eda valapeda - ఏడ వలపేడ

eda valapeda - ఏడ వలపేడ | Annamayya Lyrics | Sankeertanalu | Songs | Telugu & English

Listen Audio by G BALAKRISHNA PRASAD:

ఏడ వలపేడ (రాగం: ) (తాళం : )

ప|| ఏడ వలపేడ మచ్చిక ఏడ సుద్దులు | ఆడుకొన్నమాటలెల్లా నవి నిజాలా ||

చ|| తొలుకారుమెరుపులు తోచి పోవుగాక | నెలకొని మింట నవి నిలిచీనా |
పొలతులవలపులు పొలసిపోవుగాక | కలకాలం బవి కడతేరీనా |

చ|| యెండమావులు చూడ నేరులై పారుగాక | అండకుబోవ దాహ మణగీనా |
నిండినట్టిమోహము నెలతలమది జూడ | వుండినట్టేవుండుగాక పూతయ్యీనా ||

చ|| కలలోనిసిరులెల్ల కనుకూర్కులేకాక | మెలకువ జూడ నవి మెరసీనా |
అలివేణులమేలు ఆశపాటేకాక | తలపు వేంకటపతి దగిలీనా ||

EDa valapEDa (Raagam: ) (Taalam: )

pa|| EDa valapEDa maccikEDa suddulu | ADukonnamATalella navi nijAlA ||

ca|| tolukArumerupulu tOci pOvugAka | nelakoni miMTa navi nilicInA |
polatulavalapulu polasipOvugAka | kalakAlaM bavi kaDatErInA |

ca|| yeMDamAvulu cUDa nErulai pArugAka | aMDakubOva dAha maNagInA |
niMDinaTTimOhamu nelatalamadi jUDa | vuMDinaTTEvuMDugAka pUtayyInA ||

ca|| kalalOnisirulella kanukUrkulEkAka | melakuva jUDa navi merasInA |
alivENulamElu AsapATEkAka | talapu vEMkaTapati dagilInA ||

EDa suj~jAnamEDa - ఏడ సుజ్ఞానమేడ

ఏడ సుజ్ఞానమేడ (రాగం: ) (తాళం : )

ప|| ఏడ సుజ్ఞానమేడ తెలివి నాకు | బూడిదలో హోమమై పోయ గాలము ||

చ|| ఇదె మేలయ్యెడి నాకదె మేలయ్యెడి నని | కదిసియాసచే గడవలేక |
యెదురు చూచిచూచి యెలయించి యెలయించి | పొదచాటు మృగమై పోయ గాలము ||

చ|| ఇంతట దీరెడి దుఃఖమంతట దీరెడినని | వింతవింత వగలచే వేగివేగి |
చింతయు వేదనల జిక్కువడుచు నగ్ని- | పొంతనున్న వెన్నయై పోయ గాలము ||

చ|| యిక్కడ సుఖము నాకక్కడ సుఖంబని | యెక్కడికైనా నూరి కేగియేగి |
గక్కన శ్రీతిరువేంకటపతి గానక | పుక్కిటిపురాణమయి పోయ గాలము ||

EDa suj~jAnamEDa (Raagam: ) (Taalam: )

pa|| EDa suj~jAnamEDa telivi nAku | bUDidalO hOmamai pOya gAlamu ||

ca|| ide mElayyeDi nAkade mElayyeDi nani | kadisiyAsacE gaDavalEka |
yeduru cUcicUci yelayiMci yelayiMci | podacATu mRugamai pOya gAlamu ||

ca|| iMtaTa dIreDi duHKamaMtaTa dIreDinani | viMtaviMta vagalacE vEgivEgi |
ciMtayu vEdanala jikkuvaDucu nagni- | poMtanunna vennayai pOya gAlamu ||

ca|| yikkaDa suKamu nAkakkaDa suKaMbani | yekkaDikainA nUri kEgiyEgi |
gakkana SrItiruvEMkaTapati gAnaka | pukkiTipurANamayi pOya gAlamu ||


E purANamula neMta - ఏ పురాణముల నెంత

ఏ పురాణముల (రాగం: ) (తాళం : )

ప|| ఏ పురాణముల నెంత వెదికినా | శ్రీపతి దాసులు చెడరెన్నడును ||

చ|| హరి విరహితములు అవిగొన్నాళ్ళకు | విరసంబులు మరి విఫలములు |
నరహరి గొలిచిటు నమ్మిన వరములు | నిరతము లెన్నడు నెలవులు చెడవు ||

