ayyO nEnEkA - అయ్యో నేనేకా

ప|| అయ్యో నేనేకా అన్నిటికంటె దీలు | గయ్యాళినై వ్రిధా గర్వింతుగాని ||

చ|| తడిపివుదికినట్టిధౌతవస్త్రములు నా- | యొడలు మోచినమీద యోగ్యము గావు | వుడివోక వనములో వొప్పైనవిరులు నే- | ముడిచివేసినంతనే ముట్టరాదాయను ||

చ|| వెక్కసపురచనలవేవేలురుచులు నా- | వొకనాలు కంటితేనే యోగ్యముగావు | పక్కనదేవార్హపుబరిమళ గంధములు నా- | ముక్కుసోకినంతలోనే ముట్టరాదాయను ||

చ|| గగనానుండి వచ్చేగంగాజలములైన | వొగి నాగోరంటితేనె యోగ్యము గావు | నగుశ్రీవేంకటపతి నన్నే రక్షించినదాక | మొగడై యెరుకతుది ముట్టరాదాయను ||

pa|| ayyO nEnEkA anniTikaMTe dIlu | gayyALinai vridhA garviMtugAni ||

ca|| taDipivudikinaTTidhautavastramulu nA- | yoDalu mOcinamIda yOgyamu gAvu | vuDivOka vanamulO voppainavirulu nE- | muDicivEsinaMtanE muTTarAdAyanu ||

ca|| vekkasapuracanalavEvEluruculu nA- | vokanAlu kaMTitEnE yOgyamugAvu | pakkanadEvArhapubarimaLa gaMdhamulu nA- | mukkusOkinaMtalOnE muTTarAdAyanu ||

ca|| gaganAnuMDi vaccEgaMgAjalamulaina | vogi nAgOraMTitEne yOgyamu gAvu | naguSrIvEMkaTapati nannE rakShiMcinadAka | mogaDai yerukatudi muTTarAdAyanu ||

Ayyo naaneramike - అయ్యో నానేరమికే

రాగం:ఆహిరి

అయ్యో నానేరమికే అట్టే యేమని వగతు ముయ్యంచుచంచలాన మోసపోతిగాక

కాననా నావంటివారే కారా యీజంతువులు నానా యోనుల బుట్టి నడచేవారు మానక నాగర్వమున మదాంధమున ముందు గానక భయపడినకర్మి నింతేకాక

చదువనా నేదొల్లి జన్మజన్మాంతరముల ఇది పుణ్య మిది పాప మింతంతని వదలక నాభోగవాంఛలే పెంచి పెంచి తుదకెక్క వెదకనిదుషుడనేను

వినవా నే బురాణాల వెనకటివారినెల్ల మనెడిభాగవతులమహిమలెల్లా యెనయుచు శ్రీవేంకటేశుకృపచేత నేడు ఘనుడ నయితిగాక కష్టుడగానా

Raagam:Aahiri

Ayyo naaneramike atte yemani vagatu Muyyamchuchamchalaana mosapotigaaka

Kaananaa naavamtivaare kaaraa yeejamtuvulu Naanaa yonula butti nadachevaaru Maanaka naagarvamuna madaamdhamuna mumdu Gaanaka bhayapadinakarmi nimtekaaka

Chaduvanaa nedolli janmajanmaamtaramula Idi punya midi paapa mimtamtani Vadalaka naabhogavaamchale pemchi pemchi Tudakekka vedakanidushudanenu

Vinavaa ne buraanaala venakativaarinella Manedibhaagavatulamahimalellaa Yenayuchu sreevenkatesukrpacheta nedu Ghanuda nayitigaaka kashtudagaanaa



