O Pavanatmaja - ఓ పవనాత్మజ

O Pavanatmaja - ఓ పవనాత్మజ | Annamayya Lyrics | Sankeertanalu | Songs | Telugu & English

Listen Audio by G Balakrishna Prasad:

ఓ పవనాత్మజ (రాగం: ) (తాళం : )

ప||
ఓ పవనాత్మజ ఓ ఘనుడా
బాపు బాపనగా పరిగితిగా
చ1||
ఓ హనుమంతుడ ఉదయాచల ని-
ర్వాహక నిజ సర్వ ప్రబలా
దేహము మోచిన తెగువకు నిటువలె
సాహస మిటువలె చాటితిగా ||
చ2||
ఓ రవి గ్రహణ ఓదనుజాంతక
మారులేక మతి మలసితిగా
దారుణపు వినతా తనయాదులు
గారవింప నిటు కలిగితిగా||
చ3||
ఓ దశముఖ హర ఓ వేంకటపతి-
పాదసరోరుహ పాలకుడా
ఈ దేహముతో ఇన్నిలోకములు
నీదేహమెక్క నిలిచితిగా ||

O pavanAtmaja (Raagam: ) (Taalam: )

pa||
O pavanAtmaja O ghanuDA
bApu bApanagA parigitigA

ca1||
O hanumaMtuDa udayAchala ni-
rwAhaka nija sarwa prabalA
dEhamu mOcina teguvaku niTuvale
sAhasa miTuvale chATitigA ||

ca2||
O ravi grahaNa OdanujAMtaka
mArulEka mati malasitigA
dAruNapu vinatA tanayAdulu
gAraviMpa niTu kaligitigA||

ca3||
O daSamukha hara O vEMkaTapati-
pAdasarOruha pAlakuDA
I dEhamutO innilOkamulu
nIdEhamekka nilichitigA ||

osagitivinniyu - ఒసగితివిన్నియు

ఒసగితివిన్నియు (రాగం: ) (తాళం : )

ప|| ఒసగితివిన్నియు ఒకమాటే | వెసనిక జేసే విన్నపమేది ||

చ|| నారాయణ నీ నామమె తలచిన | నీరాని వరము లిచ్చితివి |
చేరి నిన్నిట సేవించిన నిక | కోరి పడయనిక కోరికలేవి ||

చ|| హరి నీ కొకమరి యటు శరణంటే | గరిమల నన్నిటు గాచితివి |
నిరతముగా నిక నుతియింపుచు | అర గొరతని నిను అడిగేదో ||

చ|| శ్రీ వేంకటేశ్వర చేయెత్తి మ్రొక్కిన | భావమె నీవై పరగితివి |
ఈ వరుసల నీవింతటి దాతవు | ఆవాలనిను కొనియాడేడి దేమి ||

osagitivinniyu (Raagam: ) (Taalam: )

pa|| osagitivinniyu okamATE | vesanika jEsE vinnapamEdi ||

ca|| nArAyaNa nI nAmame talacina | nIrAni varamu liccitivi |
cEri ninniTa sEviMcina nika | kOri paDayanika kOrikalEvi ||

ca|| hari nI kokamari yaTu SaraNaMTE | garimala nanniTu gAcitivi |
niratamugA nika nutiyiMpucu | ara goratani ninu aDigEdO ||

ca|| SrI vEMkaTESvara cEyetti mrokkina | BAvame nIvai paragitivi |
I varusala nIviMtaTi dAtavu | Avaalaninu koniyADEDi dEmi ||


orasi cUDabOtE - ఒరసి చూడబోతే

ఒరసి చూడబోతే (రాగం: ) (తాళం : )

ప|| ఒరసి చూడబోతే నొకటీ నిజము లేదు | పొరల మేను ధరించి పొరలగ బట్టెను ||

చ|| పాతకములటకొన్ని బలు పుణ్యాలట కొన్ని | యీతల స్వర్గనరకాలిచ్చేనట |
యేతుల నందుగొన్నాళ్ళు యిందు గొన్నాళ్ళు దేహికి | పోతరించి కాతరించి పొరలనే పట్టెను ||

చ|| పొలతులట కోందరు పురుషులట కొందరు | వెలుగును జీకట్లు విహారమట |
కలవరింతలుగొంత ఘన సంసారము గొంత | పొలసి జీవులు రెంటా బొరలగ బట్టెను ||

