చాయల సన్నల నిన్ను జరయనోప |

నీ యాధీనపు దానను నిన్ను వెంగెమాడ నోప | రాయడించ కెటువలె రక్షించినా మంచిదే ||

చ|| అట్టే కౌగిట గూడితి వలయించ నే నోప | వట్టి సట లాడి నీతో వాదించ నోప |

ఇట్టే శ్రీ వేంకటేశ యెనసితి విటు నన్ను | పట్టముగట్టి నన్నెంత పాలార్చినా మంచిదే ||

pa|| iMdarivale jUDaku yiMkA nannu | maMdaliMci yeTuvale manniMcinA maMcidE ||

ca|| tattariMci nI mIda tappulu mOpaga nOpa | kotta kotta mATalanu kosara nOpa |

batti gala dAna nItO baMtamu lADaga nOpa | cittagiMci yEmi dayasEsi nAnu maMcidE ||

ca|| cEyi cAci konagOra benakaga nE nOpa | cAyala sannala ninnu jarayanOpa |

nI yAdhInapu dAnanu ninnu veMgemADa nOpa | rAyaDiMca keTuvale rakShiMcinA maMcidE ||

ca|| aTTE kaugiTa gUDiti valayiMca nE nOpa | vaTTi saTa lADi nItO vAdiMca nOpa |

iTTE SrI vEMkaTESa yenasiti viTu nannu | paTTamugaTTi nanneMta pAlArcinA maMcidE ||

iMtEsi sEvalu sEya - ఇంతేసి సేవలు సేయ

ప|| ఇంతేసి సేవలు సేయ నెందాకా నోపు చెలి | కాంతుడవు మెచ్చి మెచ్చి కౌగలించవయ్యా ||

చ|| పయ్యదకొంగు జారగ పాలిండ్లు గదలగ | చయ్యన గుంచె వేసీని సతి నీకు |

చెయ్యెల్ల బడలంగ జెక్కులు చెమరించగ | వొయ్యనే పాదా లొత్తీ నుల్లసాన నీకు ||

చ|| గరిమ దురుము వీడ గస్తూరి బేంట్లు రాల | పరగగ గాళాంజి పట్టీ నీకు |

సరులు చిక్కువడగ సందడి నూర్పులు రేగ | సిరుల గందము పూసీ జెలరేగి నీకు ||

చ|| తనువు పులకించగ తమకములు ముంచగ | యెనచి యాకు మడచి యిచ్చీ నీకు |

అనుగు శ్రీవేంకటేశ అలమేలుమంగ యీకె | చనవున గెమ్మోవి చవిచూసీ నీకు ||

pa|| iMtEsi sEvalu sEya neMdAkA nOpu celi | kAMtuDavu mecci mecci kaugaliMcavayyA ||

ca|| payyadakoMgu jAraga pAliMDlu gadalaga | cayyana guMce vEsIni sati nIku |

ceyyella baDalaMga jekkulu cemariMcaga | voyyanE pAdA lottI nullasAna nIku ||

ca|| garima durumu vIDa gastUri bEMTlu rAla | paragaga gALAMji paTTI nIku |

sarulu cikkuvaDaga saMdaDi nUrpulu rEga | sirula gaMdamu pUsI jelarEgi nIku ||

ca|| tanuvu pulakiMcaga tamakamulu muMcaga | yenaci yAku maDaci yiccI nIku |

anugu SrIvEMkaTESa alamElumaMga yIke | canavuna gemmOvi cavicUsI nIku ||

iMtEsi matakAlu - ఇంతేసి మతకాలు

ప|| ఇంతేసి మతకాలు నే నెఱగనివా | పొంత నుండి నవ్వేవు పొద్దు వోదానీకు ||

చ|| తారుకాణాలంతే నేల తగవు నడపరాదా | గారావు నీ వెఱుగని కల్ల వున్నదా |

కూరిమి సతులమూక కూరిచి తలవంచేవు | పోరులేల పెట్టేవు పొద్దు వోదా నీకు ||

చ|| వొడ బరచగనేల వూరకే వుండగరాదా | తడివితిమా నీవింతయు నేరవా |

కడగడ లటుదొక్కి కమ్మినన్ను వేడుకొంటా | బుడికేవు నన్ను నీవు పొద్దు వోదా నీకు ||

చ|| నివ్వెరగంద నేల నిచ్చలాన నుండరాదా | జవ్వనపు నాచేత నీసలిగె కాదా |

యివ్వల శ్రీ వేంకటేశ యిట్టె నిన్ను గూడితిని | పువ్వులనేల వేసేవు పొద్దు వోదా నీకు ||

