Okkade aekanga virudu - ఒక్కడే ఏకాంగ వీరుడు

Okkade aekanga virudu - ఒక్కడే ఏకాంగ వీరుడు | Annamayya Lyrics | Sankeertanalu | Songs | Telugu & English

Listen Audio by G BALAKRISHNA PRASAD:

ఒక్కడే ఏకాంగ (రాగం: ) (తాళం : )

ఒక్కడే ఏకాంగ వీరుడుర్వికి దైవమౌనా
యెక్కడా హనుమంతుని కెదురా లోకము

ముందట నేలెడి పట్టమునకు బ్రహ్మయినాడు
అందరు దైత్యులచంపి హరిపేరైనాడు
అంది రుద్రవీర్యము తానై హరుడైనాడు
యెందునా హనుమంతుని కెదురా లోకము

చుక్కలు మోవ పెరిగి సూర్యుడు తానైనాడు
చిక్కు పాతాళము దూరి శేషుడైనాడు
గక్కన వాయుజుడై జగత్ప్రాణుడైనాడు
ఎక్కువ హనుమంతుని కెదురా లోకము

జలధి పుటమెగసి చంద్రుడు తానైనాడు
మలసి మేరుపుపొంత సింహమైనాడు
బలిమి శ్రీవేంకటేశు బంటై మంగాంబుధి
ఇల ఈ హనుమంతుని కెదురా లోకము

okkaDE EkAMga (Raagam: ) (Taalam: )

okkaDE EkAMga viiruDurviki daivamaunaa
yekkaDA hanumaMtuni keduraa lOkamu

muMdaTa nEleDi paTTamunaku brahmayinaaDu
aMdaru daityulachaMpi haripErainaaDu
aMdi rudraviiryamu taanai haruDainaaDu
yeMdunaa hanumaMtuni keduraa lOkamu

chukkalu mOva perigi suuryuDu taanainaaDu
chikku paataaLamu duuri SEshuDainaaDu
gakkana vaayujuDai jagatpraaNuDainaaDu
ekkuva hanumaMtuni keduraa lOkamu

jaladhi puTamegasi chaMdruDu taanainaaDu
malasi mErupupoMta siMhamainaaDu
balimi SriivEMkaTESu baMTai maMgaaMbudhi
ila ii hanumaMtuni keduraa lOkamu

okaTikokaTigUDa dOyamma - ఒకటికొకటిగూడ దోయమ్మ

ఒకటికొకటిగూడ దోయమ్మ (రాగం: ) (తాళం : )

ఒకటికొకటిగూడ దోయమ్మ నీయందే
సకలము నెటువలె సంతసేసితివే ||

తానకు నీ కుచాలు దంతికుంభల బోలితే
యీ నడుము సింహమునేల పోలెనే
అనివట్టి నీ కన్ను లంబుజాల బోలితేను
అననము చందురుని నదియేల పోలెనే ||

అతివ నీచేతులు బిసాంగముల బోలితేను
యితవై నడపు హంసనేల పోలెనే
చతురత నాసికము సంపెంగ జోలితేను
తతి నీకురులు తుమ్మెదలనేల పోలెనే ||

నేవళపు నీయారు నీలాహి బోలితేను
యీవల మేను మెరుపునేల పోలెనే
శ్రీ వేంకటేశు మొవి చిన్ని కెంపులంతించి
ఆవేళ దంతాలు వజ్రాలై యెట్టువోలెనే ||

okaTikokaTigUDa dOyamma (Raagam: ) (Taalam: )

okaTikokaTigUDa dOyamma nIyaMdE
sakalamu neTuvale saMtasEsitivE ||

tAnaku nI kuchAlu daMtikuMbhala bOlitE
yI naDumu siMhamunEla pOlenE
anivaTTi nI kannu laMbujAla bOlitEnu
ananamu chaMduruni nadiyEla pOlenE ||

ativa nIchEtulu bisAMgamula bOlitEnu
yitavai naDapu haMsanEla pOlenE
chaturata nAsikamu saMpeMga jOlitEnu
tati nIkurulu tummedalanEla pOlenE ||

nEvaLapu nIyAru nIlAhi bOlitEnu
yIvala mEnu merupunEla pOlenE
SrI vEMkaTESu movi chinni keMpulaMtiMchi
AvELa daMtAlu vajrAlai yeTTuvOlenE ||


Okapari kokapari - ఒకపరి కొకపరి

ఒకపరి కొకపరి (రాగం:ఖరహరప్రియ ) (తాళం : )

ఒకపరి కొకపరి కొయ్యారమై
మొకమున కళలెల్ల మొలచినట్లుండె॥

జగదేకపతిమేన చల్లిన కర్పూరధూళి
జిగికొని నలువంక చిందగాను
మొగి చంద్రముఖి నురమున నిలిపెగాన
పొగరు వెన్నెల దిగబోసి నట్లుండె॥

