Daachuko neepaadaalakudaga - దాచుకో నీపాదాలకుదగ

దాచుకో నీపాదాలకుదగ (రాగం: ఆరభి) (తాళం : )

దాచుకో నీపాదాలకుదగ నే జేసినపూజ లివి
పూచి నీకీరీతిరూపపుష్పము లివి యయ్యా

వొక్క సంకీర్తనె చాలు వొద్దికై మమ్ము రక్షించగ
తక్కినవి భాండారాన దాచి వుండనీ
వెక్కసమగునీ నామము వెల సులభము ఫల మధికము
దిక్కై నన్నేలితి విక నవి తీరని నా ధనమయ్యా

నానాలికపైనుండి నానాసంకీర్తనలు
పూని నాచే నిన్ను బొగడించితివి
వేనామాల వెన్నుడా వినుతించ నెంతవాడ
కానిమ్మని నా కీపుణ్యము గట్టితి వింతేయయ్యా

యీమాట గర్వము గాదు నీ మహిమే కొనియాడితిగాని
చేముంచి నాస్వాతంత్ర్యము చెప్పినవాడగాను
నేమాన బాడేవాడను నేరము లెంచకుమీ
శ్రీమాధవా నే నీదాసుడ శ్రీవేంకటేశుడవయ్యా

Daachuko neepaadaalakudaga (Raagam: aarabhi) (Taalam: )

Daachuko neepaadaalakudaga nae jaesinapooja livi
Poochi neekeereetiroopapushpamu livi yayyaa

Vokkasamkeertane chaalu voddikaimammu rakshimchaga
Takkinavi bhaamdaaraana daachi vumdanee
Vekkasamagunee naamamu vela sulabhamu phala madhikamu
Dikkai nannaeliti vika navi teerani naa dhanamayyaa

Naanaalikapainumdi naanaasamkeertanalu
Pooni naachae ninnu bogadimchitivi
Naenaamaala vennudaa ninutimcha nemtavaada
Kaanimmani naa keepunyamu gattiti vimtaeyayyaa


Yeemaata garvamu gaadu nee mahimae koniyaaditigaani
Chaemumchi naasvaatamtryamu cheppinavaadagaanu
Naemaana baadaevaadanu naeramu lemchakumee
Sreemadhavaa nae needaasuda sreevaemkataesudavayyaa

Sung by:Balakrishna Prasad

Get this widget | Track details | eSnips Social DNA

dayajUDavayA tatigAni - దయజూడవయా తతిగాని

దయజూడవయా తతిగాని (రాగం: ) (తాళం : )

దయజూడవయా తతిగాని మొక్కేము
ప్రియురాంద్లము నినుబెండ్లాడితిమి ||

చలములు నీతో సాదించేమా
వలచిన వారము వనితలము
బలుములు నీతో బచరించేమా
కొలిచినవారము గోలలము ||

పెనగుచు నీతో బిగిసేమా మీ
ననుపుల వారము నాతులము
పనివడి నేరమి పైవేసేమా
చనవరివారము సాదులము ||

యీవేళ గూడితి మెలయించేమా
దేవుళ్ళము నీ తెఅవలము
శ్రీ వేంకటేశ్వర చెలగి నగేమా
బూవపువారము భోగులము ||

dayajUDavayA tatigAni (Raagam: ) (Taalam: )

dayajUDavayA tatigAni mokkEmu
priyurAMdlamu ninubeMDlADitimi ||

chalamulu nItO sAdiMchEmA
valachina vAramu vanitalamu
balumulu nItO bachariMchEmA
kolichinavAramu gOlalamu ||

penaguchu nItO bigisEmA mI
nanupula vAramu nAtulamu
panivaDi nErami paivEsEmA
chanavarivAramu sAdulamu ||

yIvELa gUDiti melayiMchEmA
dEvuLLamu nI teRavalamu
SrI vEMkaTESvara chelagi nagEmA
bUvapuvAramu bhOgulamu ||


daMDanunna celula - దండనున్న చెలుల

దండనున్న చెలుల (రాగం: ) (తాళం : )

