E ninnudUraka - ఏ నిన్నుదూరక

ఏ నిన్నుదూరక (రాగం: ) (తాళం : )

ప|| ఏ నిన్నుదూరక నెవ్వరి దూరుదు నీ- | వాని నన్నొకయింత వదలక నను నేలవలదా ||

చ|| అపరాధిగనక నన్నరసి కావుమని | అపరిమితపు భయమంది నీకు శరణంటిగాక |
నెపములేక నన్ను నీకు గావగనేల | అపవర్గరూప దయాంబుధి తిరువేంకటాధిపా ||

చ|| ఘనపాపి గనక నీకరుణ గోరి నీ- | వనవరతము నాయాతుమను విహరించుమంటిగాక |
యెనసి నన్ను గాచుటేమి యరుదు నీకు- | ననఘుడ పరమతత్త్వానంద తిరువేంకటాధిప ||

E ninnudUraka (Raagam: ) (Taalam: )

pa|| E ninnudUraka nevvari dUrudu nI- | vAni nannokayiMta vadalaka nanu nElavaladA ||

ca|| aparAdhiganaka nannarasi kAvumani | aparimitapu BayamaMdi nIku SaraNaMTigAka |
nepamulEka nannu nIku gAvaganEla | apavargarUpa dayAMbudhi tiruvEMkaTAdhipA ||

ca|| GanapApi ganaka nIkaruNa gOri nI- | vanavaratamu nAyAtumanu vihariMcumaMTigAka |
yenasi nannu gAcuTEmi yarudu nIku- | nanaGuDa paramatattvAnaMda tiruvEMkaTAdhipa ||


Aedesa mOmu laedu - ఏదెస మోము లేదు

ఏదెస మోము లేదు (రాగం: సాళంగనాట) (తాళం : )

ఏదెస మోము లేదు యెవ్వరికి ననేరు మీ_
వేదాంతశ్రవణము వెట్టికి జేసేరా.

అంతా బ్రహ్మమైతేనాతుమా వొక్కటియైతే
చింతింప గురుడు లేడు శిష్యుడూ లేడు
బంతినే ముక్తుడూ లేడు బద్ధుడూ లేడిట్లయితే
వంతుల సత్కర్మమెల్ల వఱతపాలాయంబో

యిహమెల్లా గల్ల నేరు యేటికి బుట్టినవారు
సహజమే యిదనేరు చావనేటికి
మహి మీకు బోధించిన మహాత్ము శంకరాచార్యు
డహరహ మేమైయున్నా నాతనికేది గతి?

కొందరికి సుఖమిది కొందరికి దుఃఖమది
యిందు జిక్కి బ్రహ్మమున కీఘోరమేలా
అందిన శ్రీవేంకటేశు డంతరాత్ముడొక్కదింతే
మందలించికొలువరు మంటికా మీజ్ఞానము.

Aedesa mOmu (Raagam: Saalamganaata) (Taalam: )

Aedesa mOmu laedu yevvariki nanaeru mee_
Vaedaamtasravanamu vettiki jaesaeraa.

Amtaa brahmamaitaenaatumaa vokkatiyaitae
Chimtimpa gurudu laedu sishyudoo laedu
Bamtinae muktudoo laedu baddhudoo laeditlayitae
Vamtula satkarmamella va~ratapaalaayambo

Yihamellaa galla naeru yaetiki buttinavaaru
Sahajamae yidanaeru chaavanaetiki
Mahi meeku bodhimchina mahaatmu samkaraachaaryu
Daharaha maemaiyunnaa naatanikaedi gati?

Komdariki sukhamidi komdariki du@hkhamadi
Yimdu jikki brahmamuna keeghoramaelaa
Amdina sreevaemkataesu damtaraatmudokkadimtae
Mamdalimchikoluvaru mamtikaa meej~naanamu.

Edaivamu SrIpAdanaKamuna - ఏదైవము శ్రీపాదనఖమున

ఏదైవము శ్రీపాదనఖమున (రాగం: ) (తాళం : )

ప|| ఏదైవము శ్రీపాదనఖమున బుట్టినగంగ | త్రిలోకపావనము చేయును త్రిపథగామిని ఆయను ||
అప|| ఏదైవము నాభినలినంబున జనియించిన అజుండు | అఖిలాండంబులు సృజియింప నధిపతి ఆయను ||

చ|| యేదైవము వురస్థలంబు దనకును మందిరమైన యిందిర- | మాతయయ్యె యీజగంబులకెల్లను ||
యేదైవము అవలోకనమింద్రాది దివిజగణంబుల- | కెల్లపుడును సుఖంబు లాపాదించును ||

