Puvu bonula koluve - పూవు బోణుల కొలువే

Puvu bonula koluve - పూవు బోణుల కొలువే | Annamayya Lyrics | Sankeertanalu | Songs | Telugu & English

Listen Audio by P SUSHEELA, G NAGESWARA NAIDU:

పూవుఁబోణుల కొలువే (రాగం: ) (తాళం : )

పూవుఁబోణుల కొలువే పుష్పయాగము

పూవక పూచె నీకిట్టె పుష్పయాగము ॥పల్లవి॥


కలువ రేకుల వంటి ఘనమైన కన్నుల

పొలఁతుల చూపులె నీ పుష్పయాగము

తలఁచి తలఁచి నిన్నుఁ దమమేనులఁ బొడమే

పులకజొంపములె నీ పుష్పయాగము ॥పూవు॥


కరకమలములను కందువ గోపికలెల్లా

పొరసి నినుఁ జూపుటే పుష్పయాగము

సరసపు మాటలే సారెనాడి తమనవ్వు

పొరి నీపైఁ జల్లుటే పుష్పయాగము ॥పూవు॥


గాఁట్టపుఁ గొలనిదండఁ గాంతలు సిగ్గున నిన్ను

బూటకానకుఁ దిట్టుటే పుష్పయాగము

యీటున శ్రీ వేంకటేశ యిట్టె యలమేలుమంగ

పూఁటవూఁటరతులివి పుష్పయాగము ॥పూవు॥

pUvu~bONula koluvE (Raagam: ) (Taalam: )

|| Pallavi ||

pUvu~bONula koluvE puShpayAgamu

pUvaka pUche neekiTTe puShpayAgamu


|| Charanam 1 ||

kaluva rEkula vaMTi ghanamaina kannula

pola~tula chUpulE nee puShpayAgamu

tala~chi tala~chi ninnu~ damamEnula~ boDamE

pulakajoMpamulE nee puShpayAgamu


|| Charanam 2 ||

karakamalamulanu kaMduva gOpikalellA

porasi ninu~ jUpuTE puShpayAgamu

sarasapu mATalE sArenADi tamanavvu

pori neepai~ jalluTE puShpayAgamu


|| Charanam 3 ||

gA~TTapu~ golanidaMDa~ gAMtalu sigguna ninnu

bUTakAnaku~ diTTuTE puShpayAgamu

yeeTuna Sree vEMkatESa iTTe yalamElumaMga

pU~TavU~taratulivi puShpayAgamu

Chuda juda nintalone - చూడ జూడ నింతలోనే

Chuda juda nintalone - చూడ జూడ నింతలోనే | Annamayya Lyrics | Sankeertanalu | Songs | Telugu & English

Listen Audio by P SUSHEELA:

చూడఁ జూడ నింతలోనే (రాగం: ) (తాళం : )

చూడఁ జూడ నింతలోనే సుక్కరారమునాఁడు
ఆడ నీడ విభవాలే అమరె దేవునికి ॥పల్లవి॥

మేటిపాలజలధిలో మీఁగడ లంటెనో కాని
వీటనే దొంగిలినట్టి వెన్న లంటెనో
నూటుక యాకాశగంగమరు గంటెనో యనఁగ
ఆటలఁ గర్పూరకాపు అమరె దేవునికి ॥చూడ॥

శిసువులఁ దెచ్చునాఁడు చీఁకటి యంటెనో కాని
మసలక కరిఁ గాచేనుద మంటెనో
సుసరాన నీలి కాసెసొగ టంటెనో యనఁగ
అదై పుణుఁగుకాపు అమరె దేవునికి ॥చూడ॥

పరమతేజంభైన ప్రభలు చల్లెనో కాని
వురము శ్రీసతియున్న వొరపు లివి
అరిది శ్రీవేంకటేశు కలమెలుమంగతోడ
అరలేక సొమ్ము లెల్ల నమరె దేవునికి ॥చూడ॥

chUDa~ jUDa niMtalOnE (Raagam: ) (Taalam: )

|| Pallavi ||
chUDa~ jUDa niMtalOnE sukkarAramunA~du
ADa needa vibhavAlE amare dEvuniki

|| Charanam 1 ||
mETipAlajaladhilO mee~gada laMtenO kAni
veeTanE doMgilinaTTi venna laMtenO
nUTuka yAkASagaMgamaru gaMtenO yana~ga
ATala~ garpUrakApu amare dEvuniki

|| Charanam 2 ||
sisuvula~ decchunA~du chee~kaTi yaMtenO kAni
masalaka kari~ gAchEnuda maMtenO
susarAna neeli kAsesoga TaMtenO yana~ga
ade puNu~gukApu amare dEvuniki

|| Charanam 3 ||
paramatEjaMbhaina prabhalu challenO kAni
vuramu Sreesatiyunna vorapu livi
aridi SreevEMkatESu kalamelumMgatODa
aralEka sommu lella namare dEvuniki

