veravaku manasA - వెరవకు మనసా

వెరవకు మనసా (రాగం: ) (తాళం : )

ప|| వెరవకు మనసా విష్ణుని అభయము | నెరవుగ యెదుటనే నిలిచి యున్నది ||

చ|| శ్రీపతి కరుణ జీవరాసులకు | దాపును దండై తగిలినది |
పైపై దేవుని బలు సంకల్పమె | చేపట్టి రక్షించ చెలగేది ||

చ|| నలినోదరు నిజ నామాంకితమే | ఇలపై దాసుల నేలేది |
కలిభంజను శంఖ చక్ర లాంఛన | మలవడి శుభముల నందించేది ||

చ|| శ్రీవేంకటపతి చేసిన చేతలే | వేవేల చందాల వెలసినది |
భూవిభుడితడు పూనిన మహిమలె | కైవసమై మము గాచేది ||

veravaku manasA (Raagam: ) (Taalam: )

pa|| veravaku manasA viShNuni aBayamu | neravuga yeduTanE nilici yunnadi ||

ca|| SrIpati karuNa jIvarAsulaku | dApunu daMDai tagilinadi |
paipai dEvuni balu saMkalpame | cEpaTTi rakShiMca celagEdi ||

ca|| nalinOdaru nija nAmAMkitamE | ilapai dAsula nElEdi |
kaliBaMjanu SaMKa cakra lAMCana | malavaDi SuBamula naMdiMcEdi ||

ca|| SrIvEMkaTapati cEsina cEtalE | vEvEla caMdAla velasinadi |
BUviBuDitaDu pUnina mahimale | kaivasamai mamu gAcEdi ||


verapulu norapulu - వెరపులు నొరపులు

వెరపులు నొరపులు (రాగం: ) (తాళం : )

ప|| వెరపులు నొరపులు వృథా వృథా | ధరపై మరి యంతయును వృథా ||

చ|| తడయక చేసినదానంబులు వృథ | యెడనెడ నెరిగినయెరుక వృథా |
వొడలిలోనిహరి నొనరగ మతిలో | దడవనిజీవమె తనకు వృథా ||

చ|| జగమున బడసినసంతానము వృథ | తగిలి గడించినధనము వృథా |
జగదేకవిభుని సకలాత్ముని హరి | దెగి కొలువనిబుద్ధియును వృథా ||

చ|| పనివడికూడిన పరిణామము వృథ | వొనరగనుండినవునికి వృథా |
ఘనుడగు తిరువేంకటగిరిహరి గని | మననేరని జన్మములు వృథా ||

verapulu norapulu (Raagam: ) (Taalam: )

pa|| verapulu norapulu vRuthA vRuthA | dharapai mari yaMtayunu vRuthA ||

ca|| taDayaka cEsinadAnaMbulu vRutha | yeDaneDa neriginayeruka vRuthA |
voDalilOnihari nonaraga matilO | daDavanijIvame tanaku vRuthA ||

ca|| jagamuna baDasinasaMtAnamu vRutha | tagili gaDiMcinadhanamu vRuthA |
jagadEkaviBuni sakalAtmuni hari | degi koluvanibuddhiyunu vRuthA ||

ca|| panivaDikUDina pariNAmamu vRutha | vonaraganuMDinavuniki vRuthA |
GanuDagu tiruvEMkaTagirihari gani | mananErani janmamulu vRuthA ||


veTTimOpuvaMTimEnu - వెట్టిమోపువంటిమేను

వెట్టిమోపువంటిమేను (రాగం: ) (తాళం : )

ప|| వెట్టిమోపువంటిమేను విడనాడి వీ- | డిట్టె దాటిపోయె నెటువంటిజాణే ||

చ|| ఘోరమైన ఆసలనెడికూకటవేరు దవ్వి- | పారవేసి యిడుమల బడనొల్లక |
యీరసపుసంసార మింగలము దగిలించి | యేరు దాటిపోయె నెటువంటిజాణే ||

చ|| కన్నవారి దన్ను బ్రేమ నన్నవారి దిగనాడి | వున్నతమైనచోట నుండబోయి |
తన్నుదా వేంకటపతి దాసులజేరి వాడు | యెన్నడు దిరిగిరాడే యెటువంటిజాణే ||

veTTimOpuvaMTimEnu (Raagam: ) (Taalam: )

pa|| veTTimOpuvaMTimEnu viDanADi vI- | DiTTe dATipOye neTuvaMTijANE ||

ca|| GOramaina AsalaneDikUkaTavEru davvi- | pAravEsi yiDumala baDanollaka |
yIrasapusaMsAra miMgalamu dagiliMci | yEru dATipOye neTuvaMTijANE ||

ca|| kannavAri dannu brEma nannavAri diganADi | vunnatamainacOTa nuMDabOyi |
tannudA vEMkaTapati dAsulajEri vADu | yennaDu dirigirADE yeTuvaMTijANE ||