చ|| యేదైవము దేహవస్తువని అనిమిషులందరు గూడి | శ్రీనారాయణ దేవుండని నమ్మియుందురు |
ఆదేవుడే సిరులకనంత వరదుడు తిరువేంకట- | గిరినాథుడుభయ విభూతినాథుడే నానాథుడు ||

Edaivamu SrIpAdanaKamuna (Raagam: ) (Taalam: )

pa|| Edaivamu SrIpAdanaKamuna buTTinagaMga | trilOkapAvanamu cEyunu tripathagAmini Ayanu ||
apa|| Edaivamu nABinalinaMbuna janiyiMcina ajuMDu | aKilAMDaMbulu sRujiyiMpa nadhipati Ayanu ||

ca|| yEdaivamu vurasthalaMbu danakunu maMdiramaina yiMdira- | mAtayayye yIjagaMbulakellanu ||
yEdaivamu avalOkanamiMdrAdi divijagaNaMbula- | kellapuDunu suKaMbu lApAdiMcunu ||

ca|| yEdaivamu dEhavastuvani animiShulaMdaru gUDi | SrInArAyaNa dEvuMDani nammiyuMduru |
AdEvuDE sirulakanaMta varaduDu tiruvEMkaTa- | girinAthuDuBaya viBUtinAthuDE nAnAthuDu ||


edaayanaemi hari - ఏదాయనేమి హర

ఏదాయనేమి హర (రాగం: ) (తాళం : )

ప : ఏదాయనేమి హరి ఇచ్చిన జన్మమే చాలు
ఆదినారాయణుడీ అఖిల రక్షకుండు

చ : శునకము బతుకును సుఖమయ్యే తోచుకాని
తనకది హీనమని తలచుకోదు
మనసొడబడితేను మంచిదేమి కానిదేమి
తనువులో అంతరాత్మ దైవమగుట తప్పదు

చ : పుఱువుకుండే నెలవు భువనేశ్వరమైతోచు
పెరచోటి గుంటయైన ప్రియమైయుండు
ఇరవై వుండితే చాలు ఎగువేమి దిగువేమి
వరుస లోకములు సర్వం విష్ణుమయము

చ : అచ్చమైన ఙ్ఞానికి అంతా వైకుంఠమే
చెచ్చర తనతిమ్మటే జీవన్ముక్తి
కచ్చుపెట్టి శ్రీవేంకటపతికీ దాసుడైతే
హెచ్చుకుందేమిలేదు ఏలినవాడితడే

edaayanaemi hari (Raagam: ) (Taalam: )

pa : edaayanaemi hari ichchina janmame chaalu
aadinaaraayaNuDee akhila rakshakuMDu

cha : Sunakamu batukunu sukhamayye tOchukaani
tanakadi heenamani talachukOdu
manasoDabaDitenu maMchidemi kaanidemi
tanuvulO aMtaraatma daivamaguTa tappadu

cha : pu~ruvukuMDe nelavu bhuvaneSvaramaitOchu
perachOTi guMTayaina priyamaiyuMDu
iravai vuMDite chaalu eguvemi diguvemi
varusa lOkamulu sarvaM vishNumayamu

cha : achchamaina ~m~naaniki aMtaa vaikuMThame
chechchara tanatimmaTe jeevanmukti
kachchupeTTi SreeveMkaTapatikee daasuDaite
hechchukuMdemiledu elinavaaDitaDe


EdiyunulEni - ఏదియునులేని

ఏదియునులేని (రాగం: ) (తాళం : )

ప|| ఏదియునులేని దేటిజన్మము | వేదాంతవిద్యావివేకి గావలెను ||

చ|| పరమమూర్తి ధ్యానపరుడు గావలె నొండె | పరమానంద సంపదలొందవలెను |
పరమార్థముగ నాత్మభావింపవలె నొండె | పరమే తానై పరగుండవలెను ||

చ|| వేదశాస్త్రార్థకోవిదుడుగావలె నొండె | వేదాంతవిదుల సేవించవలెను |
కాదనక పుణ్యసత్కర్మి గావలె నొండె | మోదమున హరిభక్తి మొగినుండవలెను ||

చ|| సతతభూతదయావిచారి గావలె నొండె | జితమైనయింద్రియస్థిరుడు గావలెను |
అతిశయంబగు వేంకటాద్రీశు సేవకులై | గతియనుచు తనబుద్ధి గలిగుండవలెను||

