Unda basinadavilo - ఉండ బాసీనడవిలో

ఉండ బాసీనడవిలో (రాగం: ) (తాళం : )

ఉండ బాసీనడవిలో నొకతెనేను
ఎండలు నీడలు గాసీ నేమి సేతురా ||

చిన్ని నానడుము చూచి సింహము దగ్గరెనంటా
ఉన్నతపు గుచముల కొరసెగరి
మున్నిటి వొందులు వైరమునుజేసె మ్రుగపతి
యిన్నిటికి నగ్గమైతి నేమిసేతురా ||

నిండు నానడపుచూచి నెమలి దగ్గరవచ్చె
బండు సేసి నారుసూచి పాయదు పాము
రెండు జూచి పగయు గూరిమి దోచెనింతలోనే
యిండె పట్టె నిన్నిటికి నేమి సేతురా ||

కోరి నా పలుకువిని కోవిల దగ్గరవచ్చె
చేరీ నా మోవికిదె చిలుకనేడు
గారవాన నిన్నియు వేంకటగిరి విభుడా
యేరా యిట్టె చేకొంటి వేమిసేతురా ||

uMDa bAsInaDavilO (Raagam: ) (Taalam: )

uMDa bAsInaDavilO nokatenEnu
eMDalu nIDalu gAsI nEmi sEturA ||

chinni nAnaDumu chUchi siMhamu daggarenaMTA
unnatapu guchamula korasegari
munniTi voMdulu vairamunujEse mrugapati
yinniTiki naggamaiti nEmisEturA ||

niMDu nAnaDapuchUchi nemali daggaravachche
baMDu sEsi nArusUchi pAyadu pAmu
reMDu jUchi pagayu gUrimi dOcheniMtalOnE
yiMDe paTTe ninniTiki nEmi sEturA ||

kOri nA palukuvini kOvila daggaravachche
chErI nA mOvikide chilukanEDu
gAravAna ninniyu vEMkaTagiri vibhuDA
yErA yiTTe chEkoMTi vEmisEturA ||


Eehee sreeharigamtae yimta - ఈహీ శ్రీహరిగంటే యింత

ఈహీ శ్రీహరిగంటే యింత (రాగం: ) (తాళం : )

ఈహీ శ్రీహరిగంటే యింత లేదుగా వట్టి దాహపుటాసల వెఱ్రి దవ్వు టింతేకాకా

పలుమారు నిందరిని భంగపడి వేడేది యిలపై దేహమువెంచేయిందు కింతేకా

కలికికాంతలచూపుఘాతలకు భ్రమనేది చెలగి మైమఱచేటిచేత కింతేకా

పక్కన జన్మాలనెల్లా బాటువడేదెల్లాను యెక్కడో సంసారాన కిందు కింతేకా

వొక్కరి గొలిచి తిట్టు కొడిగట్టే దెల్లాను చక్కుముక్కునాలికెపైచవి కింతేకా

గారవాన ధనములు గడియించేదెల్లాను ఆరయ నాదని వీగేయందు కింతేకా

చేరి శ్రీవేంకటపతి సేవకు జొరనిదెల్లా భారపుగర్మపుభాద బట్టువడికా

Eehee sreeharigamtae yimta(Raagam: ) (Taalam: )

Eehee sreeharigamtae yimta laedugaa vatti Daahaputaasala ve~rri davvu timtaekaakaa

Palumaaru nimdarini bhamgapadi vaedaedi Yilapai daehamuvemchaeyimdu kimtaekaa

Kalikikaamtalachoopughaatalaku bhramanaedi Chelagi maima~rachaetichaeta kimtaekaa

Pakkana janmaalanellaa baatuvadaedellaanu Yekkado samsaaraana kimdu kimtaekaa

Vokkari golichi tittu kodigattae dellaanu Chakkumukkunaalikepaichavi kimtaekaa

Gaaravaana dhanamulu gadiyimchaedellaanu Aaraya naadani veegaeyamdu kimtaekaa

Chaeri sreevaemkatapati saevaku joranidellaa Bhaarapugarmapubhaada battuvadikaa


Isura lImunu - ఈసుర లీమును

ఈసుర లీమును (రాగం: ) (తాళం : )

