Muddugare yasoda - ముద్దుగారే యశోద |
Annamayya Lyrics | Sankeertanalu | Songs | Telugu & English
Listen Audio by G Balakrishna Prasad:
Your browser does not support the audio element.
ముద్దుగారే యశోద (రాగం:సాళంగనాట ) (తాళం : )
ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు తిద్దరాని మహిమల దేవకీ సుతుడు అంత నింత గొల్లెతల అరచేతి మాణికము పంత మాడే కంసుని పాలి వజ్రము కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ బూస చెంతల మాలో నున్న చిన్ని కృష్ణుడు రతికేళి రుక్మిణికి రంగు మోవి పగడము మితి గోవర్ధనపు గోమేధికము సతమై శంఖ చక్రాల సందుల వైడూర్యము గతియై మమ్ము గాచేటి కమలాక్షుడు కాళింగుని తలలపై గప్పిన పుష్యరాగము యేలేటి శ్రీ వేంకటాద్రి యింద్రనీలము పాల జలనిధి లోన బాయని దివ్య రత్నము బాలునివలె దిరిగీ బద్మ నాభుడు
Muddugaarae yasoda (Raagam: saalamganaata) (Taalam: )
Muddugaarae yasoda mumgiti mutyamu veedu Tiddaraani mahimala daevakee sutudu Amta nimta golletala arachaeti maanikamu Pamta maadae kamsuni paali vajramu Kaamtula moodu lokaala garuda pachcha boosa Chemtala maalo nunna chinni krshnudu Ratikaeli rukminiki ramgu movi pagadamu Miti govardhanapu gomaedhikamu Satamai samkha chakraala samdula vaidooryamu Gatiyai mammu gaachaeti kamalaakshudu Kaalimguni talalapai gappina pushyaraagamu Yaelaeti Sree vaemkataadri yimdraneelamu Paala jalanidhi lona baayani divya ratnamu Baalunivale dirigee badma naabhudu
Listen Audio by PRIYA SISTERS: