kannavArevvaru - కన్నవారెవ్వరు

కన్నవారెవ్వరు (రాగం: ) (తాళం : )

కన్నవారెవ్వరు నేడు కాంతజవ్వనమిది
పన్నిన విభుడ నీభాగ్గ్యమాయగాక ||

పట్టబసయేది పడతి నడుము నేడు
బట్టబయలవు అందుభావనే కాదా
అట్టెట్టెనగనేది అంగన తురుము నేడు
పుట్టు మేఘమిట మింపోడవేగాదా ||

యెంచగ జోటేది యింతికనుచూపులివి
కంచుమిచ్చులట చెప్పకధలేకాదా
పొంచి దాచ జోటేది పొలతి కుచములివి
పెంచెపుజక్కవలట బెదరేవే కావా ||

తలపోత యేది కాంతకు శ్రీ వేంకటపతి
వలపట మతిపరవశమే కాదా
తలగ నోటేది తడబడే రతులలో
పలుకు బంతములెల్ల పదరుటే కాదా ||

kannavArevvaru (Raagam: ) (Taalam: )

kannavArevvaru nEDu kAMtajavvanamidi
pannina vibhuDa nIbhAggyamAyagAka ||

paTTabasayEdi paDati naDumu nEDu
baTTabayalavu aMdubhAvanE kAdA
aTTeTTenaganEdi aMgana turumu nEDu
puTTu mEghamiTa miMpODavEgAdA ||

yeMchaga jOTEdi yiMtikanuchUpulivi
kaMchumichchulaTa cheppakadhalEkAdA
poMchi dAcha jOTEdi polati kuchamulivi
peMchepujakkavalaTa bedarEvE kAvA ||

talapOta yEdi kAMtaku SrI vEMkaTapati
valapaTa matiparavaSamE kAdA
talaga nOTEdi taDabaDE ratulalO
paluku baMtamulella padaruTE kAdA ||


Kannulapamdugalaaya - కన్నులపండుగలాయ

కన్నులపండుగలాయ (రాగం: సాళంగనాట) (తాళం : )

కన్నులపండుగలాయ గడపరాయనితేరు
మిన్ను నేల శృంగారము మితిమీరినట్లు

కదలె గదలె నదె గరుడధ్వజునితేరు
పొదిగి దేవదుందుభులు మ్రోయగా
పదివేలు సూర్యబింబము లుదయించినట్లు
పొదలి మెరువు వచ్చి పొడచూపినట్లు

వచ్చె వచ్చె నంతనింత వాసుదేవునితేరు
అచ్చుగ దేవకామిను లాడిపాడగా
ముచ్చటతో గరుడడు ముందట నిలిచినట్టు
మెచ్చుల మెరుగులతో మేఘము వాలినట్టు

తిరిగె దిరిగె నదె దేవదేవోత్తముతేరు
సరుస దేవతలెల్ల జయవెట్టగా
విరివి గడపలో శ్రీ వేంకటేశుడు తేరుపై
నిరవాయ సింహాసన మిదేయన్నట్లు

Kannulapamdugalaaya (Raagam:Saalamganaata ) (Taalam: )

Kannulapamdugalaaya gadaparaayanitaeru
Minnu naela srmgaaramu mitimeerinatlu

Kadale gadale nade garudadhvajunitaeru
Podigi daevadumdubhulu mroyagaa
Padivaelu sooryabimbamu ludayimchinatlu
Podali meruvu vachchi podachoopinatlu

Vachche vachche namtanimta vaasudaevunitaeru
Achchuga daevakaaminu laadipaadagaa
Muchchatato garudadu mumdata nilichinattu
Mechchula merugulato maeghamu vaalinattu

Tirige dirige nade daevadaevottamutaeru
Sarusa daevatalella jayavettagaa
Virivi gadapalo Sree vaemkataesudu taerupai
Niravaaya simhaasana midaeyannatlu


aunayya jANaDuvu - ఔనయ్య జాణడువు

ఔనయ్య జాణడువు (రాగం: ) (తాళం : )

ప|| ఔనయ్య జాణడువు ప్రహ్లాద వరద | ఆసలు వెట్టకుము ప్రహ్లాదవరద ||

చ|| వేసరక శ్రీసతితో వేడుక నవ్వులు నవ్వి | ఆసలు చూపేవు ప్రహ్లాద వరద |
సేస వెట్టిన చేతుల చెరగు వట్టి తిసేవు | ఆ సుద్దులె చెప్పేను ప్రహ్లాద వరద ||

చ|| నంటున తొడమీదను నలినాక్షి నెక్కించుక | అంటేవు సిగ్గులు ప్రహ్లాదవరద |
గెంటుక ఏ పొద్దును కేలుకేలు కీలించుక | అంటువాయ వదివో ప్రహ్లాద వరద ||

