marda marda mama bandhani - మర్ద మర్ద మమ బంధాని

marda marda mama bandhani - మర్ద మర్ద మమ బంధాని | Annamayya Lyrics | Sankeertanalu | Songs | Telugu & English

Listen Audio by G BALAKRISHNA PRASAD:

మర్ద మర్ద (రాగం: ) (తాళం : )

ప|| మర్ద మర్ద మమ బంధాని | దుర్దాంత మహాదురితాని ||

చ|| చక్రాయుధ రవిశత తేజోంచిత | సక్రోధసహస్ర ప్రముఖ |
విక్రమక్రమా విస్ఫులింగకణ | నక్రహరణ హరినవ్యకరాంక ||

చ|| కలితసుదర్శన కఠినవిదారణ | కులిశకోటిభవ ఘోషణా |
ప్రళయానలసంభ్రమ విభ్రమకర | రళితదైతగళ రక్తవికీరణా ||

చ|| హితకరశ్రీవేంకటేశప్రయుక్త | సతతపరాక్రమ జయంకర |
చతురోऽహంతే శరణమ్ గతోऽస్మి | యితరాన్ విభజ్య యిహ మాం రక్ష ||

marda marda mama (Raagam: ) (Taalam: )

pa|| marda marda mama baMdhAni | durdAMta mahAduritAni ||

ca|| cakrAyudha raviSata tEjOMcita | sakrOdhasahasra pramuKa |
vikramakramA visPuliMgakaNa | nakraharaNa harinavyakarAMka ||

ca|| kalitasudarSana kaThinavidAraNa | kuliSakOTiBava GOShaNA |
praLayAnalasaMBrama viBramakara | raLitadaitagaLa raktavikIraNA ||

ca|| hitakaraSrIvEMkaTESaprayukta | satataparAkrama jayaMkara |
caturO&haMtE SaraNam gatO&smi | yitarAn viBajya yiha mAM rakSha ||

maracitimaMTE - మరచితిమంటే

మరచితిమంటే (రాగం: ) (తాళం : )

ప|| మరచితిమంటే మరిలేదు | తరితో దలచవో దైవము మనసా ||

చ|| పుట్టుచునున్నది పోవుచునున్నది | పట్టపు జీవుల ప్రపంచకము |
నట్టనడుమనే హరినామము | గుట్టున దలచవో కొనగొని మనసా ||

చ|| పొద్దు వొడుచు నదె పొద్దు గుంకు నదె | తిద్దిన జగముల దిన దినము |
అద్దపు నీడల అంతర్యామిని | వొద్దనె తలచవొ ఒనరగ మనసా ||

చ|| లోపల వెలుపల లోగొని ఉన్నది | శ్రీపతి మహిమల సృష్టి యిదే |
యేపున శ్రీ వేంకటేశ్వరు డితడే | దాపని నమ్ముచు దలచవొ మనసా ||

maracitimaMTE (Raagam: ) (Taalam: )

pa|| maracitimaMTE marilEdu | taritO dalacavO daivamu manasA ||

ca|| puTTucununnadi pOvucununnadi | paTTapu jIvula prapaMcakamu |
naTTanaDumanE harinAmamu | guTTuna dalacavO konagoni manasA ||

ca|| poddu voDucu nade poddu guMku nade | tiddina jagamula dina dinamu |
addapu nIDala aMtaryAmini | voddane talacavo onaraga manasA ||

ca|| lOpala velupala lOgoni unnadi | SrIpati mahimala sRuShTi yidE |
yEpuna SrI vEMkaTESvaru DitaDE | dApani nammucu dalacavo manasA ||

madamu dolakeDi - మదము దొలకెడి

మదము దొలకెడి (రాగం: ) (తాళం : )

మదము దొలకెడి యట్టి మంచి వయసున మనకు
తుదలేని వెడుకలు దొరకుటెన్నడురా ||

ఉదుటు జనుదోయి నీవురముపై దనివార
నదిమి మోమును మోము నలమియలమి
వదలైన నీవితో వాలుగన్నుల జంకె
లొదవ నీ మీద నేనొరగు టెన్నడురా ||

కతికి తనమున నాదు కప్పురపు దమ్ములము
కులికి నీ వదనమున గుమ్మరించి
పలచనగు గోళ్ళ నీ పగడనాతెర నొక్కి
చెలుపమగు నునుగంటి సేయుటెన్నడురా ||

