rArA cinnanna - రారా చిన్నన్నా

రారా చిన్నన్నా (రాగం:చెంజురుటి ) (తాళం : ఆది )

రారా చిన్నన్నా రారా చిన్నన్నా
రారోరి చిన్నవాడ రారా ముద్దులాడ
రారోరి బాలకృష్ణ రారా , కృష్ణ రారా

రారా చిన్నన్నా రారోరి చిన్నవాడ
రారా ముద్దులాడ రారోరి బాలకృష్ణ

కిందిచూపుల గిలిగించి ఆలమందగొల్లెతల మరిగించి
సందడి వలపించి జవరాండ్ల ఊరవిందవైనయట్టి వేడుక కాడ

కొదలు మాటలనె గొణకుచు భూమి సుదతుల శిగ్గులుచూరాడి
చిదుకు చేష్టలనె చెణకుచూ ముద్దు పెదవిచవులు చూపిన జాణకాడ

కలికితనమునె కరగించి కాచి చెలులకాగిటనె చెలగి
లలనామణి యైన లక్కిమమ్మ గలసుక శ్రీవేంకటనాథు డైనవాడ

rArA cinnanna (Raagam: cenjuruTi) (Taalam: Adi )

P: rArA cinnanna rArOri cinnavADa rArA muddu lADa rArOri bAlakrSNa rArA (krSNa rArA)

C
1: kindi cUpula giligilinci Alamanda golletala mariginci sandadi valapinci javarAla Ura
vindavainayaTTi vEDuka kAdA rArA

2: podalu mATalane goNagucu bhUmi sudatula cikkulu cUrADi
ciduku cetalalane ceNakucu muddu pedda vicavulu cUpina jaNakadA rArA

3: kaliki tanamunane karaginci kATSi celula kagiTanE celagi
lalanA maNiyaina lakki mamma galasuka shrI vEnkaTa nAthuDaina vADa


rammanavE ikanu - రమ్మనవే ఇకను

రమ్మనవే ఇకను (రాగం: ) (తాళం : )

ప|| రమ్మనవే ఇకను నీ రమణునిని | పమ్మి వలపులు చల్లీ బదిమారులు ||

చ|| నెలకొన్నప్పటినుండీ నిన్నే తప్పక చూచీ | తలపోసి తలపోసి తడబడీని |
మొలక నవ్వులతోడ మూతులు గిరిపీనదె | నలువంక పొంచి పొంచి నవ్వులు నవ్వీని ||

చ|| పెనగుచు బలుమారు పెచ్చుపెరిగీ దాను | గునిసి పరులమీద కోపగించీని |
వెనుకొని నీ జాడలే వెదకీ నితడు నేడు | మనసుమర్మాలు చూడమచ్చిక సేసీని ||

చ|| పొరుగు పొంతలనుండి బుద్ధులు చెప్పేనదె | గరిమల మించీ గలికి తనమునను |
యిరవై శ్రీ వేంకటేశుడిన్నిటా నిన్ను గలసె | సరసములాడు తానే చనవు చూపీని ||

rammanavE ikanu (Raagam: ) (Taalam: )

pa|| rammanavE ikanu nI ramaNunini | pammi valapulu callI badimArulu ||

ca|| nelakonnappaTinuMDI ninnE tappaka cUcI | talapOsi talapOsi taDabaDIni |
molaka navvulatODa mUtulu giripInade | naluvaMka poMci poMci navvulu navvIni ||

ca|| penagucu balumAru peccuperigI dAnu | gunisi parulamIda kOpagiMcIni |
venukoni nI jADalE vedakI nitaDu nEDu | manasumarmAlu cUDamaccika sEsIni ||

ca|| porugu poMtalanuMDi buddhulu ceppEnade | garimala miMcI galiki tanamunanu |
yiravai SrI vEMkaTESuDinniTA ninnu galase | sarasamulADu tAnE canavu cUpIni ||


rasikuDa tirupati - రసికుడ తిరుపతి

రసికుడ తిరుపతి (రాగం: ) (తాళం : )

ప|| రసికుడ తిరుపతి రఘువీరా | కొసరుగాదు నాలోని కూరిములు గాని ||

చ|| వెలయ నీ విరిచిన విల్లువంటిది గాదు | విలసిల్ల నాబొమ్మల విండ్లు గాని |
చెలగి తపసుచేసీ చిత్రకూటగిరి గాదు | గిలుకొట్టు నా కుచగిరులు గాని ||