చ|| కందువతో కాగిలించి కైవసము సేసుకొంటి- | వందముగ నీకెను ప్రహ్లాద వరద |
పొంది శ్రీవేంకటమున పొంచి ఔభళములోన | అంది వరాలిచ్చేవు ప్రహ్లాద వరద ||

aunayya jANaDuvu (Raagam: ) (Taalam: )

pa|| aunayya jANaDuvu prahlAda varada | Asalu veTTakumu prahlAdavarada ||

ca|| vEsaraka SrIsatitO vEDuka navvulu navvi | Asalu cUpEvu prahlAda varada |
sEsa veTTina cEtula ceragu vaTTi tisEvu | A suddule ceppEnu prahlAda varada ||

ca|| naMTuna toDamIdanu nalinAkShi nekkiMcuka | aMTEvu siggulu prahlAdavarada |
geMTuka E poddunu kElukElu kIliMcuka | aMTuvAya vadivO prahlAda varada ||

ca|| kaMduvatO kAgiliMci kaivasamu sEsukoMTi- | vaMdamuga nIkenu prahlAda varada |
poMdi SrIvEMkaTamuna poMci auBaLamulOna | aMdi varAliccEvu prahlAda varada ||

Sung by:Balakrishna Prasad

Sung by:Srividya

Get this widget | Track details | eSnips Social DNA

OyammA iMtayEla - ఓయమ్మా ఇంతయేల

ఓయమ్మా ఇంతయేల (రాగం: ) (తాళం : )

ఓయమ్మా ఇంతయేల వొద్దనరే
నాయముగాదిందరిలో నగుబాటు తనకును

చెక్కునొక్కితిని సెలవి నవ్వితిని
మక్కువతో నెంతైనా మాటాడడు
మొక్కూ మొక్కితిని మోనాన నుండితిని
యెక్కుడు దిట్టితినంటా నెగ్గువట్టీ నితడు

ఇచ్చకము జేసితి ఇచ్చితి విడెమును
కచ్చుపెట్టి యెంతైనా కరగడు
ముచ్చటలాడితిని మోవిజూచితి తన్ను
బచ్చిగా జేసితినంటా పగచాటీ నితడు

కన్నులా జొక్కితిని కాగిటా నించితిని
మన్నించె రతినెంతైనా మానడు
సన్నల మెచ్చితిని చాయల హెచ్చితిని
ఇన్నిటా శ్రీవేంకటేశు డెంతజాణే ఇతడు

OyammA iMtayEla (Raagam: ) (Taalam: )

OyammA iMtayEla voddanarE
nAyamugAdiMdarilO nagubATu tanakunu

chekkunokkitini selavi navvitini
makkuvatO neMtainA mATADaDu
mokkU mokkitini mOnAna nuMDitini
yekkuDu diTTitinaMTA negguvaTTI nitaDu

ichchakamu jEsiti ichchiti viDemunu
kachchupeTTi yeMtainA karagaDu
muchchaTalADitini mOvijUchiti tannu
bachchigA jEsitinaMTA pagachATI nitaDu

kannulA jokkitini kAgiTA niMchitini
manniMche ratineMtainA mAnaDua
sannala mechchitini chAyala hechchitini
inniTA SrIvEMkaTESu DeMtajANE itaDu


OrupE nErupu - ఓరుపే నేరుపు

ఓరుపే నేరుపు (రాగం: ) (తాళం : )

ప|| ఓరుపే నేరుపు సుమ్మీ వువిదలకు | మారుకోకు మగవాని మనసు మెత్తనిది ||

చ|| చలము సంపాదించవద్దు చనవే మెఱయవే | చెలువుడాతడే నీచేత జిక్కీని |
బలములు చూపవద్దు పకపక నగవే | అలరిన జాణతనమందులోనే వున్నది ||

చ|| పగలు చాటగవద్దు పైకొని మెలగవే | సొగసి ఆతడే నీ సొమ్మై వుండీనీ |
తగవుల బెట్టవద్దు తమకము చూపవే | అగపడ్డ నీ పంతములందులోనే వున్నవి ||

చ|| మొక్కల మేమియు నొద్దు మోహములు చల్లవే | నిక్కి శ్రీ వేంకటేశుడు నిన్ను గూడెను |
తక్కల బెట్టగవొద్దు దయలు దలచవే | అక్కజపు నీ రతులు అందులోనే వున్నవి ||

