adiyepO SrIhari nAmamu - అదియెపో శ్రీహరి

అదియెపో శ్రీహరి నామము
తుదిపదమిదియె ధృవమై కలిగె

తొడరి చిత్రకేతు డే నామము
తడవి లోకమంతయు గెలిచె

విడువక బ్రహ్మయు వెస నే నామము
బడిబడి నుడుగుచు ప్రభుడై నిలిచె

హరుడే నామము అదె తారకముగ
నిరతిఁదడవి యెన్నిక మీరె
ధర నే నామము దలచి నారదుడు
సురమునియై సంస్తుతులకు నెక్కె

ధృవుడే నామము దొరకొని నుతియించి
ధృవ పట్టంబున తుద బ్రదికె
జవళి శ్రీ వేంకటేశ్వరుదాసులెల్లాను
భువి నేనామము భోగించి మనిరి


adiyepO SrIhari nAmamu
tudipadamidiye dhRvamai kalige

toDari chitrakEtu DE nAmamu
taDavi lOkamaMtayu geliche
viDuvaka brahmayu vesa nE nAmamu
baDibaDi nuDuguchu prabhuDai niliche

haruDE nAmamu ade tArakamuga
nirati@MdaDavi yennika mIre
dhara nE nAmamu dalachi nAraduDu
suramuniyai saMstutulaku nekke

dhRvuDE nAmamu dorakoni nutiyiMchi
dhRva paTTaMbuna tuda bradike
javaLi SrI vEMkaTESwarudAsulellAnu
bhuvi nEnAmamu bhOgiMchi maniri


nApAli ghana nidhAnamuvu - నాపాలి ఘన నిధానమువు



నాపాలి ఘన నిధానమువు నీవే నన్ను
నీపాల నిడుకొంటి నీవే నీవే

ఒలిసి నన్నేలే దేవుడవు నీవే యెందు
తొలగని నిజబంధుడవు నీవే
పలుసుఖమిచ్చే సంపదవు నీవే యిట్టే
వెలయ నిన్నియును నీవే నివే


పొదిగి పాయని ఆప్తుడవు నివే నాకు
నదన తోడగు దేహమవు నీవే
మదమువాపెడినా మతియు నీవే నాకు
వెదక నన్నియును నీవే నీవే

యింకా లోకములకు నెప్పుడు నీవే యీ
పంకజభవాది దేవపతి నీవే
అంకిలి వాపగ నంతకు నీవే తిరు
వేంకటేశ్వరుడవు నీవే నీవే


nApAli ghana nidhAnamuvu nIvE nannu
nIpAla niDukomTi nIvE nIvE

olisi nannElE dEvuDavu nIvE yemdu
tolagani nijabamdhuDavu nIvE
palusukhamiccE sampadavu nIvE yiTTE
velaya ninniyunu nIvE nivE

podigi pAyani AptuDavu nivE nAku
nadana tODagu dEhamavu nIvE
madamuvApeDinA matiyu nIvE nAku
vedaka nanniyunu nIvE nIvE

yimkA lOkamulaku neppuDu nIvE yI
pamkajabhavAdi dEvapati nIvE
amkili vApaga namtaku nIvE tiru
vEmkaTESvaruDavu nIvE nIvE


vEvElu bandhamulu - వేవేలు బంధములు


వేవేలు బంధములు విడువముడువంబట్టె
దైవమా నిన్నెట్టు తగిలేమయ్య

పారేముందటి భవపాశములు
తీరీదొల్లిటి తిత్తి లో పుణ్యము
కోరీ కోరికలొకటొకటే
ఏ రీతి సుజ్ఞాన విరిగేనయ్య

పట్టినాకొంగు పంచేంద్రియములు
తొట్టీ పాపము తోడుతనే
పెట్టీ భ్రమల పెరిగెనీ మాయలు
అట్టే మోక్షము ఎన్నడందేమయ్య

