Challanai kayagado - చల్లనై కాయగదో

Challanai kayagado - చల్లనై కాయగదో | Annamayya Lyrics | Sankeertanalu | Songs | Telugu & English

Listen Audio by P S RANGANATH & VASANTHA:

చల్లనై కాయగదో (రాగం: ) (తాళం : )

ప|| చల్లనై కాయగదో చందమామ | వెల్లిగా తిరి వేంకటేశు నెదుట ||
అప|| మొల్లమిగ నమృతంపు వెల్లిగొలుపుచు లోక- | మెల్ల నిను కొనియాడగా ||

చ|| పొందైన హితులు నాప్తులు రసికులు కవులు | అందముగ నును మాటలాడ నేర్చిన ఘనులు |
చిందులకు నాడేటి సీమంతి మణులు | చెలగి ఇరుగడ కొలువగాను |
వంది మాగధులు కైవారింప తన దివ్య | మందిరో పాంత మార్గమున కోనేటి |
ముందుటను కడు మంద మంద ప్రయాణముల | ఇందిరాపతి మెరయగాను ||

చ|| ఏకాంత సుఖగోష్ఠి నేప్రొద్దు మానవా- | నీకంబు లెడ గలిసి నిలిచి సేవింప గాం- |
తా కదంబములు హస్తముల కంకణ ఝణ- | త్కారములు నిగుడ చామరము లిడగ |
జోకైన మణిగణ స్తోమాంకితంబులై | సొంపుపొందు నాలవట్టములు కరములు దాల్చి |
యేకాంతు లిరువంక నెదిరి కొలువగ సకల | లోకేశ్వరుడు మెరయగాను ||

చ|| బంగారు ప్రతిమలకు వ్రతులైన దివిజ లో- | కాంగనలు ఘన విమానాంగణంబున నుండి |
చెంగలువలును మంచి చేమంతి రేకులును | చెలగి యిరుగడ చల్లగాను |
మంగళాత్మకము లగు మహిత వేదాంత వే- | దాంగ విద్యలకు ప్రియమంది చేకొనుచు తిరు- |
వేంగళేశుండు కడు వేడుకల తోడ తిరు- | వీధులను విహరింపగాను ||

callanai kAyagadO (Raagam: ) (Taalam: )

pa|| callanai kAyagadO caMdamAma | velligA tiri vEMkaTESu neduTa ||
apa|| mollamiga namRutaMpu velligolupucu lOka- | mella ninu koniyADagA ||

ca|| poMdaina hitulu nAptulu rasikulu kavulu | aMdamuga nunu mATalADa nErcina Ganulu |
ciMdulaku nADETi sImaMti maNulu | celagi irugaDa koluvagAnu |
vaMdi mAgadhulu kaivAriMpa tana divya | maMdirO pAMta mArgamuna kOnETi |
muMduTanu kaDu maMda maMda prayANamula | iMdirApati merayagAnu ||

ca|| EkAMta suKagOShThi nEproddu mAnavA- | nIkaMbu leDa galisi nilici sEviMpa gAM- |
tA kadaMbamulu hastamula kaMkaNa JaNa- | tkAramulu niguDa cAmaramu liDaga |
jOkaina maNigaNa stOmAMkitaMbulai | soMpupoMdu nAlavaTTamulu karamulu dAlci |
yEkAMtu liruvaMka nediri koluvaga sakala | lOkESvaruDu merayagAnu ||

ca|| baMgAru pratimalaku vratulaina divija lO- | kAMganalu Gana vimAnAMgaNaMbuna nuMDi |
ceMgaluvalunu maMci cEmaMti rEkulunu | celagi yirugaDa callagAnu |
maMgaLAtmakamu lagu mahita vEdAMta vE- | dAMga vidyalaku priyamaMdi cEkonucu tiru- |
vEMgaLESuMDu kaDu vEDukala tODa tiru- | vIdhulanu vihariMpagAnu ||


calapAdi rOgamI - చలపాది రోగమీ

చలపాది రోగమీ (రాగం: ) (తాళం : )

ప|| చలపాది రోగమీ సంసారము నేడు | బలువైన మందు విష్ణు భక్తి జీవులకు ||

చ|| కీడౌట మదినెరింగియు మోహ మెడలదిది | పాడైన విధికృతము బలవంతము |
ఈడనే ఇది మాన్ప హితవైన వజ్రాంగి | జోడువో హరి దలంచుట జీవులకును ||

చ|| హేయమని తెలిసి తా నిచ్చగించీ యాత్మ | పాయదీ రతి సుఖము బలవంతము |
మాయ నుగ్గులు చేయ మాధవుని దంచనపు | రాయివో వైరాగ్య రచన జీవులకు ||