ప|| దండనున్న చెలుల మిందరము సాక్షి | నిండు దొర యీతనికి నేరమేమి లేదు ||

చ|| వట్టి చలములుమాని వాకిలి దెరవరాదా | యిట్టె విభుడు వచ్చి యీడనున్నాడు |
వొట్టినట్టు కొలువై వుండిన దొక్కటేకాని | నెట్టన నితని వల్ల నేరమేమి లేదు ||

చ|| దిచ్చరి కోపము మాని తెర దియ్యరాదా | చొచ్చి వచ్చి రమణుడు చూచీ నిదే |
అచ్చముగ సరసము లాడిన దొక్కటే కాని | నిచ్చలు నితని వల్ల నేరమేమీ లేదు ||

చ|| పంతపు వేసాలు మాని పయ్యె దెడలించరాదా | చెంత శ్రీ వేంకటేశుడు చేయిచాచీనీ |
యింతలోన నిన్నుగూడె నిదియొక్కటే గాని | నింతము సేసలితని నేరమేమీ లేదు ||

daMDanunna celula (Raagam: ) (Taalam: )

pa|| daMDanunna celula miMdaramu sAkShi | niMDu dora yItaniki nEramEmi lEdu ||

ca|| vaTTi calamulumAni vAkili deravarAdA | yiTTe viBuDu vacci yIDanunnADu |
voTTinaTTu koluvai vuMDina dokkaTEkAni | neTTana nitani valla nEramEmi lEdu ||

ca|| diccari kOpamu mAni tera diyyarAdA | cocci vacci ramaNuDu cUcI nidE |
accamuga sarasamu lADina dokkaTE kAni | niccalu nitani valla nEramEmI lEdu ||

ca|| paMtapu vEsAlu mAni payye deDaliMcarAdA | ceMta SrI vEMkaTESuDu cEyicAcInI |
yiMtalOna ninnugUDe nidiyokkaTE gAni | niMtamu sEsalitani nEramEmI lEdu ||


Trikarana suddiga - త్రికరణశుద్ధిగా

త్రికరణశుద్ధిగా చేసిన పనులకు దేవుడు మెచ్ఛును లోకము మెచ్చును |

ఒకటికోటి గుణితంబగు మార్గములుండగ ప్రయాస పడనేల ||


తనమనసే పరిపూర్ణమైన గోదావరిగంగాకావేరి |

కనకబిందు యమునాగయాది ముఖ్యక్షేత్రంబుల సంతతమున్ |

దినకరసోమగ్రహణకాలముల తీర్థాచరణలు చేసిన ఫలములు |

తనుతానే సిద్ధించును ఊరకె దవ్వును తిరుగగ మరియేల ||


హరియను రెండక్షరములు నుడివిన అఖిలవేదములు మంత్రములు |

గరిమ ధర్మశాస్త్రపురాణాదులు క్రమముగ చదివిన పుణ్యములు |

పరమతపోయోగంబులు మొదలగు బహుసాధనముల సారంబు |

పరిపక్వంబై ఫలియించంగా బట్టబయలు వెదకగనేల ||


మొదల శ్రీవేంకటపతికిని చేయెత్తి మొక్కినమాత్రము లోపలనే |

పదిలపు షోడశదాన యాగములు పంచమహా యజ్నంబులును |

వదలక సాంగంబులుగా చేసిన వాడేకాడా పలుమారు |

మదిమది నుండే కాయక్లేశము మాటికి మాటికి తనకేల ||

twameva saranam - త్వమేవ శరణం

Tvameva saranam - త్వమేవ శరణం | Annamayya Lyrics | Sankeertanalu | Songs | Telugu & English

Listen Audio by G NAGESWARA NAIDU:

త్వమేవ శరణం (రాగం: ) (తాళం : )

త్వమేవ శరణం త్వమేవ శరణం కమలోదర శ్రీజగన్నాథా

వాసుదేవ కృష్ణ వామన నరసింహ శ్రీ సతీశ సరసిజనేత్రా
భూసురవల్లభ పురుషోత్తమ పీత- కౌశేయవసన జగన్నాథా

బలభద్రానుజ పరమపురుష దుగ్ధ జలధివిహార కుంజరవరద
సులభ సుభద్రా సుముఖ సురేశ్వర కలిదోషహరణ జగన్నాథా

