rachcha kekkitivi paMDaraMgi viThalA
రచ్చ కెక్కితివి పండరంగి విఠలా పచ్చిదేరే వింతలోనే పండరంగివిఠలా గుట్టుగల దొరవని కొసరి చూచినంతనె రట్టుగా నవ్వేవు పండరంగి విఠలా మట్టుమీరి తమకపు మాటలనె నీవలపు బట్టబయలె సేసేవు పండరంగి విఠలా సాగినసబలలోన సన్న సేసినంతలోనే రాగిదేలించేవు పండరంగి విఠలా వేగిరపు చేతలనె విరిని(?) నీ మోహమెల్ల బాగుగా వెళ్ళ వేసేవు పండరంగి విఠలా తతినీవున్నచోటికి దగ్గర వచ్చినంతనె రతి( గూడితివి పండరంగి విఠలా గతియైన శ్రీవేంకటనాథ యేలితివి పతివై కోవిలకుంట్ల పండరంగి విఠలా rachcha kekkitivi paMDaraMgi viThalA pachchidErE viMtalOnE paMDaraMgiviThalA guTTugala doravani kosari chUchinaMtane raTTugA navvEvu paMDaraMgi viThalA maTTumIri tamakapu mATalane nIvalapu baTTabayale sEsEvu paMDaraMgi viThalA sAginasabalalOna sanna sEsinaMtalOnE rAgidEliMchEvu paMDaraMgi viThalA vEgirapu chEtalane virini(?) nI mOhamella bAgugA veLLa vEsEvu paMDaraMgi viThalA tatinIvunnachOTiki daggara vachchinaMtane rati( gUDitivi paMDaraMgi viThalA a gatiyaina SrIvEMkaTanAtha yElitivi pativai kOvilakuMTla paMDaraMgi viThalA