hari yavatAra mItaDu - హరి యవతార మీతడు

హరి యవతార (రాగం: ) (తాళం : )

ప|| హరి యవతార మీతడు అన్నమయ్య | అరయ మా గురుడీతడు అన్నమయ్య |

చ|| వైకుంఠ నాథుని వద్ద వడి పడు చున్న వాడు | ఆకరమై తాళ్ళపాక అన్నమయ్య |
ఆకసపు విష్ణు పాదమందు నిత్యమై ఉన్న వాడు | ఆకడీకడ తాళ్ళపాక అన్నమయ్య ||

చ|| ఈవల సంసార లీల ఇందిరేశుతో నున్న వాడు | ఆవటించి తాళ్ళపాక అన్నమయ్య |
భావింప శ్రీ వేంకటేశు పదములందే యున్నవాడు | హావ భావమై తాళ్ళపాక అన్నమయ్య ||

చ|| క్షీరాబ్ధిశాయి బట్టి సేవింపుచు నున్నవాడు | ఆరితేరి తాళ్ళపాక అన్నమయ్య |
ధీరుడై సూర్యమణ్డల తేజము వద్ద నున్నవాడు | ఆరీతుల తాళ్ళపాక అన్నమయ్య ||

hari yavatAra (Raagam: ) (Taalam: )

pa|| hari yavatAra mItaDu annamayya | araya mA guruDItaDu annamayya |

ca|| vaikuMTha nAthuni vadda vaDi paDu cunna vADu | Akaramai tALLapAka annamayya |
Akasapu viShNu pAdamaMdu nityamai unna vADu | AkaDIkaDa tALLapAka annamayya ||

ca|| Ivala saMsAra lIla iMdirESutO nunna vADu | AvaTiMci tALLapAka annamayya |
BAviMpa SrI vEMkaTESu padamulaMdE yunnavADu | hAva BAvamai tALLapAka annamayya ||

ca|| kShIrAbdhiSAyi baTTi sEviMpucu nunnavADu | AritEri tALLapAka annamayya |
dhIruDai sUryamaNDala tEjamu vadda nunnavADu | ArItula tALLapAka annamayya ||

Sung by:Sobha Raju

Get this widget | Track details | eSnips Social DNA

hari yavatAramE - హరి యవతారమే

హరి యవతారమే (రాగం: ) (తాళం : )

ప|| హరి యవతారమే ఆతండితడు| పరము సంకీర్తన ఫలములో నిలిపే |

చ|| ఉన్నాడు వైకుంఠమున ఉన్నాడు ఆచార్యునొద్ద | ఉన్నతోన్నత మహిమ అన్నమయ్య |
ఉన్నవి సంకీర్తనలు ఒట్టుక లోకములందు| అన్నీనా నారదాదులు పై పై పాడగాను||

చ|| శ్రీ వేంకటాద్రి మీద శ్రీపతి కొలువు నందు | ఆవహించె తాళ్ళపాక అన్నమయ్య |
దేవతలు మునులును దేవుండని జయవెట్ట | కోవిదుడై తిరుగాడి కోనేటి దండను ||

hari yavatAramE (Raagam: ) (Taalam: )

pa|| AtanDitaDu | paramu saMkErtana phalamulO nilipE|

ca|| unnaDu vaikunThamuna unnaDu AcAryunodda | unnatOnnata mahima annamayya|
unnavi saMkErtanalu oTTuka lOkamulaMdu | annIna nArdAdulu pai pai pADagaanu ||

ca|| SrI vEnkaTAdri mIda SrI koluvu naMdu | Avahimce tALLapAka annamayya |
dEvatalu munulunu dEvuMDani jayaveTTa | kOviduDai tiruGaadi kOnETi daMDanu ||


hari SaraNAgati - హరి శరణాగతి

హరి శరణాగతి (రాగం: ) (తాళం : )

ప|| హరి శరణాగతి యాతుమది | సరుస నిదియెపో సతమయ్యెడిది ||

చ|| దిన దిన రుచులివి దేహము వి- | చెనకెటి కోరిక చిత్తముది- |
యెనసెటి కాంతులు యింద్రియంబులవి | పనివి యాత్మకిని పసిలేదయ్యా ||