ammeDi dokaTi - అమ్మెడి దొకటి

ప|| అమ్మెడి దొకటి అసిమలోదొకటి | బిమ్మిటి నిందేటిపెద్దలమయ్యా ||

చ|| సంగము మానక శాంతియు గలుగదు | సంగలంపటము సంసారము |

యెంగిలిదేహం బింతకు మూలము | బెంగల మిందేటిపెద్దలమయ్యా ||

చ|| కోరికె లుడుగక కోపం బుడుగదు | కోరకుండ దిక్కువమనసు |

క్రూరత్వమునకు కుదువ యీబ్రదుకు | పేరడి నేమిటిపెద్దలమయ్యా ||

చ|| ఫలము లందితే బంధము వీడదు | ఫలములో తగులు ప్రపంచము |

యిలలో శ్రీవేంకటేశుదాసులము | పిలువగ నేమిటిపెద్దలమయ్యా ||

pa|| ammeDi dokaTi asimalOdokaTi | bimmiTi niMdETipeddalamayyA ||

ca|| saMgamu mAnaka SAMtiyu galugadu | saMgalaMpaTamu saMsAramu |

yeMgilidEhaM biMtaku mUlamu | beMgala miMdETipeddalamayyA ||

ca|| kOrike luDugaka kOpaM buDugadu | kOrakuMDa dikkuvamanasu |

krUratvamunaku kuduva yIbraduku | pEraDi nEmiTipeddalamayyA ||

ca|| Palamu laMditE baMdhamu vIDadu | PalamulO tagulu prapaMcamu |

yilalO SrIvEMkaTESudAsulamu | piluvaga nEmiTipeddalamayyA ||

ammamma Emamma - అమ్మమ్మ ఏమమ్మ

Govinda7.jpg
ప|| అమ్మమ్మ ఏమమ్మ అలమేల్మంగ నాంచారమ్మ | తమ్మియింట నలరుకొమ్మ ఓయమ్మ ||

చ|| నీరిలోన తల్లడించే నీకే తలవంచీ | నీరికింద పులకించీ నీరమణుండు |
గోరికొన చెమరించీ కోపమే పచరించీ | సారెకు నీయలుక ఇట్టె చాలించవమ్మ ||

చ|| నీకుగానే చెయ్యిచాచీ నిండాకోపమురేచీ | మేకొని నీవిరహాన మేను వెంచీని |
ఈకడాకడి సతుల హృదయమే పెరరేచీ | ఆకు మడిచియ్యనైన ఆనతియ్యవమ్మా ||

చ|| చక్కదనములె పెంచీ సకలము గాలదంచి | నిక్కపు వేంకటేశుడు నీకే పొంచీని |
మక్కువతో అలమేల్మంగ నాంచారమ్మ | అక్కున నాతని నిట్టే అలరించవమ్మ ||

pa|| ammamma Emamma alamElmaMga nAMcAramma | tammiyiMTa nalarukomma Oyamma ||

ca|| nIrilOna tallaDiMcE nIkE talavaMcI | nIrikiMda pulakiMcI nIramaNuMDu |
gOrikona cemariMcI kOpamE pacariMcI | sAreku nIyaluka iTTe cAliMcavamma ||

ca|| nIkugAnE ceyyicAcI niMDAkOpamurEcI | mEkoni nIvirahAna mEnu veMcIni |
IkaDAkaDi satula hRudayamE perarEcI | Aku maDiciyyanaina AnatiyyavammA ||

ca|| cakkadanamule peMcI sakalamu gAladaMci | nikkapu vEMkaTESuDu nIkE poMcIni |
makkuvatO alamElmaMga nAMcAramma | akkuna nAtani niTTE alariMcavamma ||


Sung by:Balakrishna Prasad

Get this widget | Track details | eSnips Social DNA

Ameedinijasukha - అమీదినిజసుఖ

అమీదినిజసుఖ మరయలేము పామరపుచాయలకే భ్రమసితిమయ్యా

మనసున బాలు దాగి మదియించివున్నట్టు ననిచి గిలిగింతకు నవ్వినయట్టు ననిచి గిలిగింతకు నవ్వినయట్టు యెనసి సంసారసుఖ మిది నిజము సేసుక తనివోది యిందులోనే తడబడేమయ్యా

బొమ్మలాట నిజమటా బూచి చూచి మెచ్చినట్టు తెమ్మగా శివమాడి తా దేఅరైనట్టు కిమ్ముల యీజన్మదు కిందుమీదు నేఱక పమ్మి భోగములనేతెప్పల దేలేమయ్యా

బాలులు యిసుకగుళ్ళు పస గట్టు కాడినట్టు వీలి వెఱ్రివాడు గంతువేసినయట్టు మేలిమి శ్రీవేంకటేశ మిమ్ము గొలువక నేము కాల మూరకే యిన్నాళ్ళు గడపితిమయ్యా

