AtaDade mIrade - ఆతడదె మీరదె

ఆతడదె మీరదె అప్పగించితిమి మేము
మీతల పుదాన నేను మీకేలే చింత ||

నన్ను నేల అడిగేరే నాటి నేటి సుద్దులు
అన్నియును నడుగరే ఆతనిని
పన్నిన వారిద్దరికి పైపై మీరే కారా
వెన్నచేత బట్టుకొని నేడ నేలే నెయ్యి ||

యేలకొడ బర చేరే యింతలోనే నన్నును
చాలు నొడ బరచరే చాలు నాతని
పోలిమితో నింతేసి బుద్ది మీరెరగనిదా
తాలము చేత బట్టుకొని దాటణేలే వాకిలి ||

అనలేల పెట్టేరే ఆతనితో గూడుమని
పేనియాన లతనికే పెట్టరాదా
ఆనుక శ్రీవేంకటేశు డాతడే నన్ను గూడె
తేనెలు వంటి చెలులు తీపులు మీకేలే ||
AtaDade mIrade appagiMchitimi mEmu
mItala pudAna nEnu mIkElE chiMta ||

nannu nEla aDigErE nATi nETi suddulu
anniyunu naDugarE Atanini
pannina vAriddariki paipai mIrE kArA
vennachEta baTTukoni nEDa nElE neyyi ||

yElakoDa bara chErE yiMtalOnE nannunu
chAlu noDa baracharE chAlu nAtani
pOlimitO niMtEsi buddi mIreraganidA
tAlamu chEta baTTukoni dATaNElE vAkili ||

analEla peTTErE AtanitO gUDumani
pEniyAna latanikE peTTarAdA
Anuka SrIvEMkaTESu DAtaDE nannu gUDe
tEnelu vaMTi chelulu tIpulu mIkElE ||