గరగరని కురులతో కస్తూరి వాసనలు
విరితావులతోద విసరగాను
తిరువేంకటాధిపుడ నిను గూడి నే
నరమరచి సమదము లౌట యెన్నడురా ||

madamu dolakeDi (Raagam: ) (Taalam: )

madamu dolakeDi yaTTi maMchi vayasuna manaku
tudalEni veDukalu dorakuTennaDurA ||

uduTu janudOyi nIvuramupai danivaara
nadimi mOmunu mOmu nalamiyalami
vadalaina nIvitO vaalugannula jaMke
lodava nI mIda nEnoragu TennaDurA ||

katiki tanamuna nAdu kappurapu dammulamu
kuliki nI vadanamuna gummariMchi
palachanagu gOLLa nI pagaDanAtera nokki
chelupamagu nunugaMTi sEyuTennaDurA ||

garagarani kurulatO kastUri vAsanalu
viritAvulatOda visaragAnu
tiruvEMkaTAdhipuDa ninu gUDi nE
naramarachi samadamu louTa yennaDurA ||


malasI jUDarO - మలసీ జూడరో

మలసీ జూడరో (రాగం: ) (తాళం : )

ప|| మలసీ జూడరో మగసింహము | అలవి మీరిన మాయల సింహము ||

చ|| అదివో చూడరో ఆదిమ పురుషుని | పెద యౌబళముమీది పెనుసింహము |
వెదికి బ్రహ్మాదులు వేదాంతతతులు | కదిసి కానగ లేని ఘనసింహము ||

చ|| మెచ్చి మెచ్చి చూడరో మితిమీరినయట్టి | చిచ్చరకంటితోడి జిగిసింహము |
తచ్చిన వారిధిలోని తరుణిగౌగిటజేర్చి | నచ్చిన గోళ్ళ శ్రీ నరసింహము ||

చ|| బింకమున జూడరో పిరితీయక నేడు | అంకపుదనుజ సంహార సింహము |
వేంకటనగముపై వేదాచలముపై | కింకలేక వడి బెరిగిన సింహము ||

malasI jUDarO (Raagam: ) (Taalam: )

pa|| malasI jUDarO magasiMhamu | alavi mIrina mAyala siMhamu ||

ca|| adivO cUDarO Adfima puruShuni | peda yaubaLamumIdi penusiMhamu |
vediki brahmAdulu vEdAMtatatulu | kadisi kAnaga lEni GanasiMhamu ||

ca|| mecci mecci cUDarO mitimIrinayaTTi | ciccarakaMTitODi jigisiMhamu |
taccina vAridhilOni taruNigaugiTajErci | naccina gOLLa SrI narasiMhamu ||

ca|| biMkamuna jUDarO piritIyaka nEDu | aMkapudanuja saMhAra siMhamu |
vEMkaTanagamupai vEdAcalamupai | kiMkalEka vaDi berigina siMhamu ||


mahimellA doppadOge - మహిమెల్లా దొప్పదోగె

మహిమెల్లా దొప్పదోగె (రాగం: ) (తాళం : )

ప|| మహిమెల్లా దొప్పదోగె మజ్జనవేళ | సహజశృంగారాలు జడిసె శ్రీపతికి ||

చ|| మొత్తేలవానలెల్ల ముంచి కురిసినయట్టు | హత్తి పన్నీట జలకమాయ హరికి |
తత్తరాన దెల్లమొయిలు తను ఒదిగినయట్లు | కొత్తగా గప్పురకాపు గుప్పిరి దేవునికి ||

చ|| నీలపుబేరులెల్లా నిండా గట్టినయట్టు | తేల దట్టపుణుగు మెత్తిరి పతికి |
అలరిమెఱుగుదీగె లలముకొనినయట్టు | కోలుముందై సొమ్ములెల్లా గుప్పిరి విష్ణునికి ||

చ|| పెక్కునవరత్నములు పెద్దరాసి వోసినట్టు | యెక్కువదండలు గట్టిరి మూరితికి |
వొక్కట నలమేలుమంగ నురమున గట్టిరిదె | చిక్కనినవ్వులు మించె శ్రీవేంకటేశునకు ||

mahimellA doppadOge (Raagam: ) (Taalam: )

pa|| mahimellA doppadOge majjanavELa | sahajaSRuMgArAlu jaDise SrIpatiki ||

ca|| mottElavAnalella muMci kurisinayaTTu | hatti pannITa jalakamAya hariki |
tattarAna dellamoyilu tanu odiginayaTlu | kottagA gappurakApu guppiri dEvuniki ||

ca|| nIlapubErulellA niMDA gaTTinayaTTu | tEla daTTapuNugu mettiri patiki |
alarimerxugudIge lalamukoninayaTTu | kOlumuMdai sommulellA guppiri viShNuniki ||

ca|| pekkunavaratnamulu peddarAsi vOsinaTTu | yekkuvadaMDalu gaTTiri mUritiki |
vokkaTa nalamElumaMga nuramuna gaTTiride | cikkaninavvulu miMce SrIvEMkaTESunaku ||


mahi niMtaTivAruvO - మహి నింతటివారువో

మహి నింతటివారువో (రాగం: ) (తాళం : )

