mAna DennaDu - మాన డెన్నడు

మాన డెన్నడు (రాగం: ) (తాళం : )

ప|| మాన డెన్నడు శరీరి దు- | ర్మానసబోధితుడుగాన ||

చ|| పంచభూతవికారంబులు | పంచేంద్రియములూ |
పంచమహా పాతకములకును | పంచివేసినవిగాన ||

చ|| త్రైగుణ్యవికారంబులు | త్రైగుణ్యపుదనువులు |
శ్రీగురుడగు శ్రీవేంకటపతి- | భోగయోగ్యములుగాన ||

mAna DennaDu (Raagam: ) (Taalam: )

pa|| mAna DennaDu SarIri du- | rmAnasabOdhituDugAna ||

ca|| paMcaBUtavikAraMbulu | paMcEMdriyamulU |
paMcamahA pAtakamulakunu | paMcivEsinavigAna ||

ca|| traiguNyavikAraMbulu | traiguNyapudanuvulu |
SrIguruDagu SrIvEMkaTapati- | BOgayOgyamulugAna ||


Madhavunaku mangalam - మాధవునకు మంగళం

Madhavunaku mangalam - మాధవునకు మంగళం | Annamayya Lyrics | Sankeertanalu | Songs | Telugu & English

Listen Audio by NEDUNURI KRISHNAMURTHY:

మాధవునకు మంగళం (రాగం: ) (తాళం : )

ప|| మాధవునకు మంగళం | సాధు ప్రియునకు జయ మంగళం ||

చ|| మదన గురునకు మంగళము మా | మతిలేలె హరికిని మంగళము |
మధురిపు హరునకు మంగళము | చటువులుమూర్తికి మంగళము ||

చ|| మహిమాధికుణకు మంగళము | మహామహునకు మంగళము |
మహీధవునకు మంగళము | సహజ తేజునకు మంగళము ||

చ|| మాయారహితునికి మంగళము | మాయింటి పతికిని మంగళము |
యీ యెడ శ్రీ వేంకటేశ్వరు దీటు | ఛాయ శ్రీపతికి మంగళము ||

mAdhavunaku maMgaLaM (Raagam: ) (Taalam: )

pa|| mAdhavunaku maMgaLaM | sAdhu priyunaku jaya maMgaLaM ||

ca|| madana gurunaku maMgaLamu mA | matilEle harikini maMgaLamu |
madhuripu harunaku maMgaLamu | caTuvulumUrtiki maMgaLamu ||

ca|| mahimAdhikuNaku maMgaLamu | mahAmahunaku maMgaLamu |
mahIdhavunaku maMgaLamu | sahaja tEjunaku maMgaLamu ||

ca|| mAyArahituniki maMgaLamu | mAyiMTi patikini maMgaLamu |
yI yeDa SrI vEMkaTESvaru dITu | CAya SrIpatiki maMgaLamu ||

mAdhavA BUdhavA - మాధవా భూధవా

మాధవా భూధవా (రాగం: ) (తాళం : )

ప|| మాధవా భూధవా మదన జనక | సాధు రక్షణ చతుర శరణు శరణు ||

చ|| నారాయణాచ్యుతానంత గోవింద శ్రీ | నారసింహా కృష్ణ నాగశయన |
వారాహ వామన వాసుదేవ మురారి | శౌరీ జయజయతు శరణు శరణు ||

చ|| పుండరీకేక్షణ భువన పూర్ణగుణ | అండజగమన నిత్యహరి ముకుంద |
పండరి రమణ రామ బలరామ పరమ పురుష | చండభార్గవ రామ శరణు శరణు ||

చ|| దేవదేవోత్తమ దివ్యావతార నిజ | భావ భావనాతీత పద్మనాభ |
శ్రీవేంకటాచల శృంగారమూర్తి నవ | సావయవ సారూప్య శరణు శరణు ||

mAdhavA BUdhavA (Raagam: ) (Taalam: )

pa|| mAdhavA BUdhavA madana janaka | sAdhu rakShaNa catura SaraNu SaraNu ||

ca|| nArAyaNAcyutAnaMta gOviMda SrI | nArasiMhA kRuShNa nAgaSayana |
vArAha vAmana vAsudEva murAri | SaurI jayajayatu SaraNu SaraNu ||

ca|| puMDarIkEkShaNa Buvana pUrNaguNa | aMDajagamana nityahari mukuMda |
paMDari ramaNa rAma balarAma parama puruSha | caMDaBArgava rAma SaraNu SaraNu ||

ca|| dEvadEvOttama divyAvatAra nija | BAva BAvanAtIta padmanABa |
SrIvEMkaTAcala SRuMgAramUrti nava | sAvayava sArUpya SaraNu SaraNu ||