Vetti Valapu Challaku - వెట్టి వలపు చల్లకు

Vetti Valapu Challaku - వెట్టి వలపు చల్లకు | Annamayya Lyrics | Sankeertanalu | Songs | Telugu & English

Listen Audio by G Balakrishna Prasad & S Janaki:

వెట్టి వలపు (రాగం: ) (తాళం : )

ప|| వెట్టి వలపు చల్లకు విష్ణుమూరితి నాతో | వెట్టిదేర మాటాడు విష్ణుమూరితి ||

చ|| వినయము సేసేవు విష్ణుమూరితి | వెనకటి వాడవెగ విష్ణుమూరితి |
వినవయ్యా మామాట విష్ణుమూరితి మమ్ము | వెనుకొని పట్టకుమీ విష్ణుమూరితి ||

చ|| వెరపుగల వాడవు విష్ణుమూరితి నేడు | వెరగైతి నిన్ను జూచి విష్ణుమూరితి |
విరివాయె నీమాయలు విష్ణుమూరితి నాకు | విరులిచ్చే వప్పటికి విష్ణుమూరితి ||

చ|| వెలసె నీ సేతలెల్ల విష్ణుమూరితి మా- | వెలుపలలోన నీవె విష్ణుమూరితి |
వెలలేని శ్రీవేంకట విష్ణుమూరితి కూడి | విలసిల్లితివి నాతో విష్ణుమూరితి ||

veTTi valapu (Raagam: ) (Taalam: )

pa|| veTTi valapu callaku viShNumUriti nAtO | veTTidEra mATADu viShNumUriti ||

ca|| vinayamu sEsEvu viShNumUriti | venakaTi vADavega viShNumUriti |
vinavayyA mAmATa viShNumUriti mammu | venukoni paTTakumI viShNumUriti ||

ca|| verapugala vADavu viShNumUriti nEDu | veragaiti ninnu jUci viShNumUriti |
virivAye nImAyalu viShNumUriti nAku | viruliccE vappaTiki viShNumUriti ||

ca|| velase nI sEtalella viShNumUriti mA- | velupalalOna nIve viShNumUriti |
velalEni SrIvEMkaTa viShNumUriti kUDi | vilasillitivi nAtO viShNumUriti ||


velupalella tanalOnugAka - వెలుపలెల్ల తనలోనుగాక

వెలుపలెల్ల తనలోనుగాక (రాగం: ) (తాళం : )

ప|| వెలుపలెల్ల తనలోనుగాక తను విడువదు వెడమాయా |
నలువున యోగీంద్రులెల్ల మునునడచినమార్గంబు ||

చ|| జీవము నిర్జీవముగాక సిద్ధించదు పరము |
వాపులెల్ల నొకవావిగాక మఱి వదలదు ప్రపంచము |
భావంబెల్ల నభావముగాక పాయదు కర్మంబు |
దైవజ్ఞులు మును నడచి రిదియపో తప్పనిమార్గంబు ||

చ|| మాటలెల్ల గడమాటలుగాక మాయదు మలినంబు |
కూటంబులు కాలకూటంబుగాక కొనకెక్కదు భవము |
చాటుదృష్ణ లగచాటునబడక చాలదు సౌఖ్యంబు |
తేటగా మును పెద్ద లివియపో తేర్చినమార్గంబు ||

చ|| గుణములెల్ల నిర్గుణముగాక తలకూడదు శాంతంబు |
అనువున కనువై అంతయు దాగాక ఆనందము లేదు |
ప్రణుతింపగ శ్రీ వేంకటరమణుని బహుళమహిమెల్లా |
గణనకెక్కగా పురాతనులు మును కడకట్టినమతము ||

velupalella tanalOnugAka (Raagam: ) (Taalam: )

pa|| velupalella tanalOnugAka tanu viDuvadu veDamAyA |
naluvuna yOgIMdrulella mununaDacinamArgaMbu ||