చ|| ఒక్కవంక జ్ఞానమట వొక్కవంక గర్మమట | మొక్కి యిహపరాలకు మూలమిదట |
తక్కక శ్రీ వేంకటేశు దాసులై గెలిచిరట | పుక్కిట నిన్నాళ్ళు రెంటా బొరలగ బట్టెను ||

orasi cUDabOtE (Raagam: ) (Taalam: )



pa|| orasi cUDabOtE nokaTI nijamu lEdu | porala mEnu dhariMci poralaga baTTenu ||

ca|| pAtakamulaTakonni balu puNyAlaTa konni | yItala svarganarakAliccEnaTa |
yEtula naMdugonnALLu yiMdu gonnALLu dEhiki | pOtariMci kAtariMci poralanE paTTenu ||

ca|| polatulaTa kOMdaru puruShulaTa koMdaru | velugunu jIkaTlu vihAramaTa |
kalavariMtalugoMta Gana saMsAramu goMta | polasi jIvulu reMTA boralaga baTTenu ||

ca|| okkavaMka j~jAnamaTa vokkavaMka garmamaTa | mokki yihaparAlaku mUlamidaTa |
takkaka SrI vEMkaTESu dAsulai geliciraTa | pukkiTa ninnALLu reMTA boralaga baTTenu ||


oppulai noppulai - ఒప్పులై నొప్పులై

ఒప్పులై నొప్పులై (రాగం: ) (తాళం : )

ప|| ఒప్పులై నొప్పులై వుండుగాన | అప్పటికి జూడ నదియేకా నిజము ||

చ|| కన్నుల కిన్నియు జూడ కలలై వలలై | వున్నతాలు నడ్డాలై వుండుగాన |
చిన్నచిన్న చిటిపొటి చిమ్ముదొమ్ముదిమ్ములవి | వున్నవన్నియు జూడ నొకటేకా నిజము ||

చ|| సారెకు నోరికి జూడ చవులై నవ్వులై | వూరటమాటలై వుండుగాన |
తారుమారు తాకుసోకు తప్పుదోపులన్నియు | వోరపారులేనివెల్ల నొక్కటేకా నిజము ||

చ|| మేనికి నిన్నియు జూడ మృదువై పొదువై | పూని సంపదలై వుండుగాన |
తేనై తీపై తిరువేంకటేశ నిన్ను | కానవచినదే నొక్కటేకా నిజము ||

oppulai noppulai (Raagam: ) (Taalam: )

pa|| oppulai noppulai vuMDugAna | appaTiki jUDa nadiyEkA nijamu ||

ca|| kannula kinniyu jUDa kalalai valalai | vunnatAlu naDDAlai vuMDugAna |
cinnacinna ciTipoTi cimmudommudimmulavi | vunnavanniyu jUDa nokaTEkA nijamu ||

ca|| sAreku nOriki jUDa cavulai navvulai | vUraTamATalai vuMDugAna |
tArumAru tAkusOku tappudOpulanniyu | vOrapArulEnivella nokkaTEkA nijamu ||

ca|| mEniki ninniyu jUDa mRuduvai poduvai | pUni saMpadalai vuMDugAna |
tEnai tIpai tiruvEMkaTESa ninnu | kAnavacinadE nokkaTEkA nijamu ||


Olladugaaka daehi - ఒల్లడుగాక దేహ

ఒల్లడుగాక దేహ (రాగం:లలిత ) (తాళం : )

ఒల్లడుగాక దేహి వుద్యోగించడుగాక
కొల్లలైనమేలు తనగుణములో నున్నది

తలచుకొంటేజాలు దైవమేమి దవ్వా
నిలుచుక తనలోనే నిండుకున్నాడు
చలపట్టితేజాలు సర్గ మేమి బాతా
చలివేడినాలికపై సత్యములో నున్నాడు

ఆయమెఱిగితే జాలు నాయుష్యము గరవా
కాయపుటూపిరిలోనే గని వున్నది
చేయబోతే పుణ్యుడుగా జీవునికి దడవా
చేయుర గర్మము తనచేతిలోనే వున్నది

మొక్క నేరిచితే జాలు మోక్షమేమి లేదో
యెక్కువశ్రీవేంకటేశుడిదె వున్నాడు
దక్కగొంటేజాలు పెద్దతనమేమి యరుదా
తక్కక శాంతముతోడిదయ లోన నున్నది

Olladugaaka daehi (Raagam: Lalita) (Taalam: )

Olladugaaka daehi vudyogimchadugaaka
Kollalainamaelu tanagunamulo nunnadi

Talachukomtaejaalu daivamaemi davvaa
Niluchuka tanalonae nimdukunnaadu
Chalapattitaejaalu sarga maemi baataa
Chalivaedinaalikapai satyamulo nunnaadu

Aayame~rigitae jaalu naayushyamu garavaa
Kaayaputoopirilonae gani vunnadi
Chaeyabotae punyudugaa jeevuniki dadavaa
Chaeyura garmamu tanachaetilonae vunnadi