చ|| కమలాక్షుని మతిగానని చదువులు | కుమతంబులు బహు కుపథములు |
జమళి నచ్యుతుని సమారాధనలు | విమలములేకాని వితథముగావు ||

చ|| శ్రీవల్లభుగతి జేరనిపదవులు | దావతులు కపట ధర్మములు |
శ్రీవేంకటపతి సేవించు సేవలు | పావనము లధిక భాగ్యపు సిరులు ||

E purANamula (Raagam: ) (Taalam: )

pa|| E purANamula neMta vedikinA | SrIpati dAsulu ceDarennaDunu ||

ca|| hari virahitamulu avigonnALLaku | virasaMbulu mari viPalamulu |
narahari goliciTu nammina varamulu | niratamu lennaDu nelavulu ceDavu ||

ca|| kamalAkShuni matigAnani caduvulu | kumataMbulu bahu kupathamulu |
jamaLi nacyutuni samArAdhanalu | vimalamulEkAni vitathamugAvu ||

ca|| SrIvallaBugati jEranipadavulu | dAvatulu kapaTa dharmamulu |
SrIvEMkaTapati sEviMcu sEvalu | pAvanamu ladhika BAgyapu sirulu ||

Sung by:Balakrishna Prasad

Get this widget | Track details | eSnips Social DNA


ENanayanalachUpu - ఏణనయనలచూపు

ఏణనయనలచూపు (రాగం: నారణి ) (తాళం : )

ఏణనయనలచూపు లెంత సొబగైయుండు
ప్రాణసంకటములగుపనులు నట్లుండు ||

ఎడలేనిపరితాప మేరీతి దా నుండు
అడియాసకోరికెలు నటువలెనె యుండు
కడలేనిదు:ఖసంగతి యెట్ల దానుండు
అడరుసంసారంబు నట్లనే వుండు ||

చింతాపరంపరల జిత్తమది యెట్లుండు
వంత దొలగనిమొహవశము నట్లుండు
మంతనపుబనులపయి మనసు మరి యెట్లుండు
కంతుశరమార్గములగతి యట్ల నుండు ||

దేవుడొక్క డెయనెడి తెలివి దన కెట్లుండు
శ్రీవేంకటేశుక్రుపచేత లట్లుండు
భావగోచరమైనపరిణ తది యెట్లుండు
కైవల్యసొఊఖ్యసంగతులు నట్లుండు ||

ENanayanalachUpu (Raagam:nAraNi ) (Taalam: )

ENanayanalachUpu leMta sobagaiyuMDu
prANasaMkaTamulagupanulu naTluMDu ||

eDalEniparitApa mErIti dA nuMDu
aDiyAsakOrikelu naTuvalene yuMDu
kaDalEnidu:khasaMgati yeTla dAnuMDu
aDarusaMsAraMbu naTlanE vuMDu ||

chiMtAparaMparala jittamadi yeTluMDu
vaMta dolaganimohavaSamu naTluMDu
maMtanapubanulapayi manasu mari yeTluMDu
kaMtuSaramArgamulagati yaTla nuMDu ||

dEvuDokka DeyaneDi telivi dana keTluMDu
SrIvEMkaTESukrupachEta laTluMDu
bhAvagOcharamainapariNa tadi yeTluMDu
kaivalyasoUkhyasaMgatulu naTluMDu ||

Ele Yele Maradala - ఏలే యేలే మరదలా

Ele Yele Maradala - ఏలే యేలే మరదలా | Annamayya Lyrics | Sankeertanalu | Songs | Telugu & English

Listen Audio by G Balakrishna Prasad & SP Sailaja:

ఏలే యేలే మరదలా (రాగం: ) (తాళం : )

ఏలే యేలే మరదలా చాలుజాలు చాలును చాలు నీతోడి సరసంబు బావ

గాటపు గుబ్బలు గదలగ గులికేవు మాటల దేటల మరదలా
చీటికి మాటికి జెనకేవే వట్టి బూటకాలు మానిపోవే బావ

అందిందె నన్ను నదలించి వేసేవు మందమేలపు మరదలా
సందుకో దిరిగేవి సటకారివో బావ పొందుగాదిక బోవే బావ

చొక్కపు గిలిగింతల చూపుల నన్ను మక్కువ సేసిన మరదలా
గక్కున నను వేంకటపతి కూడితి దక్కించుకొంటివి తగులైతి బావ

