Pattaro veedula - పట్టరో వీదుల

పట్టరో వీదుల (రాగం:దేవగాంధారి )(తాళం : )

పట్టరో వీదుల బరువులు వెట్టి
పుట్టుగులతో హరి పొలసీ వీడే

వేవేలు నేరాలు వెదకేటిదేవుడు
ఆవుల గాచీ నలవాడే
పోవుగ బ్రాహ్మల బుట్టించుదేవుడు
సోవల యశోదసుతుడట వీడే

ఘనయజ్ఞములకు గర్తగుదేవుడు
కినిసి వెన్న దొంగిలె వీడే
మునులచిత్తములమూలపుదేవుడు
యెనసీ గొల్లెతలయింటింట వీడే

నుడిగి నారదుడు నుతించుదేవుడు
బడిరోలగట్టువడె వీడే
వుడివోనివరము లొసగెడుదేవుడు
కడగిన శ్రీ వేంకటగిరి వీడే

Pattaro veedula (Raagam:Daevagaamdhaari ) (Taalam: )

Pattaro veedula baruvulu vetti
Puttugulato hari polasee veedae

Vaevaelu naeraalu vedakaetidaevudu
Aavula gaachee nalavaadae
Povuga braahmala buttimchudaevudu
Sovala yasodasutudata veedae

Ghanayaj~namulaku gartagudaevudu
Kinisi venna domgile veedae
Munulachittamulamoolapudaevudu
Yenasee golletalayimtimta veedae

Nudigi naaradudu nutimchudaevudu
Badirolagattuvade veedae
Vudivonivaramu losagedudaevudu
Kadagina Sree vaemkatagiri veedae


అన్నమయ్య పాటలు ప

అన్నమయ్య పాటలు ప

విషయ సూచిక:| | | | | | | ఋ | | | | | | | | ఖ | | | | | | ఝ | ట | ఠ | | ఢ | ణ | | థ | | | | | | | | | | | | | | | | | ళ | ఱ |