ప|| ఈసుర లీమును లీచరాచరములు | యిసకలమంతయు నిది యెవ్వరు ||

చ|| ఎన్నిక నామము లిటు నీవై యుండగ | యిన్ని నామము లిటు నీవై యుండగ |

వున్నచోటనే నీవు వుండుచుండుగ మరి | యిన్నిటా దిరుగువా రిది యెవ్వరు ||

చ|| వొక్కరూపై నీవు వుండుచుండగ మరి | తక్కిన యీరూపములు తామెవ్వరు |

యిక్కడనక్కడ నీవు యిటు ఆత్మలలోనుండ | మక్కువ నుండువారు మరి యెవ్వరు ||

చ|| శ్రీవేంకటాద్రిపై చెలగి నీ వుండగా | దైవంబులనువారు తామెవ్వరు |

కావలసినచోట కలిగి నీవుండగ | యీవిశ్వపరిపూణు లిది యెవ్వరు ||

Isura lImunu (Raagam: ) (Taalam: )

pa|| Isura lImunu lIcarAcaramulu | yisakalamaMtayu nidi yevvaru ||

ca|| ennika nAmamu liTu nIvai yuMDaga | yinni nAmamu liTu nIvai yuMDaga |

vunnacOTanE nIvu vuMDucuMDuga mari | yinniTA diruguvA ridi yevvaru ||

ca|| vokkarUpai nIvu vuMDucuMDaga mari | takkina yIrUpamulu tAmevvaru |

yikkaDanakkaDa nIvu yiTu AtmalalOnuMDa | makkuva nuMDuvAru mari yevvaru ||

ca|| SrIvEMkaTAdripai celagi nI vuMDagA | daivaMbulanuvAru tAmevvaru |

kAvalasinacOTa kaligi nIvuMDaga | yIviSvaparipURNu lidi yevvaru ||


Eepulamai vunnadu - ఈరూపమై వున్నాడు

Eepulamai vunnadu - ఈరూపమై వున్నాడు | Annamayya Lyrics | Sankeertanalu | Songs | Telugu & English

Listen Audio by SOBHARAJU:

ఈరూపమై వున్నాడు (రాగం: ) (తాళం : )

ప|| ఈరూపమై వున్నాడు యీతడే పరబ్రహ్మము | శ్రీరమాదేవితోడ శ్రీవేంకటేశుడు ||

చ|| పొదలి మాయాదేవిపట్టిన సముద్రము | అదె పంచభూతాలుండే అశ్వత్థము |

గుదిగొన్నబ్రహ్మాండాలగుడ్ల బెట్టెహంస | సదరపుబ్రహ్మలకు జలజమూలకందము ||

చ|| అనంతవేదాలుండేటిఅక్షయవటపత్రము | ఘనదేవతలకు శ్రీకరయజ్ఞము |

కనలుదానవమత్తగజసంహరసింహము | మొనసి సంసారభారము దాల్చే వృషభము ||

చ|| సతతము జీవులకు చైతన్యసూత్రము| అతిశయభక్తులజ్ఞానామృతము |

వ్రతమై శ్రీవెంకటాద్రి వరములచింతామణి | తతిగొన్న మోక్షపుతత్త్వరహస్యము||

IrUpamai vunnADu (Raagam: ) (Taalam: )

pa|| IrUpamai vunnADu yItaDE parabrahmamu |

SrIramAdEvitODa SrIvEMkaTESuDu ||

ca|| podali mAyAdEvipaTTina samudramu | 

ade paMcaBUtAluMDE aSvatthamu |

gudigonnabrahmAMDAlaguDla beTTehaMsa |

sadarapubrahmalaku jalajamUlakaMdamu ||

ca|| anaMtavEdAluMDETiakShayavaTapatramu | 

GanadEvatalaku SrIkarayaj~jamu |

kanaludAnavamattagajasaMharasiMhamu | 

monasi saMsAraBAramu dAlcE vRuShaBamu ||

ca|| satatamu jIvulaku caitanyasUtramu|

atiSayaBaktulaj~jAnAmRutamu |

vratamai SrIveMkaTAdri varamulaciMtAmaNi | 

tatigonna mOkShaputattvarahasyamu||


IBavamunaku jUDa - ఈభవమునకు జూడ

ఈభవమునకు జూడ (రాగం: ) (తాళం : )

ప|| ఈభవమునకు జూడ నేది గడపల తనదు- | ప్రాభవం బెడలించి బాధ పెట్టించె ||

చ|| చెప్పించె బ్రియము వలసినవారలకునెల్ల | రప్పించె నెన్నడును రానిచోట్లకును |

నొప్పించె నాసలకు వోరంత ప్రొద్దునను | తిప్పించె కోరికల తిరిగి నలుగడల ||

చ|| పుట్టించె హేయంపుభోగయోనులనెల్ల | కట్టించె సంసారకలితబంధముల |

పెట్టించె ఆసలను పెడకొడముల దన్ను | తిట్టించె నిజద్రవ్యదీనకులచేత ||

చ|| బెదరించె దేహంబు పెనువేదనలచేత | చెదరించె శాంతంబు చెలగి చలమునను |

విదళించె భవములను వేంకటేశ్వరు గొలిచి | పదిలించె నతనికృప పరమసౌఖ్యములు ||


IBavamunaku jUDa (Raagam: ) (Taalam: )

pa|| IBavamunaku jUDa nEdi gaDapala tanadu- | prABavaM beDaliMci bAdha peTTiMce ||

ca|| ceppiMce briyamu valasinavAralakunella | rappiMce nennaDunu rAnicOTlakunu |

noppiMce nAsalaku vOraMta proddunanu | tippiMce kOrikala tirigi nalugaDala ||

ca|| puTTiMce hEyaMpuBOgayOnulanella | kaTTiMce saMsArakalitabaMdhamula |

peTTiMce Asalanu peDakoDamula dannu | tiTTiMce nijadravyadInakulacEta ||

ca|| bedariMce dEhaMbu penuvEdanalacEta | cedariMce SAMtaMbu celagi calamunanu |

vidaLiMce Bavamulanu vEMkaTESvaru golici | padiliMce natanikRupa paramasauKyamulu ||