చ|| పొలయు దురితంపు రొంపులు దన్నువడి ముంచ | పలుమారు జన్మమీ బలవంతము |
నెలవుకొని సకలంబు నిర్మలముగా కడుగు | జలధివో వేంకటేశ్వరుడు జీవులకు ||

calapAdi rOgamI (Raagam: ) (Taalam: )

pa|| calapAdi rOgamI saMsAramu nEDu | baluvaina maMdu viShNu Bakti jIvulaku ||

ca|| kIDauTa madineriMgiyu mOha meDaladidi | pADaina vidhikRutamu balavaMtamu |
IDanE idi mAnpa hitavaina vajrAMgi | jODuvO hari dalaMcuTa jIvulakunu ||

ca|| hEyamani telisi tA niccagiMcI yAtma | pAyadI rati sukhamu balavaMtamu |
mAya nuggulu cEya mAdhavuni daMcanapu | rAyivO vairAgya racana jIvulaku ||

ca|| polayu duritaMpu roMpulu dannuvaDi muMca | palumAru janmamI balavaMtamu |
nelavukoni sakalaMbu nirmalamugA kaDugu | jaladhivO vEMkaTESvaruDu jIvulaku ||

chakkani mAnini - చక్కని మానిని

చక్కని మానిని (రాగం: ) (తాళం : )

చక్కని మానిని మీసరి యెవ్వరె
యెక్కువైన నీ భావమెంచి చూడవసమా ||

కోమలి నీకుచముల కొండలకొనల పొంత
వోముచు మించి నిలిచెనొక సింహము
కాముడు జఘ్హనమనే కట్టుబండిమీద బెట్టి
దీమముతో వేటలాడిదేరి చూడ వసమా ||

పడతిలే జిగురుల పాదపుటడవిలోన
నడవుల యేనుగలు నటిఇంచగా
తొడలరటి కంబాలతో గట్టి దీములుగా
బడిబడి వేటలాడ భావించ వసమా ||

అంగనముఖ్హమనేటి అంబుజాకరము పొంత
ముంగిట జూపుల లేళ్ళు మోహరించగా
కంగని శ్రీవేంకటేశు కౌగిటి భావానగట్టి
చెంగటనే వేటలాడి జిత్తగించ వసమా ||

chakkani mAnini (Raagam: ) (Taalam: )

chakkani mAnini mIsari yevvare
yekkuvaina nI bhAvameMchi chUDavasamA ||

kOmali nIkuchamula koMDalakonala poMta
vOmuchu miMchi nilichenoka siMhamu
kAmuDu jaGhanamanE kaTTubaMDimIda beTTi
dImamutO vETalADidEri chUDa vasamA ||

paDatilE jigurula pAdapuTaDavilOna
naDavula yEnugalu naTiiMchagA
toDalaraTi kaMbAlatO gaTTi dImulugA
baDibaDi vETalADa bhAviMcha vasamA ||

aMganamuKhamanETi aMbujAkaramu poMta
muMgiTa jUpula lELLu mOhariMchagA
kaMgani SrIvEMkaTESu kougiTi bhAvAnagaTTi
cheMgaTanE vETalADi jittagiMcha vasamA ||


Chakkani talliki - చక్కని తల్లికి

Chakkani talliki - చక్కని తల్లికి |  Annamayya Lyrics | Sankeertanalu | Songs | Telugu & English

పరిచయం (Introduction)
అన్నమయ్య రాసిన అద్భుతమైన శృంగార సంకీర్తనలలో 'చక్కని తల్లికి చాంగుభళా' ఒకటి. ఈ పాటలో అన్నమాచార్యులు సాక్షాత్తు లక్ష్మీదేవి (అలమేలుమంగ) సౌందర్యాన్ని, ఆమె రాజసాన్ని ఎంతో ముచ్చటగా వర్ణించారు. 'చాంగుభళా' అంటే 'భళా' లేదా 'ఎంత బాగుంది!' అని అర్థం. భగవంతుడైన శ్రీవేంకటేశ్వరుని పట్టపురాణిగా ఆమె సౌందర్యం, ఆమె హావభావాలు చూసి పరవశించిపోయి అన్నమయ్య ఈ పద్యాన్ని అల్లారు. ఇది సాధారణంగా బాగేశ్వరి లేదా మధ్యమావతి రాగంలో వినసొంపుగా ఉంటుంది.