చ|| మేటివైన నీవు వేసిన మొకము చూపు గాదు | సూటి దప్పని నా కనుచూపులు గాని |
గాటమై నీవు సేతువుగట్టిన జలధి గాదు | చాటున నా చెమటల జలధులు గాని ||

చ|| తగ నీవు గెలచిన దనుజ యుద్ధము గాదు | దగతోడి నా మదన యుద్ధము గాని |
నగు శ్రీ వేంకటేశ కనకసతి పొందు గాదు | పొగడే సీతనైన నా పొందులు గాని ||

rasikuDa tirupati (Raagam: ) (Taalam: )

pa|| rasikuDa tirupati raGuvIrA | kosarugAdu nAlOni kUrimulu gAni ||

ca|| velaya nI viricina villuvaMTidi gAdu | vilasilla nAbommala viMDlu gAni |
celagi tapasucEsI citrakUTagiri gAdu | gilukoTTu nA kucagirulu gAni ||

ca|| mETivaina nIvu vEsina mokamu cUpu gAdu | sUTi dappani nA kanucUpulu gAni |
gATamai nIvu sEtuvugaTTina jaladhi gAdu | cATuna nA cemaTala jaladhulu gAni ||

ca|| taga nIvu gelacina danuja yuddhamu gAdu | dagatODi nA madana yuddhamu gAni |
nagu SrI vEMkaTESa kanakasati poMdu gAdu | pogaDE sItanaina nA poMdulu gAni ||


ranga ranga ranga - రంగ రంగ రంగ

Podagamtimayya - పొడగంటిమయ్య | Annamayya Lyrics | Sankeertanalu | Songs | Telugu & English

Listen Audio by PS RANGANATH & SP Sailaja:

రంగ రంగ రంగ (రాగం:సింధు భైరవి) (తాళం : )

రంగ రంగ రంగ పతి రంగనాధా నీ
సింగారాలె తరచాయ శ్రి రంగ నాధా

పట్ట పగలే మాతో పలుచగ నవ్వేవు
ఒట్టులేల టలిగిరించు వడి నీ మాటలు వింటె
రట్టడివి మేరమీరకు రంగనాధా
రంగనాధా శ్రీ రంగనాధా

కావేటి రంగమున కాంతపై పాదాలు సాచి
రావు పోవు ఎక్కడికి రంగ నాధా
శ్రీ వేంకటాద్రి మీద చేరి నను కూడితివి
ఏవల చూచిన నీవేయిట రంగనాధా
రంగనాధా శ్రీ రంగనాధా

ranga ranga ranga (Raagam: ) (Taalam: )

ranga ranga ranga pati ranganaadhaa nee
singaaraale tarachaaya Sri ranga naadhaa

paTTa pagalE maatO paluchaga navvEvu
oTTulEla Taligirinchu vaDi nee maaTalu vinTe
raTTaDivi mErameeraku ranganaadhaa
ranganaadhaa SrI ranganaadhaa

kaavETi rangamuna kaantapai paadaalu saachi
raavu pOvu ekkaDiki ranga naadhaa
SrI vEnkaTAdri meeda chEri nanu kUDitivi
Evala chUchina neevEyiTa ranganaadhaa
ranganaadhaa SrI ranganaadhaa


rammanagA danatO - రమ్మనగా దనతో

రమ్మనగా దనతో (రాగం: ) (తాళం : )

ప|| రమ్మనగా దనతో నే రానంటినా | చిమ్మును నింత ప్రియముచెప్ప నేలెనాకు ||

చ|| వెల్లవిరి దనమాట విననైతినా నేను | చెల్లబో నాకేల సేవ సేసీనె తాను |
యెల్లవారి దానేలీ నెవ్వరి బోలుదు నేను | బల్లిదుడు నాకేల బాతిపడె దానూ ||

చ|| చెప్పినట్లెల్లా నేను సేయకుండే దాననా | అప్పటి లేక లేటికి నంపీనె తాను |
కప్పురపు పడిగల కాంతలు గాచుకుండగా | విప్పుచు నాకుగా నేల వేగించీనె తానూ ||

