itanikaMTE Ganulu ika - ఇతనికంటే ఘనులు ఇక

ప|| ఇతనికంటే ఘనులు ఇకలేరు | ఇతరదేవతల ఇందరిలోన ||

చ|| భూపతి యితడే పొదిగి కొలువరో | శ్రీపతి యితడే చేకొనరో |
ఏపున బలుపుడు నితడే చెరరో | పై పై వేంకట పతి యైనాడు ||

చ|| మరుగురు డితడే మతినమ్మగదరో | పరమాత్ము డితడే భావించరో |
కరివరదు డితడే గతియని తలచరో | పరగ శ్రీవేంకట పతియై నాడు ||

చ|| తల్లియు నితడే తండ్రియు నితడే | వెల్లవియై యిక విడువరో |
చల్లగా నితని శరణని బ్రతుకరో | అల్ల శ్రీ వేంకట హరి యయినాడు ||

pa|| itanikaMTE Ganulu ikalEru | itaradEvatala iMdarilOna ||

ca|| BUpati yitaDE podigi koluvarO | SrIpati yitaDE cEkonarO |
Epuna balupuDu nitaDE cerarO | pai pai vEMkaTa pati yainADu ||

ca|| maruguru DitaDE matinammagadarO | paramAtmu DitaDE BAviMcarO |
karivaradu DitaDE gatiyani talacarO | paraga SrIvEMkaTa patiyai nADu ||

ca|| talliyu nitaDE taMDriyu nitaDE | vellaviyai yika viDuvarO |
callagA nitani SaraNani bratukarO | alla SrI vEMkaTa hari yayinADu ||

Itadokade sarveswarudu - ఇతడొకడే సర్వేశ్వరుడు

Itadokade sarveswarudu - ఇతడొకడే సర్వేశ్వరుడు | Annamayya Lyrics | Sankeertanalu | Songs | Telugu & English

Listen Audio by G BALAKRISHNA PRASAD:

 ఇతడొకడే సర్వేశ్వరుడు (రాగం: ) (తాళం : )

ఇతడొకడే సర్వేశ్వరుడు
సిత కమలాక్షుడు శ్రీ వేంకటేశుడు ||

పరమ యోగులకు భావ నిధానము
అరయ నింద్రాదుల కైశ్వర్యము
గరిమ గొల్లెతల కౌగిట సౌఖ్యము
సిరులొసగేయీ శ్రీ వేంకటేశుడు ||

కలికి యశోదకు కన్న మాణికము
తలచిన కరికిని తగుదిక్కు
అల ద్రౌపదికిని ఆపద్బంధుడు
చెలరేగిన యీ శ్రీ వేంకటేశుడు ||

తగిలిన మునులకు తపము సత్ఫలము
ముగురు వేల్పులకు మూలమీతడే
వొగినలమేల్మంగ కొనరిన పతియితడు
జిగిమించిన యీ శ్రీవేంకటేశుడు ||


itaDokaDE (Raagam: ) (Taalam: )


itaDokaDE sarvESvaruDu
sita kamalAkShuDu shrI vEMkatESuDu

parama yOgulaku BAva nidhAnamu
araya niMdrAdula kaiSvaryamu
garima golletala kaugiTa sauKyamu
sirulosagE yI SrI vEMkaTESuDu

kaliki yaSOdaku kanna mANikamu
talacina karikini tagudikku
ala draupadikini ApadbaMdhuDu
celarEgina yI SrI vEMkaTESuDu

tagilina munulaku tapamu satPalamu
muguru vElpulaku mUlamItaDE
voginalamElmaMga konarina patiyitaDu
jigimiMcina yI srIvEnkaTESuDu

itaDucEsinasEta - ఇతడుచేసినసేత

ప|| ఇతడుచేసినసేత లెన్నిలేవిలమీద | యితడు జగదేకగర్వితుడౌనో కాడో ||

చ|| కుడువడా ప్రాణములుగొనుచు బూతకిచన్ను | తుడువడా కపటదైత్యులనొసలివ్రాలు |
అడువడా నేలతో నలమి శకటాసురుని | వడువడా నెత్తురులు వసుధ కంసుని ||

చ|| పెట్టడా దనుజారిబిరుదు లోకమునమ్దు | కట్టడా బలిదైత్యు కర్మబంధముల |
మెట్టడా కాళింగుమేటిశిరములు, నలియ- | గొట్టడా దానవుల గోటానగోట్ల ||

