sakala jIvulakella - Top/Popular/Annamayya/annamacarya/spiritual/devotional/traditional/songs/ lyrics/Audio/videos/telugu/english
అ : సకల జీవులకెల్ల సంజీవి యీమందు వెకలులై యిందరు సేవించరో యీమందు చ : మూడు లోకము లొక్కట ముంచి పెరిగినది పోడిమి నల్లని కాంతి బొదలినది పేడుక కొమ్ములు నాల్గు పెనచి చేయివారినది నాడే శేషగిరిమీద నాటుకొన్న మందు చ : పడిగెలు వేయింటి పాము గాచుకున్నది కడు వేదశాస్త్రముల గబ్బు వేసేది యెడయక వొకకాంత యెక్కుక వుండినది కడలేని యంజనాద్రి గారుడపు మందు చ : బలు శంఖు జక్రముల బదనికెలున్నది తలచిన వారికెల్ల తత్త్వమైనది అలరిన బ్రహ్మరుద్రాదుల బుట్టించినది వెలుగు తోడుత శ్రీవేంకటాద్రి మందు a : sakala jIvulakella saMjIvi yImaMdu vekalulai yiMdaru sEviMcarO yImaMdu ca : mUDu lOkamu lokkaTa muMci periginadi pODimi nallani kAMti bodalinadi pEDuka kommulu nAlgu penaci cEyivArinadi nADE SEShagirimIda nATukonna maMdu ca : paDigelu vEyiMTi pAmu gAcukunnadi kaDu vEdaSAstramula gabbu vEsEdi yeDayaka vokakAMta yekkuka vuMDinadi kaDalEni yaMjanAdri gAruDapu maMdu ca : balu SaMKu jakramula badanikelunnadi talacina vArikella tattvamainadi alarina brahmarudrAdula buTTiMcinadi velugu tODuta SrIvEMkaTAdri maMdu Get this widget | ...