చ|| గక్కన దాగూడగాను కాదు గూడదంటినా | ముక్కుమోప సాగిలేల మొక్కినె తాను |
యెక్కువ శ్రీ వేంకటేశుడెనసె దానన్ను నిట్టె | పెక్కు సతులలోననె పెద్దసేసీ దాను ||

rammanagA danatO (Raagam: ) (Taalam: )

pa|| rammanagA danatO nE rAnaMTinA | cimmunu niMta priyamuceppa nElenAku ||

ca|| vellaviri danamATa vinanaitinA nEnu | cellabO nAkEla sEva sEsIne tAnu |
yellavAri dAnElI nevvari bOludu nEnu | balliduDu nAkEla bAtipaDe dAnU ||

ca|| ceppinaTlellA nEnu sEyakuMDE dAnanA | appaTi lEka lETiki naMpIne tAnu |
kappurapu paDigala kAMtalu gAcukuMDagA | vippucu nAkugA nEla vEgiMcIne tAnU ||

ca|| gakkana dAgUDagAnu kAdu gUDadaMTinA | mukkumOpa sAgilEla mokkine tAnu |
yekkuva SrI vEMkaTESuDenase dAnannu niTTe | pekku satulalOnane peddasEsI dAnu ||


yaj~na mUrti yaja karta - యజ్ఞ మూర్తి యజ కర్త

యజ్ఞ మూర్తి యజ కర్త (రాగం: ) (తాళం : )

యజ్ఞ మూర్తి యజ కర్త యజ్ఞ భోక్తవిన్నిటాను
యజ్ఞాది ఫలరూప మటు నీవై వుండవే


పరికించ జీవులకు ప్రాణమవైన నీకు
నిరతి ప్రాణ ప్రతిష్ఠ నేము సేసేమా
మరిగి మా పూజలంది మమ్ము గాచుట కొరకు
హరి నీ మూర్తి ప్రాణమావహించవే


జగతికి నీ పాద జలమే సంప్రోక్షణ
జిగి నీకు సంప్రోక్షణ సేయువారమా
పగటున నన్ను నీవు పావనము సేయుటకు
అగు పుణ్య తీర్థముల అభిషేక మందవే

వేదములు తెచ్చిన శ్రీ వేంకటేశనేమునీకు
వేద మంత్రముల పూజా విధి సేసేమా
యీదెస నీ దాసులమైన మము గాచుటకొరకు
వేదమూర్తి యిందే విచ్చేసి ఉండవే

yaj~na mUrti yaja karta (Raagam: ) (Taalam: )

yaj~na mUrti yaja karta yaj~na bhOktavinniTAnu
yaj~naadi phalarUpa maTu nIvai vuMDavE


parikiMcha jEvulaku prANamavaina nIku
nirati prANa pratishTha nEmu sEsEmA
marigi mA pUjalaMdi mammu gAchuTa koraku
hari nI mUrti prANamAvahiMchavE


jagatiki nI pAda jalamE saMprOkshaNa
jigi nIku saMprOkshaNa sEyuvAramA
pagaTuna nannu nIvu pAvanamu sEyuTaku
agu puNya tIrthamula abhishEka maMdavE

vEdamulu techchina SrI vEMkaTESanEmunIku
vEda maMtramula pUjA vidhi sEsEmA
yIdesa nI dAsulamaina mamu gAchuTakoraku
vEdamUrti yiMdE vichchEsi uMDavE


అన్నమయ్య పాటలు హ

విషయ సూచిక:| | | | | | | ఋ | | | | | | | | ఖ | | | | | | ఝ | ట | ఠ | | ఢ | ణ | | థ | | | | | | | | | | | | | | | | | ళ | ఱ |

  1. హరి కృష్ణ మేలుకొను ఆదిపురుషా
  2. హరీ ఆఆఆఆ ఆఆఆఆ
  3. హరిభక్తివోడ యెక్కినట్టివారలే కాని
  4. హరి గోవిందా హరి గోవిందా
  5. హరి గొలిచియు మరీ
  6. హరిదాసులతోడ నల్పులు
  7. హరిదాసుడై మాయల
  8. హరిదాసుండగుటే యది
  9. హరియే ఎరుగును
  10. హరివారమైతిమి
  11. హరినామము కడు నానందకరము
  12. హరి నీవే బుద్ధిచెప్పి
  13. హరి నీవె సర్వాత్మకుడవు
  14. హరి నీయనుమతో ఆది
  15. హరినెరుగనిపుణ్య మంటేరుగాన
  16. హిన దశలు బొంది
  17. హరి శరణాగతి యాతుమది
  18. హరి యవతారమే ఆతండితడు
  19. హరి యవతార మీతడు
  20. హరి రసమా విహారి
  21. హరివారమైతిమి