చ|| మరవడా పుట్టువులు మరణములు బ్రాణులకు | పరపడా గంగ దనపాదకమలమున |
చెరుపడా దురితములు శ్రీవేంకటేశుడిదె | నెరపడా లోకములనిండ దనకీర్తి ||

pa|| itaDucEsinasEta lennilEvilamIda | yitaDu jagadEkagarvituDaunO kADO ||

ca|| kuDuvaDA prANamulugonucu bUtakicannu | tuDuvaDA kapaTadaityulanosalivrAlu |
aDuvaDA nElatO nalami SakaTAsuruni | vaDuvaDA netturulu vasudha kaMsuni ||

ca|| peTTaDA danujAribirudu lOkamunamdu | kaTTaDA balidaityu karmabaMdhamula |
meTTaDA kALiMgumETiSiramulu, naliya- | goTTaDA dAnavula gOTAnagOTla ||

ca|| maravaDA puTTuvulu maraNamulu brANulaku | parapaDA gaMga danapAdakamalamuna |
cerupaDA duritamulu SrIvEMkaTESuDide | nerapaDA lOkamulaniMDa danakIrti ||

iTTi viMdu gaMTivA - ఇట్టి విందు గంటివా

ఇట్టి విందు గంటివా నీవెక్కదైనా
అట్టె ఆకెపొత్తున నీవారగించవయ్యా ||

కలికి కెమ్మోవితీపు కమ్మని తేనెలవిందు
చలువచూపులు నీకు జిక్కెరవిందు
సెలవి లేనవ్వులే చిలుపాలతోడి విందు
అలమేలుమంగ సేసి నారగించవయ్యా ||

కాంత గోరిచెనకులు కారపు గూరలవిందు
పంతపు మాటలే ఆవపచ్చడి విందు
వింతబొమ్మల జింకెనలే వేడి పడిదాల విందు
అంతసేసీ నీదేవి యారగించవయ్యా ||

అట్టడి సమరతి యాఅడి తరితీపువిందు
గట్టి సిగ్గు పెరుగు మీగడల విందు
గుట్టుతో మన్నించితివి కమ్మను శ్రీవేంకటేశ
అట్టె నీతనివిదీర నారగించవయ్యా ||

iTTi viMdu gaMTivA nIvekkadainA
aTTe Akepottuna nIvAragiMchavayyA ||

kaliki kemmOvitIpu kammani tEnelaviMdu
chaluvachUpulu nIku jikkeraviMdu
selavi lEnavvulE chilupAlatODi viMdu
alamElumaMga sEsi nAragiMchavayyA ||

kAMta gOrichenakulu kArapu gUralaviMdu
paMtapu mATalE AvapachchaDi viMdu
viMtabommala jiMkenalE vEDi paDidAla viMdu
aMtasEsI nIdEvi yAragiMchavayyA ||

RaTTaDi samarati yARaDi taritIpuviMdu
gaTTi siggu perugu mIgaDala viMdu
guTTutO manniMchitivi kammanu SrIvEMkaTESa
aTTe nItanividIra nAragiMchavayyA ||

iTTi BAgyamu gaMTimi - ఇట్టి భాగ్యము గంటిమి

ప|| ఇట్టి భాగ్యము గంటిమి యిద్దరూ బదుకుదురయా | పట్టము గట్టుకొంటివి పచ్చిదేరెనయ్యా ||

చ|| చెలియతోడే నీకు సింహాసనపుగద్దె | అలరుజూపులె రత్నాభిషేకాలు |

చలువైన నవ్వులే ఛత్రచామరములు | కలిగె నీకింక నేమి గావలెనయ్యా ||

చ|| చనుగవలే నీకు సామ్రాజ్య దుర్గములు | నినుపు మోవితేనెలు నిచ్చబోనాలు |

వొనరిన కౌగిలే వుండెడి నీనగరు | యెనయ నచ్చె నీ భాగ్యమీడెర నయ్యా ||

చ|| రతి చెనకులే నీకు రవణపు సొమ్ములు | సతతపుగూటమే సర్వసంపద | యితవై శ్రీవేంకటేశ యీకె యలమేలుమంగ | సతమాయ మమ్ము నేలి జాణవైతివయ్యా ||

pa|| iTTi BAgyamu gaMTimi yiddarU badukudurayA | paTTamu gaTTukoMTivi paccidErenayyA ||