  1. పట్టరో వీదుల బరువులు వెట్టి
  2. పట్టము గట్టితివింక
  3. పట్టవసముగాని
  4. పట్టినచోనే వెదకి
  5. పట్టినదెల్లా
  6. పటుశిష్టప్రతిపాలకుడ
  7. పదిలము కోట
  8. పనిలేనిధనవాంఛ
  9. పనిమాలినట్టి
  10. పనివడి యింద్రియాలే
  11. పట్టిన వారల
  12. పరగీ నిదివో
  13. పరగుబహుజన్మ
  14. పరమ పురుష
  15. పరమ పురుష నిరుపమాన
  16. పరమ పురుషుడు గోపాల బాలుడైనాడు
  17. పరమ యోగీశ్వరుల
  18. పరమజ్ఞానులకు
  19. పరమపాతకుడ
  20. పరుసము సోకక పసిడౌనా
  21. పరుసము సోకియు
  22. పరుసమొక్కటే కదా
  23. పరదేశిపట్టణమున
  24. పరమాత్మ నిన్నుగొల్చి
  25. పరమాత్ముడైన హరి
  26. పరమాత్ముని నోరబాడుచును
  27. పరిపూర్ణుడవు నీవు
  28. పరిపూర్ణగరుడాద్రి
  29. పరులకైతే నిదే
  30. పరులసేవలు
  31. పలికెటి వేదమె
  32. పలపారగించవమ్మ
  33. పలుకుతేనియలను
  34. పలుకు దేనెల తల్లి పవళించెను
  35. పలుమరు వుట్ల పండుగను
  36. పలువిచారములేల పరమాత్మనీవు
  37. పసిడియక్షంతలివె పట్టరో వేగమె రారో
  38. పసిడి చీరవాడావు
  39. పసలేని యీబ్రదుకు
  40. పసులు గాచేటి
  41. పంటల భాగ్యులు
  42. పండియు బండదు
  43. పంకజాక్షులు సొలసిపలికి
  44. పాటించి నమ్మిన వారి భాగ్యముగాదా
  45. పాటెల్లా నొక్కచో నుండు
  46. పాలదొంగవద్ద
  47. పాపపుణ్యముల రూపము దేహమిది
  48. పాడరే సోబనాలు
  49. పాడేము నేము
  50. పాపమెరంగని
  51. పాపములే సంబళమెపుడూ
  52. పాప మెఱగను పుణ్యఫల మెఱగను
  53. పాపపుణ్యముల పక్వ
  54. పాపపుణ్యముల రూపము
  55. పాపినైన నాపాల
  56. పారకుమీ వోమనసా
  57. పారితెంచి యెత్తివేసి
  58. పాయక మతినుండి
  59. పాయని కర్మంబులె
  60. పాయపుమదములబంధమా
  61. ప్రాణనాయకుడు
  62. పెట్టిననీ వెఱుగుదు పెనుదిక్కు
  63. పెంచి తమపెట్టుజెట్టు పెరికివేయ
  64. పెద్దలు మీరంతేసి
  65. పెక్కులంపటాల
  66. పెంచబెంచ మీద
  67. పెక్కులంపటాల
  68. పెరిగినాడు చూడరో
  69. పేరంటాండ్లు పాడరే
  70. పెరుగపెరుగ బెద్దలుగాగ
  71. పెట్టిననీ వెఱుగుదు
  72. పిడికిట తలంబ్రాల
  73. పిలువా గదరే
  74. పిల్ల గ్రోవి
  75. పొడగంటిమయ్య మిమ్ము
  76. పొడవైన శేషగిరి
  77. పోరాక పోయి
  78. పొరి నీకును
  79. పోరొ పోరొ
  80. పొలతి జవ్వనామున
  81. పొలయలుక నిద్దురలు
  82. పొత్తుల మగడవు
  83. పోయ గాలం
  84. పోయబోయ గాలమెల్ల
  85. పోయబోయ గాలమెల్ల పూట పూటకు
  86. పోయం గాలము
  87. పోయగాలం బడవికిగాయు
  88. పొదలె నిండు కళల
  89. పొద్దికనెన్నడు వొడచునొ పోయిన
  90. పుడమి నిందరి
  91. పుట్టినట్టె వున్న వాడ పోలేదు రాలేదు
  92. పురుషోత్తముడ నీవు పురుషాధముడ
  93. పురుషోత్తముడ నీవే పుణ్యము
  94. పురుషోత్తామ నీవే
  95. పులుగు చెప్పెడి నదె పొంచి మాగురుడు
  96. పూచిన యీదేహము పువ్వుగాని
  97. పూవుఁబోణుల కొలువే
  98. ప్రతిలేని పూజదల పంగకోటి
  99. ప్రలపనవచనైః
  100. ప్రాణులనేరమి
  101. పృథుల హేమ
  102. ప్రపన్నులకు
  103. పుండు జీవులకెల్ల
  104. పురుషుండని శ్రుతి
  105. పుట్టుభోగులము నేము
  106. పుట్టుగులమ్మీ భువి
  107. పుట్టుమాలినబరుబోకివి

Nootulu davvagabotae - నూతులు దవ్వగబోతే

నూతులు దవ్వగబోతే (రాగం:సామంతం)(తాళం :)

నూతులు దవ్వగబోతే బేతాళములు పుట్టె
కాతాళపులోకులాల కంటిరా యీసుద్దులు

మీఱినపుత్రకామేష్టి మించి లంకకు బై వచ్చె
ఆఱడి రామావతార మసురబాధ
తూఱి సీతపెండ్లి హరుదొడ్డ వింటిపండుగాయ
పాఱి పాఱి నమ్మనెటువలెవచ్చు వీరిని

చూడ కేకయరాజ్యము చుప్పనాతిపాపమాయ
వేడుక మాయామృగమువేటాయను
వాడికె సుగ్రీవుమేలు వాలికి గండాన వచ్చె
యీడుగానిరాచపుట్టు యెట్టు నమ్మవచ్చును

వుమ్మడి గోతులకూట ముదధికి గట్లు వచ్చె
తమ్మువిబుద్ది రావణుతల వోయను
పమ్మి శ్రీ వేంకటేశునిపట్టానకే యింతానాయ
యిమ్ముల నిట్టిదేవర నెట్టు నమ్మవచ్చును

Nootulu davvagabotae (Raagam:Saamamtam ) (Taalam: )

Nootulu davvagabotae baetaalamulu putte
Kaataalapulokulaala kamtiraa yeesuddulu

Mee~rinaputrakaamaeshti mimchi lamkaku bai vachche
Aa~radi raamaavataara masurabaadha
Too~ri seetapemdli harudodda vimtipamdugaaya
Paa~ri paa~ri nammanetuvalevachchu veerini