Vanitaku bati kide - వనితకు బతి కిదె

Vanitaku bati kide - వనితకు బతి కిదె | Annamayya Lyrics | Sankeertanalu | Songs | Telugu & English

Listen Audio by P SUSHEELA, G NAGESWARA NAIDU:

వనితకుఁ బతి కిదె (రాగం: ) (తాళం : )

॥పల్లవి॥ వనితకుఁ బతి కిదె వసంతము
దినదినము నమరె తిరుమలమీఁద

॥చ1॥ పుప్పొడి వసంతము పొసఁగె రమణునికి
కప్పురవసంతము కాంతకును
కొప్పెరల నెదురుగఁ గుంకుమ పన్నీరు నించి
కుప్పెలఁ జల్లులాడేరు కోనేటికాడ

॥చ2॥ జవ్వాదివసంతము చతురుఁడు గై కొనె
పువ్వుల వసంతము పొలఁతి కిదె
రవ్వగా బండ్లపై రాసులు వోసుక
నవ్వుతా వేటులాడేరు నడిమించింతాడ

॥చ3॥ గందపు వసంతముఁ గడు శ్రీవేంకటపతి
అందె కస్తూరివసంత మలమేల్మంగ
చిందుచుఁ దట్టుపుణుఁగు చిమ్ముచుఁ గూడాడేరు
సందడి సమరతుల సంపెఁగకాడ

vanitaku~ bati kide (Raagam: ) (Taalam: )

|| Pallavi ||
vanitaku~ bati kide vasaMthamu
dinadinamu namare tirumalamee~da

|| Cha1 ||
puppoDi vasaMthamu posa~ge ramaNuniki
kappuravasaMthamu kAMtakunu
kopperala neduruga~ guMkuma panneeru niMchi
kuppela~ jallulAdEru kOnETikADa

|| Cha2 ||
javvAdivasaMthamu chaturu~du gaikone
puvvula vasaMthamu pola~ti kide
ravvagA baMDlapei rAsulu vOsuka
navvutA vETulAdEru naDimiMchiMtADa

|| Cha3 ||
gaMdapu vasaMthamu~ gaDu SreevEMkaTapati
aMde kastUrivasaMtha malamElmaMga
chiMduchu~ daTTupuNu~gu chimmuchu~ gUdAdEru
saMdaDi samaratula saMpe~gakADa

Velupala maravaka - వెలుపల మరవక

Velupala maravaka - వెలుపల మరవక | Annamayya Lyrics | Sankeertanalu | Songs | Telugu & English

Listen Audio by SOBHARAJU:

వెలుపల మఱవక (రాగం: ) (తాళం : )

వెలుపల మఱవక లోపల లేదు వెలుపలఁ గలిగిన లోపల మఱచు

చలమున నిదియే ఘడియ ఘడియకును సాధించిన సుఖమటు దోఁచు ॥పల్లవి॥


వెలుపలి వెలుఁగే చూడఁగ లోపలి వెడ చీఁకటి గాననియట్లు

అలరి ప్రపంచజ్ఞానికిఁదనలో నాత్మజ్ఞానము గనరాదు

పలుమరు చీఁకటి చూడఁగఁ జూడఁగ బయలే వెలుఁగై తోఁచినయట్లు

అలయక తనలోచూపు చూచినను అంతరంగమున హరిఁ గనును ॥వెలు॥


జాగరమే కడుఁ జేయఁగఁ జేయఁగ సతతము నిద్దుర రానట్లు

చేగల నింద్రియములలోఁ దిరిగిన చిత్తవికారము లయపడదు

యీగతి నిద్దురవోఁగాఁ బోఁగా నిలలో సుద్దులు యెఱఁగనియట్టు

యోగపు టేకాంతంబును దన మనసొగి మరవఁగ మరవఁగ హరిఁ గనును ॥వెలు॥


దేహపు టాకాశపు నిట్టూర్పులు బాహిరపు బయట నడగినయట్లు

ఆహ జీవుని జననమరణములు అందే పొడముచు నందడఁగు

వూహల శ్రీవేంకటపతి వాయువు కొగి నాకాశము వొక్క సూత్రము

ఆహా ప్రాణాపానవాయువులు ఆతుమ నిలుపుటే హరిఁ గనుట ॥వెలు॥

velupala maRavaka (Raagam: ) (Taalam: )