Mokka naerichitae jaalu mokshamaemi laedo
Yekkuvasreevaemkataesudide vunnaadu
Dakkagomtaejaalu peddatanamaemi yarudaa
Takkaka saamtamutodidaya lona nunnadi


okkaDE aMtaryAmi - ఒక్కడే అంతర్యామి

ఒక్కడే అంతర్యామి (రాగం: ) (తాళం : )

ప|| ఒక్కడే అంతర్యామి వుపకారి చేపట్టు | తక్కినవి యిన్నియును తలపు రేచెడిని ||

చ|| యెఱుగుమీ జీవుడా యింద్రియాలు సొమ్ము గావు | గుఱియై మాయలలోన గూడించే వింతె |
మఱవకు జీవుడా మనసు చుట్టము గాదు | తెఱగొప్ప ఆసలనే తిప్పెడి దింతె ||

చ|| తెలుసుకో జీవుడా దేహమును నమ్మరాదు | వలసితే నుండు బోవు వన్నెవంటిది |
తలచుకో జీవుడా ధనము దనిచ్చ గాదు | పలులంపటములచే బరచెడి దింతె ||

చ|| సమ్మతించు జీవుడా సంసార మొకజాడ గాదు | బిమ్మటి పొద్దొకజాడ పెనచు నింతె |
యిమ్ముల శ్రీవేంకటేశు డితనిమూలమే యింత | నెమ్మి దానే గతియంటే నిత్యమౌ నింతే ||

okkaDE aMtaryAmi (Raagam: ) (Taalam: )


pa|| okkaDE aMtaryAmi vupakAri cEpaTTu | takkinavi yinniyunu talapu rEceDini ||

ca|| yerxugumI jIvuDA yiMdriyAlu sommu gAvu | gurxiyai mAyalalOna gUDiMcE viMte |
marxavaku jIvuDA manasu cuTTamu gAdu | terxagoppa AsalanE tippeDi diMte ||

ca|| telusukO jIvuDA dEhamunu nammarAdu | valasitE nuMDu bOvu vannevaMTidi |
talacukO jIvuDA dhanamu danicca gAdu | palulaMpaTamulacE baraceDi diMte ||

ca|| sammatiMcu jIvuDA saMsAra mokajADa gAdu | bimmaTi poddokajADa penacu niMte |
yimmula SrIvEMkaTESu DitanimUlamE yiMta | nemmi dAnE gatiyaMTE nityamau niMtE ||


okaTi bOlicina - ఒకటి బోలిచిన

ఒకటి బోలిచిన (రాగం: ) (తాళం : )

ప|| ఒకటి బోలిచిన వేరొకటి తోచీని | సకలము బోలిచేము సుదతి సింగారాలు ||

చ|| కలువలు జకోరాలు గండుమీలు దామరలు | చలిముతైపు జిప్పలు సతికన్నులు |
అలలు నీలమణులంధకారము మేఘము | నలుపు రాశివో నలినాక్షి తురుము ||

చ|| జక్కవలు నిమ్మపండ్లు సరి బూగుత్తులు గొండ | లెక్కువ మరిమిద్దెలు యింతి చన్నులు |
చుక్కలు సురవొన్నలు సూది వజ్రాల గోళ్ళు | అక్కర యేనుగ తోండాలరంట్లే తొడలు ||

చ|| సోగ తీగెలు తూండ్లు సుదతి బాహువులిదె | చేగ చిగురు లత్తిక చెలి పాదాలు |
యీగతి శ్రీవేంకటేశ యింతి నీవురము మీద | బాగుగ నమరి పైడి పతిమ బోలినవి ||

okaTi bOlicina (Raagam: ) (Taalam: )



pa|| okaTi bOlicina vErokaTi tOcIni | sakalamu bOlicEmu sudati siMgArAlu ||

ca|| kaluvalu jakOrAlu gaMDumIlu dAmaralu | calimutaipu jippalu satikannulu |
alalu nIlamaNulaMdhakAramu mEGamu | nalupu rASivO nalinAkShi turumu ||

ca|| jakkavalu nimmapaMDlu sari bUguttulu goMDa | lekkuva marimiddelu yiMti cannulu |
cukkalu suravonnalu sUdi vajrAla gOLLu | akkara yEnuga tOMDAlaraMTlE toDalu ||

ca|| sOga tIgelu tUMDlu sudati bAhuvulide | cEga ciguru lattika celi pAdAlu |
yIgati SrIvEMkaTESa yiMti nIvuramu mIda | bAguga namari paiDi patima bOlinavi ||