ca|| jIvamu nirjIvamugAka siddhiMcadu paramu |
vApulella nokavAvigAka marxi vadaladu prapaMcamu |
BAvaMbella naBAvamugAka pAyadu karmaMbu |
daivaj~julu munu naDaci ridiyapO tappanimArgaMbu ||

ca|| mATalella gaDamATalugAka mAyadu malinaMbu |
kUTaMbulu kAlakUTaMbugAka konakekkadu Bavamu |
cATudRuShNa lagacATunabaDaka cAladu sauKyaMbu |
tETagA munu pedda liviyapO tErcinamArgaMbu ||

ca|| guNamulella nirguNamugAka talakUDadu SAMtaMbu |
anuvuna kanuvai aMtayu dAgAka AnaMdamu lEdu |
praNutiMpaga SrI vEMkaTaramaNuni bahuLamahimellA |
gaNanakekkagA purAtanulu munu kaDakaTTinamatamu ||


velikI veLLaDu calikI - వెలికీ వెళ్ళడు చలికీ

వెలికీ వెళ్ళడు (రాగం: ) (తాళం : )

ప|| వెలికీ వెళ్ళడు చలికీ వెరవడు | వులికీ నులికీ నులికీనయ్యా ||

చ|| రోగియై తా రుచుల బాయడు | భోగియై రతిపొందల్లడు |
వేగిమిగిలినవెడచీకటినీరు | తాగీ దాగీ దాగీనయ్యా ||

చ|| తొడికీ దొడకడు వుడికీ నుడకడు | కడికీ గసరడు కడుజేరడు |
మడికీ గుడికీ మానినమమతల | బుడికీ బుడికీ బుడికీనయ్యా ||

చ|| నిండీ నిండడు నెరసీ నెరయడు | పండీ బండడు బయలీతలా |
అండనె తిరువేంకటాధిపు దలపుచు- | నుండీ నుండీ నుండీనయ్యా ||

velikI veLLaDu (Raagam: ) (Taalam: )

pa|| velikI veLLaDu calikI veravaDu | vulikI nulikI nulikInayyA ||

ca|| rOgiyai tA rucula bAyaDu | BOgiyai ratipoMdallaDu |
vEgimigilinaveDacIkaTinIru | tAgI dAgI dAgInayyA ||

ca|| toDikI doDakaDu vuDikI nuDakaDu | kaDikI gasaraDu kaDujEraDu |
maDikI guDikI mAninamamatala | buDikI buDikI buDikInayyA ||

ca|| niMDI niMDaDu nerasI nerayaDu | paMDI baMDaDu bayalItalA |
aMDane tiruvEMkaTAdhipu dalapucu- | nuMDI nuMDI nuMDInayyA ||


velayu nI kalyANavEdigA - వెలయు నీ కల్యాణవేదిగా

వెలయు నీ కల్యాణవేదిగా (రాగం:వరాళి ) (తాళం : )

వెలయు నీ కల్యాణవేదిగా మతినుండి
కలికి జవ్వనపు యాగము సేసెనతడు ||

మలయు నీ నాభి హోమపు గుండమునను
నెలకొన్న విరహాగ్ని నిండా బోసి
పొలయు నీ నిట్టూరుపుల విసరుచును
వొలుకు జెమటల నాహుంతి వోసెనతడు ||

కదసి నీనెస్నడిమి గగనమునందు
పొదలిన యారనే పొగ నిండగా
మదిరాక్షి నీ మంచి మానపు బళువు
నదనెరిగె వేలిచె నతివ నీకతడు ||

కాటుక కన్నుల నిన్ను గడునలైంచి
బూటకముల చిటిపొటి సిగ్గుల
గాటపు గరుణ వేంకటగిరి విభుడు
కోటి హోమము సేసెగూడి నిన్నతడు ||

velayu nI kalyANavEdigA (Raagam:varALi ) (Taalam: )

velayu nI kalyANavEdigA matinuMDi
kaliki javvanapu yAgamu sEsenataDu ||

malayu nI nAbhi hOmapu guMDamunanu
nelakonna virahAgni niMDA bOsi
polayu nI niTTUrupula visaruchunu
voluku jemaTala nAhuMti vOsenataDu ||

kadasi nInesnaDimi gaganamunaMdu
podalina yAranE poga niMDagA
madirAkShi nI maMchi mAnapu baLuvu
nadanerige vEliche nativa nIkataDu ||

kATuka kannula ninnu gaDunalaiMchi
bUTakamula chiTipoTi siggula
gATapu garuNa vEMkaTagiri vibhuDu
kOTi hOmamu sEsegUDi ninnataDu ||