Madhava kesava - మాధవ కేశవా

Madhava kesava madhusudana - మాధవ కేశవా మధుసూదన | Annamayya Lyrics | Sankeertanalu | Songs | Telugu & English

Listen Audio by G BALAKRISHNA PRASAD:

మాధవా కేశవా మధుసూధనా (రాగం: ) (తాళం : )

మాధవా కేశవా మధుసూధనా ౨ విష్ణు శ్రీధరా పదనకం చింతయామి యూయం

వామన గోవింద వాసుదేవ ప్రద్యుమ్నా రామ రామ కృష్ణ నారాయనాచ్యుతా ౨
దామోదరానిరుద్ద దైవ పుండరీకాక్ష ౨ నామ త్రయాదీశ నమో నమో

పురుషోత్తమా పుండరీకాక్ష దివ్య హరిసంకర్షనా అధోక్షజా ౨
నరశింహ హృషీకేష నగధరా త్రివిక్రమ శరణా గత రక్ష జయ జయ సేవే

మహిత జనార్ధనా మత్స్య కూర్మ వరాహ సహజ భార్గవ బుద్ధ జయ తురగ కల్కి ౨
విహిత విజ్ఞాన శ్రీ వేంకటేశ శుభ కరం అహ మిహ తవ పద దాస్యం అనిశం భజామి

Maadhavaa kaesavaa (Raagam: ) (Taalam: )

Maadhavaa kaesavaa madhusoodhanaa ~2 vishnu Sreedharaa padanakam chimtayaami yooyam

Vaamana govimda vaasudaeva pradyumnaa raama raama krshna naaraayanaachyutaa ~2
Daamodaraanirudda daiva pumdareekaaksha ~2 naama trayaadeesa namo namo

Purushottamaa pumdareekaaksha divya harisamkarshanaa adhokshajaa ~2
Narasimha hrsheekaesha nagadha raatri vikrama Saranaa gata raksha jaya jaya saevae

Mahita janaardhanaa matsya koorma varaaha sahaja bhaargava buddha jaya turaga kalki ~2
Vihita vignaana Sree vaemkataesa Subha karam aha miha tava pada daasyam anisam bhajaami


mArxu mOvidETiki - మాఱు మోవిదేటికి

మాఱు మోవిదేటికి (రాగం: ) (తాళం : )

ప|| మాఱు మోవిదేటికి మంకుదన మేటికి | జాఱువడ నే నవ్వితే సంతసించవలదా ||

చ|| వడి నీకెమ్మోవి మీది వన్నెదీసినది చూచి | తొడరి వీడెమిచ్చితే దోసమాయిది |
కడుచెమటల నీపై గందవొడి చల్లితేను | జడియక నీవిందుకు సంతసించవలదా ||

చ|| కులికి నీకన్నులపై కుంకుమ వన్నెలుచూచి | బలిమి బన్నీరిచ్చితే పాపమాయిది |
కలసిన వేడి వేడి కాకలమే నటుచూచి | చలిగా నే విసరితే సంతసించవలదా ||

చ|| పిప్పియైన నీమేని పెక్కులాగులటు చూచి | ముప్పిరి గళలంటితే మోసమాయిది |
అప్పటి శ్రీ వేంకటేశ అలమితి విటునన్ను | చప్పుడు గాకియ్యకుంటే సంతసించవలదా ||

mArxu mOvidETiki (Raagam: ) (Taalam: )

pa|| mArxu mOvidETiki maMkudana mETiki | jArxuvaDa nE navvitE saMtasiMcavaladA ||

ca|| vaDi nIkemmOvi mIdi vannedIsinadi cUci | toDari vIDemiccitE dOsamAyidi |
kaDucemaTala nIpai gaMdavoDi callitEnu | jaDiyaka nIviMduku saMtasiMcavaladA ||

ca|| kuliki nIkannulapai kuMkuma vannelucUci | balimi bannIriccitE pApamAyidi |
kalasina vEDi vEDi kAkalamE naTucUci | caligA nE visaritE saMtasiMcavaladA ||

ca|| pippiyaina nImEni pekkulAgulaTu cUci | muppiri gaLalaMTitE mOsamAyidi |
appaTi SrI vEMkaTESa alamiti viTunannu | cappuDu gAkiyyakuMTE saMtasiMcavaladA ||