|| Pallavi ||

velupala maRavaka lOpala lEdu velupala~ galigina lOpala maRachu

chalamuna nidiyE ghaDiya ghaDiyakunu sAdhiMchina sukhamaTu dO~chu


|| Cha1 ||

velupali velu~gE chUDa~ga lOpali veDa chee~kaTi gAnaniyaTlu

alari prapaMchaj~nAniki~danalO nAtmaj~nAnamu ganarAdu

palumaru chee~kaTi chUDa~ga~ jUDa~ga bayalE velu~gai tO~chinayaTlu

alayaka tanalOchUpu chUchinanu aMtaratyaMgamuna hari~ ganunu


|| Cha2 ||

jAgaramE kaDu~ jEya~ga~ jEya~ga satatamu niddura rAnaTlu

chEgala niMdriyamulalO~ dirigina chittavikAramu layapaDadu

yeegati nidduravO~gA~ bO~gA nilalO suddulu yeRa~ganiyaTTu

yOgapu tEkAMtaMbunumu dana manasogi marava~ga marava~ga hari~ ganunu


|| Cha3 ||

dEhapu tAkASapu niTTUrpulu bAhirapu bayaTa naDaginayaTlu

Aha jeevuni jananamaraNamulu aMdE poDamuchu naMdaDa~gu

vUhala SreevEMkaTapati vAyuvu kogi nAkASamu vokka sUtramu

AhA prANApAnavAyuvulu Atuma nilupuTE hari~ ganuTa

Induvalla nemigaddu - ఇందువల్ల నేమిగద్దు

Induvalla nemigaddu - ఇందువల్ల నేమిగద్దు | Annamayya Lyrics | Sankeertanalu | Songs | Telugu & English

Listen Audio by SOBHARAJU:

ఇందువల్ల నేమిగద్దు (రాగం: ) (తాళం : )

॥పల్లవి॥ ఇందువల్ల నేమిగద్దు యినుపగుగ్గిళ్లింతే
యిందిరారమణు సేవే యిరవైన పదవి

॥చ1॥ సతులతో నవ్వులు చందమామగుటుకలు
మతితలపోఁత లెండమావులనీళ్ళు
రతులతో మాటలు రావిమానిపువ్వులు
తతి విరహపుకాఁక తాటిమావినీడ

॥చ2॥ లలనల జవ్వనాలు లక్కపూసకపురులు
నెలకొని సేసే బత్తి నీటిపై వ్రాత
చెలువపు వినయాలు చేమకూరశైత్యాలు
కొలఁదిలేని ననుపు గోడమీఁది సున్నము

॥చ3॥ పడఁతుల వేడుకలు పచ్చివడఁగండ్ల గుళ్లు
కడుమోవితీపు చింతకాయకజ్జము
బడి నలుమేలుమంగపతి శ్రీవేంకటేశ్వరుఁ-
డడరించిన మాయలు అద్దములో నీడలు

iMduvalla nEmigaddu (Raagam: ) (Taalam: )

|| Pallavi ||
iMduvalla nEmigaddu yinupaguggillinthE
yiMdirAramaNu sEvE yiravaina padavi

|| Cha1 ||
satulatO navvulu chaMdamAmaguTukalu
matitalapO~ta leMDamAvuleeneeLLu
ratulatO mATalu rAvimAnipuvvulu
tati virahapukA~ka tATimAvineeda

|| Cha2 ||
lalanala javvanAlu lakkapUsakapurulu
nelakoni sEsE batti neeTipai vrAta
cheluvapu vinayAlu chEmakUraSaityAlu
kola~dilEni nanupu gODamee~di sunnamu

|| Cha3 ||
paDa~tula vEDukalu pacchivaDa~gaMDla guLLu
kaDumOviteepu chiMtakAyakajjamu
baDi nalumElumaMgapati SreevEMkatESvaru~-
DadariMchina mAyalu addamulO needaLu

Nitito nadachitenu - నీతితో నడచితేను

Nitito nadachitenu - నీతితో నడచితేను | Annamayya Lyrics | Sankeertanalu | Songs | Telugu & English

Listen Audio by SOBHARAJU:

