Te sarana maham - తే శరణ మహం

Te sarana maham - తే శరణ మహం | Annamayya Lyrics | Sankeertanalu | Songs | Telugu & English

Listen Audio by G BALAKRISHNA PRASAD:

తే శరణ మహం (రాగం: ) (తాళం : )

ప॥ తే శరణ మహం తే శరణ మహం |

శైశవకృష్ణ తే శరణం గతో‌ఽస్మి ||


చ॥ దశవిధావతార ధర్మరక్షకమూర్తి |

దశమస్తకాసురదశన

దశదిశాపరిపూర్ణ తపనీయస్వరూప |

దశావరణ లోకతత్వాతీత ||


చ॥ సహస్రలోచన సంతతవినుత |

సహస్రముఖశేషశయనా

సహస్రకరకోటిసంపూర్ణతేజా |

సహస్రారదివ్యచక్రాయుధా ||


చ॥ అనంతచరణ సర్వాధారాధేయ |

అనంతకరదివ్యాయుధా

అనంతనిజకల్యాణగుణార్ణవ |

అనంత శ్రీవేంకటాద్రినివాసా ||

tae SaraNa mahaM (Raagam: ) (Taalam: )

pa|| tae SaraNa mahaM tae SaraNa mahaM

SaiSavakRshNa tae SaraNaM gatO‌ఽsmi ||


cha|| daSavidhaavataara dharmarakshakamoorti |

daSamastakaasuradaSana

daSadiSaaparipoorNa tapaneeyasvaroopa |

daSaavaraNa lOkatatvaateeta ||


cha|| sahasralOchana saMtatavinuta |

sahasramukhaSaeshaSayanaa

sahasrakarakOTisaMpoorNataejaa |

sahasraaradivyachakraayudhaa ||


cha|| anaMtacharaNa sarvaadhaaraadhaeya |

anaMtakaradivyaayudhaa

anaMtanijakalyaaNaguNaarNava |

anaMta SreevaeMkaTaadrinivaasaa ||

teppagA marrAku - తెప్పగా మర్రాకు

తెప్పగా మర్రాకు (రాగం: ) (తాళం : )

ప|| తెప్పగా మర్రాకు మీద తేలాడువాడు | ఎప్పుడు లోకములెల్ల నేలేటివాడు ||

చ|| మోతనీటి మడుగులో యీతగరచినవాడు | పాతగిలే నూతిక్రింద బాయనివాడు |
మూతిదోసిపట్టి మంటిముద్ద పెల్లగించువాడు | రోతయైన పేగుల పేరులు గలవాడు ||

చ|| కోడికూత నోరివాని కుర్రతమ్ముడైనవాడు | బూడిద బూసినవాని బుద్ధులవాడు |
మాడవన్నె లేడివెంట మాయలబడినవాడు | దూడల నావులగాచి దొరయైనవాడు ||

చ|| ఆకసానబారే వూరి అతివల మానముల | కాకుసేయువాడు తురగముపైవాడు |
ఏకమై వేంకటగిరి నిందిరారమణి గూడి | యేకాలముబాయని యెనలేనివాడు ||

teppagA marrAku (Raagam: ) (Taalam: )

pa|| teppagA marrAku mIda tElADuvADu | eppuDu lOkamulella nElETivADu ||

ca|| mOtanITi maDugulO yItagaracinavADu | pAtagilE nUtikriMda bAyanivADu |
mUtidOsipaTTi maMTimudda pellagiMcuvADu | rOtayaina pEgula pErulu galavADu ||

ca|| kODikUta nOrivAni kurratammuDainavADu | bUDida bUsinavAni buddhulavADu |
mADavanne lEDiveMTa mAyalabaDinavADu | dUDala nAvulagAci dorayainavADu ||

ca|| AkasAnabArE vUri ativala mAnamula | kAkusEyuvADu turagamupaivADu |
Ekamai vEMkaTagiri niMdirAramaNi gUDi | yEkAlamubAyani yenalEnivADu ||

Sung by:Balakrishna Prasad

Get this widget | Track details | eSnips Social DNA

tellavAraniyyarO - తెల్లవారనియ్యరో

తెల్లవారనియ్యరో తెరువు (రాగం: ) (తాళం : )

ప|| తెల్లవారనియ్యరో తెరువు యీ- | పల్లదపుదొంగలెల్ల బారాడుతెరువు ||

చ|| దొంతరపూవులతోట తూరుపుదెరువు | చింతపూవుదేనెలచెమ్మతెరువు |
సంతులేనిసతియింటిచాయతెరువు | యింతలోనె చలిబడి యెండదాకేతెరువు ||

