Itara chimta lika - ఇతర చింత లిక

రాగం: గుండక్రియ
ప|| ఇతరచింత లేక యేమిటికి | అతడే గతియై అరసేటివాడు ||

చ|| కర్మ మూలమే కాయము నిజ | ధర్మ మూలమే తన యాత్మ |
అర్మిలి రెంటికి హరి యొకడే | మర్మ మీతడే మనిపేటి వాడు ||

చ|| బహుభోగ సమయము ప్రపంచము | విహిత జ్ఞానము నిజముక్తి |
ఇహపరములకును ఈశ్వరుడే | సహజ కర్తయై జరిపేటి వాడు ||

చ|| అతి దుఃఖకరము లాసలు | సతత సుఖకరము సమవిరతి |
గతి యలమేల్మంగతో శ్రీ వేంకట | పతి యొకడిన్నిట పాలించువాడు ||

Raagam:Gumdakriya

pa|| itaraciMta lEka yEmiTiki | ataDE gatiyai arasETivADu ||

ca|| karma mUlamE kAyamu nija | dharma mUlamE tana yAtma |
armili reMTiki hari yokaDE | marma mItaDE manipETi vADu ||

ca|| bahuBOga samayamu prapaMcamu | vihita j~jAnamu nijamukti |
ihaparamulakunu ISvaruDE | sahaja kartayai jaripETi vADu ||

ca|| ati duHKakaramu lAsalu | satata suKakaramu samavirati |
gati yalamElmaMgatO SrI vEMkaTa | pati yokaDinniTa pAliMcuvADu ||

Itanikamtae nupaaya mika - ఇతనికంటే నుపాయ మిక

ఇతనికంటే నుపాయ మిక లేదు మతిలోననున్న వాడు మర్మ మిదే సుండీ.

ఇన్నిలోకసుఖములు ఇంద్రియప్రీతులే తన్ను గనినతల్లిదండ్రి తనుపోషకులే కన్ను లెదిటిధనాలు కారణార్థములే వున్నతి నిష్టార్థసిద్ది కొక్కడే దేవుడు.

కలదేవత లిందరు కర్మఫలదాతలే లలి విద్యలెల్ల ఖ్యాతిలాభపూజలకొరకే పలుమంత్రములెల్లను బ్రహ్మలోక మీసందివె వొలిసి ఇష్టార్థసిద్ది కొక్కడే దేవుడు.

అనుదినరాజసేవ లల్ప్రార్థహేతులే కొనగల్పవృxఅమైన గోరినవిచ్చేటిదే ఘన శ్రీవేంకటేశుడు కల్పించె జీవుని గావ_ వొనర నిష్టార్థసిద్ది కొక్కడే దేవుడు.

Itanikamtae nupaaya mika laedu Matilonanunna vaadu marma midae sumdee.

Innilokasukhamulu imdriyapreetulae Tannu ganinatallidamdri tanuposhakulae Kannu leditidhanaalu kaaranaarthamulae Vunnati nishtaarthasiddi kokkadae daevudu.

Kaladaevata limdaru karmaphaladaatalae Lali vidyalella khyaatilaabhapoojalakorakae Palumamtramulellanu brahmaloka meesamdive Volisi ishtaarthasiddi kokkadae daevudu.

Anudinaraajasaeva lalpraarthahaetulae Konagalpavrxamaina gorinavichchaetidae Ghana sreevaemkataesudu kalpimche jeevuni gaava_ Vonara nishtaarthasiddi kokkadae daevudu.

itanikaMTE Ganulu ika - ఇతనికంటే ఘనులు ఇక

ప|| ఇతనికంటే ఘనులు ఇకలేరు | ఇతరదేవతల ఇందరిలోన ||

చ|| భూపతి యితడే పొదిగి కొలువరో | శ్రీపతి యితడే చేకొనరో |
ఏపున బలుపుడు నితడే చెరరో | పై పై వేంకట పతి యైనాడు ||

చ|| మరుగురు డితడే మతినమ్మగదరో | పరమాత్ము డితడే భావించరో |
కరివరదు డితడే గతియని తలచరో | పరగ శ్రీవేంకట పతియై నాడు ||