ca|| celiyatODE nIku siMhAsanapugadde | alarujUpule ratnABiShEkAlu |

caluvaina navvulE CatracAmaramulu | kalige nIkiMka nEmi gAvalenayyA ||

ca|| canugavalE nIku sAmrAjya durgamulu | ninupu mOvitEnelu niccabOnAlu |

vonarina kaugilE vuMDeDi nInagaru | yenaya nacce nI BAgyamIDera nayyA ||

ca|| rati cenakulE nIku ravaNapu sommulu | satatapugUTamE sarvasaMpada |

yitavai SrIvEMkaTESa yIke yalamElumaMga | satamAya mammu nEli jANavaitivayyA ||

Itti prataapamugala - ఇట్టి ప్రతాపముగల

రాగం:మాళవి

ఇట్టి ప్రతాపముగల యీతని దాసులనెల్ల కట్టునా కర్మములెల్ల గాలి బోబుగాక

యెలమి జక్రాయుధున కెదురా దానవులు తొలగ కెందుచొచ్చిన దుండించుగాక ఇల గరుడధ్వజుపై నెక్కునా విషములు కలగి నీరై పారి గాలిబోబుగాక


గోవర్దనధరునిపై కొలువునా మాయలు వేవేలుదునుకలై విరుగుగాక కేవలుడచ్యుతునొద్ద గీడు చూపగలవా కావరమై తా దానె గాలి బోవుగాక

వీరనారసింహునకు వెరపులు గలవా దూరాన గగ్గులకాడై తొలగుగాక కోరి యీ శ్రీవేంకటేశు గొలిచితి మిదివో కారుకొన్నపగలెల్ల గాలి బోవుగాక

Raagam: maalavi

Itti prataapamugala yeetani daasulanella Kattunaa karmamulella gaali bobugaaka

Yelami jakraayudhuna keduraa daanavulu Tolaga kemduchochchina dumdimchugaaka Ila garudadhvajupai nekkunaa vishamulu Kalagi neerai paari gaalibobugaaka


Govardanadharunipai koluvunaa maayalu Vaevaeludunukalai virugugaaka Kaevaludachyutunodda geedu choopagalavaa Kaavaramai taa daane gaali bovugaaka

Itti

Veeranaarasimhunaku verapulu galavaa Dooraana gaggulakaadai tolagugaaka Kori yee sreevaemkataesu golichiti midivo Kaarukonnapagalella gaali bovugaaka

Itti naastikulamaata yaemani - ఇట్టి నాస్తికులమాట యేమని

రాగం: గుండక్రియ

ఇట్టి నాస్తికులమాట యేమని సమ్మెడి దిక పట్టి సములమంటానే భక్తుల దూషింతురు

వేదములు చదువుతా విశ్వమెలా గల్లనేరు ఆదెస తాము పుట్టుండి అదియును మాయనేరు పాదగువిష్ణుడుండగ బయలు తత్వమనేరు లేదు జీవతత్వమంటా లేమల బొందుదురు

తిరమై తమ ఇండ్ల దేవపూజలు సేసేరు ధరలోన తముదామే దైవమనేరు ఆరయగర్మమె బ్రహ్మమని యాచరించేరు సరి నదే కాదని సన్యసించేరు

అందుక పురుషసూక్తమర్థము జెప్పుదురు కందువ నప్పటి నిరాకారమందురు యిందులో శ్రీవేంకటేశ యిటె నీ దాసులుగాక మందపురాక్షసులాడేమతము నడతురు

Raagam: Gumdakriya


Itti naastikulamaata yaemani sammedi dika Patti samulamamtaanae bhaktula dooshimturu

Vaedamulu chaduvutaa visvamelaa gallanaeru Aadesa taamu puttumdi adiyunu maayanaeru Paadaguvishnudumdaga bayalu tatvamanaeru Laedu jeevatatvamamtaa laemala bomduduru

Tiramai tama imdla daevapoojalu saesaeru Dharalona tamudaamae daivamanaeru Aarayagarmame brahmamani yaacharimchaeru Sari nadae kaadani sanyasimchaeru

Amduka purushasooktamarthamu jeppuduru Kamduva nappati niraakaaramamduru Yimdulo sreevaemkataesa yite nee daasulugaaka Mamdapuraakshasulaadaematamu nadaturu