Vinayaka Vrata Kalpam (Part 2) - వినాయక వ్రతకల్పం (2)
Sri Vinayaka Vrata Kalpam (Part 2) – శ్రీ సిద్ధి వినాయక వ్రతకల్పం (2) శ్రీ సిద్ధి వినాయక వ్రతకల్పం శ్రీ వరసిద్ధివినాయక పూజా విధానం పూజ చేయు విధానం చూ. || శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం | ప్రసన్నవదనం ధ్యాయేత్ నర్వ విఘ్నోప శాంతయే || (పూజ పూర్వాంగము లో ఆచమనం, దీపారాధన, ప్రాణాయామము చేయవలెను. సంకల్పము చెప్పునపుడు ఎడమ అరచేతిని కుడి అరచేతితో పట్టుకుని ఈ క్రింది సంకల్పము చెప్పవలెను) పూర్వాంగం చూ. || సంకల్పం – శ్రీ గోవింద గోవింద || మమ ఉపాత్త ………. సమేతస్య, అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయాయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం, ధర్మార్థకామమోక్ష చతుర్విధ పురుషార్థఫల సిద్ధ్యర్థం, పుత్రపౌత్రాభివృద్ధ్యర్థం, ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం, సమస్త దురితోపశాంత్యర్థం, సమస్త మంగళావాప్త్యర్థం వరసిద్ధివినాయక దేవతాముద్దిశ్య, వరసిద్ధివినాయక ప్రీత్యర్థం కల్పోక్తప్రకారేణ భాద్రపద శుక్ల చతుర్థీ పుణ్యకాలే యావచ్ఛక్తి ధ్యానావాహనాది షోడశోపచారపూజాం కరిష్యే || || వినాయక పూజా ప్రారంభః || ప్రార్థనా – భవసంచితపాపౌఘవిధ్వంసనవిచక్షణమ్ | విఘ్నాంధకారభాస్వంతం విఘ్నరాజమహం భజే || ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజమ్ | ప...