Nede sukkuraramu - నేడె సుక్కురారము
Nede sukkuraramu - నేడె సుక్కురారము | Annamayya Lyrics | Sankeertanalu | Songs | Telugu & English
Listen Audio by VANI JAIRAM:
నేఁడె సుక్కురారము నెలఁతలాల
పోఁడిమి సేవసేయరే పుణుఁగుకాపు ॥పల్లవి॥
పన్నీటి కాలువలు పారీనిఁజూడరే
అన్నిటాఁ గొండవంటి శ్రీహరిమీఁదను
యెన్ననభిషేకమంత్రాలిదె చెప్పేరు వినరే
తిన్నని పుళుగుకాపు దేవునికి నేఁడు ॥నేఁడె॥
రాలీని కప్పురరజమిదె చూడరే
నీలమేఘమువంటి యీ నీరజాక్షుపై
తాలమితో జాలువారీ తట్టుపుణుఁగదిగోరే
పోలింపఁ బుణుఁగుకాపు పురుషోత్తమునికి ॥నేఁడె॥
అలమేలు మంగతోడి హారాలు సేవించరే
వెలయ ధరించెను శ్రీవెంకటేశుఁడు
పలువిందులారగించె బాగాలు యియ్యరే
చెలఁగీ పుణుఁగుకాపు శేషాద్రిపతికి ॥నేఁడె॥
nE@MDe sukkurAramu nela@MtalAla
pO@MDimi sEvasEyarE puNu@MgukApu ॥pallavi॥
pannITi kAluvalu pArIni@MjUDarE
anniTA@M goMDavaMTi SrIharimI@Mdanu
yennanabhishEkamaMtrAlide cheppEru vinarE
tinnani puLugukApu dEvuniki nE@MDu ॥nE@MDe॥
rAlIni kappurarajamide chUDarE
nIlamEghamuvaMTi yI nIrajAkshupai
tAlamitO jAluvArI taTTupuNu@MgadigOrE
pOliMpa@M buNu@MgukApu purushOttamuniki ॥
nE@MDe॥
alamElu maMgatODi hArAlu sEviMcharE
velaya dhariMchenu SrIveMkaTESu@MDu
paluviMdulAragiMche bAgAlu yiyyarE
chela@MgI puNu@MgukApu SEshAdripatiki ॥nE@MDe॥