చ|| పముపుట్టగొంటిమీదిపడుమటితెరువు | చీమకదొంతరలోనిచిన్నతెరువు |
గాములుగాచుకయుండే గాలితెరువు | యేమిటా నెక్కడవుత నెరగనితెరువు ||

చ|| అన్నిదిక్కులును దానేయైవున్న్నతెరువు | పన్నీటికాలువలబాటతెరువు |
కన్నుల వేంకటపతి గన్నతెరువు | మిన్నునేలగూడినమీదితెరువు ||

tellavAraniyyarO (Raagam: ) (Taalam: )

pa|| tellavAraniyyarO teruvu yI- | palladapudoMgalella bArADuteruvu ||

ca|| doMtarapUvulatOTa tUrupuderuvu | ciMtapUvudEnelacemmateruvu |
saMtulEnisatiyiMTicAyateruvu | yiMtalOne calibaDi yeMDadAkEteruvu ||

ca|| pamupuTTagoMTimIdipaDumaTiteruvu | cImakadoMtaralOnicinnateruvu |
gAmulugAcukayuMDE gAliteruvu | yEmiTA nekkaDavuta neraganiteruvu ||

ca|| annidikkulunu dAnEyaivunnnateruvu | pannITikAluvalabATateruvu |
kannula vEMkaTapati gannateruvu | minnunElagUDinamIditeruvu ||


teliyarAdu mAyAdEhamA - తెలియరాదు మాయాదేహమా

తెలియరాదు మాయాదేహమా (రాగం: ) (తాళం : )

ప|| తెలియరాదు మాయాదేహమా మమ్ము | పలువికారాలబెట్టి పనిగొన్న దేహమా ||

చ|| దినమొక్కవయసెక్కే దేహమా సారె | పెనుమదముగురిసేబెండు దేహమా |
దినదినరుచిగోరే దేహమా నన్ను | ఘనమోహపాశాల గట్టెగదె దేహమా ||

చ|| తెలివినిద్రలుగల దేహమా నీ- | పొలము పంచభూతాలపొత్తు దేహమా |
తిలకించి పాపపుణ్యాల దేహమా | బలుపుగలదాకా బదుకవో దేహమా ||

చ|| తీరనిసంసారపు దేహమా యిట్టె | వూరట లేనిభోగాల వోదేహమా |
కూరిమి శ్రీవేంకటేశు గొలిచితినిక నాకు | కారణజన్మమవై కలిగిన దేహమా ||

teliyarAdu mAyAdEhamA (Raagam: ) (Taalam: )

pa|| teliyarAdu mAyAdEhamA mammu | paluvikArAlabeTTi panigonna dEhamA ||

ca|| dinamokkavayasekkE dEhamA sAre | penumadamugurisEbeMDu dEhamA |
dinadinarucigOrE dEhamA nannu | GanamOhapASAla gaTTegade dEhamA ||

ca|| telivinidralugala dEhamA nI- | polamu paMcaBUtAlapottu dEhamA |
tilakiMci pApapuNyAla dEhamA | balupugaladAkA badukavO dEhamA ||

ca|| tIranisaMsArapu dEhamA yiTTe | vUraTa lEniBOgAla vOdEhamA |
kUrimi SrIvEMkaTESu golicitinika nAku | kAraNajanmamavai kaligina dEhamA ||


teliyani vAriki - తెలియని వారికి

తెలియని వారికి (రాగం: ) (తాళం : )

ప|| తెలియని వారికి తెరమరుగు | తెలిసిన వారికిదిష్టంబిదియే ||

చ|| కన్నుల యెదుటను గాంచిన జగమిది | పన్నిన ప్రకృతియు బ్రహ్మమే |
ఇన్నిటనుండగ ఇది గాదని హరి | కన్న చోట వెదకగ బోనేల ||

చ|| ఆగపడి యిరువది యైదై జీవుని | తగిలిన వెల్లా తత్త్వములే |
నగవుల నిదియును నమ్మగ జాలక | పగటున తమలో భ్రమయగ నేలా ||

