ekkaDi narakamu ekkaDimRutyuvu - Top/Popular/Annamayya/annamacarya/spiritual/devotional/traditional/songs/ lyrics/Audio/videos/telugu/english


ప|| ఎక్కడి నరకము ఎక్కడిమృత్యువు మాకు
దక్కి నీదివ్య నామామృతము చూరగొంటిమి

చ|| తమితో శ్రీపతి దాసుల చేరినప్పుడే
యమ కింకర భయము లణగి పోయె
జమళి నీ యాయుధ లాంఛనము మోచినప్పుడే
అమర కాలదండము లవియెల్ల బొలిసె

చ|| మును నీ నగరిత్రోవ మొగమైన యప్పుడే
ఘన యామ్య మార్గము కట్టువడియె
ఒనర నీ తిరుపతి నొకరాత్రి వున్నపుడే
కనలు కాలసూత్రాది ఘాతలెల్ల పూడె

చ|| యెడరై నీమంత్రజపము యెంచుకొన్న
యపుడే కడు చిత్రగుప్తుని లెక్కలుగ చే-
వడిగా వేంకటేశ్వర మీశరణమనగ
అడరి వైకుంఠము మా యరచేత నిలిచె


pa|| ekkaDi narakamu ekkaDimRutyuvu mAku
dakki nIdivya nAmAmRutamu cUragoMTimi

ca|| tamitO SrIpati dAsula cErinappuDE
yama kiMkara Bayamu laNagi pOye
jamaLi nI yAyudha lAMCanamu mOcinappuDE
amara kAladaMDamu laviyella bolise

ca|| munu nI nagaritrOva mogamaina yappuDE
Gana yAmya mArgamu kaTTuvaDiye
onara nI tirupati nokarAtri vunnapuDE
kanalu kAlasUtrAdi GAtalella pUDe

ca|| yeDarai nImaMtrajapamu yeMcukonna
yapuDE kaDu citraguptuni lekkaluga cE-
vaDigA vEMkaTESvara mISaraNamanaga
aDari vaikuMThamu mA yaracEta nilice

composed and sung by: Nukala chinasatyanarayana


eMta vaDEya nidEmammA - Top/Popular/Annamayya/annamacarya/spiritual/devotional/traditional/songs/ lyrics/Audio/videos/telugu/english


ఎంత వడేయ నిదేమమ్మా
దొంతిరతులకు నెదురు చూచీని

అలికులవేణి అంబుజపాణి
కలికిమగువ రాగదవమ్మా
మలయజగంధి మదన విలాసిని
కలయికకు పతిగాచుకున్నాడు

సామజగమనా చక్కెరబొమ్మా
కామిని యిక రాగదవమ్మా
భూ(భా?)మాతిలకమ పసిడి సలాకా
నీమగడదివో నిలుచుకున్నాడు

వొడికపు నెలతా వొప్పుల కుప్పా
కడకల సతి రాగాదవమ్మా
గుడిగొని తెరలో గూడెనిన్నప్పుడు
యెడయక శ్రీవేంకటేశుదున్నాడు


eMta vaDEya nidEmammA
doMtiratulaku neduru chUchIni

alikulavENi aMbujapANi
kalikimaguva rAgadavammA
malayajagaMdhi madana vilAsini
kalayikaku patigAchukunnADu

sAmajagamanA chakkerabommA
kAmini yika rAgadavammA
bhUmAtilakama pasiDi salAkA
nImagaDadivO niluchukunnADu

voDikapu nelatA voppula kuppA
kaDakala sati rAgAdavammA
guDigoni teralO gUDeninnappuDu
yeDayaka SrIvEMkaTESudunnADu



Tuned&Sung by:Balakrishna Prasad

Get this widget | Track details | eSnips Social DNA

Eduta nevvaru leru - ఎదుట నెవ్వరు లేరు

ప|| ఎదుట నెవ్వరు లేరు యింతా విష్ణుమయమే వదలక హరిదాసవర్గమైనవారికి

చ|| ముంచిన నారాయణమూర్తులే యీజగమెల్ల అంచితనామములే యీయక్షరాలెల్లా
పంచుకొన్న శ్రీహరిప్రసాద మీరుచులెల్లా తెంచివేసి మేలు దా దెలిసేటివారికి

చ|| చేరి పారేటినదులు శ్రీపాదతీర్థమే భారపుయీ భూమితని పాదరేణువే
సారపుగర్మములు కేశవుని కైంకర్యములే ధీరులై వివేకించి తెలిసేటివారికి

చ|| చిత్తములో భావమెల్లా శ్రీవేంకటేశుడే హత్తినప్రకృతి యెల్లా నాతనిమాయే
మత్తిలి యీతనికంటే మరి లేదితరములు తిత్తిదేహపుబ్రదుకు తెలిసేటివారికి


pa|| eduTa nevvaru lEru yiMtA viShNumayamE vadalaka haridAsavargamainavAriki

ca|| muMcina nArAyaNamUrtulE yIjagamella aMcitanAmamulE yIyakSharAlellA
paMcukonna SrIhariprasAda mIruculellA teMcivEsi mElu dA delisETivAriki

ca|| cEri pArETinadulu SrIpAdatIrthamE BArapuyI BUmitani pAdarENuvE
sArapugarmamulu kESavuni kaiMkaryamulE dhIrulai vivEkiMci telisETivAriki

ca|| cittamulO BAvamellA SrIvEMkaTESuDE hattinaprakRuti yellA nAtanimAyE
mattili yItanikaMTE mari lEditaramulu tittidEhapubraduku telisETivAriki


chali gAli vEDEla challIne kappurapu - Top/Popular/Annamayya/annamacarya/spiritual/devotional/traditional/songs/ lyrics/Audio/videos/telugu/english