విందై ఇహము వెనకకూతీసి
అందీ వైరాగ్యం అరచేతికి
కందువా శ్రీవేంకటపతి ఈ రెండు
బంధించి తివేది భోగింతునయ్యా


vEvElu bandhamulu viDuvamuDuvambaTTe
daivamA ninneTTu tagilEmayya

pArEmumdaTi bhavapASamulu
tIrIdolliTi titti lO puNyamu
kOrI kOrikalokaTokaTE
E rIti suj~nAna virigEnayya

paTTinAkongu panchEndriyamulu
toTTI pApamu tODutanE
peTTI bhramala perigenI mAyalu
aTTE mOkshamu ennaDandEmayya

vindai ihamu venakakUtIsi
amdI vairAgyam aracEtiki
kanduvA SrIvEmkaTapati I remDu
bamdhimci tivEdi bhOgimtunayyA


soridi saMsAraMbu - సొరిది సంసారంబు


ప|| సొరిది సంసారంబు సుఖమా యిందరికి | వెరవెఱంగక వగల వేగేరుగా ||

చ|| దేహములు దలప సుస్థిరములా ప్రాణులకు- | నూహింప లోభ మట్లుండుగాక |
మోహంబుచే వెనుకముందెఱుగలేక తమ- | దేహసుఖములు మరిగి తిరిగేరుగాక ||

చ|| నెలకొన్నద్రవ్యములు నిలుచునా యెవ్వరికి | అలవి నిలుపగరాని యాసగాక |
బలువైనవట్టిభ్రాంతిచే దగులువడి | తెలిసియును దెలియకిటు తిరిగేరుగాక ||

చ|| నెఱయువిభవములెల్ల నిజములా యిందరికి | కొఱమాలినట్టి తమగుణముగక |
యెఱుకతో దిరువేంకటేశు గొలువగలేక | తెఱగుమాలినబుద్ధి దిరిగేరుగాక ||



pa|| soridi saMsAraMbu suKamA yiMdariki | veraverxaMgaka vagala vEgErugA ||

ca|| dEhamulu dalapa susthiramulA prANulaku- | nUhiMpa lOBa maTluMDugAka |
mOhaMbucE venukamuMderxugalEka tama- | dEhasuKamulu marigi tirigErugAka ||

ca|| nelakonnadravyamulu nilucunA yevvariki | alavi nilupagarAni yAsagAka |
baluvainavaTTiBrAMticE daguluvaDi | telisiyunu deliyakiTu tirigErugAka ||

ca|| nerxayuviBavamulella nijamulA yiMdariki | korxamAlinaTTi tamaguNamugaka |
yerxukatO diruvEMkaTESu goluvagalEka | terxagumAlinabuddhi dirigErugAka ||


ennaDu tIravu Ipanulu - ఎన్నడు తీరవు


ఎన్నడు తీరవు ఈపనులు
పన్నిన నీమాయ బహుళంబాయె

పెక్కుమతంబుల పెద్దలునడచిరి
ఒక్కసమ్మతై ఒడబడరు
పెక్కుదేవతలు పేరు ఆడెదరు
తక్కక ఘనులము తామేఅనుచు

పలికెడి చదువులు బహుమార్గంబులు
కలసి ఏకవాక్యత కాదు
చలవాదంబులు జనులు మానరు
పలు తర్కంబులె పచరించేరు

శరణాగతులకు శ్రీవేంకటేశ్వర
తిరముగ నీవే తీర్చితివీ
పరమవైష్ణవులు పట్టిరివ్రతము
ఇరవుగ నాచార్యులెరుగుదురూ


ennaDu tIravu Ipanulu
pannina nImAya bahuLambAye

pekkumatambula peddalunaDaciri
okkasammatai ODabaDaru
pekkudEvatalu pEru ADedaru
takkaka ghanulamu tAmEanucu

palikeDi caduvulu bahumArgambulu
kalasi EkavAkyata kAdu
calavAdambulu janulu mAnaru
palu tarkambule pacarimcEru