Chooda kaekayaraajyamu chuppanaatipaapamaaya
Vaeduka maayaamrgamuvaetaayanu
Vaadike sugreevumaelu vaaliki gamdaana vachche
Yeedugaaniraachaputtu yettu nammavachchunu

Vummadi gotulakoota mudadhiki gatlu vachche
Tammuvibuddi raavanutala voyanu
Pammi Sree vaemkataesunipattaanakae yimtaanaaya
Yimmula nittidaevara nettu nammavachchunu


nErupari nanukOnu - నేరుపరి ననుకోను

నేరుపరి ననుకోను (రాగం: ) (తాళం : )

ప|| నేరుపరి ననుకోను నెరజాణ ననుకోను | యీరీతి నాహావ భావాలింతెఱగడా ||

చ|| మలసి తనతో నేను మాటలాడనని దూరి | నెలవుల నవ్వితేనే సేన మాటలే |
పిలిపించనని తాను బిగువులు నెరపీని | తలుపు దెరచితేనే తగుసన్న గాదా ||

చ|| దగ్గర గూచుండనంటా తమకించి నంతలోనె | సిగ్గువడి వుండితేనే చేరి వుండుటే |
వొగ్గి తన్ను జూడనంటా వొరట్లు వట్టీని | అగ్గమై యెదుట నుంటే అన్నియును గాదా ||

చ|| ముందు కౌగిలించనంటూ మొనలెల్ల జూపీని | ఇందమని విడేమిచ్చుటదియే అది |
అందపు శ్రీ వేంకటేశుడలమేలుమంగ నేను | పొందితిమిద్దరమివి పోదులెల్లా గావా ||

nErupari nanukOnu (Raagam: ) (Taalam: )

pa|| nErupari nanukOnu nerajANa nanukOnu | yIrIti nAhAva BAvAliMterxagaDA ||

ca|| malasi tanatO nEnu mATalADanani dUri | nelavula navvitEnE sEna mATalE |
pilipiMcanani tAnu biguvulu nerapIni | talupu deracitEnE tagusanna gAdA ||

ca|| daggara gUcuMDanaMTA tamakiMci naMtalOne | sigguvaDi vuMDitEnE cEri vuMDuTE |
voggi tannu jUDanaMTA voraTlu vaTTIni | aggamai yeduTa nuMTE anniyunu gAdA ||

ca|| muMdu kaugiliMcanaMTU monalella jUpIni | iMdamani viDEmiccuTadiyE adi |
aMdapu SrI vEMkaTESuDalamElumaMga nEnu | poMditimiddaramivi pOdulellA gAvA ||


nErpukaMTe bennidhi - నేర్పుకంటె బెన్నిధి

నేర్పుకంటె బెన్నిధి (రాగం: ) (తాళం : )

ప|| నేర్పుకంటె బెన్నిధి గద్దా | ఓర్పుకంటె సుఖమొకటి గద్దా ||

చ|| కరుణకు నెక్కుడు గతి యిక గద్దా | సరసత కెక్కుడు సరిగద్దా |
గురుమతి జిత్తము కూరిమి నిలిపిన | నెరవుకంటె విధమిక గద్దా ||

చ|| కలిమికంటె జీకటి మరి కద్దా | బలిమి కంటె నాపద గద్దా |
గెలుపు(గ) దెలెసి లంకించిన మతితో | జెలగుకంటె నిజనీతి యిక గద్దా ||

చ|| పాయము కంటె నపాయము గద్దా | కాయపు రోతకు గడ గద్దా |
పాయక వేంకట పతికృప గోరిన | యీ యభిమతమున కెదురిక గద్దా ||

nErpukaMTe bennidhi (Raagam: ) (Taalam: )

pa|| nErpukaMTe bennidhi gaddA | OrpukaMTe suKamokaTi gaddA ||

ca|| karuNaku nekkuDu gati yika gaddA | sarasata kekkuDu sarigaddA |
gurumati jittamu kUrimi nilipina | neravukaMTe vidhamika gaddA ||

ca|| kalimikaMTe jIkaTi mari kaddA | balimi kaMTe nApada gaddA |
gelupu(ga) delesi laMkiMcina matitO | jelagukaMTe nijanIti yika gaddA ||

ca|| pAyamu kaMTe napAyamu gaddA | kAyapu rOtaku gaDa gaddA |
pAyaka vEMkaTa patikRupa gOrina | yI yaBimatamuna kedurika gaddA ||


nEla minnu nokkaTainanIbaMTu - నేల మిన్ను నొక్కటైననీబంటు

నేల మిన్ను నొక్కటైననీబంటు (రాగం: ) (తాళం : )

