Niddirinchi pala - నిద్దిరించి పాల

Niddirinchi pala - నిద్దిరించి పాల | Annamayya Lyrics | Sankeertanalu | Songs | Telugu & English

Listen Audio by P SUSHEELA, G NAGESWARA NAIDU:

నిద్దిరించి పాల (రాగం: ) (తాళం : )

॥పల్లవి॥ నిద్దిరించి పాల జలనిధివలెనే

వొద్దిక శ్రీరమణునికి వొత్తరే పాదములు


॥చ1॥ వేగుదాఁకాఁ జిత్తగించి విద్యలెల్ల నాదరించి

బాగుగాఁ గృపారసము పంచి పంచి

యేగతిఁ బవ్వళించెనో యెట్ల భోగించెనో

యోగీంద్రవరదుని వూఁచరే వుయ్యాలను


॥చ2॥ వాలుఁగన్నుల రెప్పల వడదాఁకి తనుతావి

చాలుకొన్న వూర్పులు చల్లి చల్లి

నీలవర్ణపుగుణము నెరవుచు నొకయింత-

కాలము గన్నులఁ దిప్పికప్పరే దోమతెర


॥చ3॥ సరుగన యోగనిద్ర చాలించి లోకమెల్లఁ

గరుణించఁ దలఁచి వేంకటగిరిపై

అరుదుగ సకలలోకారాధ్యుఁడయి మించి

విరివి నాలవట్టాలు విసరరే సతులు

niddiriMchi pAla (Raagam: ) (Taalam: )

|| Pallavi ||

niddiriMchi pAla jalanidhivalenE

voddika SreeramaNuniki vottarE pAdamulu


|| Cha1 ||

vEgudA~kA~ jittagiMchi vidyalella nAdariMchi

bAgugA~ gRupArasamu paMchi paMchi

yEgati~ bavvaLiMchenO yeTla bhOgiMchenO

yOgeeMdravaraduni vU~charE vuyyAlanu


|| Cha2 ||

vAlu~gannula reppala vaDadA~ki tanutAvi

chAlukonna vUrpulu challi challi

neelavarNapuguNamu neravuchu nokayiMta-

kAlamu gannula~ dippikapparE dOmatera


|| Cha3 ||

sarugana yOganidra chAliMchi lOkamella~

garuNiMcha~ dala~chi vEMkaTagiripai

aruduga sakalalOkArAdhyuDayi miMchi

virivi nAlavaTTAlu visararE satulu

Nitito nadachitenu - నీతితో నడచితేను

Nitito nadachitenu - నీతితో నడచితేను | Annamayya Lyrics | Sankeertanalu | Songs | Telugu & English

Listen Audio by SOBHARAJU:

నీతితో నడచితేను (రాగం: ) (తాళం : )

॥పల్లవి॥ నీతితో నడచితేను నెగులే లేదు
జాతి దప్పకుండితేను చలమే ఫలము

॥చ1॥ వొలిసి కై కొంటేను వొగరైనాఁ దీపే
తెలిసితేఁ దనలోనే దేవుఁడున్నాఁడు
పలుకులు మంచివై తే పగవారుఁ జుట్టాలే
చెలఁగి దిష్టించితేను చీఁకటిల్లు వెలుఁగు

॥చ2॥ నేరిచి బతికితేను నేలెల్లా నిధానము
వొరిచితేఁ దనపంత మూరకే వచ్చు
సారెకు నుతించితేను చట్టైనాఁ గరఁగును
వూరకే గుట్టుననుంటే వూరికెల్లా నెక్కుడు

॥చ3॥ వాడికె సేసుకొంటేను వలపెల్లా నిలుపౌను
వేడుకతో నుండితే వెనకే ముందౌ
యీడులేని శ్రీవేంకటేశ్వరుఁ గొలిచితేను
జాడుపడ్డపనులెల్లా సఫలమౌను

neetitO naDachitEnu (Raagam: ) (Taalam: )

|| Pallavi ||
neetitO naDachitEnu negulE lEdu
jAti dappakuMDitEnu chalamE phalamu

|| Cha1 ||
volisi kai koMtEnu vogarainA~ deepE
telisitE~ danalOnE dEvuDuM~nADu
palukulu maMchivaitE pagavAru~ juTTAlE
chela~gi diShTiMchitEnu chee~kaTillu velu~gu

|| Cha2 ||
nErichi batikitEnu nElellA nidhAnamu
vorichitE~ danapaMta mUrakE vacchu
sAreku nutiMchitEnu chaTTainA~ gara~gunu
vUrakE guTTananuMtE vUrikellA nekkuDu

|| Cha3 ||
vADike sEsukoMtEnu valapellA nilupaunu
vEDukatO nuMDitE venakE muMdau
yeedulEni SreevEMkatESvaru~ golichitEnu
jADupaDDapanulellA saphalamAunu