ADuvAru kaDu - ఆడువారు కడు

ప|| ఆడువారు కడుగోపులవుట నీ వెరగవా | నేడు గొత్తలుగా భూమి నేర్పుక వచ్చేరా ||

చ|| వలచిన యాడువారు వాదులాటకు వచ్చిన | చలము సాధించువాడు జాణడా వాడు |

కలయని కాకతోడ కమ్మటి నలిగిపోగా | పిలిచి మాటాడకున్న ప్రియుడా వాడు ||

చ|| చనవుగలుగువారు సణగులదిట్టగాను | కనలియెగ్గువట్టితే ఘనుడా వాడు |

గునిసి సవతులపై కోపాన పతి నంటేను | విని నవ్వకుండేవాడు విభుడా వాడు ||

చ|| పాయరానియటివారు బలుములు చూపితేను | నాయాలబెట్టెడివాడు నాథుడా వాడు |

యీయెడ శ్రీవేమ్కటేశ యింతినిట్టె గూడితివి | చాయకు రాకుండువాడు సరసుడా వాడు ||

pa|| ADuvAru kaDugOpulavuTa nI veragavA | nEDu gottalugA BUmi nErpuka vaccErA ||

ca|| valacina yADuvAru vAdulATaku vaccina | calamu sAdhiMcuvADu jANaDA vADu |

kalayani kAkatODa kammaTi naligipOgA | pilici mATADakunna priyuDA vADu ||

ca|| canavugaluguvAru saNaguladiTTagAnu | kanaliyegguvaTTitE GanuDA vADu |

gunisi savatulapai kOpAna pati naMTEnu | vini navvakuMDEvADu viBuDA vADu ||

ca|| pAyarAniyaTivAru balumulu cUpitEnu | nAyAlabeTTeDivADu nAthuDA vADu |

yIyeDa SrIvEmkaTESa yiMtiniTTe gUDitivi | cAyaku rAkuMDuvADu sarasuDA vADu ||


ADaramma pADaramma - ఆడరమ్మ పాడరమ్మ

ఆడరమ్మ పాడరమ్మ అంగనలు చూడరమ్మ | వేడుక పరషులెల్ల వీధి చూడరమ్మ ||

చ|| అల్లదివో ఓగునూతుల ఔభళేశు పెద్దకోన | వెల్లిపాల నీటి జాలు వెడలే సోన |

చల్లని మాకుల నీడ సంగడి మేడలవాడ | ఎల్లగాగ నరసింహుడేగీ నింతితోడ ||

చ|| సింగారపు మండపాల సింహాల మునిమందలు | అంగపు తెల్లగోపురము అదె మిన్నంద |

చెంగట నాళువార్లు చేరి పన్నిద్దరు గొల్వ | సంగతి తా కొలువిచ్చీ జయనరసింహము ||

చ|| కందువ శ్రీవేంకటేశు కల్యాణముల వేది | అందమై భూమికెల్ల ఆదికి అనాది |

మందల పాల కొండ మలకు నట్టనడుమ | విందగు దాసుల తోడ విహరించీ దేవుడు ||

ADaramma pADaramma aMganalu cUDaramma | vEDuka paraShulella vIdhi cUDaramma ||

ca|| alladivO OgunUtula auBaLESu peddakOna | vellipAla nITi jAlu veDalE sOna |

callani mAkula nIDa saMgaDi mEDalavADa | ellagAga narasiMhuDEgI niMtitODa ||

ca|| siMgArapu maMDapAla siMhAla munimaMdalu | aMgapu tellagOpuramu ade minnaMda | ceMgaTa nALuvArlu cEri panniddaru golva | saMgati tA koluviccI jayanarasiMhamu ||

ca|| kaMduva SrIvEMkaTESu kalyANamula vEdi | aMdamai BUmikella Adiki anAdi | maMdala pAla koMDa malaku naTTanaDuma | viMdagu dAsula tODa vihariMcI dEvuDu ||

Atavari guditoura - ఆటవారి గూడితౌరా

Atavari guditoura - ఆటవారి గూడితౌరా | Annamayya Lyrics | Sankeertanalu | Songs | Telugu & English

ప|| ఆటవారి గూడితౌరా || అనుప||

ఆటవారిగూడి అన్నిచోట్ల బొమ్మ- | లాట లాడించ నధికుండవైతివి ||

చ|| గురుతరమగు పెద్ద కొట్టాములోపల | తిరుమైన పెనుమాయ దెరగట్టి |

అరయ నజ్ఞానములవి యడ్డముగజేసి | పరగ సుజ్ఞానదీపములు ముట్టించి ||

చ|| తోలుబొమ్మల దొరకొని గడియించి | గాలిచేత వాని గదలించి |

తూలేటి రసములు తొమ్మిది గడియించి | నాలుగుముఖముల నలువున నాడించ ||

చ|| నిన్నే మెత్తురుగాని నీకేమి నీలేరు | మన్నించుదాతలు మరి లేరు |

యెన్నగ దిరువేంకటేశ్వర నీదాసు- | లున్నతులై నిన్ను నుబ్బించి పొగడగ ||

pa|| ATavAri gUDitaurA || anupa||

ATavArigUDi annicOTla bomma- | lATa lADiMca nadhikuMDavaitivi ||

ca|| gurutaramagu pedda koTTAmulOpala | tirumaina penumAya deragaTTi |

araya naj~jAnamulavi yaDDamugajEsi | paraga suj~jAnadIpamulu muTTiMci ||

ca|| tOlubommala dorakoni gaDiyiMci | gAlicEta vAni gadaliMci |

tUlETi rasamulu tommidi gaDiyiMci | nAlugumuKamula naluvuna nADiMca ||

ca|| ninnE metturugAni nIkEmi nIlEru | manniMcudAtalu mari lEru |

yennaga diruvEMkaTESvara nIdAsu- | lunnatulai ninnu nubbiMci pogaDaga ||

AkevO nAprANa - ఆకెవో నాప్రాణ

ప|| ఆకెవో నాప్రాణ మోహనపు రాణి | దాకొని వేవేలు కాంతలలోన నున్నది ||

చ|| ముదిత కురులనెల్లా ముత్యములు మాణిక్యాలు | గుదిగుచ్చి కలుగంటు గొన్నది |

సదరపు పసిడి వజ్రాలచనుకట్టుది | అదె పైడి పూవుల పయ్యద వల్లెవాటుది ||

చ|| పచ్చలు దాచిన యట్టి పాదుకలు మెట్టినది | లచ్చన మొగవుల మొలనూళ్ళది |

అచ్చపు టుంగరముల అందెలు బాయవట్టాలు | గుచ్చుల ముంజేతుల కంకణ సూడిగేలది ||

చ|| నానాభూషణముల నానా సింగరాల | పానిపట్టి నాదిక్కెతప్పక చూచేది |

ఆనకపుశ్రీ వేంకటాద్రి పతినైన నన్ను | తానె వచ్చి కూడి నాదగ్గరనె వున్నది ||

pa|| AkevO nAprANa mOhanapu rANi | dAkoni vEvElu kAMtalalOna nunnadi ||

ca|| mudita kurulanellA mutyamulu mANikyAlu | gudigucci kalugaMTu gonnadi | sadarapu pasiDi vajrAlacanukaTTudi | ade paiDi pUvula payyada vallevATudi ||