Matanga parvatamaada - మతంగ పర్వతామాడ

మతంగ పర్వతామాడ (రాగం: ) (తాళం : )

మతంగ పర్వతామాడ మాల్యవంతము నీడ
అతిశయిల్లిన పెద్ద హనుమంతుడు ఇతడ

ఈతడా రాముని బంటు ఈతడా వాయు సుతుడు
ఆతతబలాడ్యూలందురు ఆతడితడా
సీతను వెదకి వచ్చి చెప్పిన ఆతడితడా
ఘాతల లంకలోని రాక్షస వైరి ఇతడ

ఆంజనాసుతడితడా అక్షమర్ధనుడు ఇతడ
సంజీవిని కొండ దెచ్చే సారె నితడా
భంజిన్‌చె గాలనేమిని పంతముననితడా
రంజితప్రతాప కపిరాజ సఖుడితడా

చీరజీవి ఈతడ జీతేంద్రీయుడు ఇతడ
సురలకు ఉపకారపు చుట్టము ఈతడ
నిరతి శ్రీ వేంకటాద్రీని వి నగరములో
నరిది వరములిచ్చి అందరికి ఇతడ

Matanga parvatamaada (Raagam: ) (Taalam: )

Matanga parvatamaada maalyavanthamu needa
Atishayillina pedda hanumanthudu ithada

Eethada raamuni bantu eethada vaayu suthudu
Aathatha balaadhyulanduru aathadithada
Seethanu vedaki vachi cheppina aathadithada
Ghathala lankaloni rakshasa vairi ithada

Anjanaasuthudithada akshamardhanudithada
Sanjeevini konda dechhe saarenithada
Bhanjinche gaalanemini panthamunanithada
Ranjitha prathapa kapiraaja sakhudithada

Chirajeevi eethada jithendriyudu ithada
Suralaku upakaarapu chuttamu eethada
Nirathi sree venkatadrini vijanagaramulo
Naridi varamulichhi andariki ithada

Get this widget | Track details | eSnips Social DNA

Ma~ri haridaasudai - మఱి హరిదాసుడై

మఱి హరిదాసుడై (రాగం:దేసాక్షి) (తాళం : )

మఱి హరిదాసుడై మాయల జిక్కువడితే
వెఱపించబోయి తనే వెఱచినట్లువును

శూరుడైనవాడేడజొచ్చిన నడ్డము లేదు
ఆరీతిజ్ఞానికి విధు లడ్డము లేవు
కారణాన నప్పటినీ గలిగెనా నది మరి
తేరిననీళ్ళ వండు దేరిన ట్లవును

సిరులరాజై తే నేమిసేసిన నేరమి లేదు
పరమాధికారియైతే బాపము లేదు
అరసి తనకుదానే అనుమానించుకొనెనా
తెరువే పో?సుంకరి దెలిపినట్లవును

భూమెల్ల మేసినా నాబోతుకు బందె లేదు
నేమపుబ్రపన్నునికి నింద లేదు
యీ మేర శ్రీవేంకటేశ్వరుని శరుణుని
సోమరి కర్మమంటితే జుంటీగ కతవును

Ma~ri haridaasudai (Raagam:Daesaakshi ) (Taalam: )

Ma~ri haridaasudai maayala jikkuvaditae
Ve~rapimchaboyi tanae ve~rachinatluvunu

Soorudainavaadaedajochchina naddamu laedu
Aareetij~naaniki vidhu laddamu laevu
Kaaranaana nappatinee galigenaa nadi mari
Taerinaneella vamdu daerina tlavunu

Sirularaajai tae naemisaesina naerami laedu
Paramaadhikaariyaitae baapamu laedu
Arasi tanakudaanae anumaanimchukonenaa
Teruvae po?sumkari delipinatlavunu

Bhoomella maesinaa naabotuku bamde laedu
Naemapubrapannuniki nimda laedu
Yee maera sreevaemkataesvaruni sarununi
Somari karmamamtitae jumteega katavunu