Vaevaelu bamdhamulu - వేవేలు బంధములు

వేవేలు బంధములు (రాగం:శంకరాభరణం ) (తాళం : )

వేవేలు బంధములు విడువ ముడువబట్టె
దైవమా నిన్నెట్టు తగిలేమయ్యా

పారీ ముందటిభవపాశములు
తీరీ దొల్లిటితిత్తిలో పుణ్యము
వూరీ గోరిక లొకటొకటే
యేరీతి సుజ్ఞాన మెరిగేనయ్యా

పట్టీ నాకొంగు పంచేంద్రియములు
తొట్టీ బాపము తోడుతనే
పెట్టీ భ్రమల బెరిగి నీమాయలు
అట్టే మోక్ష మెన్నడందేమయ్యా

విందై యిహము వెనకకు దీసీ
అందీ వైరాగ్య మరచేతికి
కందువ శ్రీవేంకటపతి యీ రెండు
బొందించితి వేది భోగింతునయ్యా

Vaevaelu bamdhamulu (Raagam: Samkaraabharanam) (Taalam: )

Vaevaelu bamdhamulu viduva muduvabatte
Daivamaa ninnettu tagilaemayyaa

Paaree mumdatibhavapaasamulu
Teeree dollititittilo punyamu
Vooree gorika lokatokatae
Yaereeti suj~naana merigaenayyaa

Pattee naakomgu pamchaemdriyamulu
Tottee baapamu todutanae
Pettee bhramala berigi neemaayalu
Attae moksha mennadamdaemayyaa

Vimdai yihamu venakaku deesee
Amdee vairaagya marachaetiki
Kamduva sreevaemkatapati yee remdu
Bomdimchiti vaedi bhogimtunayyaa


vELagAdu siggulaku - వేళగాదు సిగ్గులకు

వేళగాదు సిగ్గులకు (రాగం: ) (తాళం : )

ప|| వేళగాదు సిగ్గులకు విచ్చనవిడింతే కాని | గోలతనమిపుడేలే కొంగుపట్టీ నతడు ||

చ|| తమకించి నపుడే తతియాయ రతులకు | సుముఖుడైనపుడే సూటి మాటకు |
చెమరించినపుడే చేతలకెల్లా లోను | కొమరె వేల లోగేవే కొంగువట్టీ నతడు ||

చ|| అంట జూచినపుడే అదనట్టే నవ్వులకు | వెంట వచ్చినపుడే విందుమోవికి |
నంటు సేసుకున్నప్పుడే నయము కోరికలకు | దంటవు యేల కొంకేవే దక్కగొనీ నతడు ||

చ|| ఆయములంటినప్పుడే అనువు నీ పంతాలకు | చాయ సేసుకొన్నపుడే చవి కౌగిలి |
యీయెడ నలమేల్మంగ ఇదిగో శ్రీ వేంకటేశు- | నోయమ్మ కూడితివి నీ వొడి వట్టెనతడు ||

vELagAdu siggulaku (Raagam: ) (Taalam: )

pa|| vELagAdu siggulaku viccanaviDiMtE kAni | gOlatanamipuDElE koMgupaTTI nataDu ||

ca|| tamakiMci napuDE tatiyAya ratulaku | sumuKuDainapuDE sUTi mATaku |
cemariMcinapuDE cEtalakellA lOnu | komare vEla lOgEvE koMguvaTTI nataDu ||

ca|| aMTa jUcinapuDE adanaTTE navvulaku | veMTa vaccinapuDE viMdumOviki |
naMTu sEsukunnappuDE nayamu kOrikalaku | daMTavu yEla koMkEvE dakkagonI nataDu ||

ca|| AyamulaMTinappuDE anuvu nI paMtAlaku | cAya sEsukonnapuDE cavi kaugili |
yIyeDa nalamElmaMga idigO SrI vEMkaTESu- | nOyamma kUDitivi nI voDi vaTTenataDu ||


vEMkaTagiri gOviMduDA - వేంకటగిరి గోవిందుడా

వేంకటగిరి గోవిందుడా (రాగం: ) (తాళం : )

ప|| వేంకటగిరి గోవిందుడా | యింకా నొకరో యిద్దరో మీరు ||

చ|| పచ్చలు దాచిన బాహుపురులతో | అచ్చపు గరముల అందముతో |
అచ్చలు నిచ్చలు నలరుదురిదివో | నిచ్చలు నీవో నీవో కానీ ||