Ameedinijasukha marayalemu Paamarapuchaayalake bhramasitimayyaa

Manasuna baalu daagi madiyimchivunnattu Nanichi giligimtaku navvinayattu Nanichi giligimtaku navvinayattu Yenasi samsaarasukha midi nijamu sesuka Tanivodi yimdulone tadabademayyaa

Bommalaata nijamataa boochi choochi mechchinattu Temmagaa sivamaadi taa dearainattu Kimmula yeejanmadu kimdumeedu neraka Pammi bhogamulaneteppala delemayyaa

Baalulu yisukagullu pasa gattu kaadinattu Veeli verrivaadu gamtuvesinayattu Melimi sreevenkatesa mimmu goluvaka nemu Kaala moorake yinnaallu gadapitimayyaa

Amaranganalade - అమరాంగనలదె

Amaranganalade - అమరాంగనలదె | Annamayya Lyrics | Sankeertanalu | Songs | Telugu & English

Listen Audio by P SUSHEELA:

అమరాంగనలదె నాడేరు (రాగమ్: ) (తాలమ్: )

అమరాంగనలదె నాడేరు
ప్రమదంబున నదె పాడేరు // పల్లవి //

గరుడ వాహనుడు కనక రథముపై
ఇరువుగ వీధుల నేగినీ
సురులును మునులును సొంపుగ మోకులు
తెరలిచి తెరలిచి తీసేరు // అమరాంగనలదె //

ఇలధరు డదివో ఇంద్రరథముపై
కెలయచు దిక్కులు గెలిచేని
బలు శేషాదులు బ్రహ్మ శివాదులు
చెలగి సేవలటు చేసేరు // అమరాంగనలదె //

అలమేల్మంగతో నటు శ్రీ వేంకట
నిలయుడు రథమున నెగడీని
నలుగడ ముక్తులు నారదాదులును
పొలుపు మిగులగడు బొగడేరు // అమరాంగనలదె //


amarAMganalade nADEru (Raagam: ) (Taalam: )

amarAMganalade nADEru
pramadaMbuna nade pADEru

garuDa vAhanuDu kanaka rathamupai
iruvuga vIdhula nEginI
surulunu munulunu soMpuga mOkulu
teralici teralici tIsEru

iladharu DadivO iMdrarathamupai
kelayacu dikkulu gelicEni
balu SEShAdulu brahma shivAdulu
celagi sEvalaTu cEsEru

alamElmaMgatO naTu SrI vEMkaTa
nilayuDu rathamuna negaDIni
nalugaDa muktulu nAradAdulunu
polupu migulagaDu bogaDEru


aBayamu aBayamO - అభయము అభయమో

అభయము అభయమో హరి నీవు | విభుడ వింతటికి వెర వికనేది ||

చ|| జడిగొని మదిలో శాంతము నిలువదు | కడుగడు దుస్సంగతి వలన |

ఇడుమలేని సుఖ మించుక గానము | ఆడియాసల నా-యలమట వలన ||

చ|| తలపులోన నీ తత్వము నిలువదు | పలులంపటముల భ్రమ వలన |

కలిగిన విజ్ఞాన గతియును దాగెను | వెలి విషయపు సిరివీకుల వలన ||

చ|| పక్కన పాపపు బంధము లూడెను | చిక్కక నిను దలచిన వలన |

చిక్కులు వాసెను శ్రీ వేంకటపతి | నిక్కము నాకిదే నీ కృప వలన ||

aBayamu aBayamO hari nIvu | viBuDa viMtaTiki vera vikanEdi ||

ca|| jaDigoni madilO SAMtamu niluvadu | kaDugaDu dussaMgati valana | iDumalEni suKa miMcuka gAnamu | ADiyAsala nA-yalamaTa valana ||

ca|| talapulOna nI tatvamu niluvadu | palulaMpaTamula Brama valana | kaligina vij~jAna gatiyunu dAgenu | veli viShayapu sirivIkula valana ||

ca|| pakkana pApapu baMdhamu lUDenu | cikkaka ninu dalacina valana | cikkulu vAsenu SrI vEMkaTapati | nikkamu nAkidE nI kRupa valana ||