SaraNAgatulaku SrIvEmkaTESwara
tiramuga nIvE tIrcitivI
paramavaishNavulu paTTirivratamu
iravuga nAchAryulerugudurU


hari hari nI mAyAmahima - హరి హరి నీ మాయా

హరి హరి నీ మాయామహిమ
సరవి దెలియ నను గరుణించగదే

తలతును నా పాలిదైవమవని నిను
తలతును తల్లిని దండ్రివని
మలసి యంతలో మఱతును తెలుతును
కలవలె నున్నది కడగనరాదు

మొక్కుదు నొకపరి మొగినేలికవని
మొక్కుదు నీ వాదిమూలమని
వుక్కున గర్వించి యుబ్బుదు సగ్గుదు
కక్కసమైనది కడ గనరాదు

చూతును నీమూర్తి సులభుడవనుచును
చూతు జగములకు సోద్యమని
యీతల శ్రీ వేంకటేశ నన్నేలితివి
కౌతుకమొదవెను కడ గనరాదు


hari hari nI mAyAmahima
saravi deliya nanu garuNiMcagadE

talatunu nA pAlidaivamavani ninu
talatunu tallini daMDrivani
malasi yaMtalO marxatunu telutunu
kalavale nunnadi kaDaganarAdu

mokkudu nokapari moginElikavani
mokkudu nI vAdimUlamani
vukkuna garviMci yubbudu saggudu
kakkasamainadi kaDa ganarAdu

cUtunu nImUrti sulabhuDavanucunu
cUtu jagamulaku sOdyamani
yItala SrI vEMkaTESa nannElitivi
kautukamodavenu kaDa ganarAdu


SaraNAgata vajra paMjaruDitaDu - శరణాగత వజ్ర


ప|| శరణాగత వజ్ర పంజరుడితడు చక్రధరుడు అసుర సంహారుడు
అప వెరవుతోడ తను శరణనువారికి వెనుబలమీతడే రక్షకుడు

చ|| అంతరాత్మ శ్రీ వేంకటేశ్వరుడు అన్యము భజించ చోటేది
ఇంతట నమ్మక దేవతాంతరము లేటేటివొ మరి చెప్పుదురు
ఎంతలేదు ప్రాకృత జనముల భ్రమ ఎవ్వరి కాదన నేమిటికి
ఇంతకు శ్రీ వేంకటేశు దాసుల ఈతడే మాకిక రక్షకుడు

చ|| శ్రీపతి దిక్కై కావగ జేరని సంపద లికనేవి
దాపల బుద్ధుల నది నమ్మక విచ్చలవిడి నోములు చెప్పుదురు
తీపులు పుట్టించి యెవ్వ రేమనిన తెలిపి వాదడువ నేమిటికి
శ్రీపతి గొలిచితి చేరె సంపదలు జిగినితడే మా రక్షకుడు


pa|| SaraNAgata vajra paMjaruDitaDu cakradharuDu asura saMhAruDu
apa veravutODa tanu SaraNanuvAriki venubalamItaDE rakShakuDu

ca|| aMtarAtma SrI vEMkaTESvaruDu anyamu BajiMca cOTEdi
iMtaTa nammaka dEvatAMtaramu lETETivo mari ceppuduru
eMtalEdu prAkRuta janamula Brama evvari kAdana nEmiTiki
iMtaku SrI vEMkaTESu dAsula ItaDE mAkika rakhakuDu

ca|| SrIpati dikkai kAvaga jErani saMpada likanEvi
dApala buddhula nadi nammaka viccalaviDi nOmulu ceppuduru
tIpulu puTTiMci yevva rEmanina telipi vAdaDuva nEmiTiki
SrIpati goliciti cEre saMpadalu jiginitaDE mA rakShakuDu