pa|| iMtEsi matakAlu nE nerxaganivA | poMta nuMDi navvEvu poddu vOdAnIku ||

ca|| tArukANAlaMtE nEla tagavu naDaparAdA | gArAvu nI verxugani kalla vunnadA | kUrimi satulamUka kUrici talavaMcEvu | pOrulEla peTTEvu poddu vOdA nIku ||

ca|| voDa baracaganEla vUrakE vuMDagarAdA | taDivitimA nIviMtayu nEravA | kaDagaDa laTudokki kamminannu vEDukoMTA | buDikEvu nannu nIvu poddu vOdA nIku ||

ca|| nivveragaMda nEla niccalAna nuMDarAdA | javvanapu nAcEta nIsalige kAdA | yivvala SrI vEMkaTESa yiTTe ninnu gUDitini | puvvulanEla vEsEvu poddu vOdA nIku ||

Imtaepo vaarivaari - ఇంతేపో వారివారి

రాగం:గుజ్జర

ఇంతేపో వారివారిహీనాధికములెల్ల పంతాన తా మేపాతిభాగ్యము నాపాటే।

అందరిలో దేవుడుండు అందధికులు గొందరు కొందరు హీనులై కుందుదు రింతే చెంది వీచేగాలొకటే చేనిపంటా నొకటే పొంది గట్టికొలుచుండి పొల్లు కడబడును।

పుట్టుగందరి కొకటే భూమిలో యేలికలును వెట్టిబంట్లు గొందరై వీగుదు రింతే చుట్టి వరి గురుమతో జొన్న గింజ సరిదూగు తెట్టెలై మేలొకటికి తీలొకటికాయ

కోరి శ్రీవేంకటపతికుక్షిలోనే లోకములు ఆరయ గిందెడు మీదెడై వున్నవింతే యీరీతి నితనిదాసు లెక్కిరి పొడవులకు తారి కిందికి దిగిరి దానవులై కొందరు

Raagam: Gujjara

Imtaepo vaarivaariheenaadhikamulella Pamtaana taa maepaatibhaagyamu naapaatae

Amdarilo daevudumdu amdadhikulu gomdaru Komdaru heenulai kumdudu rimtae Chemdi veechaegaalokatae chaenipamtaa nokatae Pomdi gattikoluchumdi pollu kadabadunu

Puttugamdari kokatae bhoomilo yaelikalunu Vettibamtlu gomdarai veegudu rimtae Chutti vari gurumato jonna gimja saridoogu Tettelai maelokatiki teelokatikaaya

Kori sreevaemkatapatikukshilonae lokamulu Aaraya gimdedu meededai vunnavimtae Yeereeti nitanidaasu lekkiri podavulaku Taari kimdiki digiri daanavulai komdaru

iMtE marEmilEdu - ఇంతే మరేమిలేదు

ప|| ఇంతే మరేమిలేదు యిందుమీదను | దొంతులకర్మాలు దుమ్ముదూరుపెత్తుట ||

చ|| వుల్లములో నుండి దేహమొగి రక్షించేహారి- | నొల్లకున్న తన్ను దానొల్లకుండుట |

బల్లిదు డతని మానిపరుల వేడేదెల్లా | పొల్లకట్టు దంచిదంచి పోగుసేసుకొనుట ||

చ|| యెయ్యెడా బుణ్యఫలము లేమి గలిగిన హరి- | కియ్యకున్న నది దైవమియ్యకుండుట |

చెయ్యార నాతని కొప్పుసేయని భోగములెల్లా | చయ్యన జెరకుబిప్పి చవిగొనుట ||

చ|| శ్రీకాంతుడైనట్టి శ్రీవేంకటేశ్వరుని | జేకొంటె సిరులెల్లా జేకొనుట |

మేకులశ్రీహరినామమే నోరనుడుగుట | కైకొన్న యమృతపుగందు వగుట ||

pa|| iMtE marEmilEdu yiMdumIdanu | doMtulakarmAlu dummudUrupettuTa ||

ca|| vullamulO nuMDi dEhamogi rakShiMcEhAri- | nollakunna tannu dAnollakuMDuTa | ballidu Datani mAniparula vEDEdellA | pollakaTTu daMcidaMci pOgusEsukonuTa ||

ca|| yeyyeDA buNyaPalamu lEmi galigina hari- | kiyyakunna nadi daivamiyyakuMDuTa | ceyyAra nAtani koppusEyani BOgamulellA | cayyana jerakubippi cavigonuTa ||

ca|| SrIkAMtuDainaTTi SrIvEMkaTESvaruni | jEkoMTe sirulellA jEkonuTa | mEkulaSrIharinAmamE nOranuDuguTa | kaikonna yamRutapugaMdu vaguTa ||