ETi braduku yETi braduku - ఏటి బ్రదుకు
మాట లోనే యటమటమైన బ్రదుకు
సంతకూటములే చవులయిన బ్రదుకు
దొంతిభయములతోడి బ్రదుకు
ముంతనీళ్ళనే మునిగేటి బ్రదుకు
వంతఁ బొరలి కడవర(ల)లేని బ్రదుకు
మనసుచంచలమే మనువయిన బ్రదుకు
దినదినగండాలఁ దీరు బ్రదుకు
తనియ కాసలనె తగిలేటి బ్రదుకు
వెనక ముందర చూడ వెరపయిన బ్రదుకు
తెగి చేదెతీపయి తినియేటి బ్రదుకు
పగవారి పంచల పాలైన బ్రదుకు
తగువేంకటేశ్వరుఁ దలచని బ్రదుకు
పొగకు నోపక మంటఁ బొగిలేటి బ్రదుకు
ETi braduku yETi braduku ! vokka -
mATa lOnE yaTamaTamaina braduku
saMtakUTamulE chavulayina braduku
doMtibhayamulatODi braduku
muMtanILLanE munigETi braduku
vaMta@M borali kaDavara(la)lEni braduku
manasuchaMchalamE manuvayina braduku
dinadinagaMDAla@M dIru braduku
taniya kAsalane tagilETi braduku
venaka muMdara chUDa verapayina braduku
tegi chEdetIpayi tiniyETi braduku
pagavAri paMchala pAlaina braduku
taguvEMkaTESwaru@M dalachani braduku
pogaku nOpaka maMTa@M bogilETi braduku
Sung by: R Viswanath
|
Adarani matadi - ఆడరాని మాటది

ఆడరానిమా టది గుఱుతు
వేడుకతోనే విచ్చేయుమనవే // పల్లవి //
కాయజకేలికిఁ గడుఁ దమకించఁగ
ఆయము లంటిన దది గుఱుతు
పాయపుఁబతికినిఁ బరిణాము చెప్పి
మోయుచుఁ దన కిటు మొక్కితిననవే // ఆడ //
దప్పిమోవితో తా ననుఁ దిట్టఁగ -
నప్పుడు నవ్విన దది గుఱుతు
యిప్పుడు దనరూ పిటు దలఁచి బయలు
చిప్పిలఁ గాఁగిటఁ జేర్చితిననవే // ఆడ //
పరిపరివిధములఁ బలుకులు గులుకఁగ
అరమరచి చొక్కిన దది గుఱుతు
పరగ శ్రీవేంకటపతి కడపలోన
సరవిఁగూడె నిఁక సమ్మతియనవే // ఆడ //
ADrAnimA Tadi gurutu
vEDukatOnE vichchEyumanavE // pallavi //
kAyajakEliki gaDu damakiMchaga
Ayamu laMTina dadi gu~rutu
pAyapubatikini bariNAmu cheppi
mOyuchu dana kiTu mokkitinanavE // ADa //
dappimOvitO tA nanu diTTaga
nappuDu navvina dadi gu~rutu
yippuDu danarU piTu dalachi bayalu
chippila gAgiTa jErchitinanavE // ADa //
pariparividhamula balukulu gulukaga
aramarachi chokkina dadi gu~rutu
paraga SrIvEMkaTapati kaDapalOna
saravigUDe nika sammatiyanavE // ADa //
kuMdanapu pilla@MgrOvi - కుందనపు పిల్లగ్రోవి
కుందనపు పిల్లఁగ్రోవి గోపినాథా ! మాపైచిందేవు మోహరసాలు చిన్ని గోపినాథా
కొలనిలోపలిమాతో గోపినాథా ! యేల
కులికినవ్వు నవ్వేవు గోపినాథా
కొలువు మొక్కు మొక్కేము గోపినాథా ! నీ
చలము చెల్లితేఁ జాలు జాణ గోపినాథా
గొబ్బన మాచీరలిమ్ము గోపినాథా ! మా
గుబ్బలపైఁ గాక రేగె గోపినాథా
గుబ్బతిల్లీ తమకమే గోపినాథా నీ
కబ్బితి మేమైన చేయవయ్య గోపినాథా
కుప్పవడె మాసిగ్గు గోపినాథా ! మా
కొప్పు జారె ముడువుమా గోపినాథా
వొప్పుగ శ్రీవేంకటాద్రి నుండి వచ్చి కూడితివి
అప్ప తొండమారేగుళ్ళా ఆది గోపినాథా
kuMdanapu pilla@MgrOvi gOpinAthA ! mApai
chiMdEvu mOharasAlu chinni gOpinAthA
kolanilOpalimAtO gOpinAthA ! yEla
