Chittaginchu ma matalu - చిత్తగించు మా మాటలు

Chittaginchu ma matalu - చిత్తగించు మా మాటలు | Annamayya Lyrics | Sankeertanalu | Songs | Telugu & English

Listen Audio by PS RANGANATH & VIJAYALAKSHMI SHARMA:


॥పల్లవి॥ చిత్తగించు మా మాటలు శ్రీనరసింహ
చిత్తజజనక వో శ్రీనరసింహ

॥చ1॥ చెలరేఁగి యున్నాఁడవు శ్రీనరసింహ నీకు
చెలు లెల్లా మొక్కేరు శ్రీనరసింహ
సెలవుల నవ్వే రిట్టె శ్రీనరసింహ నీకె
సెలవు మా వలపు శ్రీనారసింహ

॥చ2॥ చిందీని చెమటలు శ్రీనరసింహ నినుఁ
జెందీ నది కడుజాణ శ్రీనరసింహా
చెందమ్మిరేకుగోళ్ల శ్రీనరసింహ నీపై
చిందు లెల్లఁ బాడేము శ్రీనారసింహ

॥చ3॥ సిరి నెరగౌఁగిటి శ్రీనరసింహ మంచి
సిరుల యహోబల శ్రీనరసింహ
సిర నెత్తు శ్రీవేంకట శ్రీనారసింహ నీ
నెర బడివారము శ్రీనారసింహా

॥Pallavi॥ cittagin̄cu mā māṭalu śrīnarasinha 
cittajajanaka vō śrīnarasinha 
॥ca1॥ celarēm̐gi yunnām̐ḍavu śrīnarasinha nīku 
celu lellā mokkēru śrīnarasinha 
selavula navvē riṭṭe śrīnarasinha 
nīke selavu mā valapu śrīnārasinha 
॥ca2॥ cindīni cemaṭalu śrīnarasinha 
ninum̐ jendī nadi kaḍujāṇa śrīnarasinhā 
cendam'mirēkugōḷla śrīnarasinha 
nīpai cindu lellam̐ bāḍēmu śrīnārasinha 
॥ca3॥ siri neragaum̐giṭi śrīnarasinha 
man̄ci sirula yahōbala śrīnarasinha 
sira nettu śrīvēṅkaṭa śrīnārasinha 
nī nera baḍivāramu śrīnārasinhā