ElE yElE maradalA (Raagam: ) (Taalam: )

pa|| ElE yElE maradalA cAlujAlu cAlunu |
cAlu nItODi sarasaMbu bAva ||

ca|| gATapu gubbalu gadalaga gulikEvu |
mATala dETala maradalA |
cITiki mATiki jenakEvE vaTTi |
bUTakAlu mAnipOvE bAva ||

ca|| aMdiMde nannu nadaliMci vEsEvu |
maMdamElapu maradalA |
saMdukO dirigEvi saTakArivO bAva |
poMdugAdika bOvE bAva ||

ca|| cokkapu giligiMtala cUpula nannu |
makkuva sEsina maradalA |
gakkuna nanu vEMkaTapati kUDiti |
dakkiMcukoMTivi tagulaiti bAva ||

ElOkamaMdunnA - ఏలోకమందున్నా

ఏలోకమందున్నా (రాగం: ) (తాళం : )

ప|| ఏలోకమందున్నా నేమీ లేదు | తాలిమి నందుకుదగ్గదావతేకాని ||

చ|| సురల కసురలకు సూడునుబాడునే కాని | పొరసి సుఖించగ బొద్దు లేదు |
ధరలో ఋషులకును తపము సేయనేకాని | మరిగి భోగించగ మరి పొద్దు లేదు ||

చ|| గక్కన సిద్దులకైనా గంతయు బొంతయేకాని | చిక్కిపరుసము గలిగి నెలవులేదు |
రెక్కలు గలపక్షికి రేసుతిమ్మటలేకాని | చక్క వైకుంఠాన కెగయ సత్తువ లేదు ||

చ|| సకల జంతువులకు జన్మాదులేకాని | అకటా నిత్యానంద మందలేదు |
వెకలి శ్రీవేంకటేశు విష్ణుదాసులకే మంచి- | సుకములెల్లా గలవు సుడివడలేదు ||

ElOkamaMdunnA (Raagam: ) (Taalam: )

pa|| ElOkamaMdunnA nEmI lEdu | tAlimi naMdukudaggadAvatEkAni ||

ca|| surala kasuralaku sUDunubADunE kAni | porasi suKiMcaga boddu lEdu |
dharalO RuShulakunu tapamu sEyanEkAni | marigi BOgiMcaga mari poddu lEdu ||

ca|| gakkana siddulakainA gaMtayu boMtayEkAni | cikkiparusamu galigi nelavulEdu |
rekkalu galapakShiki rEsutimmaTalEkAni | cakka vaikuMThAna kegaya sattuva lEdu ||

ca|| sakala jaMtuvulaku janmAdulEkAni | akaTA nityAnaMda maMdalEdu |
vekali SrIvEMkaTESu viShNudAsulakE maMci- | sukamulellA galavu suDivaDalEdu ||

Aelokamuna laedu - ఏలోకమున లేడు

ఏలోకమున లేడు (రాగం: దేసాక్షి ) (తాళం : )

ఏలోకమున లేడు యింతటిదైవము మరి
జోలి దవ్వి తవ్వి యెంత సోదించినాను

మంచిరూపున నెంచితే మరునిగన్నతండ్రి
ఇంచుకంత సరిలేదు ఇతనికిని
మించుసంపదల నైతే మేటిలక్ష్మీకాంతుడు
పొంది యీతనికి నీడు పురుడించగలరా

తగ బ్రతాపమునను దానవాంతకు డితడు
తగుల నీతనిమారుదైవాలు లేరు
పొగరుమగతనాన బురుషోత్తము డితడు
వెగటై యీతనిపాటి వెదకిన లేరు

పట్టి మొదలెంచితేను బ్రహ్మగన్నతండ్రితడు
ఘట్టున నింతటివారు మరి వేరి
ఇట్టె శ్రీవేంకటేశుడీగికి వరదుడు
కొట్టగొన నితరుల గురిసేయగలరా


Aelokamuna laedu (Raagam:Daesaakshi ) (Taalam: )

Aelokamuna laedu yimtatidaivamu mari
Joli davvi tavvi yemta sodimchinaanu

Mamchiroopuna nemchitae marunigannatamdri
Imchukamta sarilaedu itanikini
Mimchusampadala naitae maetilakshmeekaamtudu
Pomdi yeetaniki needu purudimchagalaraa

Taga brataapamunanu daanavaamtaku ditadu
Tagula neetanimaarudaivaalu laeru
Pogarumagatanaana burushottamu ditadu
Vegatai yeetanipaati vedakina laeru

Patti modalemchitaenu brahmagannatamdritadu
Ghattuna nimtativaaru mari vaeri
Itte sreevaemkataesudeegiki varadudu
Kottagona nitarula gurisaeyagalaraa