చ|| నిలుచుండుటయును నెరి బవళింపుచు | నలరుటయును మీరటునిటును |
జలజాక్షులు దొడ చరచగ నొరపుల | వెలయగ నిద్రో విభవమిదో ||

చ|| తిరువేంకటగిరి దిగువ తిరుపతిని | పరమానందపు బహుసిరులు |
అరుదుగ బొందుచు అధికము లందుచు | ఉరగశయనుడవొ వొడయడవో ||

vEMkaTagiri (Raagam: ) (Taalam: )

pa|| vEMkaTagiri gOviMduDA | yiMkA nokarO yiddarO mIru ||

ca|| paccalu dAcina bAhupurulatO | accapu garamula aMdamutO |
accalu niccalu nalaruduridivO | niccalu nIvO nIvO kAnI ||

ca|| nilucuMDuTayunu neri bavaLiMpucu | nalaruTayunu mIraTuniTunu |
jalajAkShulu doDa caracaga norapula | velayaga nidrO viBavamidO ||

ca|| tiruvEMkaTagiri diguva tirupatini | paramAnaMdapu bahusirulu |
aruduga boMducu adhikamu laMducu | uragaSayanuDavo voDayaDavO ||


Vedukondama - వేడుకొందామా

Vedukondama - వేడుకొందామా | Annamayya Lyrics | Sankeertanalu | Songs | Telugu & English

Listen Audio by G BALAKRISHNA PRASAD, PS RANGANATH, G NAGESWARA NAIDU & SP SAILAJA:

వేడుకొందామా (రాగం: ) (తాళం : )

ప|| వేడుకొందామా వేంకటగిరి వేంకటేశ్వరుని ||

చ|| ఆమటి మ్రొక్కుల వాడె ఆదిదేవుడే వాడు | తోమని పళ్యాలవాడె దురిత దూరుడే ||

చ|| వడ్డికాసుల వాడె వనజనాభుడే పుట్టు | గొడ్డురాండ్రకు బిడ్డలిచ్చే గోవిందుడే ||

చ|| ఎలిమి గోరిన వరాలిచ్చే దేవుడే వాడు | అలమేల్మంగా శ్రీవేంకటాద్రి నాథుడే ||

vEDukoMdAmA (Raagam: ) (Taalam: )

pa|| vEDukoMdAmA vEMkaTagiri vEMkaTESvaruni ||

ca|| AmaTi mrokkula vADe AdidEvuDE vADu | tOmani paLyAlavADe durita dUruDE ||

ca|| vaDDikAsula vADe vanajanABuDE puTTu | goDDurAMDraku biDDaliccE gOviMduDE ||

ca|| elimi gOrina varAliccE dEvuDE vADu | alamElmaMgA SrIvEMkaTAdri nAthuDE ||

vEdana boralE - వేదన బొరలే

వేదన బొరలే (రాగం: ) (తాళం : )

ప|| వేదన బొరలే వెరవేలా | యీదయ విధి దనకీయదా ||

చ|| తత్తరపాట్ల తనువికారముల | జిత్తము దెంచేచెలువేలా |
బత్తితో దాచిన పరధనంబుగొని | సత్తయు వుండుట చాలదా ||

చ|| యెక్కువతమకపుటింతుల బొందక | వక్కుచువాడే వయసేలా |
మొక్కుచు దాచిన మూలధనము గన- | నెక్కువ దైవంబియ్యదా ||

చ|| సేతల బొరలెడి చిక్కుల గెరలెడి- | రోతల యీనేరుపులేలా |
బాతిగ వేంకటపతిరతి జిత్తపు- | టూతల గోరిక లూనవా ||

vEdana boralE (Raagam: ) (Taalam: )

pa|| vEdana boralE veravElA | yIdaya vidhi danakIyadA ||

ca|| tattarapATla tanuvikAramula | jittamu deMcEceluvElA |
battitO dAcina paradhanaMbugoni | sattayu vuMDuTa cAladA ||

ca|| yekkuvatamakapuTiMtula boMdaka | vakkucuvADE vayasElA |
mokkucu dAcina mUladhanamu gana- | nekkuva daivaMbiyyadA ||

ca|| sEtala boraleDi cikkula geraleDi- | rOtala yInErupulElA |
bAtiga vEMkaTapatirati jittapu- | TUtala gOrika lUnavA ||


vEdamulE nI nivAsamaTa - వేదములే నీ నివాసమట

వేదములే నీ (రాగం: ) (తాళం : )