ca|| paccalu dAcina yaTTi pAdukalu meTTinadi | laccana mogavula molanULLadi | accapu TuMgaramula aMdelu bAyavaTTAlu | guccula muMjEtula kaMkaNa sUDigEladi ||

ca|| nAnABUShaNamula nAnA siMgarAla | pAnipaTTi nAdikketappaka cUcEdi | AnakapuSrI vEMkaTAdri patinaina nannu | tAne vacci kUDi nAdaggarane vunnadi ||

ahObalESvaruDu aKila - అహోబలేశ్వరుడు అఖిల

ప|| అహోబలేశ్వరుడు అఖిల వందితుడు | మహి నితని గొలిచి మనుడిక జనులు ||

చ|| మూడు మూర్తులకు మూలంబీతడు | వేడి ప్రతాపపు విభుడీతడు |

వాడి చక్రాయుధ వరదుండీతడు | పోణిమి పురాణ పురుషు డీతడు ||

చ|| అసురలకెల్ల కాలాంతకు డీతడు | వసుధ దివ్యసింహం బితడు |

విసువని ఏకాంగ వీరుడీతడు | దెసల పరాత్పరతేజం బితడు ||

చ|| నిగిడి శ్రీవేంకట నిలయుడీతడు | బగివాయని శ్రీపతి యీతడు |

సొగసి దాసులకు సులభు డీతడు | తగు ఇహపరముల దాతయు నీతడు ||

pa|| ahObalESvaruDu aKila vaMdituDu | mahi nitani golici manuDika janulu ||

ca|| mUDu mUrtulaku mUlaMbItaDu | vEDi pratApapu viBuDItaDu | vADi cakrAyudha varaduMDItaDu | pONimi purANa puruShu DItaDu ||

ca|| asuralakella kAlAMtaku DItaDu | vasudha divyasiMhaM bitaDu | visuvani EkAMga vIruDItaDu | desala parAtparatEjaM bitaDu ||

ca|| nigiDi SrIvEMkaTa nilayuDItaDu | bagivAyani SrIpati yItaDu |

sogasi dAsulaku sulaBu DItaDu | tagu ihaparamula dAtayu nItaDu ||

asmadAdInAM - అస్మదాదీనాం

ప|| అస్మదాదీనాం అన్యేషాం | తస్మిన్ తస్మిన్ తత్ర చ పునశ్చ ||

చ|| సతతాధ్యయననిష్ఠాపరాణాం దృఢ- | వ్రతినాం యతీనాం వనవాసినాం |

గతిరిహ స్మర్తుం కా జగత్యాం పర- | స్థితిరియం కా విష్ణుసేవా పునశ్చ ||

చ|| మోహినామత్యంతముష్కరాణాం గుణ- | గ్రాహిణాం భువనైక కఠినానాం |

దేహసంక్షాళన విదేశకోవా సదా | శ్రీహరిస్మరణవిశేషః పునశ్చ ||

చ|| కింకుర్వాణదుఃఖితజీవినాం | పంకిలమనోభ్బయభ్రాంతానాం |

శంకాం నిరురుతి స్సరసా కా, శ్రీ- | వేంకటాచలపతేర్వినుతిః పునశ్చ ||

pa|| asmadAdInAM anyEShAM | tasmin tasmin tatra ca punaSca ||

ca|| satatAdhyayananiShThAparANAM dRuDha- | vratinAM yatInAM vanavAsinAM |

gatiriha smartuM kA jagatyAM para- | sthitiriyaM kA viShNusEvA punaSca ||

ca|| mOhinAmatyaMtamuShkarANAM guNa- | grAhiNAM Buvanaika kaThinAnAM |

dEhasaMkShALana vidESakOvA sadA | SrIharismaraNaviSEShaH punaSca ||

ca|| kiMkurvANaduHKitajIvinAM | paMkilamanOBbayaBrAMtAnAM |

SaMkAM niruruti ssarasA kA, SrI- | vEMkaTAcalapatErvinutiH punaSca ||