Listen Audio by G Balakrishna Prasad:

చక్కని తల్లికి (రాగం:పాడి ) (తాళం : )

చక్కని తల్లికి చాంగుభళా తన
చక్కెర మోవికి చాంగుభళా

కులికెడి మురిపెపు కుమ్మరింపు తన
సళుపు జూపులకు చాంగుభళా
పలుకుల సొంపుల బతితో గసరెడి
చలముల యలుకకు చాంగుభళా

కిన్నెరతో పతి కెలన నిలుచు తన
చన్ను మెఱుగులకు చాంగుభళా
ఉన్నతి బతిపై నొరగి నిలుచు తన
సన్నపు నడిమికి చాంగుభళా

జందెపు ముత్యపు సరులహారముల
చందన గంధికి చాంగుభళా
విందయి వెంకట విభుబెన చినతన
సంది దండలకు చాంగుభళా

Chakkani talliki (Raagam:paadi ) (Taalam: )

Chakkani talliki chaamgubhalaa tana
Chakkera moviki chaamgubhalaa

Kulikedi muripepu kummarimpu tana
Salupu joopulaku chaamgubhalaa
Palukula sompula batito gasaredi
Chalamula yalukaku chaamgubhalaa

Kinnerato pati kelana niluchu tana
Channu me~rugulaku chaamgubhalaa
Unnati batipai noragi niluchu tana
Sannapu nadimiki chaamgubhalaa

Jamdepu mutyapu sarulahaaramula
Chamdana gamdhiki chaamgubhalaa
Vimdayi vemkata vibhubena chinatana
Samdi damdalaku chaamgubhalaa

English Meaning & Explanation
Pallavi (Refrain)
  • Chakkani talliki chaamgubhalaa tana / Chakkera moviki chaamgubhalaa
  • Meaning: Hail to the beautiful mother (Alamelu Manga)! Glory to her lips which are as sweet as sugar. A joyful salute to her divine elegance.
Charanam 1
  • Meaning: Her playful movements and the way she pours out her charms are marvelous. Even her feigned anger and the little quarrels she has with her Lord (Venkateswara) while speaking sweet words are beautiful to behold.
Charanam 2
  • Meaning: As she stands beside her Lord holding a Kinnera (a traditional string instrument), the radiance of her beauty is stunning. The grace with which she leans slightly towards her husband, highlighting her slender waist, is truly a sight to admire.
Charanam 3
  • Meaning: Adorned with pearl necklaces and smelling of fresh sandalwood, she is a vision of purity. As she embraces the Lord of Venkata Hill, the beauty of her decorated arms (adorned with armlets) is beyond praise. Glory to her and her union with the Lord!

Frequently Asked Questions (FAQ)
  • 'చాంగుభళా' అంటే ఏమిటి? (What does 'Changubhala' mean?)
    ఇది ఒక ప్రశంసా పూర్వక పదం. దీని అర్థం "ఎంత బాగుంది!" లేదా "అద్భుతం!" అని. అన్నమయ్య తన సంకీర్తనల్లో ఏదైనా విషయాన్ని గొప్పగా వర్ణించేటప్పుడు ఈ పదాన్ని వాడతారు.
  • ఈ పాట ఎవరి గురించి? (Who is this song about?)
    ఈ పాట శ్రీవేంకటేశ్వరుని భార్య అయిన అలమేలుమంగ (శ్రీలక్ష్మి) సౌందర్యాన్ని మరియు ఆమె దివ్యత్వాన్ని కొనియాడుతూ రాసినది.
  • ఈ పాట ఏ సందర్భంలో పాడతారు?
    ఇది ప్రధానంగా శృంగార సంకీర్తన. శాస్త్రీయ నృత్య ప్రదర్శనలలో (కుచిపూడి, భరతనాట్యం) ఈ పాటకు ప్రాధాన్యత ఎక్కువ.
  • సినిమా వెర్షన్ ఉందా?
    అవును, అన్నమయ్య (1997) సినిమాలో ఈ పాటను చాలా అందంగా చిత్రీకరించారు.

GOraduritamulacE - ఘోరదురితములచే

ఘోరదురితములచే (రాగం: ) (తాళం : )

ప|| ఘోరదురితములచే గుణవికారములచే- | నీరీతిబడునాకు నేది దెరువు ||

చ|| హరి జగన్నాథు లోకారాధ్యు- | నెరగలేనివాని కేది దెరువు |
పరమపురుషుని జగద్భరితు నంతర్వ్యాప్తి- | నిరవుకొలుపనివాని కేది దెరువు ||

చ|| శ్రీవేంకటేశు దలచినవెనుక సకలంబు- | నేవగింపనివాని కేది దెరువు |
దేవోత్తముని మహిమ దెలిసితెలియగలేని- | యీవివేకంబునకు నేది దెరువు ||

GOraduritamulacE (Raagam: ) (Taalam: )

pa|| GOraduritamulacE guNavikAramulacE- | nIrItibaDunAku nEdi deruvu ||

ca|| hari jagannAthu lOkArAdhyu- | neragalEnivAni kEdi deruvu |
paramapuruShuni jagadBaritu naMtarvyApti- | niravukolupanivAni kEdi deruvu ||

ca|| SrIvEMkaTESu dalacinavenuka sakalaMbu- | nEvagiMpanivAni kEdi deruvu |
dEvOttamuni mahima delisiteliyagalEni- | yIvivEkaMbunaku nEdi deruvu ||