kulikinavvu navvEvu gOpinAthA
koluvu mokku mokkEmu gOpinAthA ! nI
chalamu chellitE@M jAlu jANa gOpinAthA
gobbana mAchIralimmu gOpinAthA ! mA
gubbalapai@M gAka rEge gOpinAthA
gubbatillI tamakamE gOpinAthA nI
kabbiti mEmaina chEyavayya gOpinAthA
kuppavaDe mAsiggu gOpinAthA ! mA
koppu jAre muDuvumA gOpinAthA
voppuga SrIvEmkaTAdri nuMDi vachchi kUDitivi
appa toMDamArEguLLA Adi gOpinAthA
challani choopulavaani chakkanivaani - చల్లని చూపులవాని

చల్లని చూపులవాని చక్కనివాని | పీలి |
చొల్లెపుఁ జుట్లవానిఁ జూపరమ్మ చెలులు
వాడలోని చెలులను వలపించి వచ్చెనే | వాడు |
చేడెల మనసు దొంగ చిన్నికృష్ణుడు
యేడుగడయునుఁ దానై యెలయించె నన్నును |వానిఁ|
జూడక వుండగ లేను చూపరమ్మ చెలులు
మందలోని గొల్లెతల మరగించి వచ్చెనే | వాడు |
సందడిపెండ్లికొడుకు జాణకృష్ణుడు
ముందు వెనకా నలమి మొహింపించె నన్నును | వాని|
పొందులు మానగ లేను పోనీకురే చెలు(లు?)
దంటవాడు కవి(లి?) కిఁచేతలకృష్ణుడు
నంటునను శ్రీవెంకటనాథుఁడై నన్నుఁ గూడెనే | వాని |
వొంటిఁ బాయలే నావద్ద నుంచరమ్మ చెలులు.
challani choopulavaani chakkanivaani | peeli |
chollepu@M juTlavaani@M jooparamma chelulu
VaaDalOni chelulanu valapinchi vacchenE | vaaDu |
chEDela manasu donga chinnikRshNuDu
yEDugaDayunu@M daanai yelayinche nannunu |vaani@M|
jooDaka vunDaga lEnu chooparamma chelulu
mandalOni golletala maraginchi vacchenE | vaaDu |
sandaDipenDlikoDuku jaaNakRShNuDu
mundu venakaa nalami mohimpinche nannunu | vaani|
pondulu maanaga lEnu pOneekurE chelu(lu?)
inTinTi yintula nellaa yelayinchi vacchenE | vaaDu|
danTavaaDu kavi(li?) ki@MchEtalakRshNuDu
nanTunanu SreevenkaTanaathu@MDai nannu@M gooDenE | vaani |
vonTi@M baayalE naavadda nuncharamma chelulu
echchaTa@MjUchina - ఎచ్చటజూచిన
కొట్టరో వుట్ట్లు గోపాలబాలులు
యిట్టె కృష్ణుని యెదుటను
పట్టరో వారలు పాలునేతికిని
గట్టిగ జోరున గారీనవిగో
కూడరో మూకలు కోలలవారలు
వేడుక కృష్ణుని వెంటవెంట
ఆడుచు మెసగరో అడుకులు చక్కిలాల్లు
వాడల వాడల వరుసతోను
నిక్కితీసుకోరో నెలవాదికాండ్లు
మక్కువ కృష్ణుని మఱగునను
యెక్కరో శ్రీవేంకటేశు కొండమీద
పెక్కు నురుగులు పెరుగులు నివిగో
echchaTa@MjUchina nitaDai kRshNuDu
machchika nalamElumaMgatO velasI
koTTarO vuTTlu gOpAlabAlulu
yiTTe kRshNuni yeduTanu
paTTarO VAralu pAlunEtikini
gaTTiga jOruna gArInavigO
kUDarO mUkalu kOlalavAralu
vEDuka kRshNuni veMTaveMTa
ADuchu mesagarO aDukulu chakkilAllu
vADala vADala varusatOnu
nikkitIsukOrO nelavAdikAMDlu
makkuva kRshNuni ma~ragunanu
yekkarO SrIvEMkaTESu koMDamIda
pekku nurugulu perugulu nivigO
Sung by:Sri Balakrishna Prasad & Bullemma
nIvokkaDavE nAkucAlu - నీవొక్కడవే నాకు
