Atani mulame jagamanta - ఆతని మూలమే జగమంతా

Atani mulame jagamanta - ఆతని మూలమే జగమంతా | Annamayya Lyrics | Sankeertanalu | Songs | Telugu & English

Listen Audio by SOBHARAJU:

అధ్యాత్మ సంకీర్తన
రేకు: 174-1
సంపుటము: 2-362
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లలిత

ఆతనిమూలమే జగమంతా నిది
ఆతుమలో హరి కీలు ‌అయివుండుఁ గాని ॥పల్లవి॥

మచ్చరము లేకున్నను మనసే రామరాజ్యము
వచ్చినట్టె వచ్చితేను వలపే చవి
యెచ్చుకుందు లేకున్న నెక్కడైనా సుఖమే
యిచ్చకుఁడై హరి తన కియ్యవలెఁ గాని ॥ఆత॥

నెట్టుకొని నడచితే నిజమే మూలధనము
పట్టినదే వ్రతమైతే భవమే మేలు
జట్టిగా నొనగూడితే సంసారమే ఫలము
యిట్టి హరి దనకు నియ్యవలెఁ గాని ॥ఆత॥

చెప్పినట్లు సేసితేను చేరి దేహమే చుట్టము
తప్పులు లేనిదియైతే ధర్మమే సొమ్ము
చొప్పున హరిదాసులు సోదించి చూచిన దిది
యెప్పుడు శ్రీవేంకటేశుఁ డియ్యవలెఁ గాని ॥ఆత॥

Atanimulame jagamanta nidi 
Atumlo Hari keelu ayivundu gani ॥Ata॥

Machcharamu lekunnanu manase Ramarajyamu 
Vachinatle vachitenu valape chavi 
Yechukundu lekunna nekkadaina sukhame 
Ichchakundai Hari tana kiyyavale gani ॥Ata॥ 

Nettukoni nadachite nijame mooladhanamu 
Pattinade vratamaite bhavame melu 
Jattiga nonagudite samsarame phalamu 
Yitti Hari danaku niyavale gani ॥Ata॥

Cheppinatlu sesitenu cheri dehame chuttamu 
Tappulu lenidiyaite dharmame sommu 
Choppuna Haridasulu sodinchi chuchina didi 
Yeppudu Srivenkatesu Diyavale gani ॥Ata॥