పొరిమెరుగు చెక్కుల పూసిన తట్టుపునుగు
కరగి ఇరుదెసల కారగాను
కరిగమన విభుడు గనుక మోహమదము
తొరిగి సామజసిరి తొలికినట్లుండె॥

మెరయ శ్రీవేంకటేశుమేన సింగారముగాను
తరచైన సొమ్ములు ధరియించగా
మెరుగు బోడి అలమేలు మంగయు తాను
మెరుపు మేఘము గూడి మెరసినట్లుండె॥

పెద తిరుమలాచర్యుల రచన

Okapari kokapari (Raagam: Kharaharapriya ) (Taalam: )
Okapari kokapari koyyaaramai
Mokamuna kalalella molachinatlumde

Jagadaekapatimaena challina karpooradhooli
Jigikoni naluvamka chimdagaanu
Mogi chamdramukhi nuramuna nilipegaana
Pogaru vennela digabosi natlumde

Porimerugu chekkula poosina tattupunugu
Karagi irudesala kaaragaanu
Karigamana vibhudu ganuka mohamadamu
Torigi saamajasiri tolikinatlumde

Meraya sreevaemkataesumaena simgaaramugaanu
Tarachaina sommulu dhariyimchagaa
Merugu bodi alamaelu mamgayu taanu
Merupu maeghamu goodi merasinatlumde

Peda tirumalaacharyula rachana


Sung by:Balakrishna Prasad

Get this widget | Track details | eSnips Social DNA

Ainadayyee gaanidellaa - ఐనదయ్యీ గానిదెల్లా

ఐనదయ్యీ గానిదెల్లా (రాగం: వరాళి ) (తాళం : )

ఐనదయ్యీ గానిదెల్లా నటు గాకుండితే మానీ
మానుపరా దివి హరిమాయా మహిమలు

పుట్టేటి వెన్ని లేవు పోయేటి వెన్ని లేవు
వెట్టి దేహాలు మోచినవెడజీవులు
గట్టిగా దెలుసుకొంటే కలలోనివంటి దింతే
పట్టి ఇందుకుగా నేల బడలేమో నేము

కడచిన వెన్ని లేవు కాచుకున్న వెన్ని లేవు
సుడిగొన్న తనలోని సుఖదుఃఖాలు
యెడపుల నివి రెండు యెండనీడవంటి వింతే
కడనుండి నే మేలకరగేమో నేము

కోరినవి యెన్ని లేవు కోరగల వెన్ని లేవు
తీరనైసంపదలతో తెందేపలు
ధారుణి శృఈవేంకటేశుదాసులమై యిన్నియును
చేరి కైకొంటిమి యేమి సేసేమో నేము

Ainadayyee gaanidellaa (Raagam:Varaali ) (Taalam: )
Ainadayyee gaanidellaa natu gaakumditae maanee
Maanuparaa divi harimaayaa mahimalu

Puttaeti venni laevu poyaeti venni laevu
Vetti daehaalu mochinavedajeevulu
Gattigaa delusukomtae kalalonivamti dimtae
Patti imdukugaa naela badalaemo naemu

Kadachina venni laevu kaachukunna venni laevu
Sudigonna tanaloni sukhadu@hkhaalu
Yedapula nivi remdu yemdaneedavamti vimtae
Kadanumdi nae maelakaragaemo naemu

Korinavi yenni laevu koragala venni laevu
Teeranaisampadalato temdaepalu
Dhaaruni sreevaemkataesudaasulamai yinniyunu
Chaeri kaikomtimi yaemi saesaemo naemu

EvI nupAyAlugAvu - ఏవీ నుపాయాలుగావు

ఏవీ నుపాయాలుగావు (రాగం: ) (తాళం : )

ప|| ఏవీ నుపాయాలుగావు యెక్కువ భక్తేకాని | దావతి బడక యిది దక్కితే సులభము ||

చ|| ముంటిపై సుఖమందుట ముక్కున నూరుపువట్టి | దంటవాయువు గెలువదలచేదెల్లా |
వెంటికవట్టుక పోయి వెస గొండ వాకుట | వెంట గర్మమార్గమున విష్ణుని సాధించుట ||

చ|| యేనుగుతో బెనగుట యిల నిరాహారియై | కాననిపంచేందిర్యాల గట్టబోవుట |
నానిం చినుపగుగిళ్ళు నమలుట బలిమిని | ధ్యానించి మనసుబట్టి దైవము సాధించుట ||

చ|| దప్పికి నెండమావులు దాగ దగ్గరబోవుట | తప్పుజదువులలో దత్త్వము నెంచుట |
పిప్పిచవి యడుగుట పెక్కుదైవాల గొలిచి | కప్పిన శ్రీవేంకటేశుకరుణ సాధించుట ||

