Andaru maalinayatti - అందరు మాలినయట్టి

అందరు మాలినయట్టిఆధమూలాల పొంత సంతకూటమి పొరిచూపు గాదా

కనక మిత్తడితోడ కలయ సరిదూచితే అనువనువునా అది దోషమవుగాక ఘనుడైనహరితో గడుహీనదేవతల నవిచి సరివెట్టితే నయ మవునా భువిని

పట్టభద్రుడు గూర్చుండేబలుసింహాసనముపై వెట్టింబంటు బెట్టేవారు వెఱ్రులేకారా గట్టిగా శ్రీహరితోడ కలగంపదేవతల బెట్టి కొలుచుట విందువెట్టి పగగాదా

కొంచక సింహముండేటిగుహ నుండవచ్చునా పొంచి నక్కలకెల్ల బొక్కలేకాక అంచెల శ్రీవేంకటేశుడాత్మలోనే వుండగాను కొంచపుదైవాల పలువంచలనేకాక

Andaru maalinayattiaadhamoolaala Ponta santakootami porichoopu gaadaa

Kanaka mittaditoda kalaya saridoochite Anuvanuvunaa adi doshamavugaaka Ghanudainaharito gaduheenadevatala Navichi sarivettite naya mavunaa bhuvini

Pattabhadrudu goorchumdebalusimhaasanamupai Vettinbantu bettevaaru verrulekaaraa Gattigaa sreeharitoda kalaganpadevatala Betti koluchuta vinduvetti pagagaadaa

Konchaka sinhamumdetiguha nundavachchunaa Ponchi nakkalakella bokkalekaaka Anchela sreevenkatesudaatmalone vundagaanu Konchapudaivaala paluvamchalanekaaka