Ihaparasadhana midi - ఇహపరసాధన మిది

Ihaparasadhana midi - ఇహపరసాధన మిది | Annamayya Lyrics | Sankeertanalu | Songs | Telugu & English

Listen Audio by G BALAKRISHNA PRASAD:

ఇహపరసాధన మిది (రాగం:శుద్ధవసంతం ) (తాళం : )

ఇహపరసాధన మిది యొకటే

సహజపు మురారిసంకీర్తన నొకటే ॥పల్లవి॥


భవసాగరములఁ బాపెడిది తేప

భువి నజ్ఞానముపులివాకట్టిది

జవళి నాశాపాశములకుఁ గొడువలి

నవనీతచోరునామం బొకటే ॥ఇహ॥


చింతాతిమిరముఁ జెరిచేటి సూర్యుఁడు

అంతట దరిద్రహతపు నిధానము

వింతమరణభయ వినాశమంత్రము

మంతుకు హరినామంబిది యొకటే ॥ఇహ॥


మించు దు:ఖములమృత సంజీవని

అంచలఁ బంచేద్రియములు కంకుశము

యెంచగఁ శ్రీవేంకటేశు దాసులకు

బంచిన పాళ్లఁ బరగినదొకటే ॥ఇహ॥

ihaparasAdhana midi (Raagam:SuddhavasaMtaM ) (Taalam: )

ihaparasAdhana midi yokaTE

sahajapu murArisaMkIrtana nokaTE ॥pallavi॥


bhavasAgaramula@M bApeDidi tEpa

bhuvi naj~nAnamupulivAkaTTidi

javaLi nASApASamulaku@M goDuvali

navanItachOrunAmaM bokaTE ॥iha॥


chiMtAtimiramu@M jerichETi sUryu@MDu

aMtaTa daridrahatapu nidhAnamu

viMtamaraNabhaya vinASamaMtramu

maMtuku harinAmaMbidi yokaTE ॥iha॥


miMchu du:khamulamRta saMjIvani

aMchala@M baMchEdriyamulu kaMkuSamu

yeMchaga@M SrIvEMkaTESu dAsulaku

baMchina pALla@M baraginadokaTE ॥iha॥