ప|| మహి నింతటివారువో మనవారు | బహుమహిమలవారు ప్రపన్నులు ||

చ|| జయమంది జననజరామరణముల- | భయములేనివారు ప్రపన్నులు |
క్రియలెల్ల నుడిగి మూగినకర్మపుటడవి | బయలుచేసినవారు ప్రపన్నులు ||

చ|| ధీరులై మాయాంధకారంబు నెదిరించి | పారదోలినవారు ప్రపన్నులు |
సారమయ్యినసంసారసాగరము | పారముగన్నవారు ప్రపన్నులు ||

చ|| అండ నిన్నిటా దనిసి యాసలెల్లా దెగగోసి | పండినమనసువారు ప్రపన్నులు |
దండిగా శ్రీవేంకటేశుదాసులై పరముతోడ | బండినబాట చేసినారు ప్రపన్నులు ||

mahi niMtaTivAruvO (Raagam: ) (Taalam: )

pa|| mahi niMtaTivAruvO manavAru | bahumahimalavAru prapannulu ||

ca|| jayamaMdi jananajarAmaraNamula- | BayamulEnivAru prapannulu |
kriyalella nuDigi mUginakarmapuTaDavi | bayalucEsinavAru prapannulu ||

ca|| dhIrulai mAyAMdhakAraMbu nediriMci | pAradOlinavAru prapannulu |
sAramayyinasaMsArasAgaramu | pAramugannavAru prapannulu ||

ca|| aMDa ninniTA danisi yAsalellA degagOsi | paMDinamanasuvAru prapannulu |
daMDigA SrIvEMkaTESudAsulai paramutODa | baMDinabATa cEsinAru prapannulu ||


magavAnikEDa siggu - మగవానికేడ సిగ్గు

మగవానికేడ సిగ్గు (రాగం: ) (తాళం : )

మగవానికేడ సిగ్గు మగువలకింతేకాక
యెగసక్కేలాడేనంటా యేలనవ్వేవిపుడు ||

మంతనాన నిద్దరము మాటలాడుకొన్నవెల్లా
యింతలోనే ఆపెనేడు యెట్టెరిగెను
చెంతల నీవెమ్మెలకు చెప్పితివేమోకాక
వింతగా నీ చెవులనే వినవయ్యా ముద్దులు ||

చేరియింటిలో మనము చేసుకొన్న బాసలు
వారించి యాపెకు నే డవ్వరు చూపిరి
మేరమీరి మురిపెము మెరిసితివేమో కాక
ఆరీతి నీవే యడుగవయ్యా యీ సుద్దులు ||

పానుపువ్పై నిద్దరము పైకొన్న కూటములెల్లా
తానకమై యే రీతిగా దలచినది
కానీలే నీవే పెద్దరికము చూపేవే మోకాక
మేన శ్రీవేంకటేశుడ మెచ్చవయ్యా సుద్దులు ||

magavAnikEDa siggu (Raagam: ) (Taalam: )

magavAnikEDa siggu maguvalakiMtEkAka
yegasakkElADEnaMTA yElanavvEvipuDu ||

maMtanAna niddaramu mATalADukonnavellA
yiMtalOnE ApenEDu yeTTerigenu
cheMtala nIvemmelaku cheppitivEmOkAka
viMtagA nI chevulanE vinavayyA muddulu ||

chEriyiMTilO manamu chEsukonna bAsalu
vAriMchi yApeku nE Davvaru chUpiri
mEramIri muripemu merisitivEmO kAka
ArIti nIvE yaDugavayyA yI suddulu ||

pAnupuvpai niddaramu paikonna kUTamulellA
tAnakamai yE rItigA dalachinadi
kAnIlE nIvE peddarikamu chUpEvE mOkAka
mEna SrIvEMkaTESuDa mechchavayyA suddulu ||