EvI nupAyAlugAvu (Raagam: ) (Taalam: )

pa|| EvI nupAyAlugAvu yekkuva BaktEkAni | dAvati baDaka yidi dakkitE sulaBamu ||

ca|| muMTipai suKamaMduTa mukkuna nUrupuvaTTi | daMTavAyuvu geluvadalacEdellA |
veMTikavaTTuka pOyi vesa goMDa vAkuTa | veMTa garmamArgamuna viShNuni sAdhiMcuTa ||

ca|| yEnugutO benaguTa yila nirAhAriyai | kAnanipaMcEMdiryAla gaTTabOvuTa |
nAniM cinupagugiLLu namaluTa balimini | dhyAniMci manasubaTTi daivamu sAdhiMcuTa ||

ca|| dappiki neMDamAvulu dAga daggarabOvuTa | tappujaduvulalO dattvamu neMcuTa |
pippicavi yaDuguTa pekkudaivAla golici | kappina SrIvEMkaTESukaruNa sAdhiMcuTa ||


Evam Srutimata - ఏవం శ్రుతిమత

Evam Srutimata - ఏవం శ్రుతిమత | Annamayya Lyrics | Sankeertanalu | Songs | Telugu & English

ఏవం శ్రుతిమత (రాగం:సామంతం ) (తాళం : )

ప|| ఏవం శ్రుతిమత మిదమేవ త- | ద్భావయితు మతఃపరం నాస్తి ||

చ|| అతులజన్మభోగాసక్తానాం | హితవైభవసుఖ మిదమేవ |
సతతం శ్రీహరి సంకీర్తనం త- | ద్వ్యతిరిక్తసుఖం వక్తుం నాస్తి||

చ|| బహుళమరణ పరిభవచిత్తానా- | మిహపరసాధన మిదమేవ |
అహిశయనమనోహరసేవా త- | ద్విహరణంవినా విధిరపి నాస్తి ||

చ|| సంసారదురితజాడ్యపరాణాం | హింసావిరహిత మిదమేవ |
కంసాంతకవేంకటగిరిపతేః ప్ర- |శంసైనానాంపశ్చాదిహ నాస్తి ||

EvaM Srutimata (Raagam:Samantam ) (Taalam: )

pa|| EvaM Srutimata midamEva ta- | dBAvayitu mataHparaM nAsti ||

ca|| atulajanmaBOgAsaktAnAM | hitavaiBavasuKa midamEva |
satataM SrIhari saMkIrtanaM ta- | dvyatiriktasuKaM vaktuM nAsti||

ca|| bahuLamaraNa pariBavacittAnA- | mihaparasAdhana midamEva |
ahiSayanamanOharasEvA ta- | dviharaNaMvinA vidhirapi nAsti ||

ca|| saMsAraduritajADyaparANAM | hiMsAvirahita midamEva |
kaMsAMtakavEMkaTagiripatEH pra- |SaMsainAnAMpaScAdiha nAsti ||


ErIti nevvaru - ఏరీతి నెవ్వరు

ఏరీతి నెవ్వరు (రాగం: ) (తాళం : )

ప|| ఏరీతి నెవ్వరు నిన్ను నెట్టు భావించినాను | వారి వారి పాలికి వరదుడ వౌదువు ||

చ|| చేరి కొల్చినవారికి జేపట్టు గుంచమవు | కోరి నుతించువారి కొంగుపైడివి |
మేరతో దలచువారి మేటినిధానమవు | సారపు వివేకులకు సచ్చిదానందుడవు ||

చ|| కావలెనన్నవారికి కామధేనువు మరి | సేవ చేసేవారికి చింతామణివి |
నీవే గతన్నవారికి నిఖిల రక్షకుడవు | వావిరి శరణు వేడే వారికి భాగ్యరాశివి ||

చ|| నిన్ను బూజించేవారి నిజ పరతత్త్వమవు | యిన్నిటా నీదాసులకు నేలికవు |
యెన్నగ శ్రీవేంకటేశ యిహపరములకును | పన్ని కాచుకున్నవారి ఫలదాయకుడవు ||

ErIti nevvaru (Raagam: ) (Taalam: )

pa|| ErIti nevvaru ninnu neTTu BAviMcinAnu | vAri vAri pAliki varaduDa vauduvu ||

ca|| cEri kolcinavAriki jEpaTTu guMcamavu | kOri nutiMcuvAri koMgupaiDivi |
mEratO dalacuvAri mETinidhAnamavu | sArapu vivEkulaku saccidAnaMduDavu ||

ca|| kAvalenannavAriki kAmadhEnuvu mari | sEva cEsEvAriki ciMtAmaNivi |
nIvE gatannavAriki niKila rakShakuDavu | vAviri SaraNu vEDE vAriki BAgyarASivi ||

ca|| ninnu bUjiMcEvAri nija paratattvamavu | yinniTA nIdAsulaku nElikavu |
yennaga SrIvEMkaTESa yihaparamulakunu | panni kAcukunnavAri PaladAyakuDavu ||