GOra vidAraNa - ఘోర విదారణ

ఘోర విదారణ (రాగం: ) (తాళం : )

ప|| ఘోర విదారణ నారసింహనీ | నీ రూపముతో నెట్లుండితివో ||

చ|| ఉడికెడి కోపపుటూర్పుల గొండలు | పొడిపొడియై నభమున కెగయ |
బెడిదపు రవమున పిడుగులు దొరుగగ | యెడనెడ నీవపుటెట్లుండితివో ||

చ|| కాలానలములు గక్కున యన | జ్వాలల నిప్పులు చల్లుచును |
ఫాలాక్షముతో బ్రహ్మాణ్డ కోట్ల | కేలికవై నేవెటులుండితివో ||

చ|| గుటగుట రవములు కుత్తిక గులుకుచు | గిటగిట బండ్లు గీటుచును |
తటతట బెదవులు దవడల వణకగ | ఇటువలె నీవపుడెట్లుండితివో ||

చ|| గోళ్ళ మెరుగుల కొంకుల పెదపెద | వేళ్ళ దిక్కులు వెదుకుచును |
నీళ్ళ తీగలు విగుడగ నోరను- | చ్చిళ్ళు గమ్మగ నెట్లుండితివో ||

చ|| హిరణ్యకశిపుని నేపడచి భయం- | కర రూపముతో గడుమెరసి |
తిరు వేంకట గిరి దేవుడ నీవిక | యిరవు కొన్న నాడెట్లుండితివో ||

GOra vidAraNa (Raagam: ) (Taalam: )

pa|| GOra vidAraNa nArasiMhanI | nI rUpamutO neTluMDitivO ||

ca|| uDikeDi kOpapuTUrpula goMDalu | poDipoDiyai naBamuna kegaya |
beDidapu ravamuna piDugulu dorugaga | yeDaneDa nIvapuTeTluMDitivO ||

ca|| kAlAnalamulu gakkuna yana | jvAlala nippulu callucunu |
PAlAkShamutO brahmANDa kOTla | kElikavai nEveTuluMDitivO ||

ca|| guTaguTa ravamulu kuttika gulukucu | giTagiTa baMDlu gITucunu |
taTataTa bedavulu davaDala vaNakaga | iTuvale nIvapuDeTluMDitivO ||

ca|| gOLLa merugula koMkula pedapeda | vELLa dikkulu vedukucunu |
nILLa tIgalu viguDaga nOranu- | cciLLu gammaga neTluMDitivO ||

ca|| hiraNyakaSipuni nEpaDaci BayaM- | kara rUpamutO gaDumerasi |
tiru vEMkaTa giri dEvuDa nIvika | yiravu konna nADeTluMDitivO ||


GanuDAtaDE mamu - ఘనుడాతడే మము

ఘనుడాతడే మము (రాగం: ) (తాళం : )

ప|| ఘనుడాతడే మము గాచుగాక హరి | అనిశము నేమిక నతనికె శరణు ||

చ|| యెవ్వని నాభిని యీ బ్రహ్మాదులు | యెవ్వడు రక్షకుడిన్నిటికి |
యెవ్వని మూలము యీ సచరాచర | మవ్వల నివ్వల నతనికే శరణు ||

చ|| పురుషోత్తముడని పొగడి రెవ్వరిని | కరి నెవ్వడు గాచె |
ధర యెవ్వడెత్తి దనుజుల బొరిగొనె | అరుదుగ మేమిక నతనికె శరణు ||

చ|| శ్రీసతి యెవ్వని జేరి వురమునను | భాసిల్లె నెవ్వడు పరమంబై |
దాసుల కొరకై తగు శ్రీవేంకట | మాస చూపి నితడతనికె శరణు ||

GanuDAtaDE mamu (Raagam: ) (Taalam: )

pa|| GanuDAtaDE mamu gAcugAka hari | aniSamu nEmika natanike SaraNu ||

ca|| yevvani nABini yI brahmAdulu | yevvaDu rakShakuDinniTiki |
yevvani mUlamu yI sacarAcara | mavvala nivvala natanikE SaraNu ||

ca|| puruShOttamuDani pogaDi revvarini | kari nevvaDu gAce |
dhara yevvaDetti danujula borigone | aruduga mEmika natanike SaraNu ||

ca|| SrIsati yevvani jEri vuramunanu | BAsille nevvaDu paramaMbai |
dAsula korakai tagu SrIvEMkaTa | mAsa cUpi nitaDatanike SaraNu ||