చ|| పదరెటి కోపము పాపముది | అదవ గాలములు అనాదివి |
నిదుర తమోగుణ నిలయముది | యెదుట నాత్మకివి యెవరయ్యా ||

చ|| కాయపు జననము కర్మముది | మాయ లంపటము మమతలది |
యేయెడ శ్రీ వేంకటేశుడితని కృప | పాయని యాత్మకు బ్రమాణమయ్యా ||

hari SaraNAgati (Raagam: ) (Taalam: )

pa|| hari SaraNAgati yAtumadi | sarusa nidiyepO satamayyeDidi ||

ca|| dina dina ruculivi dEhamu vi- | cenakeTi kOrika cittamudi- |
yenaseTi kAMtulu yiMdriyaMbulavi | panivi yAtmakini pasilEdayyA ||

ca|| padareTi kOpamu pApamudi | adava gAlamulu anAdivi |
nidura tamOguNa nilayamudi | yeduTa nAtmakivi yevarayyA ||

ca|| kAyapu jananamu karmamudi | mAya laMpaTamu mamataladi |
yEyeDa SrI vEMkaTESuDitani kRupa | pAyani yAtmaku bramANamayyA ||


Hina dasalu bondi - హీన దశలు బొంది

Hina dasalu bondi - హీనదశలు బొంది | Annamayya Lyrics | Sankeertanalu | Songs | Telugu & English

 హీనదశలు (రాగం:దేసాక్షి ) (తాళం : )

॥పల్లవి॥ హీనదశలఁబొంది యిట్ల నుండుటకంటె

నానావిధులను నున్ననాఁడే మేలు


॥చ1॥ అరుదైన క్రిమికీటకాదులందుఁ బుట్టి

పరిభవములనెల్లఁ బడితిఁ గాని

యిరవైనచింత నాఁడింతలేదు యీ-

నరజన్మముకంటె నాఁడే మేలు


॥చ2॥ తొలఁగక హేయజంతువులయందుఁ బుట్టి

పలువేదనలనెల్లఁ బడితిఁగాని

కలిమియు లేమియుఁ గాన నేఁ డెఱిఁగి

నలఁగి తిరుగుకంటె నాఁడే మేలు


॥చ3॥ కూపనరకమున గుంగి వెనకకు నేఁ

బాపవిధులనెల్లఁ బడితిఁగాని

యేపునఁ దిరువేంకటేశ నా కిటువలె

నాపాలఁ గలిగినాఁడే మేలు


Hina dasalu (Raagam:Desakshi ) (Taalam: )

Hina dasalu bondi itlu nunduta kante
Nana vidhulanu nunnanade melu

Arudeina krimi keetakaalandu putti
Paribhavamulanella baditigaani
Iravei na chinta naadinta ledu ee-
Narajanmamukante naade melu

Tolagaka heyajantuvulayandu putti
Paluvedananellla baditi gaani
Kalimiyu lemiyu gaana nederigi
Nalagi tirugukante naade melu

Kupanarakamuna gungi venakakune
Baapavidhulanella baditigaani
Yepuna tiruvenkatesa naa kituvale
Naapaalagaligina naade melu


harineruganipuNya - హరినెరుగనిపుణ్య

హరినెరుగనిపుణ్య (రాగం: ) (తాళం : )

ప|| హరినెరుగనిపుణ్య మంటేరుగాన | దురితాలే దురితాలే దురితాలే సుండీ ||

చ|| దొడ్డపుణ్యములు సేసి తుదలేనిసంపదలు | అడ్డగించుకొని రాసులగుగురుతు |
జడ్డులేనిహరికథ చవిలేకుండిన నిట్టే | గొడ్డరే గొడ్డరే గొడ్డరే సుండీ ||

చ|| వలెనని మేలెల్ల వడిజేసి కైవల్య- | మలమి చేతిలోననగు గురుతు |
తలపు వైష్ణవభక్తి దగులకుండిన నంతా | అలయికే అలయికే అలయకే సుండి ||