ప|| నేల మిన్ను నొక్కటైననీబంటు వొక్క- | వేలనే యక్షుని దెగవేసెగా నీబంటు ||

చ|| ఉంగర మెగరవేసి యుదధిలో బడకుండ | నింగికి జెయిజాచి నీబంటు |
చంగున జలధిదాటి జంబుమాలి నిలమీద | కుంగదొక్కి పదముల గుమ్మెగా నీబంటు ||

చ|| వెట్టగా రావణు రొమ్మువిరుగ జేతనే గుద్దె | నిట్టతాడువంటివాడు నీబంటు |
దిట్టయై మందులకొండ తేజమున నడురేయి | పట్టపగలు దెచ్చె బాపురే నీబంటు ||

చ|| అలరనన్నియు జేసి అజునిపట్టానకు | నిలుచున్నాడదివో నీబంటు |
బలువేంకటేశ ఈ పవననందనుడు | కలిగి లోకములెల్ల గాచెగా నీబంటు ||

nEla minnu nokkaTainanIbaMTu (Raagam: ) (Taalam: )

pa|| nEla minnu nokkaTainanIbaMTu vokka- | vElanE yakShuni degavEsegA nIbaMTu ||

ca|| uMgara megaravEsi yudadhilO baDakuMDa | niMgiki jeyijAci nIbaMTu |
caMguna jaladhidATi jaMbumAli nilamIda | kuMgadokki padamula gummegA nIbaMTu ||

ca|| veTTagA rAvaNu rommuviruga jEtanE gudde | niTTatADuvaMTivADu nIbaMTu |
diTTayai maMdulakoMDa tEjamuna naDurEyi | paTTapagalu decce bApurE nIbaMTu ||

ca|| alarananniyu jEsi ajunipaTTAnaku | nilucunnADadivO nIbaMTu |
baluvEMkaTESa I pavananaMdanuDu | kaligi lOkamulella gAcegA nIbaMTu ||


nE nEmisEyudunu - నే నేమిసేయుదును

నే నేమిసేయుదును (రాగం: ) (తాళం : )

ప|| నే నేమిసేయుదును నీవు నాలోపలనుండి | శ్రీనాథుడవు నీచేత ఇంతేకాక ||

చ|| తనువేమిసేయును తనువులోపలయున్న- | చెనటియింద్రియములచేతలుగాక |
మనసేమిసేయును మనసులోపలనున్న- | నినుపుగోర్కులు చేసేనేరములుగాక ||

చ|| జీవుడేమిసేయును జీవునిబొదుగుకున్న- | భావపుప్రకృతి చేసేపాపముగాక |
చేవదేర బుట్టు వేమిసేయు ముంచుకొన్నట్టి- | దైవపుమాయలోనిధర్మ మింతేకాక ||

చ| కాలమేమిసేయును గక్కన శ్రీవేంకటేశు- | డేలి మన్నించేమన్నన యిదియేకాక |
యేల యేల దూర నింక నెవ్వరు నేమిసేతురు | మేలిమి నిను దలచి మెచ్చుటేకాక ||

nE nEmisEyudunu (Raagam: ) (Taalam: )

pa|| nE nEmisEyudunu nIvu nAlOpalanuMDi | SrInAthuDavu nIcEta iMtEkAka ||

ca|| tanuvEmisEyunu tanuvulOpalayunna- | cenaTiyiMdriyamulacEtalugAka |
manasEmisEyunu manasulOpalanunna- | ninupugOrkulu cEsEnEramulugAka ||

ca|| jIvuDEmisEyunu jIvunibodugukunna- | BAvapuprakRuti cEsEpApamugAka |
cEvadEra buTTu vEmisEyu muMcukonnaTTi- | daivapumAyalOnidharma miMtEkAka ||

ca| kAlamEmisEyunu gakkana SrIvEMkaTESu- | DEli manniMcEmannana yidiyEkAka |
yEla yEla dUra niMka nevvaru nEmisEturu | mElimi ninu dalaci meccuTEkAka ||