చ|| అంతరంగుడును నర్చావతారము | నింతయు శ్రీ వేంకటేశ్వరుడే |
చెంతల నీతని సేవకులకు మరి | దొంతి కర్మముల తొడసిక నేలా ||

teliyani vAriki (Raagam: ) (Taalam: )

pa|| teliyani vAriki teramarugu | telisina vArikidiShTaMbidiyE ||

ca|| kannula yeduTanu gAMcina jagamidi | pannina prakRutiyu brahmamE |
inniTanuMDaga idi gAdani hari | kanna cOTa vedakaga bOnEla ||

ca|| AgapaDi yiruvadi yaidai jIvuni | tagilina vellA tattvamulE |
nagavula nidiyunu nammaga jAlaka | pagaTuna tamalO Bramayaga nElA ||

ca|| aMtaraMguDunu narcAvatAramu | niMtayu SrI vEMkaTESvaruDE |
ceMtala nItani sEvakulaku mari | doMti karmamula toDasika nElA ||


teliyaka vUraka - తెలియక వూరక

తెలియక వూరక (రాగం: ) (తాళం : )

ప|| తెలియక వూరక తిరిగేము | చలమరి కగునా సంతతసుఖము ||

చ|| హేయము కడుపున నిడుకొని యింకా | చీ యనినమాకు సిగ్గేది |
పాయము పిడికిట బట్టుచునుండేటి- | కాయధారులకు గలదా విరతి ||

చ|| అంగనలరతులయాసలనీదేటి- | యెంగిలిమనుజుల కెగ్గేది |
ముంగిట నార్గురుముచ్చులగూడిన- | దొంగగురుని కిందుల నిజమేది ||

చ|| జననమరణములు సరిగని కానని | మనుజాధమునకు మహిమేది |
యెనగొని శ్రీవేంకటేశు శరణమిటు | గని మనకుండిన గతి యిక నేది ||

teliyaka vUraka (Raagam: ) (Taalam: )

pa|| teliyaka vUraka tirigEmu | calamari kagunA saMtatasuKamu ||

ca|| hEyamu kaDupuna niDukoni yiMkA | cI yaninamAku siggEdi |
pAyamu piDikiTa baTTucunuMDETi- | kAyadhArulaku galadA virati ||

ca|| aMganalaratulayAsalanIdETi- | yeMgilimanujula keggEdi |
muMgiTa nArgurumucculagUDina- | doMgaguruni kiMdula nijamEdi ||

ca|| jananamaraNamulu sarigani kAnani | manujAdhamunaku mahimEdi |
yenagoni SrIvEMkaTESu SaraNamiTu | gani manakuMDina gati yika nEdi ||


teliyadevvarikini dEva - తెలియదెవ్వరికిని దేవ

తెలియదెవ్వరికిని దేవ (రాగం: ) (తాళం : )

ప|| తెలియదెవ్వరికిని దేవ దేవేశ యీ | నెలత భావంబెల్ల నీవెఱుగు దికనూ ||

చ|| నిలుచు దలయూచు గన్నీరు వాలిక గోళ్ళ | జినుకు నివ్వెఱగుపడు జింతించును |
పులకించు నలయు దలపోయు నిను జిత్తమున | నిలుపు నంగన విధము నీ వెఱుగు దికను ||

చ|| కమలంబు చెక్కుతో గదియించు నెన్నుదుట | చెమట బయ్యెద దుడుచు సెలవి నగును |
తమకంపు గోరికలు తరుణి యిదె నిను బాసి | నిమిష మోర్వగలేదు నీవెఱుగు దికను ||

చ|| వెక్కసపు నును దురుము వెడవ దలనేరదు | చిక్కుదేరగ గొంత సిగ్గు వడును |
ఇక్కువల దిరువేంకటేశ నిను గూడె నిదె | నిక్క మీచెలి వగల నీ వెఱుగ దికనూ ||

teliyadevvarikini dEva (Raagam: ) (Taalam: )

pa|| teliyadevvarikini dEva dEvESa yI | nelata BAvaMbella nIverxugu dikanU ||

ca|| nilucu dalayUcu gannIru vAlika gOLLa | jinuku nivverxagupaDu jiMtiMcunu |
pulakiMcu nalayu dalapOyu ninu jittamuna | nilupu naMgana vidhamu nI verxugu dikanu ||

ca|| kamalaMbu cekkutO gadiyiMcu nennuduTa | cemaTa bayyeda duDucu selavi nagunu |
tamakaMpu gOrikalu taruNi yide ninu bAsi | nimiSha mOrvagalEdu nIverxugu dikanu ||

ca|| vekkasapu nunu durumu veDava dalanEradu | cikkudEraga goMta siggu vaDunu |
ikkuvala diruvEMkaTESa ninu gUDe nide | nikka mIceli vagala nI verxuga dikanU ||