Induvalla nemigaddu - ఇందువల్ల నేమిగద్దు
Induvalla nemigaddu - ఇందువల్ల నేమిగద్దు | Annamayya Lyrics | Sankeertanalu | Songs | Telugu & English
Listen Audio by SOBHARAJU:
ఇందువల్ల నేమిగద్దు (రాగం: ) (తాళం : )
॥పల్లవి॥ ఇందువల్ల నేమిగద్దు యినుపగుగ్గిళ్లింతే
యిందిరారమణు సేవే యిరవైన పదవి
॥చ1॥ సతులతో నవ్వులు చందమామగుటుకలు
మతితలపోఁత లెండమావులనీళ్ళు
రతులతో మాటలు రావిమానిపువ్వులు
తతి విరహపుకాఁక తాటిమావినీడ
॥చ2॥ లలనల జవ్వనాలు లక్కపూసకపురులు
నెలకొని సేసే బత్తి నీటిపై వ్రాత
చెలువపు వినయాలు చేమకూరశైత్యాలు
కొలఁదిలేని ననుపు గోడమీఁది సున్నము
॥చ3॥ పడఁతుల వేడుకలు పచ్చివడఁగండ్ల గుళ్లు
కడుమోవితీపు చింతకాయకజ్జము
బడి నలుమేలుమంగపతి శ్రీవేంకటేశ్వరుఁ-
డడరించిన మాయలు అద్దములో నీడలు
|| Pallavi ||
iMduvalla nEmigaddu yinupaguggillinthE
yiMdirAramaNu sEvE yiravaina padavi
|| Cha1 ||
satulatO navvulu chaMdamAmaguTukalu
matitalapO~ta leMDamAvuleeneeLLu
ratulatO mATalu rAvimAnipuvvulu
tati virahapukA~ka tATimAvineeda
|| Cha2 ||
lalanala javvanAlu lakkapUsakapurulu
nelakoni sEsE batti neeTipai vrAta
cheluvapu vinayAlu chEmakUraSaityAlu
kola~dilEni nanupu gODamee~di sunnamu
|| Cha3 ||
paDa~tula vEDukalu pacchivaDa~gaMDla guLLu
kaDumOviteepu chiMtakAyakajjamu
baDi nalumElumaMgapati SreevEMkatESvaru~-
DadariMchina mAyalu addamulO needaLu