వటపత్రశయన భువనపాలన జంతు- ఘటకారకరణ శృంగారాధిపా
పటుతర నిత్యవైభవరాయ తిరువేంకటగిరినిలయ జగన్నాథా

twameva saranam (Raagam: ) (Taalam: )

twameva saranam twameva saranam
kamalodhara sree jagannadha

vAsudEva kRiShNa vAmana narasiMha SrI satISa sarasijanEtrA
BUsuravallaBa puruShOttama pIta kauSEyavasana jagnnAthA

balaBadrAnuja paramapuruSha dugdha jaladhivihAra kuMjaravarada |
sulaBa suBadrAsumuKa surESvara kalidOShaharaNa jagannAthA

vaTapatraSayana BuvanapAlana jaMtu- GaTakArakaraNa SRuMgArAdhipA
paTutara nityavaiBavarAya tiruvEM- kaTagirinilaya jagannAthA

tOraNamulE dOvellA - తోరణములే దోవెల్లా

తోరణములే (రాగం: ) (తాళం : )

ప|| తోరణములే దోవెల్లా | మూరట బారట ముంచినలతల ||

చ|| కూరిమిమటములు గోపురంబులును | తేరుపడగెలే తెరువెల్లా |
కోరినపండ్లుగురి సేటితరువులు | తోరములైన వెదురుజొంపములు ||

చ|| ఆటలు దిరుపులు నందపుటురుపులు | పాటలు వనవైభవమెల్లా |
కూటువనెమళ్ళ కోవిలగుంపుల | పేటల దేటలపెనుగూటములు ||

చ|| వింజామరలును విసనకర్రలును | గొంజెగొడుగులే కొండెల్లా |
అంజనగిరిరాయడు వేంకటపతి | సంజీవని పరుషల కొదవగను ||

tOraNamulE (Raagam: ) (Taalam: )

pa|| tOraNamulE dOvellA | mUraTa bAraTa muMcinalatala ||

ca|| kUrimimaTamulu gOpuraMbulunu | tErupaDagelE teruvellA |
kOrinapaMDluguri sETitaruvulu | tOramulaina vedurujoMpamulu ||

ca|| ATalu dirupulu naMdapuTurupulu | pATalu vanavaiBavamellA |
kUTuvanemaLLa kOvilaguMpula | pETala dETalapenugUTamulu ||

ca|| viMjAmaralunu visanakarralunu | goMjegoDugulE koMDellA |
aMjanagirirAyaDu vEMkaTapati | saMjIvani paruShala kodavaganu ||


tolubApapuNyAlatODa - తొలుబాపపుణ్యాలతోడ

తొలుబాపపుణ్యాలతోడ (రాగం: ) (తాళం : )

ప|| తొలుబాపపుణ్యాలతోడ బుట్టితినట | బలువైనభవముల భడలేనా ||

చ|| గాములయింటినే కాపనయితినట | పాముపుట్టనుండియైన బతుకలేనా |
గోమున హేయపుగుండకూడు నించితినట | గామిడినేగారేతిత్తి గానోపనో ||

చ|| కట్లైనగుణములచే కట్టువడితినట | చుట్టపుబంధాలరొచ్చుకు నోపనా |
దట్టపుటాసల నేదాల్చితినట నా- | వెట్టకాయము మోవవెరచేనా ||

చ|| నిగిడినలోపల నీ వుండుదువట | పగవారికి నే బగిలేనా |
తగువేంకటేశ నీదయవాడనట యీ- | వగల నిన్నిట గెలువగలనా ||

(Raagam: ) (Taalam: )

pa|| tolubApapuNyAlatODa buTTitinaTa | baluvainaBavamula BaDalEnA ||

ca|| gAmulayiMTinE kApanayitinaTa | pAmupuTTanuMDiyaina batukalEnA |
gOmuna hEyapuguMDakUDu niMcitinaTa | gAmiDinEgArEtitti gAnOpanO ||

ca|| kaTlainaguNamulacE kaTTuvaDitinaTa | cuTTapubaMdhAlaroccuku nOpanA |
daTTapuTAsala nEdAlcitinaTa nA- | veTTakAyamu mOvaveracEnA ||

ca|| nigiDinalOpala nI vuMDuduvaTa | pagavAriki nE bagilEnA |
taguvEMkaTESa nIdayavADanaTa yI- | vagala ninniTa geluvagalanA ||