OrupE nErupu (Raagam: ) (Taalam: )

pa|| OrupE nErupu summI vuvidalaku | mArukOku magavAni manasu mettanidi ||

ca|| calamu saMpAdiMcavaddu canavE merxayavE | celuvuDAtaDE nIcEta jikkIni |
balamulu cUpavaddu pakapaka nagavE | alarina jANatanamaMdulOnE vunnadi ||

ca|| pagalu cATagavaddu paikoni melagavE | sogasi AtaDE nI sommai vuMDInI |
tagavula beTTavaddu tamakamu cUpavE | agapaDDa nI paMtamulaMdulOnE vunnavi ||

ca|| mokkala mEmiyu noddu mOhamulu callavE | nikki SrI vEMkaTESuDu ninnu gUDenu |
takkala beTTagavoddu dayalu dalacavE | akkajapu nI ratulu aMdulOnE vunnavi ||


OrucukOvE yeTTayinA - ఓరుచుకోవే యెట్టయినా

ఓరుచుకోవే యెట్టయినా (రాగం: ) (తాళం : )

ప|| ఓరుచుకోవే యెట్టయినా వువిద నీవు | నేరుపరి నీ విభుడు నేడే వచ్చీ నీడకు ||

చ|| కలువల వేసితేనే కాముడు చుట్టము గాడా | వెలయు విరహులకు వెగటు గాక |
చలివెన్నెల గాసితే చందురుడు పగవాడా | పొలయలు కలవారే పొగడరుగాక ||

చ|| కొసరుచు బాడితేనే కోయిల గుండె బెదరా | అసదు విరహులు కాదందురు గాక |
ముసరితే దుమ్మిద మూకలు దయలేనివా | విసిగిన కాముకులే వినలేరు గాక ||

చ|| వనము సింగారించితే వసంతుడు కౄరుడా | వొనరని విరహుల కొంటదుగాక |
యెనసి శ్రీ వేంకటేశుడేలె నిన్ను చిలుకలు | కినిసేనా పాంథులకు కేరడముగాక ||

OrucukOvE yeTTayinA (Raagam: ) (Taalam: )



pa|| OrucukOvE yeTTayinA vuvida nIvu | nErupari nI viBuDu nEDE vaccI nIDaku ||

ca|| kaluvala vEsitEnE kAmuDu cuTTamu gADA | velayu virahulaku vegaTu gAka |
calivennela gAsitE caMduruDu pagavADA | polayalu kalavArE pogaDarugAka ||

ca|| kosarucu bADitEnE kOyila guMDe bedarA | asadu virahulu kAdaMduru gAka |
musaritE dummida mUkalu dayalEnivA | visigina kAmukulE vinalEru gAka ||

ca|| vanamu siMgAriMcitE vasaMtuDu kRUruDA | vonarani virahula koMTadugAka |
yenasi SrI vEMkaTESuDEle ninnu cilukalu | kinisEnA pAMthulaku kEraDamugAka ||


OhO DEMDEM - ఓహో డేండేం

ఓహో డేండేం (రాగం: ) (తాళం : )

ప|| ఓహో డేండేం వొగి బ్రహ్మ మిదియని | సాహసమున శ్రుతి దాటెడిని ||

చ|| పరమున నరము బ్రకృతియు ననగా | వెరవుదెలియుటే వివేకము |
పరము దేవుడును అపరము జీవుడు | తిరమైన ప్రకృతియె దేహము ||

చ|| జ్ఞానము జ్ఞేయము జ్ఞానగమ్యమును | పూని తెలియుటే యోగము |
జ్ఞానము దేహాత్మ, జ్ఞేయము పరమాత్మ | జ్ఞానగమ్యమే సాధించుమనసు ||

చ|| క్షరము నక్షరమును సాక్షి పురుషుడని | సరవి దెలియుటే సాత్వికము |
క్షరము ప్రపంచ, మక్షరము కూటస్థుడు | సిరిపురుషోత్తముడే శ్రీ వేంకటేశుడు ||

OhO DEMDEM (Raagam: ) (Taalam: )

pa|| OhO DEMDEM vogi brahma midiyani | sAhasamuna Sruti dATeDini ||

ca|| paramuna naramu brakRutiyu nanagA | veravudeliyuTE vivEkamu |
paramu dEvuDunu aparamu jIvuDu | tiramaina prakRutiye dEhamu ||

ca|| j~jAnamu j~jEyamu j~jAnagamyamunu | pUni teliyuTE yOgamu |
j~jAnamu dEhAtma, j~jEyamu paramAtma | j~jAnagamyamE sAdhiMcumanasu ||

ca|| kSharamu nakSharamunu sAkShi puruShuDani | saravi deliyuTE sAtvikamu |
kSharamu prapaMca, makSharamu kUTasthuDu | siripuruShOttamuDE SrI vEMkaTESuDu ||

Listen Audio by Sobharaju: