Talapu lopali talapu - తలపు లోపలి తలపు
Talapu lopali talapu - తలపు లోపలి తలపు | Annamayya Lyrics | Sankeertanalu | Songs | Telugu & English
Listen Audio by G NAGESWARA NAIDU:
తలపు లోపలి తలపు (రాగం: ) (తాళం : )
ప|| తలపులోపలితలపు దైవమితడు |
పలుమారు బదియును బదియైనతలపు ||
చ|| సవతైనచదువులు సరుగ దెచ్చినతలపు |
రవళి దరిగుబ్బలిని రంజిల్లుతలపు |
కవగూడి గోరు భూకాంతముంగిటితలపు |
తివిరి దూషకు గోళ్ళ దెగటార్చుతలపు ||
చ|| గొడుగువట్టినవాని గోరి యడగినతలపు |
తడబడక విప్ప్రులకు దానమిడుతలపు |
వొడసి జలనిధిని గడగూర్చి తెచ్చినతలపు |
జడియక హలాయుధము జళిపించుతలపు ||
చ|| వలపించి పురసతులవ్రతము చెరిచినతలపు |
కలికితనములు చూపగలిగున్నతలపు |
యిల వేంకటాద్రిపై నిరవుకొన్నతలపు |
కలుషహరమై మోక్షగతిచూపుతలపు ||
pa|| talapulOpalitalapu daivamitaDu |
palumAru badiyunu badiyainatalapu ||
ca|| savatainacaduvulu saruga deccinatalapu |
ravaLi darigubbalini raMjillutalapu |
kavagUDi gOru BUkAMtamuMgiTitalapu |
tiviri dUShaku gOLLa degaTArcutalapu ||
ca|| goDuguvaTTinavAni gOri yaDaginatalapu |
taDabaDaka vipprulaku dAnamiDutalapu |
voDasi jalanidhini gaDagUrci teccinatalapu |
jaDiyaka halAyudhamu jaLipiMcutalapu ||
ca|| valapiMci purasatulavratamu cericinatalapu |
kalikitanamulu cUpagaligunnatalapu |
yila vEMkaTAdripai niravukonnatalapu |
kaluShaharamai mOkShagaticUputalapu ||