చలి గాలి వేడేల చల్లీనే కప్పురపు
మలయజము తానేల మండీనే

పాపంపు మననేల పారీనే నలుగడల
చూపేల నలువంక జూచీనే
తాపంపు మేనేల తడవీనే పూవింటి
తూపేల చిత్తంబు దూరీనే

వాయెత్తి చిలుకేల వదరీనె పలుమారు
కోయిలలు దామేల గొణిగీనే
రాయడికి నలులేల రసీనే మాతోను
కాయజుడు తానేల కసరీనే

ఏకాంతమునేల యెదురైతినే తనకు
లోకాధి పతికేల లోనైతినే
చేకొనిదే మన్నించె శేషాద్రి వల్లభుడు
పైకొనిదె మమ్మేల పాలించెనే


chali gAli vEDEla challIne kappurapu-
malayajamu tAnEla mandEnE

pApapu manasEla pAreene nalugadala
choopela naluvanka joocheenE
tApaMpu mEnEla taDaveenE poovinti-
toopEla cIttaMbu doorenE

vAYetti cilukela vadareene palumaru
kOyilalu daamEla goNageenE
raayadiki nalulEla raaseene maa tonu
kaayajujudu tAnEla kasareenE

EkaMtamunela yeduraitine tanaku
lOkAdhipatikEla LonaitinE
cEkonide manninchi SeshAdri Vallabhudu
paikonide mammeela pAlinchenE

Sung by:Vanijayaram

Get this widget | Track details | eSnips Social DNA

bApu bApu kRshNa bAlakRshNA - Top/Popular/Annamayya/annamacarya/spiritual/devotional/traditional/songs/ lyrics/Audio/videos/telugu/english


బాపు బాపు కృష్ణ బాలకృష్ణా
బాపురే నీ ప్రతాప భాగ్యము లివివో

బాలుడవై రేపల్లె పాలు నీవారగైంచ
పాల జలనిధి యెంత భయపడెనో
ఆలించి తొదలుమాట లాడనేర్చుకొనగ
యీలీల నసురసతు లెంత భ్రమసిరో

తప్పటడుగులు నీవు ధరమీద పెట్టగాను
తప్పక బలీంద్రుడేమి దలచినాడో
అప్పుదే దాగిలిముచ్చు లందరితో నాడగాను
చెప్పేటివేదాలు నిన్ను జేరి యెంత నగునో

సందడి గోపికల చంకలెక్కి వున్ననాడు
చెంది నీవురము మీది శ్రీసతి యేమనెనో
విందుగ శ్రీవేంకటాద్రి విభుడవై యున్న నేడు
కందువైన దేవతల ఘనత యెట్టుండెనో

bApu bApu kRshNa bAlakRshNA
bApurE nI pratApa bhAgyamu livivO

bAluDavai rEpalle pAlu nIvAragaMchaga
pAla jalanidhi yeMta bhayapaDenO
AliMchi todalumATa lADanEruchukonaga
yIlIla nasurasatu leMta bhramasirO

tappaTaDugulu nIvu dharamIda peTTagAnu
tappaka balIMdruDEmi dalachinADO
appudE dAgilimuchchu laMdaritO nADagAnu
cheppETivEdAlu ninnu jEri yeMta nagunO

saMdaDi gOpikala chaMkalekki vunnanADu
cheMdi nIvuramu mIdi SrIsati yEmanenO
viMduga SrIvEMkaTAdri vibhuDavai yunna nEDu
kaMduvaina dEvatala ghanata yeTTuMDenO

Sung by:TP Chakrapani

Get this widget | Track details | eSnips Social DNA

U - Annamayya Lyrics List

vuyyAlAbAlunUCedaru

ugguveTTarE vOyammA

uppavaDamu gAkunnAriMdaru

udayAdri telupAye

UrulEni polimEra

unnatOnnatuDu vuDayavaru

uyyAla Upulu O muddulayya

UrakE dorakunA vunnatOnnata

unnamaMtrAliMdu sadA

unnamATa lika nEla vO dEvA

udayAdri telupAye

Annamayya Lyrics: Telugu/ English - Index - T

Learn/Listen more | 1 | 2 | 3 |




tiruvIdhula merasI dEvadEvuDu

tandanaana ahi - brahmamokkate

tirumala giri raaya

telisitaemOkshamu

teppaGa marrAku mEda

telisinavAriki dEvuMDitaDE

teliya cIkaTiki dIpamettaka

tattADi guDi dhiMdhiM

tirotiro javarAla

tvamEva SaraNaM




Learn/Listen more | 1 | 2 | 3 |