ప|| వేదములే నీ నివాసమట విమలనారసింహ | నాదప్రియ సకలలోకపతి నమోనమో నరసింహ ||

చ|| ఘోరపాతక నిరుహరణ కుటిలదైత్యదమన | నారాయణ రమాథినాయక నగధర నరసింహ |
నీరూపంబు ఇంత అంతయని నిజము తెలియరాదు | ఈరీతి త్రివిక్రమాకృతి నేచితి నరసింహ ||

చ|| గోవింద గుణగణరహిత కోటిసూర్యతేజ | శ్రీవల్లభ పురాణపురుష శిఖసఖ నరసింహ |
దేవా మిము బ్రహ్మాదులకును తెలియ నలవికాదు | భావించగ ప్రహ్లాదు నెదుట పరగితి నరసింహ ||

చ|| దాసపరికర సులభ తపన చంద్రనేత్ర | వాసవ సురముఖ మునిసేవిత వందిత నరసింహ |
భాసురముగ శ్రీవేంకటగిరిని పాయనిదైవమ వటుగాన | ఓసరకిపుడు ఏగితివిట్ల అహోబల నరసింహ ||

vEdamulE nI (Raagam: ) (Taalam: )

pa|| vEdamulE nI nivAsamaTa vimalanArasiMha | nAdapriya sakalalOkapati namOnamO narasiMha ||

ca|| GOrapAtaka niruharaNa kuTiladaityadamana | nArAyaNa ramAthinAyaka nagadhara narasiMha |
nIrUpaMbu iMta aMtayani nijamu teliyarAdu | IrIti trivikramAkRuti nEciti narasiMha ||

ca|| gOviMda guNagaNarahita kOTisUryatEja | SrIvallaBa purANapuruSha SiKasaKa narasiMha |
dEvA mimu brahmAdulakunu teliya nalavikAdu | BAviMcaga prahlAdu neduTa paragiti narasiMha ||

ca|| dAsaparikara sulaBa tapana caMdranEtra | vAsava suramuKa munisEvita vaMdita narasiMha |
BAsuramuga SrIvEMkaTagirini pAyanidaivama vaTugAna | OsarakipuDu EgitiviTla ahObala narasiMha ||

Sung by:Balakrishna Prasad

Get this widget | Track details | eSnips Social DNA

vEdaM bevvani - వేదం బెవ్వని

వేదం బెవ్వని (రాగం:పాడి ) (తాళం : )

ప|| వేదం బెవ్వని వెదకెడివి | ఆదేవుని గొనియాడుడీ ||

చ|| అలరిన చైతన్యాత్మకు డెవ్వడు | కలడెవ్వ డెచట గలడనిన |
తలతు రెవ్వనిని దనువియోగదశ | యిల నాతని భజియించుడీ ||

చ|| కడగి సకలరక్షకు డిందెవ్వడు | వడి నింతయు నెవ్వనిమయము |
పిడికిట తృప్తులు పితరు లెవ్వనిని | దడవిన ఘనుడాతని గనుడు ||

చ|| కదసి సకలలోకంబుల వారలు | యిదివో కొలిచెద రెవ్వనిని |
త్రిదశవంద్యుడగు తిరువేంకటపతి | వెదకి వెదకి సేవించుడీ ||

vEdaM bevvani (Raagam:pADi ) (Taalam: )

pa|| vEdaM bevvani vedakeDivi | AdEvuni goniyADuDI ||

ca|| alarina caitanyAtmaku DevvaDu | kalaDevva DecaTa galaDanina |
talatu revvanini danuviyOgadaSa | yila nAtani BajiyiMcuDI ||

ca|| kaDagi sakalarakShaku DiMdevvaDu | vaDi niMtayu nevvanimayamu |
piDikiTa tRuptulu pitaru levvanini | daDavina GanuDAtani ganuDu ||

ca|| kadasi sakalalOkaMbula vAralu | yidivO koliceda revvanini |
tridaSavaMdyuDagu tiruvEMkaTapati | vedaki vedaki sEviMcuDI ||