Ipeku nitaDu dagu - ఈపెకు నితడు దగు

ఈపెకు నితడు (రాగం: ) (తాళం : )

ఈపెకు నితడు దగు నితనికీపె దగు
చూపులకు పండుగాయ శోభనము నేడు ||

పిలువరె పెండ్లి కూతుబెండ్లిపీటమీదకి
చెలగి తానెదురు చూచీ దేవుడు
బలువుగా నిద్దరికి బాసికములు గట్టరె
కలిమెల్ల మెరసి సింగారించరే ||

ఆతలదెచ్చి పెట్టరె ఆ పెండ్లి కూతురును
యీతడే జంట సోభన మిద్దరికిని
కాతరాన బువ్వానకు గక్కన బెట్టరె మీరు
రేతిట నుండియు వేగిరించేరు వీరు ||

పానుపు పరచరె బలునాగవల్లి నేడు
పూని తెరవేయరె పోలతులాల
ఆనుక శ్రీవేంకటేశుడలమేలుమంగయును
లోననె భూకాంతయును లోలువైరి తాము ||

Ipeku nitaDu (Raagam: ) (Taalam: )

Ipeku nitaDu dagu nitanikIpe dagu
chUpulaku paMDugAya SObhanamu nEDu ||

piluvare peMDli kUtubeMDlipITamIdaki
chelagi tAneduru chUchI dEvuDu
baluvugA niddariki bAsikamulu gaTTare
kalimella merasi siMgAriMcharE ||

Ataladechchi peTTare A peMDli kUturunu
yItaDE jaMTa sObhana middarikini
kAtarAna buvvAnaku gakkana beTTare mIru
rEtiTa nuMDiyu vEgiriMchEru vIru ||

pAnupu parachare balunAgavalli nEDu
pUni teravEyare pOlatulAla
Anuka SrIvEMkaTESuDalamElumaMgayunu
lOnane bhUkAMtayunu lOluvairi tAmu ||


IdEha vikAramunaku - ఈదేహ వికారమునకు

ఈదేహ వికారమునకు(రాగం: ) (తాళం : )

ప|| ఈదేహ వికారమునకు నేదియు గడపల ఘనము | మోదమెరంగని మోహము ముందర గననీదు ||

చ|| నిత్యానిత్యవివేకము నీరసునకు నొనగూడదు | సత్యాలాపవిచారము జరగదు లోభికిని |

హత్యావిరహిత కర్మము అంటదు క్రూరాత్మునకును | ప్రత్యక్షంబగు పాపము పాయదు కష్టునకు ||

చ|| సతతానందవికాసము సంధించదు తామసునకు | గతకల్మష భావము దొరకదు వ్యసనికిని |

జితకాముడు దానవుటకు సిద్ధింపదు దుష్కర్మికి | అతులితగంభీర గుణంబలవడ దధమునకు ||

చ|| శ్రీవేంకటగిరి వల్లభుసేవా తత్పరభావము- | ద్రోవ మహాలంపటులకు తోపదు తలపునకు |

దేవోత్తముడగు నీతని దివ్యామృతమగు నామము | సేవింపగ నితరులకును చిత్తంబొడబడదు ||

IdEha vikAramunaku(Raagam: ) (Taalam: )

pa|| IdEha vikAramunaku nEdiyu gaDapala Ganamu | mOdameraMgani mOhamu muMdara gananIdu ||

ca|| nityAnityavivEkamu nIrasunaku nonagUDadu | satyAlApavicAramu jaragadu lOBikini |

hatyAvirahita karmamu aMTadu krUrAtmunakunu | pratyakShaMbagu pApamu pAyadu kaShTunaku ||

ca|| satatAnaMdavikAsamu saMdhiMcadu tAmasunaku | gatakalmaSha BAvamu dorakadu vyasanikini |

jitakAmuDu dAnavuTaku siddhiMpadu duShkarmiki | atulitagaMBIra guNaMbalavaDa dadhamunaku ||

ca|| SrIvEMkaTagiri vallaBusEvA tatparaBAvamu- | drOva mahAlaMpaTulaku tOpadu talapunaku |

dEvOttamuDagu nItani divyAmRutamagu nAmamu | sEviMpaga nitarulakunu cittaMboDabaDadu ||