నీతితో నడచితేను (రాగం: ) (తాళం : )

॥పల్లవి॥ నీతితో నడచితేను నెగులే లేదు
జాతి దప్పకుండితేను చలమే ఫలము

॥చ1॥ వొలిసి కై కొంటేను వొగరైనాఁ దీపే
తెలిసితేఁ దనలోనే దేవుఁడున్నాఁడు
పలుకులు మంచివై తే పగవారుఁ జుట్టాలే
చెలఁగి దిష్టించితేను చీఁకటిల్లు వెలుఁగు

॥చ2॥ నేరిచి బతికితేను నేలెల్లా నిధానము
వొరిచితేఁ దనపంత మూరకే వచ్చు
సారెకు నుతించితేను చట్టైనాఁ గరఁగును
వూరకే గుట్టుననుంటే వూరికెల్లా నెక్కుడు

॥చ3॥ వాడికె సేసుకొంటేను వలపెల్లా నిలుపౌను
వేడుకతో నుండితే వెనకే ముందౌ
యీడులేని శ్రీవేంకటేశ్వరుఁ గొలిచితేను
జాడుపడ్డపనులెల్లా సఫలమౌను

neetitO naDachitEnu (Raagam: ) (Taalam: )

|| Pallavi ||
neetitO naDachitEnu negulE lEdu
jAti dappakuMDitEnu chalamE phalamu

|| Cha1 ||
volisi kai koMtEnu vogarainA~ deepE
telisitE~ danalOnE dEvuDuM~nADu
palukulu maMchivaitE pagavAru~ juTTAlE
chela~gi diShTiMchitEnu chee~kaTillu velu~gu

|| Cha2 ||
nErichi batikitEnu nElellA nidhAnamu
vorichitE~ danapaMta mUrakE vacchu
sAreku nutiMchitEnu chaTTainA~ gara~gunu
vUrakE guTTananuMtE vUrikellA nekkuDu

|| Cha3 ||
vADike sEsukoMtEnu valapellA nilupaunu
vEDukatO nuMDitE venakE muMdau
yeedulEni SreevEMkatESvaru~ golichitEnu
jADupaDDapanulellA saphalamAunu

Tinarani konarani - తినరాని కొనరాని

Tinarani konarani - తినరాని కొనరాని | Annamayya Lyrics | Sankeertanalu | Songs | Telugu & English

తినరాని కొనరాని (రాగం: ) (తాళం : )

ప|| తినరాని కొనరాని దేవలోకపుబండు | 

మనసున దలచితే మరగించే పండు ||

చ|| పంటకెక్కి పాలవెల్లి బండిన పాలపండు | 

తొంటి గొల్లెతల మోవి దొండపండు |
అంటుకొన్న మేనిచాయ అల్లు నేరేడుబండు | 

ముంటి సింహపుగోళ్ళ ముండ్లపండు ||

చ|| ఇచ్చల వేదశాస్త్రాలు దెచ్చిన పేరీతపండు | 

తచ్చిన దైత్యమారి దేవదారుబండు |
పచ్చిదేర మెరసిన బండి గురువిందపండు | 

యిచ్చవలెనన్న వారియింట నంటిపండు ||

చ|| తెమ్మగా మునులపాలి తియ్యని చింతపండు | 

తిమ్మల సిరివలపు దేనెపండు |
యిమ్ముల శ్రీ వేంకటాద్రి నింటినింట ముంగిటిపండు | 

కొమ్మల పదారువేల గొప్ప మామిడిపండు ||

tinarAni konarAni (Raagam: ) (Taalam: )

pa|| tinarAni konarAni dEvalOkapubaMDu | 

manasuna dalacitE maragiMcE paMDu ||

ca|| paMTakekki pAlavelli baMDina pAlapaMDu | 

toMTi golletala mOvi doMDapaMDu |
aMTukonna mEnicAya allu nErEDubaMDu | 

muMTi siMhapugOLLa muMDlapaMDu ||

ca|| iccala vEdaSAstrAlu deccina pErItapaMDu | 

taccina daityamAri dEvadArubaMDu |
paccidEra merasina baMDi guruviMdapaMDu | 

yiccavalenanna vAriyiMTa naMTipaMDu ||

ca|| temmagA munulapAli tiyyani ciMtapaMDu | 

timmala sirivalapu dEnepaMDu |
yimmula SrI vEMkaTAdri niMTiniMTa muMgiTipaMDu | 

kommala padAruvEla goppa mAmiDipaMDu ||