EdiyunulEni (Raagam: ) (Taalam: )

pa|| EdiyunulEni dETijanmamu | vEdAMtavidyAvivEki gAvalenu ||

ca|| paramamUrti dhyAnaparuDu gAvale noMDe | paramAnaMda saMpadaloMdavalenu |
paramArthamuga nAtmaBAviMpavale noMDe | paramE tAnai paraguMDavalenu ||

ca|| vEdaSAstrArthakOviduDugAvale noMDe | vEdAMtavidula sEviMcavalenu |
kAdanaka puNyasatkarmi gAvale noMDe | mOdamuna hariBakti moginuMDavalenu ||

ca|| satataBUtadayAvicAri gAvale noMDe | jitamainayiMdriyasthiruDu gAvalenu |
atiSayaMbagu vEMkaTAdrISu sEvakulai | gatiyanucu tanabuddhi galiguMDavalenu||


Edi tuda dinikedi - ఏది తుద దీనికేది

Edi tuda dinikedi - ఏది తుద దీనికేది | Annamayya Lyrics | Sankeertanalu | Songs | Telugu & English

Listen Audio by G Balakrishna Prasad:

ఏది తుద (రాగం: ) (తాళం : )

ప|| ఏది తుద దీనికేది మొదలు | పాదుకొను హరిమాయ బరగు జీవునికి ||

చ|| ఎన్నిబాధలు దనకు నెన్ని లంపటములు | యెన్నివేదనలు మరియెన్ని దుఃఖములు |
యెన్నిపరితాపంబు లెన్నిదలపోతలు | యెన్ని చూచిన మరియు నెన్నైనగలవు ||

చ|| యెన్నికొలువులు దనకు నెన్నియనుచరణలు | యెన్నియాసలు మరియు నెన్ని మోహములు |
యెన్నిగర్వములు దనకెన్ని దైన్యంబులివి | యిన్నియును దలప మరి యెన్నైన గలవు ||

చ|| యెన్నిటికి జింతించు నెన్నటికి హర్షించు | నెన్నిటికి నాసించు నెన్నిటికి దిరుగు |
యిన్నియును దిరువేంకటేశులీలలు గాగ | నెన్ని చూచినను దానెవ్వడును గాడు ||

Edi tuda (Raagam: ) (Taalam: )

pa|| Edi tuda dInikEdi modalu | pAdukonu harimAya baragu jIvuniki ||

ca|| ennibAdhalu danaku nenni laMpaTamulu | yennivEdanalu mariyenni duHKamulu |
yenniparitApaMbu lennidalapOtalu | yenni cUcina mariyu nennainagalavu ||

ca|| yennikoluvulu danaku nenniyanucaraNalu | yenniyAsalu mariyu nenni mOhamulu |
yennigarvamulu danakenni dainyaMbulivi | yinniyunu dalapa mari yennaina galavu ||

ca|| yenniTiki jiMtiMcu nennaTiki harShiMcu | nenniTiki nAsiMcu nenniTiki dirugu |
yinniyunu diruvEMkaTESulIlalu gAga | nenni cUcinanu dAnevvaDunu gADu ||

Edi kaDa dInikEdi - ఏది కడ దీనికేది

ఏది కడ (రాగం: ) (తాళం : )

ప|| ఏది కడ దీనికేది మొదలు వట్టి- | వేదనలు తన్ను విడుచు టెన్నడు ||

చ|| తొడరినహృదయమే తోడిదొంగయై | వడిగొని తన్ను వలబెట్టగాను |
కడగి కర్మముల గడచు టెన్నడు | నిడివిబంధముల నీగు టెన్నడు ||

చ|| తతిగొన్న తలపులే దైవయోగమై | మతినుండి తన్ను మరగించగాను |
ప్రతిలేనియాపద బాయు టెన్నడు | ధృతిమాలినయాస దీరు టెన్నడు ||

చ|| పొదలినమమతయే భూతమై తన్ను | బొదిగొని బుద్ధి బోధించగాను |
కదిసి వేంకటపతి గనుట యెన్నడు | తుదిలేనిభవముల దొలగు టెన్నడు ||

Edi kaDa (Raagam: ) (Taalam: )

pa|| Edi kaDa dInikEdi modalu vaTTi- | vEdanalu tannu viDucu TennaDu ||

ca|| toDarinahRudayamE tODidoMgayai | vaDigoni tannu valabeTTagAnu |
kaDagi karmamula gaDacu TennaDu | niDivibaMdhamula nIgu TennaDu ||

ca|| tatigonna talapulE daivayOgamai | matinuMDi tannu maragiMcagAnu |
pratilEniyApada bAyu TennaDu | dhRutimAlinayAsa dIru TennaDu ||

ca|| podalinamamatayE BUtamai tannu | bodigoni buddhi bOdhiMcagAnu |
kadisi vEMkaTapati ganuTa yennaDu | tudilEniBavamula dolagu TennaDu ||