చ|| తల్లియు నితడే తండ్రియు నితడే | వెల్లవియై యిక విడువరో |
చల్లగా నితని శరణని బ్రతుకరో | అల్ల శ్రీ వేంకట హరి యయినాడు ||

pa|| itanikaMTE Ganulu ikalEru | itaradEvatala iMdarilOna ||

ca|| BUpati yitaDE podigi koluvarO | SrIpati yitaDE cEkonarO |
Epuna balupuDu nitaDE cerarO | pai pai vEMkaTa pati yainADu ||

ca|| maruguru DitaDE matinammagadarO | paramAtmu DitaDE BAviMcarO |
karivaradu DitaDE gatiyani talacarO | paraga SrIvEMkaTa patiyai nADu ||

ca|| talliyu nitaDE taMDriyu nitaDE | vellaviyai yika viDuvarO |
callagA nitani SaraNani bratukarO | alla SrI vEMkaTa hari yayinADu ||

Itadokade sarveswarudu - ఇతడొకడే సర్వేశ్వరుడు

Itadokade sarveswarudu - ఇతడొకడే సర్వేశ్వరుడు | Annamayya Lyrics | Sankeertanalu | Songs | Telugu & English

Listen Audio by G BALAKRISHNA PRASAD:

 ఇతడొకడే సర్వేశ్వరుడు (రాగం: ) (తాళం : )

ఇతడొకడే సర్వేశ్వరుడు
సిత కమలాక్షుడు శ్రీ వేంకటేశుడు ||

పరమ యోగులకు భావ నిధానము
అరయ నింద్రాదుల కైశ్వర్యము
గరిమ గొల్లెతల కౌగిట సౌఖ్యము
సిరులొసగేయీ శ్రీ వేంకటేశుడు ||

కలికి యశోదకు కన్న మాణికము
తలచిన కరికిని తగుదిక్కు
అల ద్రౌపదికిని ఆపద్బంధుడు
చెలరేగిన యీ శ్రీ వేంకటేశుడు ||

తగిలిన మునులకు తపము సత్ఫలము
ముగురు వేల్పులకు మూలమీతడే
వొగినలమేల్మంగ కొనరిన పతియితడు
జిగిమించిన యీ శ్రీవేంకటేశుడు ||


itaDokaDE (Raagam: ) (Taalam: )


itaDokaDE sarvESvaruDu
sita kamalAkShuDu shrI vEMkatESuDu

parama yOgulaku BAva nidhAnamu
araya niMdrAdula kaiSvaryamu
garima golletala kaugiTa sauKyamu
sirulosagE yI SrI vEMkaTESuDu

kaliki yaSOdaku kanna mANikamu
talacina karikini tagudikku
ala draupadikini ApadbaMdhuDu
celarEgina yI SrI vEMkaTESuDu

tagilina munulaku tapamu satPalamu
muguru vElpulaku mUlamItaDE
voginalamElmaMga konarina patiyitaDu
jigimiMcina yI srIvEnkaTESuDu

itaDucEsinasEta - ఇతడుచేసినసేత

ప|| ఇతడుచేసినసేత లెన్నిలేవిలమీద | యితడు జగదేకగర్వితుడౌనో కాడో ||

చ|| కుడువడా ప్రాణములుగొనుచు బూతకిచన్ను | తుడువడా కపటదైత్యులనొసలివ్రాలు |
అడువడా నేలతో నలమి శకటాసురుని | వడువడా నెత్తురులు వసుధ కంసుని ||

చ|| పెట్టడా దనుజారిబిరుదు లోకమునమ్దు | కట్టడా బలిదైత్యు కర్మబంధముల |
మెట్టడా కాళింగుమేటిశిరములు, నలియ- | గొట్టడా దానవుల గోటానగోట్ల ||

చ|| మరవడా పుట్టువులు మరణములు బ్రాణులకు | పరపడా గంగ దనపాదకమలమున |
చెరుపడా దురితములు శ్రీవేంకటేశుడిదె | నెరపడా లోకములనిండ దనకీర్తి ||

pa|| itaDucEsinasEta lennilEvilamIda | yitaDu jagadEkagarvituDaunO kADO ||

ca|| kuDuvaDA prANamulugonucu bUtakicannu | tuDuvaDA kapaTadaityulanosalivrAlu |
aDuvaDA nElatO nalami SakaTAsuruni | vaDuvaDA netturulu vasudha kaMsuni ||