చ|| తిరమైనట్టితీర్థాలు దిరిగి యందరిలొన | ధర బుణ్యుడవుట యంతకు గురుతు |
తిరువేంకటపతి దెలియకుండిన నంతా | విరసాలే విరసాలే విరసాలే సుండీ ||

harineruganipuNya (Raagam: ) (Taalam: )

pa|| harineruganipuNya maMTErugAna | duritAlE duritAlE duritAlE suMDI ||

ca|| doDDapuNyamulu sEsi tudalEnisaMpadalu | aDDagiMcukoni rAsulagugurutu |
jaDDulEniharikatha cavilEkuMDina niTTE | goDDarE goDDarE goDDarE suMDI ||

ca|| valenani mElella vaDijEsi kaivalya- | malami cEtilOnanagu gurutu |
talapu vaiShNavaBakti dagulakuMDina naMtA | alayikE alayikE alayakE suMDi ||

ca|| tiramainaTTitIrthAlu dirigi yaMdarilona | dhara buNyuDavuTa yaMtaku gurutu |
tiruvEMkaTapati deliyakuMDina naMtA | virasAlE virasAlE virasAlE suMDI ||


hari nIyanumatO - హరి నీయనుమతో

హరి నీయనుమతో (రాగం: ) (తాళం : )

ప|| హరి నీయనుమతో ఆది నాకర్మమో | పరమే యిహమై భ్రమయించీని ||

చ|| కలుగదు శాంతము కటకట బుద్ధికి | చలమున నింతా జదివినను |
నిలువదు చిత్తము నీపై చింతకు | పలుసంపదలను బరగినను ||

చ|| తగులదు వైరాగ్యధన మాత్మకును | వొగి నుపవాసము లుండినను |
అగపడదు ముక్తి ఆసలనాసల | జగమింతా సంచరించినను ||

చ|| విడువదు జన్మము వివేకముననే | జడిసి స్వతంత్రము జరపినను |
యెడయక శ్రీవేంకటేశ్వర నీవే | బడిగాచితి విదె బ్రదికితి నేను ||

hari nIyanumatO (Raagam: ) (Taalam: )

pa|| hari nIyanumatO Adi nAkarmamO | paramE yihamai BramayiMcIni ||

ca|| kalugadu SAMtamu kaTakaTa buddhiki | calamuna niMtA jadivinanu |
niluvadu cittamu nIpai ciMtaku | palusaMpadalanu baraginanu ||

ca|| taguladu vairAgyadhana mAtmakunu | vogi nupavAsamu luMDinanu |
agapaDadu mukti AsalanAsala | jagamiMtA saMcariMcinanu ||

ca|| viDuvadu janmamu vivEkamunanE | jaDisi svataMtramu jarapinanu |
yeDayaka SrIvEMkaTESvara nIvE | baDigAciti vide bradikiti nEnu ||


Hari nive sarvatma - హరి నీవె సర్వాత్మ

Hari nive sarvatma - హరి నీవె సర్వాత్మ | Annamayya Lyrics | Sankeertanalu | Songs | Telugu & English

Listen Audio by G BALAKRISHNA PRASAD:

హరి నీవె (రాగం: ) (తాళం : )

హరి నీవె సర్వాత్మకుడవు
యిరవగు భావననీయగదె

చూడకమానవు చూచేటి కన్నులు
ఏడనేవైనయితరములు
నీడలనింతానీరూపములని
ఈడువదని తెలివీయగదె

పారక మానదు పాపపు మనసిది
ఈరసములతో ఎంతైనా
నీరజాక్షయిది నీమయమేయని
ఈరీతులతలపీయగదె

కలుగక మానవు కాయపు సుఖములు
ఇలలోపల గలవెన్నైనా
అలరిని శ్రీవేంకటధిప నీకే
యిలనర్పితమను ఇహమీయగదె

hari neeve (Raagam: ) (Taalam: )

hari neeve sarvaatmakuDavu
yiravagu bhaavananeeyagade

chooDakamaanavu choochaeTi kannulu
aeDanaevainayitaramulu
neeDalaniMtaaneeroopamulani
eeDuvadani teliveeyagade

paaraka maanadu paapapu manasidi
eerasamulatO eMtainaa
neerajaakshayidi neemayamaeyani
eereetulatalapeeyagade

kalugaka maanavu kaayapu sukhamulu
ilalOpala galavennainaa
alarini SreevaeMkaTadhipa neekae
yilanarpitamanu ihameeyagade