ca|| peTTaDA danujAribirudu lOkamunamdu | kaTTaDA balidaityu karmabaMdhamula |
meTTaDA kALiMgumETiSiramulu, naliya- | goTTaDA dAnavula gOTAnagOTla ||

ca|| maravaDA puTTuvulu maraNamulu brANulaku | parapaDA gaMga danapAdakamalamuna |
cerupaDA duritamulu SrIvEMkaTESuDide | nerapaDA lOkamulaniMDa danakIrti ||

iTTi viMdu gaMTivA - ఇట్టి విందు గంటివా

ఇట్టి విందు గంటివా నీవెక్కదైనా
అట్టె ఆకెపొత్తున నీవారగించవయ్యా ||

కలికి కెమ్మోవితీపు కమ్మని తేనెలవిందు
చలువచూపులు నీకు జిక్కెరవిందు
సెలవి లేనవ్వులే చిలుపాలతోడి విందు
అలమేలుమంగ సేసి నారగించవయ్యా ||

కాంత గోరిచెనకులు కారపు గూరలవిందు
పంతపు మాటలే ఆవపచ్చడి విందు
వింతబొమ్మల జింకెనలే వేడి పడిదాల విందు
అంతసేసీ నీదేవి యారగించవయ్యా ||

అట్టడి సమరతి యాఅడి తరితీపువిందు
గట్టి సిగ్గు పెరుగు మీగడల విందు
గుట్టుతో మన్నించితివి కమ్మను శ్రీవేంకటేశ
అట్టె నీతనివిదీర నారగించవయ్యా ||

iTTi viMdu gaMTivA nIvekkadainA
aTTe Akepottuna nIvAragiMchavayyA ||

kaliki kemmOvitIpu kammani tEnelaviMdu
chaluvachUpulu nIku jikkeraviMdu
selavi lEnavvulE chilupAlatODi viMdu
alamElumaMga sEsi nAragiMchavayyA ||

kAMta gOrichenakulu kArapu gUralaviMdu
paMtapu mATalE AvapachchaDi viMdu
viMtabommala jiMkenalE vEDi paDidAla viMdu
aMtasEsI nIdEvi yAragiMchavayyA ||

RaTTaDi samarati yARaDi taritIpuviMdu
gaTTi siggu perugu mIgaDala viMdu
guTTutO manniMchitivi kammanu SrIvEMkaTESa
aTTe nItanividIra nAragiMchavayyA ||

iTTi BAgyamu gaMTimi - ఇట్టి భాగ్యము గంటిమి

ప|| ఇట్టి భాగ్యము గంటిమి యిద్దరూ బదుకుదురయా | పట్టము గట్టుకొంటివి పచ్చిదేరెనయ్యా ||

చ|| చెలియతోడే నీకు సింహాసనపుగద్దె | అలరుజూపులె రత్నాభిషేకాలు |

చలువైన నవ్వులే ఛత్రచామరములు | కలిగె నీకింక నేమి గావలెనయ్యా ||

చ|| చనుగవలే నీకు సామ్రాజ్య దుర్గములు | నినుపు మోవితేనెలు నిచ్చబోనాలు |

వొనరిన కౌగిలే వుండెడి నీనగరు | యెనయ నచ్చె నీ భాగ్యమీడెర నయ్యా ||

చ|| రతి చెనకులే నీకు రవణపు సొమ్ములు | సతతపుగూటమే సర్వసంపద | యితవై శ్రీవేంకటేశ యీకె యలమేలుమంగ | సతమాయ మమ్ము నేలి జాణవైతివయ్యా ||

pa|| iTTi BAgyamu gaMTimi yiddarU badukudurayA | paTTamu gaTTukoMTivi paccidErenayyA ||

ca|| celiyatODE nIku siMhAsanapugadde | alarujUpule ratnABiShEkAlu |

caluvaina navvulE CatracAmaramulu | kalige nIkiMka nEmi gAvalenayyA ||

ca|| canugavalE nIku sAmrAjya durgamulu | ninupu mOvitEnelu niccabOnAlu |

vonarina kaugilE vuMDeDi nInagaru | yenaya nacce nI BAgyamIDera nayyA ||

ca|| rati cenakulE nIku ravaNapu sommulu | satatapugUTamE sarvasaMpada |

yitavai SrIvEMkaTESa yIke yalamElumaMga | satamAya mammu nEli jANavaitivayyA ||